తిరుమశ్రీ వారికి 18వ పర్యాయంగా 7 కోట్ల జప సమర్పణ
కలియుగములో ధర్మం ఒంటి పాదముపై నడుస్తుందంటారు. దైవ చింతనపరులు తక్కువ, అధర్మం, అన్యాయం, అసూయ, అనాగరిక వ్యవహారాలు అధికం. మానవుని ఆయుర్దాయం కూడా మిగిలిన యుగములతో పోల్చుకుంటే అతి తక్కువ. భగవంతుడు కూడా ఈ యుగములో కదలక మెదలక, పలకక కేవలం అర్చామూర్తిగా ఉంటూ అన్నీ గమనిస్తూ ఉంటాడు. ఈనాటి మానవుడు సుఖా మనస్తత్వము అధికంగా కలవాడు. చివరికి భగవంతుని పొందుటకై కూడా అధికంగా శ్రమించలేడు. చిటికెలో పని కావాలనే స్వభావము కలవాడు. కావున యజ్ఞ యాగాదులందు కాని, తపస్సు యందు కాని ఆసక్తి లేనివాడుగా జీవించుచున్నాడు. ఈనాటి మానవులను దృష్టి యందుంచుకొనిన భగవంతుడు తనను పొందుటకు అతి సులభమైన ఉపాయమును సూచించాడు. ఆయన సూచించిన మార్గమున పయనిస్తే, యజ్ఞ యాగాదులు చేసిన ఫలితాన్ని పొంది, భగవంతుని కృపను అతి సులభంగా పొందవచ్చును. అదే భగవంతుని “నామ స్మరణ'శ్రీ వేంకటేశ్వరుని నామస్మరణ. ఆయన నామాన్ని ఉచ్చరిస్తే సాధించలేనిది ఏదీ ఉండదు. భగవంతుడు గొప్పవాడు. కాని ఆయన నామము అంతకంటే గొప్పదని పెద్దలంటారు. గుహుడుశ్రీ రాముణ్ణి తన నావలో ఎక్కించుకుని ఒక యోజనము పొడవున్న గంగానదిని దాటాడు. కాని ఆంజనేయుడుశ్రీ రాముని నామాన్ని స్మరించుచు 100 యోజనాలున్న సముద్రాన్ని దాటాడు. మృత్యువు చివరి సమయములో అనాలోచితంగా నారాయణుని స్మరించిన అజామిళుడు ముక్తిని పొందాడని పురాణాలు చెప్పుచున్నవి. నారాయణుని గాథను విని పరీక్షిత్తు మహారాజు 7 రోజులలో ముక్తిని పొందాడని భాగవతము చెప్పుచున్నది. కావున నేటి అశక్తులైన మానవులు శక్తి కొలదీ వారి వారి విరామ సమయములో కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరుణ్ణి తనివితీరా స్మరించి తరించాలనే ఉద్దేశ్యముతో ప్రతి సంవత్సరముశ్రీ వారి భక్తులందరిచే వ్రాయించిన 7 కోట్ల జపమును సమర్పించుచున్నాము. 2002 సంవత్సరము నుండి ప్రారంభించిన ఈ కార్యక్రమము, భగవంతుని దయ వలన ప్రతి సంవత్సరము 7 కోట్ల చొప్పున ప్రస్తుతము 18వపర్యాయంగా 7కోట జపమును ఆగస్టు12వతేది గోకులాష్టమినాడు తిరుమశ్రీ వేంకటేశ్వరునికి జప హోమాదులు నిర్వహించి, సమర్పించబడును. మరియు 19వ పర్యాయంగా 7 కోట్ల జప సమర్పణ ప్రారంభించబడును. స్వామి నామాన్ని వ్రాసిన వారందరిశ్రీ వేంకటేశ్వరుని కృప లభించాలని ప్రార్థించెదము. ఒక్కసాశ్రీ వారి నామాన్ని వ్రాయడం వలన దాదాపు 7 మార్లు ఆయన నామాన్ని స్మరించినంత విలువ ఉంటుందని పెద్దలంటారు. కావున స్మరిస్తేనే ఉద్దరించేవాడు వేలసార్లు స్మరించిన మనలను తప్పక ఆదరించగలడు. నేడు 'కరోనా' మహమ్మారి దృష్ట్యా ప్రతి సంవత్సరము నిర్వహించే “నమో వేంకటేశాయ” రథయాత్రను ఈసారి మానుకున్నాము. దయామయుడైన మన ప్రభువు, కలియుగ దైవము, తిరుమలశ్రీ వేంకటేశ్వరుడు ఈ కరోనా మహమ్మారిని తరిమి మనందరినీ కాపాడవలెనని, ఈ 18వ పర్యాయముగా 7 కోట్ల జపమును స్వీకరించి తన భక్తులను మరియు మనందరిని ఆనందింప చేయగలడని ప్రార్థిస్తున్నాము.
శ్రీ వేంకటేశ్వర పాదసేవకుడు పుల్లగూర్ల సాయిరెడ్డి (గోవిందదాసు)