అన్నమయ్య పద శోభ గోనుగుంట మురళీకృష్ణ |

 


ఆయన ఆ కాలంలో విరవిగా వస్తున్న ప్రబంధ భాషను కాకుండా సామాన్యులకు కూడా అర్థం అయ్యేటట్లు వ్యావహారిక భాషలో కీర్తనలు రచించారు. విష్ణుమూర్తి ఖడ్గం అయిన "నందకం" అంశగా ఆయనని భక్తులు భావిస్తూ ఉంటారు. ఆయన రచించిన కీర్తనలలో ఇది ఒకటి... "బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము"


"బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము" . అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరస్వామి మీద రచించినా, కొన్నిచోట్ల విష్ణుమూర్తి అవతారాలను కూడా ప్రస్తావించాడు. ఎందుకంటే వేంకటేశ్వరుడు కూడా విష్ణుమూర్తి అవతారమే. కలియుగంలో ఈ రూపంలో అవతరించాడు. ఇక్కడ పల్లవిలో బ్రహ్మ విష్ణుమూర్తి పాదాలు ఎప్పుడు కడిగాడు? అని సందేహం రావచ్చు. వామనావతారంలో విష్ణువు వామనుడి రూపంలో వచ్చి బలిచక్రవర్తిని మూడడుగుల నేలను దానం కోరాడు. అలాగే తీసుకొమ్మన్నాడు బలి. వామనుడు త్రివిక్రమావతారం దాల్చి ఒక అడుగుతో భూమండలాన్ని, మరో అడుగుతో నభోమండలాన్ని ఆక్రమించాడు. మూడవ అడుగు ఎక్కడ పెట్టను? అని అడిగితే తతూ పించాడు. బలి. అతని తల మీద అడుగు మోపి పాతాళానికి తొక్కేశాడు వామనుడు. భూమికింద ఆరు లోకాలు, భూమిపైన ఏడు లోకాలు ఉన్నాయి. ఆకాశమార్గంలోకి ప్రయాణించిన విష్ణుమూర్తి రెండవ పాదం భువర్లోక, మహలోక, తపోలోకాది లోకాలన్నీ దాటి అన్నిటికన్నా పైన ఉన్న సత్యలోకం చేరుకుంది. సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. అక్కడికి


వచ్చిన విష్ణుపాదాన్ని అర్ఘ్య పాద్యాదులతో పూజించాడు బ్రహ్మ. బ్రహ్మము అంటే సృష్టికర్త అయిన బ్రహ్మకు మూలమైన దేవుడు అని అర్థం. ఆ బ్రహ్మము కూడా తానే అయిన విష్ణువు అని అర్థం. ఇక్కడ బ్రహ్మ అనే పదంలో 'హ' కింద 'మ' వత్తు ఇచ్చి రాస్తాము. కానీ 'మ' కింద 'హ' వత్తు ఇచ్చి పలకాలి. అలాగే "చిహ్నము" అనే పదం రాసేటప్పుడు కూడా 'హ' కింద 'న' వత్తు ఇచ్చి రాసినా, పలికేటప్పుడు మాత్రం 'న' కింద 'మ' వత్తు ఇచ్చి పలకాలి. కొన్ని సంస్కృత పదాల ఉచ్చారణ అలాగే ఉంటుంది. ఇది పల్లవి మాత్రమే. మొదటి చరణంలో ఇలా చెబుతున్నాడు అన్నమయ్య


చెలగి అంటే విజృంభించి అని. తలకక అంటే చలించక అని అర్థాలు. త్రివిక్రమ వామనావతారంలో విష్ణుపాదం విశ్వరూపం దాల్చి భూమి మొత్తం ఆక్రమించింది. బలిచక్రవర్తి తలమీద పెట్టుకున్నది కూడా ఈ పాదాన్నే. ఈ పాదమే చలించకుండా గగన మండలాన్ని కూడా తన్నింది. బలమైన రాజులకు శత్రువగు ఇంద్రుని కూడా కాపాడింది. ఏ రాక్షసుడు గానీ, ఏ ముని గానీ తపస్సు చేస్తున్నా, తన సింహాసనం కోసమే అని ఇంద్రుడి భయం. దానికితోడు హిరణ్యకశిపుడు, నరకాసురుడు వంటి దానవులు వరాలు పొంది మొదటగా దండెత్తి వచ్చేది ఇంద్రుడి మీదకే. అందుకే వారి తపస్సు భగ్నం చేయటానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. ఇంద్రుడికి అండగా ఉంటూ ఆ దానవులని శిక్షిస్తూ ఉంటాడు హరి. ఇక్కడ బలి చక్రవర్తి గొప్పదానశీలుడు. అందులో సందేహం లేదు. కానీ అమరాధిపతి భాగలబమైన అమరావతిని ఆక్రమించి కొంత అధర్మానికి పాల్పడ్డాడు కదా! అందువల్లనే పాతాళానికి అణచివేయబడ్డాడు.


బ్రహ్మదేవుడు అతిలోక సౌందర్యరాశి అయిన అహల్యను సృష్టించి, భూప్రదక్షిణం చేసి ముందుగా ఎవరు సత్యలోకం వస్తారో వారికే ఈమె ఇల్లాలు అవుతుందని చెప్పాడు. అహల్య కోసం ఇంద్రుడు, వరుణుడు, యముడు వంటి దిక్పాలకులు అంతా భూప్రదక్షిణానికి బయల్దేరి వెళ్ళారు. గౌతమ మహర్షి యుక్తిగా గోప్రదక్షిణం చేసి భూప్రదక్షిణ ఫలాన్ని పొంది అహల్యను చేపట్టాడు. అహల్య మీద మనసుపడ్డ ఇంద్రుడు ఒకరోజు కోడిరూపం దాల్చి సూర్యోదయానికి ముందే కూశాడు. తెల్లవారుతున్న దనుకుని సూర్యోదయాఘ్నికాలను నిర్వర్తించటానికి నదీస్నానానికి బయలుదేరాడు గౌతముడు. కొంతదూరం వెళ్ళిన తరువాత ఆకాశంలోని నక్షత్రమండలరూ సి "రాత్రి మూడవ ఝామైనా కాలేదు. వేళకాని వేళ కోడికూత ఏమిటి? ఇందులో ఏదో మోసం ఉంది" అనుకుంటూ ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అక్కడ ఇంద్రుడు గౌతముడి రూపంలో అహల్య పక్కన ఉన్నాడు. గౌతముడు ఆగ్రహంతో నీ కాయమంతా కళ్ళుగా నిండి అందవిహీనంగా మారిపో" అని ఇంద్రుడిని శపించాడు. శిలవు కమ్మని అహల్యను శపించాడు. "స్వామీ! మీ రూపంలో వస్తే మీరే అనుకున్నాను. ఇందులో నా దోషం ఏముంది? క్షమించి పరిహారం చెప్పండి" అని వేడుకున్నది.


గౌతముడు నిజం గ్రహించి శాంతించాడు. "నోరు జారింది. వెనక్కు తీసుకోలేను. పర పురుష స్పర్శతో అపవిత్రమైన నీవు పరమాత్మ స్పర్శతో పవిత్రురాలవు అవుతావు" అని చెప్పి వెళ్ళిపోయాడు. విష్ణువు రామావతారంలో తన పాదస్పర్శతో అహల్యకు శాపవిమోచనం కావించాడు. "కామిని పాపము కడిగిన పాదము" అని అంటే అర్థం ఇదే. , "పాము తలనిడిన పాదము" అనే వాక్యానికి అర్థం - కద్రువ కుమారుడైన కాళియుడు అనే సర్పం రమణక ద్వీపంలో నివసిస్తూ ఉండేవి. గరుత్మంతుడు ఆ సర్పాలను పట్టి భకిస్తూ ఉండేవాడు.


అతని బాధ పడలేక సర్పాలన్నీ ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఆ ప్రకారం ప్రతినెలా ఒక్కొక్క సర్పాన్ని గరుత్మంతుడికి ఆహారంగా ఇవ్వటం. కొంతకాలానికి కాళియుడి వంతు వచ్చింది. అతడు ఆహారం కావటం ఇష్టంలేక గరుత్మంతుడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరికీ పోరు భయంకరంగా సాగింది. చివరకు కాళియుడు ఓడిపోయి, పారిపోయి కాళిందిలో దాక్కున్నాడు. పూర్వం ఒక ముని ఇచ్చిన శాపం వల్ల గరుత్మంతుడు ఆ మడుగులోకి రాలేదు. కాళియుడి వల్ల ఆ మడుగు విషపూరితం అయింది. గోవులను కాయటానికి వచ్చిన గోపబాలురు కాళింది లోని నీరు త్రాగి చనిపోయారుశ్రీ కృష్ణుడు వారిని బ్రతికించి, కాళియుడి మదం అణచటానికి మడుగులోకి దూకాడు. శ్రీ కృష్ణుడికి, కాళియుడికి భయంకరమైన యుద్దం సాగింది. శ్రీ కృష్ణుడు ఆ సర్పరాజు చుట్టూ గిర్రున తిరుగుతూ, గభాలున అతడి పడగల మీద ఎక్కి రెండు పాదాలతో చిందులు తొక్కుతూ, చిత్ర విచిత్రంగా నాట్యం చేశాడు. ఆ అద్భుత దృశ్యామా సి దేవతలూ, మునులూ, గంధర్వులూ, సిద్ధులూ మొదలైన వారంతా ఆనంద పరవశులైనారు. చివరకు కాళియుడి శక్తి నశించి పరమాత్ముని శరణు కోరాడు. "ఈ మడుగు విడిచిపెట్టి సముద్రంలోకి వెళ్ళిపో!" అని ఆజ్ఞాపించాడశ్రీ కృష్ణుడు. . ఇక చివరి వాక్యం - పామిడి తురగపు పాదము - ఇడి అంటే లేకుండా చేయటం. పాముని లేకుండా చేసేది గరుత్మంతుడు. గరుత్మంతుడు తురగము (వాహనము) గా గలవాడు శ్రీ మహావిష్ణువు. ఆయన పాదము అని అర్థం.


పరమ యోగులు అంటే యోగులలోశ్రీ ష్ఠులు అని అర్థం. నారదుని వంటివారు ఆ కోవకు చెందుతారు. నారదుడు నిరంతరం హరినామ స్మరణ చేస్తూనే ఉంటాడు. అటువంటి శ్రీ ష్ఠులైన యోగులకు రకరకాలుగా వరములు ఇచ్చేది ఈ పాదము. సాధారణముగా వరము అంటే కోరిన కోరిక తీర్చటం అనుకుంటారు. వరము అంటే వరింపదగిన స్థితి అని వేదాంతుల భాష్యం. యోగులైనవారు కోరదగిన కోరికలు ఏముంటాయి? వారికి కావలసింది ఆత్మసమర్పణ పొందగలిగిన స్థితి. అదేవారికి శ్రీ ష్ఠమైనది. పరమపద సోపానం చేరినవారు జారిపడరు. అది స్థిరమైనది. విష్ణువు యొక్క స్థానమే పరమపదమని విష్ణుసూక్తము చెబుతున్నది. భక్తి శ్రద్ధలు కలవారిశ్రీ వేంకటాద్రియే అటువంటి స్థితిని ప్రసాదిస్తుంది అంటూ అన్నమయ్య ఈ సంకీర్తన ద్వారా తెలియజేస్తున్నాడు.