వేంకటాచల మాహాత్మ్యం

స్కాంద పురాణాంతర్గతము - వేంకటాచల మాహాత్మ్యం 


భగవాన్ మహావిష్ణువు కృతయుగం నుండి ద్వాపరయుగం వరకు మత్స్య - కూర్మ - వరాహాది అవతారాలను ధరించి, అధర్మపరులైన రాక్షసాదులను సంహరించి, సాధుశీలురైన మునిపుంగవులను, సజ్జనులను సంరక్షించి, ధర్మ సంస్థాపన చేశాడు. "కలౌ వేంకట నాయకః" అని చెప్పినట్లు భగవంతుడైన శ్రీమహావిష్ణువు ఈ కలియుగంలో వేంకటాచలంలో అర్చావతార రూపంగా శ్రీవేంకటేశ్వరుడనే పేరుతో ఆవిర్భవించాడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుడు దుష్టజనులను శిక్షిస్తూ, భక్తులను రక్షిస్తూ మహా మహిమాన్వితుడై సర్వాభీష్టప్రదుడై సప్తగిరులలో విరాజిల్లుతున్నాడు. ఈ విషయాన్ని ఈ క్రింది శ్లోకం దృఢపరుస్తున్నది.


వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన | వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి || శ్రీ వేంకటాచలంతో సమానమైన క్షేత్రం ఈ బ్రహ్మాండంలోనే లేదని, శ్రీ వేంకటేశ్వరునితో సమానమైన దైవం గతంలో లేదని, భవిష్యత్తులో కూడా ఉండబోడని పై శ్లోకానికి అర్థం. ఇందువలననే భక్తులు దేశ విదేశాల నుండి ఇక్కడకు వచ్చి, శ్రీ నివాసుని భక్తితో సందర్శించి తమ తమ అభీష్టసిద్ధిని పొందుతున్నారుశ్రీ నివాసుని అనుగ్రహం వలన ఇహలోకంలో భుక్తిని, పరలోకంలో ముక్తిని పొందుతున్నారు. మన భారతదేశం పవిత్ర నదీనదాలకు, పర్వతాలకు, తీర్థ క్షేత్రాలకు నిలయం. శ్రుతి, స్మృతి, ఇతిహాస, పురాణాలలో భగవంతుడైన శ్రీ మహావిష్ణువు మహిమా విశేషాలు అనేక విధాలుగా వర్ణించబడినాయి. నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో శ్రీ వేంకటాచల క్షేత్రం ప్రధానమైంది. భగవంతుడైన శ్రీ వేంకటేశ్వరుని వైభవం, శ్రీ వేంకటాచల మాహాత్మ్యం మహాపురాణాలలోను ఉప పురాణాలలోను వర్ణించబడింది. శ్రీ వేంకటాచల మాహాత్మ్యం వరాహ, పద్మ, గరుడ, హరివంశ (శేషధర్మ), బ్రహ్మాండ, మార్కండేయ, వామన, బ్రహ్మ, స్కాందఆదిత్య, భవిష్యోత్తర, భాగవత పురాణాలలో వర్ణించబడిందివీటిలో స్కాందం, భాగవతం, హరివంశం మినహా మిగిలిన పురాణాల మూల గ్రంథాలలో శ్రీ వేంకటాచల మాహాత్మ్య విషయాలు కనబడటం లేదు. స్కాంద మహాపురాణంలో మాత్రం శ్రీ వేంకటాచల మాహాత్మ్యం నలభై అధ్యాయాలలో వివరంగా వర్ణించబడింది.


శ్రీ వేంకటేశ్వర దేవస్థానం వారు భాగవతం మినహా మిగిలిన పదకొండు పురాణాలలోని శ్రీ వేంకటాచల మాహాత్మ్యాన్ని ఆంధ్రలిపిలోను, దేవనాగరి లిపిలోను మహంత్ భగవాన్ దాజ్ కాలం నుండి (క్రీ.శ.1880-1890) అనేక పర్యాయాలు ముద్రించి ప్రచురించారు. స్వామి ప్రయాగ దాజ్ శ్రీ వేంకటాచల మాహాత్మ్యాన్ని హిందీ అనువాదంతో రెండు భాగాలుగా ప్రకటించారు. 1904లో ముద్రించిన శ్రీ వేంకటాచల మాహాత్మ్యంలో శ్రీ వేంకటేశ్వర తాపిన్యుపనిషత్తు కూడా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1959-62 సంవత్సరముల మధ్యకాలంలోశ్రీ వేంకటాచల మాహాత్మ్యాన్ని రెండు సంపుటాలుగా తెలుగు లిపిలోను, నాగరి లిపిలోను ప్రచురించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన శ్రీ వేంకటాచల మాహాత్మ్యం గ్రంథంలో భాగవతం మినహా మిగిలిన పదకొండు పురాణాల విషయం ఉంది. వీటిలో బ్రహ్మపురాణంలోని ఉత్తర ఖండాన్ని వేరొక పురాణ భాగంగా లెక్కించి పన్నెండు పురాణాల భాగాలుగా కొందరు పేర్కొన్నారు. స్కాంద పురాణంలో శ్రీ వేంకటాచల మాహాత్మ్యంలో మొదటి పది అధ్యాయాలు ధరణీ వరాహ సంవాద రూపంలో ఉండటం వలన వాటిని వరాహ పురాణం ద్వితీయ భాగంగా పేర్కొన్నారు. కాని వాస్తవంగా అవి స్కాంద పురాణం లోనివే. మిగిలిన ముప్ఫై అధ్యాయాలను నాలుగు భాగాలుగా విభజించారు. సప్త ఖండాత్మకమైన స్కాంద మహాపురాణంలో రెండవదైన వైష్ణవ ఖండంలో తొమ్మిది మాహాత్మ్యాలు చెప్పబడినాయి. వాటిలో మొదటిశ్రీ వేంకటాచల మాహాత్మ్యం .


శ్రీనివాపు రాణం: తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన శ్రీ వేంకటాచల మాహాత్మ్యంలో 157 అధ్యాయాలు, 10,771 శ్లోకాలు ఉన్నాయిశ్రీ సాళువ నరసింహరాయని కాలంలో (క్రీ.శ.1445-1492) శ్రీ పసిండి వేంకటత్తురైవర్ అనే శ్రీ నివాసుని అర్చకులు దీనిని సంకలనం చేశారు. దీనిని మొట్టమొదటిసారి 27-06-1491వ తేదీన శ్రీ నివాసుని సన్నిధిలో ఈయన పారాయణం చేశారు. ఈ సంప్రదాయం నరసింహరాయని ప్రోత్సాహంతో నెలకొల్పబడింది. శ్రీ వేంకటాచల మాహాత్మ్యానికి శ్రీ నివాసపురాణం' అని మరొక పేరుంది. దీనినే తమిళంలో 'తిరువేంగడ మాహాత్మ్యము అంటారు. స్కాంద పురాణంలో శ్రీ వేంకటాచల మాహాత్మ్యం ప్రస్తావన శ్రీ నివాస మంగాపురం దేవాలయ శాసనంలో ఉంది. తాళ్ళపాక అన్నమాచార్యుల మనుమడు, పెద తిరుమలాచార్యుల కుమారుడైన చిన తిరుమలాచార్యుడు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాడు. ఆయన క్రీ.శ.23-03-1540 నాడు వేయించిన తెలుగు శాసనమిది. శ్రీ వేంకటాచల మాహాత్మ్యంలోని వరాహాది పదకొండు పురాణ భాగాల్లోని విషయాలు సంక్షిప్తంగా ఇవి -


1. వరాపు రాణం : అష్టాదశ పురాణాల్లో వరాహపురాణం పదకొండవ స్థానంలో ఉంది. దీనిలో ముప్పై అధ్యాయాల్లో శ్రీ వేంకటాచల మాహాత్మ్యం వర్ణించబడింది. ఇది వరాహ కల్పవృత్తాంతంతో ప్రారంభమవుతుంది. ఇంకను దీనిలో స్వామి పుష్కరిణీ మాహాత్మ్యం. కుమారధారా ప్రాశస్త్యం, కపిలతీర్థం మొదలైన పదిహేడు తీర్థాల మాహాత్మ్యాలు శ్రీ వేంకటేశ్వర మహోత్సవం, పాండవతీర్థ (గోగర్భం) - ఫల్గుణీ తీర్థ - జాబాలితీర్థ - సనక సనందన తీర్థ - కాయరసాయన తీర్థ మాహాత్మ్యాలు, దశరథుని వృత్తాంతం, బ్రహ్మాది దేవతలు - మహర్షుల శ్రీ వేంకటాచలానికి రావడం, భేరుండాసుర సుదర్శన సేనల యుద్ధం, అష్టాంగ యోగస్వరూప నిరూపణం మొదలైన విషయాలు వర్ణించబడినాయి.


2. పడు రాణం : ఇది మహాపురాణాల్లో రెండవది. దీనిలో పదకొండు అధ్యాయాల్లో శ్రీ వేంకటాచల మాహాత్మ్యం వర్ణించబడింది. వాటిలోశ్రీ వేంకటాచల వర్ణనం, ఆకాశగంగా మాహాత్మ్యం, పద్మసరోవర వర్ణనం, దాని తీరంలోని దివ్యారామ వర్ణనం, స్వామి పుష్కరిణీ ప్రాశస్త్యం, శ్రీ నివాసావిర్భావం, శ్రీ వరాహావిర్భావం, నీలకంఠాశ్రమ వర్ణనం, పాండవతీర్థ మాహాత్మ్యం, నారాయణగిరి ప్రభావం పద్మసరోవర మాహాత్మ్యం , లక్ష్మీ ప్రాదుర్భావం, శుకమహర్షి వృత్తాంతం, బ్రహ్మాదులు చేసిన శ్రీ మహావిష్ణు స్తుతి మొదలైన విషయాలు వర్ణించబడినాయి.


3. గరుడు రాణం: ఇది మహాపురాణాల్లో పదిహేడవది. దీనిలో వేంకటాచల మాహాత్మ్యం ఒకే ఒక అధ్యాయంలో అరుంధతీ వసిష్ట సంవాదరూపంలో ఉంది. ఇందులో ఆకాశగంగ, పాపవినాశనం, తుంబురు తీర్థాల ప్రాశస్త్యం, అరుంధతీదేవి తపస్సు చేయడానికి శేషాచలానికి రావడం, అరుంధతి చేసిన భగవత్ స్తుతి, భగవంతుడు చెప్పిశ్రీ వేంకటాచల - తుంబురు తీర్థ మాహాత్మ్యా లు వర్ణించబడినాయి.


4. హరివంశం: మహాభారతంలోని ఖిలపర్వంలో హరివంశం వర్ణించబడింది. ఇది భీష్మ, యుధిష్ఠిర సంవాదరూపంలో ఉంది. హరివంశంలో ఇరవైనాలుగు వేల శ్లోకాలున్నాయి. ఇక్కడ ఒకే ఒక అధ్యాయంలోశ్రీ వేంకటాచల మహాత్మ్య విషయాలు వర్ణించబడినాయి. అవి - భగవంతుని సేవించడానికై నారదాది మహర్షులు శ్రీ వేంకటాచలానికి రావడం శ్రీ వేంకటాచలంలో నివసిస్తున్న మహాజనుల చరిత్ర వర్ణనం, శ్రీ నివాసుని సేవించడానికై భీష్ముడు యుధిష్ఠిరుని రేపించడం మొదలైనవి.


5. బ్రహ్మాండు రాణం : ఇది మహాపురాణాల్లో చివరిది. దీనిలో పన్నెండు అధ్యాయాల్లో శ్రీ వేంకటాచల మాహాత్మ్యం వర్ణించబడింది. ఇది భృగు నారద సంవాదరూపంలో ఉంది. దీనిలోశ్రీ వేంకటాచలం యొక్క నామాంతరాలు, అనంతుడు భగవంతుని క్రీడాద్రిగా రూపొందడం, వ్యాఘ్రపాద వృత్తాంతం, నారాయణుడనే విప్రుని వృత్తాంతం, క్రీడాచల వర్ణనం, వృషభాసుర వృత్తాంతం, అంజనాదేవి వేంకటాద్రిపై తపస్సు చేసి ఆంజనేయుని పుత్రునిగా పొందడం, క్రీడాద్రికి అంజనాచలమనే పేరు కలగడంశ్రీ నివాస మహోత్సవం, చోళరాజు వృత్తాంతం, అస్థికూట వృత్తాంతం,


సింహాదుడనే అసురుని వృత్తాంతం మొదలైన విషయాలు ప్రతిపాదించబడినాయి.


6. మార్కండేయ రాణం : ఇది మహాపురాణాల్లో ఏడవది శ్రీ వేంకటాచల మాహాత్మ్యం ఐదు అధ్యాయాల్లో వర్ణించబడింది. ఇందులో మార్కండేయుని తీర్థయాత్రా క్రమం, మార్కండేయుడు శుద్దుడనే అగస్త్య మహర్షి శిష్యునితో వేంకటాచలానికి వెళ్ళడం, అగస్త్య మహర్షి వర్ణించిన వేంకటాచల వైభవం, బ్రహ్మ రుద్రాదులు చేసిన శ్రీ నివాసుని స్తుతి, కుమారధారా మాహాత్మ్యం, వృద్దద్విజుని వృత్తాంతం, కుమారధారా తీర్థంలో స్కందుడు తపస్సు చేయడం, స్కందుడు చేసిశ్రీ నివాసుని స్తుతి మొదలైన విషయాలు చెప్పబడినాయి.


7.వామవు రాణం : ఇది మహాపురాణాల్లో పధ్నాలుగవది. దీనిలో ఇరవై ఐదు అధ్యాయాల్లో శ్రీ వేంకటాచల మాహాత్మ్య విషయాలు వర్ణించబడినాయి. వీటిలో ప్రయాగ మాహాత్మ్యం, స్కందుడు తపస్సు చేయటానికైశ్రీ వేంకటాచలానికి వెళ్ళడం, స్కందుడు చేసిన తపస్సు, చక్రాది పదిహేడు తీరాల మాహాత్మ్యం, శేషాచలం తూర్పు దిక్కున అగస్త్యాది మహర్షులు అద్భుత వస్తువులను సేకరించడం, శేషాచలం దక్షిణ దిక్కున అగస్త్య మహర్షి శంకరుని సేవించడంశ్రీ వేంకటాచలంలోని పుణ్యతీర్థ వర్ణనం, కపిలతీర్థానికి పడమటి దిక్కున ఉన్న పంచతీర్థాల మాహాత్మ్యం, స్వామి పుష్కరిణి మొదలైన సర్వతీర్థాల మాహాత్మ్యం, శంఖరాజు వృత్తాంతం, ఉపరిచర వసు వృత్తాంతం, బ్రహ్మాదులు భగవంతుని స్తుతించడం, భగవంతుడు బ్రహ్మాదులకు అభీష్ట వరాలనివ్వడం, శేషాద్రి వాయవ్య భాగంలో ఉన్న మహాభూతాన్ని నారాయణాద్రిగా వర్ణించడం, దేవజిత్తు మొదలైన అసురులు లోకోపద్రవం కలిగించడం, విష్వక్సేనుడు అసురులను వధించడం, భవిష్యత్తులో కలగబోయే భగవంతుని దివ్యవిమాన వర్ణనం, స్వామి పుష్కరిణీ తీరంలో చేసే అన్నదానాది ప్రశంస, స్వామిపుష్కరిణీ తీర్థంలో స్నానం చేయడం కోసం జనక మహారాజుశ్రీ వేంకటాచలానికి రావడం మొదలైన విషయాలు ప్రస్తావించబడినాయి.


8. బ్రపళ్లు రాణం : మహాపురాణాలలో ఇది మొదటిది. ఈ పురాణం రెండు ఖండాలుగా ఉంది. పూర్వఖండంలో పది అధ్యాయాల్లోను, ఉత్తరఖండంలో రెండు అధ్యాయాల్లోను శ్రీ వేంకటాచల మాహాత్మ్యం వర్ణించబడింది. వీటిలో దుర్వాసమహర్షి దిలీపునితో చెప్పిన శ్రీ వేంకటాచల వైభవం, వాయుశేషుల పరస్పర బలపరీక్ష, వేంకటాద్రిలో శేషుడు చేసిన తపస్సు, స్వామిపుష్కరిణి మొదలైన సప్త తీర్థవర్ణన శ్రీ వేంకటాచలంలోని అరవై ఎనిమిది తీర్థాల మహిమానువర్ణనం, తొండమాన్ చక్రవర్తి వృత్తాంతం, స్వామితీర్థం మధ్యలో ఉన్న ధనదాది సప్తతీర్థ వర్ణనం, విష్ణువృద్దుడనే ద్విజబంధు వృత్తాంతం, శ్రీ వేంకటాద్రిలో వేదద్విజుడు చేసిన దీపారోప ప్రశంస, సర్వాబద్రోపాఖ్యానం, బ్రహ్మదేవుని ఆజ్ఞమేరకువసిషాది మహరుతీ వేంకటాచలానికి రావడం, ఘోణ (తుంబురు) తీర్థ మాహాత్మ్యం, ఘోణ తీర్థంలో తుంబురుడు తపస్సు చేయడం, అగస్త్య మహర్షి చెప్పిన తుంబురు తీర్థ మాహాత్మ్యం మొదలైన విషయాలు చెప్పబడినాయి.


9. ఆదిత్ళు రాణం : ఉపపురాణాల్లో ఆదిత్య పురాణమొకటి. ఇది సూత - శౌనక సంవాదరూపంలో ఉంది. ఇందులో ఐదు అధ్యాయాల్లో శ్రీ వేంకటాచల మాహాత్మ్య విషయాలు వర్ణించబడినాయి. వాటిలో• నివాస వైభవం, దేవశర్మ వృత్తాంతంశ్రీ శ్రీ నివాసన దివ్యమంగళ సౌందర్యవర్ణనం, దేవశర్మచేసిశ్రీ శ్రీ నివాసస్తుతి, భగవంతుని విశ్వరూపాది వర్ణనం, దేవశర్మకుశ్రీ నివాసుడు వరాలనివ్వడం మొదలైన విషయాలున్నాయి.


10. భవ త్తదు రాణం : ఉపపురాణాల్లో భవిష్యోత్తర పురాణం మరొకటి. ఇది కూడా సూత - శౌనక సంవాదరూపంలో ఉంది. దీనిలో వేంకటాచల మాహాత్మ్యం పదిహేను అధ్యాయాల్లో వర్ణించబడింది. వీటిలో శ్రీ వేంకటాచల ప్రభావం, వృషభాచల - అంజనాచల - శేషాచల - వేంకటాచల నామాలు ఏర్పడిన విధానం, శ్రీ స్వామిపుష్కరిణీ మాహాత్మ్యం, వేంకటాచలానికి భగవంతుడు రావడంశ్రీ వేంకటాచలాన్ని అయోధ్య - మధుర పట్టణాలతో పోల్చడం, భూమినుండి శ్రీ పద్మావతీదేవి ఆవిర్భవించడం, పద్మావతీశ్రీ నివాసుల సమాగమం, పద్మావతీశ్రీ నివాసుల పరిణయం, పద్మావతీదేవి చెప్పిన భగవంతుని లక్షణాలు, భక్తుల లక్షణాలు, రాజ్య విషయంలో తొండమాన్ - వసుదానుల మధ్య కలహమేర్పడటం, తొండమాన్ భగవంతునికి దివ్యాలయాన్ని నిర్మించడం, బ్రహ్మదేవుడు చేసిన శ్రీ నివాస మహోత్సవం, కుర్వ గ్రామంలోని భీముడనే కులాల భక్తుని వృత్తాంతం, రహస్యాధ్యాయం మొదలైన విషయాలు చెప్పబడినాయి.


11. స్కాందు రాణం : మహాపురాణాల్లో స్కాందపురాణం ఒకటి. దీనిని మహేశ్వరుడు స్కందునికి ఉపదేశించాడు. దీనిలో ఏడు మొదటి పది అధ్యాయాలు ధరణీ వరాహ సంవాద రూపంలో ఉన్నాయి. భగవంతుని శ్వేతవరాహ వర్ణనం, వరాహస్వామి మహా మహిమత్వం మరియు వైభవ విశేషాలు ఇందులో ప్రతిపాదించబడినాయి. శ్రీ వేంకటాచలక్షేత్ర వైభవంలో విశ్వసృష్టిశ్రీ వరాహస్వామి భూమిని ఉద్దరించడం, యుగాలు, మన్వంతరాలు - కల్పాలు, యజ్ఞవరాహస్వామి దర్శనం, వాసుదేవాలయశ్రీ వరాహస్తుతి, శ్రీ వరాహ మంత్రారాధన, విధి, ఆది వరాహక్షేత్రం, వేంకటాద్రి విశిష్టత, సర్వదేవతల నిత్యనివాసం మొదలైన విషయాలు వివరించబడినాయి. శ్రీ వేంకటేశ్వర వైభవంలో స్వామి దర్శనం సర్వపాపహరం, అష్టవిధభక్తి, ముక్తిప్రదాత, శ్రీ నివాసుడే పరమగతి, శ్రీ వేంకటేశ్వరుని మహిమ, యజస్వరూపుడు, ఓంకారమే ఆయన హృదయం, సాటిలేని మేటి దైవం, బ్రహ్మూత్సవారంభం మొదలైన విషయాలు చెప్పబడినాయి. శ్రీ పద్మావతీ నివాస కళ్యాణంలో భూమినుంశ్రీ పద్మావతి లభించడం, నారదమహర్షి పద్మావతికి సాముద్రికాన్ని చెప్పడం శ్రీ నివాసుడు వేటకై పుష్పోద్యానవనానికి రావడం, పద్మావతిమా శ్రీ నివాసుడు మోహాన్ని పొందడం, ఆమెను వివాహమాడదలచినట్లు చెప్పడం, ఆకాశరాజు నగరానికి వకుళమాలిక రావడం, ఆమెకు పద్మావతీ సఖులు పద్మావతి వృత్తాంతాన్ని చెప్పడం, పద్మావతి భగవంతుని మరియు భగవద్భక్తుల లక్షణాలను చెప్పడం, వకుళమాలిక మాట ప్రకారం ధరణీదేవి - ఆకాశరాజులు పద్మావతీశ్రీ నివాసుల వివాహాన్ని నిశ్చయించటం, ఈ విషయాన్ని శుకమహరిద్వాజీ నివాసునికి తెలియజేయడం, మహాలక్ష్మి మొదలైనవారు శ్రీ నివాసునికి వివాహాలంకారం చేయడం, శ్రీ నివాసుడు బ్రహ్మాదులతో నారాయణవనానికి రావడం, పద్మావతీ నివాసుల పరిణయం, శ్రీ నివాసుడు ఆకాశరాజుకు భక్తిప్రాప్తి రూపమైన వరాన్ని అనుగ్రహించడం మొదలైనవి వర్ణించబడినాయి. తీర్థ మాహాత్మ్యంలోశ్రీ వేంకటాచలం సర్వ పుణ్యతీర్థాలకు ఆధారమని విశదీకరించి, ఇరవై తీర్థాల మాహాత్మ్యాలు వర్ణించబడినాయి. అవి స్వామి పుష్కరిణి, కుమారధార, తుంబురు తీర్థం, జాబాలితీర్థం, పాపవినాశన తీర్థం, ఆకాశగంగ, కటాహతీర్థం, సువర్ణముఖరి మొదలైనవి. , ఉపాఖ్యానాలలో పధ్నాలుగు వృత్తాంతాలు చెప్పబడినాయి. అవి - వసువనే నిషాదుని కథ, తొండమాన్ చక్రవర్తి చరిత్ర, భీముడనే భక్తుని ఉదంతం, కాశ్యప పరీక్షిత్తుల వృత్తాంతం, ధర్మగుప్తునికథ, అర్జునుని తీర్థయాత్రావర్ణనం, భరద్వాజమహర్షి వృత్తాంతం, అగస్త్య మహర్షి వృత్తాంతం, శంఖమహారాజు చరిత్ర మొదలైనవి.  (సశేషం)