8 సంవత్సరాల వరకు ఈ చెట్టు అతివేగంగా పెరుగుతుంది. ఈ వృక్షం సుమారు 30 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. దీని కాండం 5 నుండి 7 అడుగుల లోపుగా చుట్టుకొలత ఉంటుంది. ఈ వృక్షపు కలపను వంటచెరకుగా ఉపయోగిస్తారు. ఈ చెక్క తేలికగా ఉంటుంది. ఎక్కువకాలం మన్నదు. చవకరకం కాగితాన్ని దీంతో తయారు చేస్తారు. అగ్గిపుల్లలు, అగరుబత్తీలు, చవకరకం ప్యాకేజీ పెట్టెల కోసం ఈ కలపను ఉపయోగిస్తారు. ఈ కలపకు చెదలు పట్టే అవకాశం ఉంటుంది.
కదంబ చెట్టు బెరడుతో కషాయం కాచి వడగట్టి త్రాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. కదంబ ఫలాలను తింటే శరీరానికి బలం వస్తుంది. ఈ ఫలాల నుంచి తీసిన రసం ఎంతో రుచిగా ఉంటుంది. చాలామందికి పెద్ద పెద్ద వృక్షాలు కానీ, వాటి పేర్లు కానీ, ఆ వృక్షం యొక్క ఉపయోగాలు కానీ తెలియవు. ప్రకృతిలోని ప్రతి చెట్టు గురించి పిల్లలు పెద్దల నడిగి తెలుసుకోవాలి. లేదా ఆయుర్వేద వైద్యం ద్వారా తెలుసుకోవాలి.