శ్రీ విష్ణు మహాపురాణం పురాణం


శ్రీ విష్ణు మహాపురాణం పురాణం - కిడాంబి నరసింహాచార్య గత సంచిక తరువాయి


నాల్గవ అంశలో ఐదవ అధ్యాయము


శ్రీ పరాశరుడు చెబుతున్నాడు - ఇక్ష్వాకు కొడుకు నిమి యనువాడు వేయి సంవత్సరాలు సత్రయాగాన్ని ఆరంభించాడు. వసిష్ఠుని హోతగా ఎన్నుకున్నాడు. నిమితో వసిష్ఠుడన్నాడు - నేను ఇంతకు ముందే ఐదు వందల సంవత్సరాల యాగం చేయటానికి ఇంద్రునితో పిలువబడ్డాను. ఆ తరవాత ఆ రక్షణ ఐనాక వచ్చి నీ యాగానికి ఋత్విక్కునౌతాను అని అనగా, ఆ రాజు ఏమీ పలుకలేదు. వసిష్ఠుడు ఈ రాజు నా మాట ఇష్టపడ్డాడని తలంచి ఇంద్రుని యాగానికై వెళ్ళాడు. ఈ రాజు వసిష్ఠుడు లేనప్పుడు గౌతమాదులను ఋత్విక్కులుగా ఏర్పరచి యాగం చేశాడు. ఇంద్రుని యాగం పూర్తయినాక వసిష్ఠుడు నిమితో యజ్ఞం తొందరగా చేయిస్తానని వచ్చాడు. దానిని గౌతముడు చేయిస్తున్నాడనూ చి తన రాజైన ఆ నిమికి శాపమిచ్చాడు. నన్ను కాదని ఈ నిమి గౌతమునికి పని అప్పగించాడని,


కనుక ఈ నిమి విదేహుడు (దేహం లేనివాడు) కావాలని. ఈ విషయం నిమికి తెలిసి, ఆతడిట్లన్నాడు - నాతో మాట్లాడకుండా అజ్ఞానంతో నిద్రపోతున్న నాకు ఈ దుష్టగురువు శాపమిచ్చాడు కనుక ఆ గురువుకు కూడా దేహం లేకుండుగాక (దేహం పడిపోవు గాక) అని శాపమిచ్చి ఆ రాజు దేహాన్ని విడిచాడు. ఆ శాపం వల్ల వసిష్ఠుని చేతస్సు మిత్రావరుణుల తేజస్సులో చేరింది. ఊర్వశిమా డటం వలన మిత్ర వరుణులకు వీర్యస్థలనమై అందుండి వసిష్ఠుడు మరొక దేహాన్ని పొందాడు. నిమి శరీరానికి మనోహరమైన గంధ తైలాదులు పూయటం వలన ఆ శరీరానికి ఏ బాధ కలగలేదు. అప్పుడే మరణించినట్లున్నది ఆ శరీరము. యజ్ఞ సమాప్తి కాగా యజ్ఞంలో తమ భాగాన్ని (ఇంద్రాయ స్వాహా అంటే అది ఇంద్రునిది) తీసుకోవటానికి దేవాదులు రాగా వారితో ఋత్విజులన్నారు, యజమానునకు వరాన్నివ్వండి అని. దేవతలు రేపింపగా నిమి అన్నాడు - ఓ దేవతలారా! మీరు సమస్త సంసార దుఃఖాన్ని తొలగించేవారు. శరీరం ఆత్మ పోయాక కలిగే దుఃఖంతో సమానమైనది మరొక దుఃఖం లేదు. అందువల్ల నేను సమస్త లోకమందలి ప్రాణులలోని కళ్ళలో ఉండటానికి ఇష్టపడుతున్నాను. తిరిగి నాకు శరీరం వద్దు అని అనగా దేవతలు ఈతడు సమస్త ప్రాణుల నేత్రముల యందున్నాడు. అప్పటి నుండి ప్రాణులు కళ్ళు తెరవటం, మూయటం చేశారు. (నిమి - నిమిష అట్లా నిమి చక్రవర్తి మన కళ్ళల్లో రెప్పపాటు (తెరవటం, మూయటం) అనే పద్దతిలో ఉన్నాడు). - సంతానం లేనివాడు ఆ రాజు. ఆ కారణంగా ఆ రాజు శరీరాన్ని అరణ్యంలోని మునులు చిలికారు రాజ్యం అరాజకం కాకూడదని. అందుండి ఒక పిల్లవాడు పుట్టాడు. జననం (పుట్టినందున) ఐనందువలన జనకుడైనాడు. ఈతని తండ్రికి దేహం లేనందువలన జనకునకు వైదేహుడని పేరు. శరీరాన్ని చిలికినందువల్ల పుట్టినాడని (మథనాత్ మిథి) మథనమైనందున మిథి అని కూడా పేరు. అతనికి ఉదావసుడని పుత్రుడు. ఆతనికి నందివర్తనుడు. ఆతనికి సుకేతువు. ఆతనికి దేవరాతుడు. ఆతనికి బృహదుధుడు,ఆతనికి మహావీర్యుడు, ఆతనికి సుధృతి, ఆతనికి ధృష్టకేతువు కలిగారు. ధృష్టకేతువునకు హర్యశ్వుడు, ఆతనికి మనువు, మనువునకు ప్రతికుడు, ఆతనికి కృతరథుడు, ఆతనికి దేవమీఢుడు, ఆతనికి విబుధుడు, ఆతనికి మహాధృతి, ఆతనికి కృతరాతుడు, ఆతనికి మహా రోముడు, ఆతనికి స్వర్ణరోముడు, ఆతని పుత్రుడు హ్రస్వరోముడు, ఆతనికి సీరధ్వజుడు కలిగారు (ఇట్లా వంశక్రమము).


ఆ సీరధ్వజుడు పుత్రుడు కల్గటానికి యజ్ఞభూమిని దున్నుతుండగా నాగలికర్రునకు సీత అనే కూతురు తగిలింది. సీరధ్వజుని తమ్ముడు సాంకాశ్య దేశానికి రాజు. ఆతని పేరు కుశధ్వజుడు. సీరధ్వజుని సంతానము భానుమంతుడు. ఆతనికి శతద్యుమ్నుడు. ఆతనికి శుచి, ఆతనికి ఊరుడు కలిగారు. ఆతనికి శతధ్వజుడు, ఆతనికి కృతి, ఆతనికి అంజనుడు, ఆతనికి కురుజిత్తు, ఆతనికి అరిష్టనేమి, ఆతనికి శ్రుతాయువు, ఆతనికి సుపార్వుడు, ఆతనికి సృంజయుడు, ఆతనికి క్షేమావి, ఆతనికి అసేనుడు, ఆతనికి భౌమరథుడు, ఆతనికి సత్యరథుడు, ఆతనికి ఉపగువు, ఆతనికి ఉపగుప్తుడు, ఆతనికి స్వాగతుడు, ఆతనికి స్వానందుడు, ఆతనికి సువర్చుడు, ఆతనికి సుపార్శ్వుడు, ఆతనికి సుభాషుడు, ఆతనికి సుశ్రుతుడు, ఆతనికి జయుడు, ఆతనికి విజయుడు, ఆతనికి ఋతుడు, ఆతనికి సునయుడు, ఆతనికి వీతహవ్యుడు, ఆతనికి ధృతి, ఆతనికి బహులాశ్వుడు, ఆతనికి కృతి, కృతికి సంతిష్ఠుడు ఇది జనక వంశ క్రమము. వీరంతా మైథిలులు. వీరంతా ఆత్మవిద్యను ఆశ్రయించినవారు. రాజులు అయినారు (అవుతారు అని. ఈ వంశక్రమం పేర్లలో వేరే పురాణాలలోని పేర్ల క్రమానికి తేడా ఉన్నా, కొన్ని పేర్లు లేకపోయినా ఇది ఒక కల్పం లోని కథ. అది ఒక కల్పం లోనిదని గ్రహించాలి అని పురాణజ్జుల మాట) అనిశ్రీ విష్ణు మహాపురాణంలో నాల్గవ అంశలో ఐదవ అధ్యాయం సమాప్తము.


ఆరవ అధ్యాయము


శ్రీ యుడు అడుగుతున్నాడు - భగవన్! మీరు నాకు సూర్యవంశపు రాజునులను చెప్పారు. అట్లాగే సోమ (చంద్ర) వంశములోని రాజులందరి గూర్చి చెప్పండి వినదలిచాను. ఏ సంతతి నేటికి కూడా స్థిరకీర్తి కలదై కీర్తింపబడుతున్నదో వారిని చెప్పండి. ఓ బ్రహ్మన్! అనుగ్రహపూర్వకముగా వారిని గూర్చి చెప్పండి అని. శ్రీ పరాశరుడు చెబుతున్నాడు - ప్రసిద్ధమైన తేజస్సు గల ఆ వంశాన్ని గూర్చి, ఓ మహర్షీ విను. చంద్రుడు ఆరంభమై ప్రసిద్ధమైన ఆ చంద్రవంశపు రాజుల గూర్చి విను. ఈ వంశంలో మిక్కిలి బలవంతులు, పరాక్రమశాలురు, కాంతివంతులు, శీలవంతులు, మంచి చేష్టలు కలవారు, మంచి గుణవంతులు అయిన నహుష, యయాతి, కార్తవీర్యుడు మొదలైన రాజులు జన్మించారు. వారిని గూర్చి చెబుతాను విను. సమస్త జగత్తును సృష్టించే భగవంతుడైన నారాయణుని నాభి పద్మం నుండి బ్రహ్మ పుట్టాడు. ఆతనికి అత్రి, ఆతనికి చంద్రుడు కలిగారు. బ్రహ్మ ఆ చంద్రుని సమస్త ఓషధులకు, బ్రాహ్మణులకు, నక్షత్రములకు అధిపతిగా ఉంచాడు. ఆతడు రాజసూయం చేశాడు. దాని ప్రభావం వల్ల చాలా ఉన్నతమైన ఆధిపత్యాన్ని పొందినందువల్ల అతనికి మదమెక్కింది. ఆ గర్వంతో సకల దేవతలకు గురువైన బృహస్పతి భార్యను ఎత్తుకుపోయినాడు. బృహస్పతి రేపింపగా, బ్రహ్మ అనేకమార్లు రేపించినా, దేవతలంతా యాచించినా చంద్రుడు తారను వదలలేదు. ఆ చంద్రునకు బృహస్పతి మీది ద్వేషంతో శుక్రుడు సహాయకుడైనాడు. (బృహస్పతి దేవగురువు. శుక్రుడు రాక్షస గురువు. ఇది వారి ద్వేషమునకు కారణం). అంగీరసుని దగ్గర రుద్రుడు విద్యను పొందినవాడు. ఆ కారణంగా బృహస్పతికి రుద్రుడు సహాయం చేశాడు. (అంగీరసుని పుత్రుడు బృహస్పతి). శుక్రుడుఏవైపు ఉంటేజంభకుంభాది రాక్షసులంతా (దైత్య దానవులు) ఆ వైపు ఉండి గొప్ప యుద్ధం చేశారు. బృహస్పతికి సమస్త దేవసైన్యంతో కూడి ఇంద్రుడు సహాయం చేశాడు. ఇట్లా ఆ ఇద్దరికీ తీవ్రమైన భయంకరమైన యుద్ధము తార కారణంగా తారకామయమని ఐంది. పిదప సమస్త శస్త్రాలు రాక్షసుల యందు దేవతలు, రుద్రుడు మొదలగు వారు వేశారు. దేవతలపైన రాక్షసులు వేశారు. ఇట్లా దేవతల అసురులు యుద్ధ సంక్షోభంతో క్షోభించిన వారంతా జగత్తుకు బ్రహ్మమైన వానిని ఆశ్రయించారు. అప్పుడు బ్రహ్మ కూడా శుక్రుని, శంకరుని, అసురులను, దేవతలను వారించి బృహస్పతికి తారనిప్పించాడు. ఆమె గర్భిణి. ఆమెమూ చిబృహస్పతి అడిగాడు. నీ కడుపులోని వాడు ఎవరి సుతుడు? నా సుతుడా? వేరేవాని సుతుడా? వేరేవాని సుతుడైతే వానిని విడిచిపెట్టు అని అనగా ఆ పతివ్రత భర్త మాట విన్నాక రెల్లుగడ్డి కాడలో ఆ గర్భాన్ని విడిచిపెట్టింది. విడిచిపెట్టగానే ఆ పిండం గొప్ప తేజస్సుతో దేవతల తేజస్సును వెక్కిరించింది. (దేవతల తేజస్సును మించిపోయింది). దేవతలు, బృహస్పతిని, చంద్రచూ చి ఆ పిల్లవాని సౌందర్యాచ్నూ చి, కుతూహలంతో అనుమానంతో తారను అడిగారు. అమ్మా! నిజం చెప్పు. ఓ సౌందర్యవతీ! ఈ పిల్లవాడు చంద్రుని కొడుకా, కాక బృహస్పతి పుత్రుడా అని. వారిట్లా అంటే తార సిగ్గుతో ఏమీ చెప్పలేదు. దేవతలు ఎన్నిసార్లు అడిగినా మాట్లాడకపోతే ఆ పిల్లవాడు ఆ తల్లిని . శపించదలచి ఇట్లా అన్నాడు. ఓ .. దుర్మార్గపు తల్లీ! నా తండ్రి పేరు ఎందుకు చెప్పటం లేదు అని. దొంగ సిగ్గు నటించే నీకు తగిన శాస్తి చేస్తాను, • ఇప్పటికైనా చెప్పకపోతే : శపిస్తానన్నాడు.


అప్పుడు బ్రహ్మ ఆ పిల్లవాడిని తొలగించి, తారను స్వయంగా తానే అడిగాడు. చెప్పమ్మా! ఎవరి పిల్లవాడు సోముని కొడుకా? బృహస్పతి కొడుకా అనగా సిగ్గుతో సోముని కొడుకు అని అన్నది. ఆ పిదప గాలిని పీల్చేవేళ కనిపించే నిర్మలమైన చెక్కిళ్ళ కాంతి గల చంద్రుడు కొడుకును కౌగిలించుకుని పుత్రా! బాగు, బాగు. ప్రాజ్ఞుడవు నీవు అతనికి బుధుడు అని పేరు పెట్టాడు. అతడు పెట్టినపేరు అదే స్థిరమైంది. బుధుడు ఇల యను స్త్రీ యందు పురూరవుని పొందాడు. పురూరవుడు దానపరుడు. అనేక యజ్ఞాలు చేసినవాడు. మిక్కిలి తేజస్సు కలవాడు. సత్యవాది, రూపవంతుడు, మనస్వి. .. అట్టివానిని మిత్రావరుణ్యుల శాపం వల్ల మనుష్య లోకంలో తాను ఉండాలని • భావించి వచ్చిన ఊర్వం చింది. • ఆతనినిచూ డగానే మానాన్ని విడిచిపెట్టి, స్వరసుఖాభిలాషను దలి ఆతనియందే : మనస్సు నిలిపి, ఆతని దరికి : వచ్చింది. ఆతడు కూడా సకల • లోకములందలి స్త్రీల కాంతిని, సౌకుమార్యాన్ని, లావణ్యాన్ని, నడకను, విలాసమును, నవ్వును మొదలైన వానిని గుణాలు కలదానిమా చి ఆమెకు మించిన అధీనమైన మనసు కలవాడైనాడు. ఇద్దరు పరస్పరం ఆ మనస్సు కలవారై నా పులేక ఇతర ప్రయోజ వదిలినవారైనారు. రాజు తడబడకుండా ఆమెతో అన్నాడు - ఓ సుభ్రూ! నేను నిన్ను బాగా మిస్తున్నాను. అనుగ్రహించు. నామీద అనురాగాని పు అనగా - సిగ్గువిడిచి ఊర్వశి ఆతనితో అన్నది. సరే అట్లాగే కానీ. కాని నా నియమాలను నీవు పాటిస్తేనే అని ఆమె అంటే పురూరవుడు ఆమెతో అన్నాడు ఆ నియమాలేమిటో చెప్పు అని. ఆమె తిరిగి అన్నది - పడక దగ్గర నా రెండు పొట్టేళ్ళు నా పిల్లల లాగా ఉంటాయి. వాటిని తీసేయొద్దు. నా ఎదుట నీవు నగ్నంగా కన్పించవద్దు. నేను నేయి మాత్రమే తింటాను అని. రాజు సరేనన్నాడు. ఆమెతో కూడి ఆ రాజు అలకానగరిలో చైత్ర రథాది వనాలలో స్వచ్ఛమైన పద్మాల మధ్య, అందమైన మానసాది సరస్సులలో ఆనందిస్తూ 61 సంవత్సరాలు ప్రతిరోజు పెరుగుతున్న ఆనందం కలవాడై కాలం గడిపాడు. ఊర్వశి కూడా ఆతనితో భోగాలనుభవిస్తూ ప్రతిరోజు పెరుగుతున్న అనురాగం కలదై స్వర్గ సుఖాన్ని కూడా తలచలేదు. ఊర్వశి లేకుండా దేవలోకము, అప్సరసలకు, సిద్ధ గంధర్వులకు ఆనందమన్పించలేదు. ఊర్వశీ పురూరవుల కట్టుబాటును తెలుసుకున్న విశ్వావసు అనే . గంధర్వుడు ఇతర గంధర్వులతో కూడి రాత్రి పూట ఊర్వశీ పురూరవుల పడక దగ్గర నుండి ఒక పొట్టేలును హరించాడు. దానిని ఆకాశంలో తీసుకుపోతుంటే ఆ శబ్దాన్ని • తీసుకుపోతుంటే ఆ శబ్దాన్ని ఊర్వశి విన్నది. ఆమె అన్నది - అనాథ అయిన నా పుత్రుని ఎవడు ఎత్తుకుపోతున్నాడు? నేనెవరిని శరణు వేడాలి అని. దానిని విని రాజు, నేను పడకలో నగ్నంగా ఉన్నాను. డేహి స్తుందని లేవలేదు. ఇంతలో గంధర్వులు రెండో పొట్టేలును తీసుకుని వెళ్ళారు. దానిని కూడా ఎత్తుకుపోవటం, దాని శబ్దాన్ని ఆకాశంలో నున్న దాన్ని విని తిరిగి నేను అనాథను. భర్తలేని దానిని. ఎవరిని ఆశ్రయించాలి అని ఆర్తితో అరిచింది. రాజు కూడా కోపంతో ఇది చీకటి అని ఎంచి ఖడ్గం తీసుకుని దుష్టుడా ! చచ్చావు అని అంటూ వెంట పరిగెత్తాడు. అంతలో గంధర్వులు చాలా ఉజ్జ్వలమైన మెరుపును సృష్టించారు. ఆ కాంతిలో ఊర్వశి బట్టలు లేని రాజు చూ చి కట్టుబాటును దాటాడని ఎంచి వెంటనే వెళ్ళిపోయింది. ఆ పొట్టేళ్ళను విడిచి గంధర్వులు కూడా దేవలోకానికి వెళ్ళారు. రాజు కూడా ఆ పొట్టేళ్ళను తీసుకుని ఆనందంతో తన పడకగదికి వచ్చాడు. ఊర్వశి కనిపించలేదు. ఆమె కన్పించనందువల్ల బట్టలు లేకుండానే పిచ్చివానిలా తిరిగాడు. కురుక్షేత్రంలో అంభోజ సరస్సులో ఇంకొక నల్గురు అప్సరసలతో కూడి ఉన్న ఊర్వశమా చాడు పురూరవుడు. అప్పుడు పిచ్చివాడై ఓ భార్యా! ఉండు. నా ఘోరమైన మనస్సులో ఉండు. మాటలలో కాపట్యం కలదానా! నిలు నిలు అని రక రకాలుగా అన్నాడు. అప్పుడు ఊర్వశి అన్నది - ఓ మహారాజా! ఈ అవివేక చేష్ట చాలు. నేను గర్భిణిని. సంవత్సరం చివరనీవు ఇక్కడికి రా.నీకుపుత్రుడుకలుగుతాడు.ఒకరాత్రినీతో గడుపుతాను అని పలుకగా ఆనందించి తన నగరానికెళ్ళాడు. ఆ అప్సరసలతో ఊర్వశి అన్నది. ఈ ఉత్తమ పురుషునితో ఉత్కృష్టునితో ఇంతకాలం అనురాగంతో ఆకర్షింపబడి కలిసి ఉన్నాను అనగానే ఆ అప్సరసలు ఇట్లా అన్నారు - ఈతని రూపం బాగుంది. ఇతనితో మేము ఎల్లకాలముండాలి అని. సంవత్సరం తర్వాత రాజు అక్కడికి వచ్చాడు. ఆయుషుడనే కుమారుని ఊర్వశి అతనికి ఇచ్చింది. ఒక రాత్రి అతనితో గడిపి అయిదుగురు పుత్రుల కొరకు గర్భాన్ని దాల్చింది. ఆ రాజుతో ఇలా అన్నది. నా


సంతోషం కొరకు గంధర్వులందరు మహారాజుకు .. వరములిచ్చేవాళ్ళెనారు. వరాన్ని కోరుకో .. అని.రాజు అన్నాడు శత్రువులనందరినీ • జయించి, ఇంద్రియ సామర్థ్యం కలిగి, • బంధువులు కలిగి, అమితమైన . బలము, కోశము కలిగి ఉన్నాను. : ఊర్వశీ సాలోక్యం తప్ప నాకు • కావలసినది ఏమీ లేదు. : అందువలన ఈ ఊర్వశితో నేను • కాలం గడపాలనుకుంటున్నాను . అనగా గంధర్వులు రాజుకు • అగ్నిస్థాలిని ఇచ్చి ఇట్లా అన్నారు - వేదాన్ని అనుసరిస్తూ అగ్నిని మూడు భాగాలు చేసి ఊర్వశీ సలోకత అనే . కోరికను ఉద్దేశించి (ఆమెతో ఒకే లోకంలో ఉండటం) చక్కగా యజ్ఞం చేయుము. అప్పుడు తప్పకుండా నీ కోరిక తీరుతుంది అని అనగా రాజు ఆ అగ్నిసాలిని తీసుకుని వెళ్ళాడు. అడవి మధ్యలో రాజు ఆలోచించాడు. నేనెంత మూర్ఖుణ్ణి. నేనెంత పని చేశాను. ఊర్వశిని తేకుండా అగ్నిష్టాలిని తెచ్చాను అని అడవిలోనే అగ్నిష్టాలిని వదిలి తన నగరానికి వెళ్ళాడు. అర్థరాత్రి గడిచాక నిద్రరాక ఇట్లా అనుకున్నాడు. నాకు ఊర్వశీ సాలోక్య ప్రాప్తి కొరకు గంధర్వులు అగ్నిస్థాలీనిచ్చారు. నేను దాన్ని అడవిలో వదిలాను. కనుక నేను దాన్ని తీసుకు రావటానికి వెళతాను అని లేచి ఆ అడవికి వెళ్ళాడు. అక్కడ అగ్నిష్టాలి లేదు. అగ్నిహిలి ఉండే చోట శమి (జమ్మి) చెట్టు లోపల గల అశ్వత్థ వృక్షాన్ని ( రామ చాడు. అది శమి గర్భంలో గల అశ్వత్థమైనది. అందువలన దీనినే నేను అగ్నిరూపంగా తీసుకువెళ్ళి నా నగరంలో అరణిని చేసి అందుండి పుట్టిన అగ్నిని ఉపాసిస్తాను అని. అట్లాగే తన నగరానికి వెళ్ళి అరణిని చేశాడు. గాయత్రి అక్షర ప్రమాణంగా అన్ని అంగుళములతో అరణిని భావించి గాయత్రిని జపించాడు. అట్లా చదువుతుండగా అక్షర సంఖ్యకు తగ్గట్టుగా అన్ని అంగుళాల అరణి ఏర్పడింది. అందులో అగ్నిని మథించి మూడగ్నులను వేదానుసారంగా హోమం చేశాడు. ఊర్వశీ సాలోక్య ఫలాన్ని పొందాడు. ఆ అగ్ని విధితోనే అనేక రకాల యజ్ఞాలు చేసి గంధర్వ లోకాన్ని చేరి ఊర్వశితో కలిసి ఉన్నాడు. తొలుత ఒకే అగ్ని ఉండేది. ఈ మన్వంతరంలో ఆ ఒక్కటి మూడు విధాలైనది. అశ్రీ విష్ణు మహాపురాణంలో నాల్గవ అంశలో ఆరవ అధ్యాయము సమాప్తము. (సశేషము)