చంద్రమతి స్వయంవరం


ఆరోజు అయోధ్యా నగరం అంతా కోలాహలంగా ఉన్నది. నగరమంతా పూలదండలతోనూ, మామిడాకుల తోరణాలతోనూ అలంకరించి ఉన్నది. ఆలయాల్లో తెల్లవారు ఝాము నుంచే పూజలు జరుగుతున్నాయి. ప్రజలందరూ నూతన వస్త్రాలు ధరించి ఉన్నారు. అందరి ముఖాలు | సంతోషంతో కళకళలాడుతూ ఉన్నాయి..


మహారాజు త్రిశంకుడు కొలువుతీరి ఉన్నాడు. మంత్రి, సామంతులు, సభికులు అందరూ మహారాజు సందేశం కోసం ఎదురూ స్తున్నారు. త్రిశంకుడు లేచి నిలబడ్డాడు. "సభాసదులారా! నేను బహుకాలం రాజ్యం చేసి ఉన్నాను. పైగా వయోభారం నన్ను కుంగదీస్తోంది. ఇక నేను వానప్రస్థాశ్రమం స్వీకరించాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. అయితే అందరిలాగా నేను తపస్సుతో శరీరం కృశింపచేసుకుని తనువు విడిచిపెట్టడం ఇష్టం లేదు. సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలని అనుకుంటున్నాను. అందుకోసం రేపే నా కుమారుడు హరిశ్చంద్రుడికి రాజ్యం అప్పగించి వసిష్టాశ్రమానికి బయలుదేరాలనుకుంటున్నాను. ఇకనుంచి నన్ను ఆదరించినట్లేనా బిడ్డను కూడా ఆదరించండి" అన్నాడు.


"అలాగే మహారాజా! మీ ఆశయం తప్పక నెరవేరాలని కోరుకుంటున్నాం" అన్నాడు మంత్రి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అన్నట్లు హరిశ్చంద్రుడి గుణగణాలు చిన్నతనం నుంచే అందరూ చూస్తున్నారు. అందువల్ల మహారాజు మాటలు వారికి ఆనందాన్నే కలిగించాయి. "త్రిశంకు మహారాజుకీ" అన్నాడు మంత్రి. సభికులు అందరూ "జై" అన్నారు. "యువరాజు హరిశ్చంద్రుల వారికీ" మళ్ళీ అన్నాడు. అందరూ మళ్ళీ "జై" అన్నారు.


రోజులు గడిచిపోయాయి. హరిశ్చంద్రుడు రాజ్యపాలన చేస్తున్నాడు. ప్రజలందరు ఎటువంటి ఈతిబాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఒకరోజు హరిశ్చంద్రుడు కొలువతీరి ఉండగా కొందరు బ్రాహ్మణులు వచ్చారు. మహారాజు వారిని ఉచితాసనాలు ఇచ్చి గౌరవించాడు. మాటల సందర్భంలో వారు "మహారాజావిజయాస్పదపురాన్ని పాలించే ఉశీనరుడనే రాజుకు చక్కని కుమార్తె ఉన్నది. ఆమె పేరు చంద్రమతి. అతిలోక సౌందర్యవతి. ఆమెకు త్వరలో వివాహం చేయటానికి స్వయంవరం ప్రకటించబోతున్నారు" అన్నారు. "అంతటి సౌందర్యవతా?" ఆలోచనగా అన్నాడు రాజు.


"అంతటి సౌందర్యవతా?" ఆలోచనగా అన్నాడు రాజు. "అవును మహారాజా! ఆమె సౌందర్యాన్ని వర్ణించటానికి మా ప్రపంచానుభవం చాలదు. ఎంతటి సౌందర్యవతో అంతటి సుగుణవతిమీరా అపర మన్మథులు. మీ ఇద్దరికీ వివాహం జరిగితే మీ దాంపత్యం ఆదర్శప్రాయమౌతుంది" అన్నారు. "సరే! స్వయంవరం ప్రకటిస్తారుగా!" అన్నాడు రాజు.


"అదీ అతి సమీపంలోనే ఉన్నది. కళ్యాణమస్తు!' దీవిస్తూ లేచి నిలబడ్డారు బ్రాహ్మణులు. హరిశ్చంద్రుడు వారికి నమస్కరించాడు. కొన్నాళ్ళ తర్వాత హరిశ్చంద్రుడిని చంద్రమతీ స్వయంవరానికి ఆహ్వానిస్తూ వార్తాహరుడు లేఖ తీసుకువచ్చాడు. హరిశ్చంద్రుడు రాజ్యరక్షణ భారం సేనాపతులకి అప్పగించి, మంత్రి సత్యకీర్తితో కలిసి స్వయంవరానికి బయలుదేరాడు. ఇద్దరూ గుఱ్ఱల మీద ప్రయాణం సాగిస్తూ కొండలు, కోనలు, అడవులు దాటారు.


"సత్యకీర్తీ! చీకటి పడుతున్నది. అదిగో! ఆ కనిపించే నదీతీరం దగ్గర కాళికాలయంలో ఈ రాత్రి విడిది చేసి తెల్లవారగనే వెళదాం!" అన్నాడు. "అలాగే మహారాజా!" అన్నాడు సత్యకీర్తి. ఇద్దరూ గుర్రాలను చెట్టుకు కట్టి సరోవరంలో దాహం తీర్చుకుని స్నానపానాదులు ముగించుకుని శుచి అయ్యారు. హరిశ్చంద్రుడు కాళికాలయంలోకి వచ్చాడు. "సత్యకీర్తీ! అటడు . ఆలయం మొత్తం నల్లరాతితో తయారైనా రథాశ్వాలు, విల్లంబులు బంగారు వన్నెతో మెరిసిపోతున్నాయి" అంటూ పించాడు. "బంగారు వన్నెతోనా? నాకేమీ కనిపించటం లేదు మహారాజా! అవి కూడా నల్లరాతితో చేసినట్లే ఉన్నాయి" అన్నాడు. "అలాగా! అయితే దీనికేదో బలవత్తరమైన కారణం ఉండి ఉంటుంది. ముందు దేవి దర్శనం చేసుకుందాం" అని లోపలికి వెళ్ళి చేతులు జోడించి నమస్కరించాడు హరిశ్చంద్రుడు. దేవిని అనేక విధాల స్తుతించాడు.


"అమ్మా! ఎలాగైనా ఆ చంద్రమతి నన్నే వరించేటట్లు చేయి" అని ప్రార్థించాడు. వెంటనే దేవి విగ్రహం చుట్టూ మిరుమిట్లు గొలిపేటట్లు మెరుపులు మెరిశాయి.శంఖం, చక్రం, దండం, ఖడం వంటి ఆయుధాలు ధరించి పది చేతులతో కాళిక ప్రత్యక్షమైంది. "కుమారా! చంద్రమతే నీకు తగిన పత్ని. ఆమె తప్పక నిన్నే వరిస్తుంది. సత్యానికి, ధర్మానికి పుట్టినిల్లయి వర్ధిల్లు" అని దీవించింది. "ధన్యుణ్ణి తల్లీ! కానీ ఒక్కసందేహం. ఇక్కడ రథాశ్వాలూ, విల్లంబులు సువర్ణశోభతో విరాజిల్లుతూ కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏమిటో దయచేసి తెలియజేయి" అడిగాడు. | "పూర్వం ఈ భరతఖండాన్ని వరుణుడు అనే రాజు పరిపాలించాడు. కొంతకాలానికి అతడు సన్యాసాశ్రమానికి వెళుతూ ఈ రథాశ్వాలూ, విల్లమ్ములనూ నా దగ్గర ఉంచి వాటిని శిలలుగా మార్చమనీ, వాటి నిజరూపం ఎవరికి కనిపిస్తుందో వారికి ఇమ్మని నన్ను ప్రార్థించాడు. ధర్మాత్ముడవైన నీవు కనుగొంటివి కాన వీటిని నీవే గ్రహించు. శుభమస్తు' అని దీవించి అదృశ్యురాలైంది కాళిక. సత్యకీర్తి ఇదంతా ఒక అద్భుత దృశ్యందూ స్తూ ఉండిపోయాడు. ఆ రాత్రి అక్కడ విశ్రమించారు. తెల్లవారి మళ్ళీ ప్రయాణం కొనసాగించి విజయాస్పదపురానికి చేరుకున్నారు..


అంతఃపురంలో చంద్రమతి హరిశ్చంద్రుడి చిత్రపటం గీసి తదేకంగా చూస్తూ ఉంది. ఇంతలో చెలికత్తె మంజరి వచ్చి "అమ్మా! మహారాజు గారు, మహారాణి గారు వస్తున్నారు" అని చెప్పింది. చంద్రమతి గభాలున చిత్రపటాన్ని తెరతో మూసివేసింది. ఉశీనరుడు, ఆయన భార్య లోపలికి వచ్చారు. చంద్రమతికి ఆమె స్వయంవరం గురించి చెప్పాడు ఉశీనరుడు. "నాన్నా! ఈరోజు రాత్రి ఒక విచిత్రం జరిగింది. కలలో పరమశివుడు కనిపించి నాకుహరిశ్చంద్రుడే భర్త అవుతారనీ,మా వివాహం దేవతలకు కూడా సమ్మతమేనని చెప్పారు" అంది. | "శుభం తల్లీ!" అన్నాడు మహారాజు, "అమ్మా! స్వయంవరానికి వెళ్ళేముందుశ్రీ రంగనాథుడి ఆలయానికి పోయి దర్శించుకోవాలిఅది మన ఆచారం" అన్నది తల్లి. "అలాగేనమ్మా!" అంది చంద్రమతి"మంజరీ! నువ్వు కూడా అమ్మాయితో వెళ్ళు!" అన్నది. "చిత్తం మహారాణీ!" అన్నది మంజరి. | చంద్రమతి చెలికత్తెలతో కలిసి శ్రీ రంగనాథుడి ఆలయానికి వచ్చింది. అర్చకుడు ఎదురు వచ్చి ఆమెను లోపలికి తోడ్కొని వచ్చాడు"పూజారిగారూ! అమ్మాయిగారు కోరుకున్న వరుడు భర్త కావాలని దేవుణ్ణి పూజించండి"కొంటెగా అందిమంజరి. "మంజరీ!" అని అలకగా చూసి మోచేత్తో పొడిచింది చంద్రమతి. "అలాగేనమ్మా! యువరాణి గారి పెళ్ళంటే మాకందరికీ పర్వదినం" అన్నాడు అర్చకుడు. చంద్రమతి కళ్ళు సిగ్గుతో బరువెక్కాయి. |


మంజరి అందించిన పూలమాలను స్వామివారికి అలంకరించాడు పూజారి. మంత్రాలు చదువుతూ హారతిచ్చాడు. చంద్రమతి స్వామిని భక్తిభావంతుస్తూ "స్వామీ! నా కలలో కనిపించిన సుందరుడే పతిగా అనుగ్రహించు" అని ప్రార్థించింది.వెంటనే గోడమీద బల్లి కుహూ కుహూ అంటూ తోక ఆడించింది. అర్చకుడు హారతి అందిస్తూ "శుభశకునం తల్లీ! బల్లి కూడా చెప్పింది" అన్నాడు. హారతి తీసుకుని ఆయనకి కూడా నమస్కరించింది చంద్రమతి. "శీఘ్రమే ప్రియ సమాగమ ప్రాప్తిరస్తు" అని దీవించాడు. స్వయంవర మంటపంలో వివిధ దేశాల నుంచి వచ్చిన రాకుమారులందరూ వరసగా ఆశీనులయ్యారు. చంద్రమతి పూలహారం పట్టుకుని ఉన్నది. మంజరి ఆ రాకుమారులందరినీ ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వస్తోంది. చంద్రమతి వారినందరినీ దాటి వచ్చిందిహరిశ్చంద్రుడి దగ్గరకువచ్చిన తర్వాత "వీరు అయోధ్యాధీశులు,త్రిశంకు నృపాలునికుమారుడు అయినహరిశ్చంద్రుల వారు"పరిచయం చేసింది మంజరి.హరిశ్చంద్రుడు లేచి నిలబడ్డాడు. పూలమాల వేయటానికి చేయి పైకెత్తింది చంద్రమతి.


"ఆగు! పెద్దగా అరిచాడు హరిశ్చంద్రుడు. అందరూ ఏమైందా అమా శారు. "ఎంత మోసం? ఎంత వంచన?" అన్నాడు పెద్దగా. "మహారాజా! దీనితో నీ కాపట్యం వెల్లడయింది. ఛీ! నీవింత వంచకుడవనుకోలేదు" అన్నాడు హరిశ్చంద్రుడు. "రాకుమారా! ఏమిటీ అసందర్భ ప్రలాపం?" కోపంగా అన్నాడు మంత్రి.


"సందర్భం తెలియకుండా మాట్లాడేది మీరే!... మహారాజా ఒకసారి వివాహం అయిన స్త్రీకి మళ్ళీ స్వయంవరం చాటిస్తారా? ఇంతకన్నా అన్యాయం, అక్రమం ఏమైనా ఉన్నదా?" అన్నాడు. "మా రాకుమారి మీద ఇలాంటి నింద వేసిన నీవు క్షమార్హుడవు కావు..." ఇంకా ఏదో అనబోయాడు మంత్రి. ఆగు అన్నట్లు చేత్తో ఒక్క విదిలింపు విదిలించాడు హరిశ్చంద్రుడు. "అదిగో ఆమె మెడలో మంగళసూత్రం ప్రత్యక్షంగా కనిపిస్తుంటే ఇంక కల్లలాడుతారెందుకు?" అన్నాడు. "మంగళసూత్రమా! ఏదీ ఎక్కడా?" అని రాకుమారులందరూ ఆశ్చర్యం శారు. "అదిగో! మిలమిలా మెరుస్తూ పైట చాటున బాల సూర్యుడిలా ప్రకాశిస్తోంది" అన్నాడు. "రాకుమారా! నీకేమైనా మతి భ్రమించిందా? ఆమె మెడలో ఏమాంగల్యమూ లేదు" అన్నారు. "ఆగండి" గొంతు విప్పాడు ఉశీనరుడు. "మీ ఇరుపక్షాల వాదనలూ యదార్థమే. నాకు చాలాకాలం వరకు సంతానం కలగలేదు. ఆ కారణం వల్ల ఈశ్వరుని కోసం తపస్సు చేశాను. ఆయన కరుణించి పార్వతీ సహితుడై ప్రత్యక్షమై, నాకు పుట్టుకతోనే మాంగల్యంతో ఒక కుమార్తె జన్మిస్తుందనీ, ఆ మాంగల్యం ఏ పురుషుడి కంటపడుతుందో అతడే ఆమె భర్త అవుతాడని వరం ఇచ్చాడు. అందుకే మీ అందరికీ కనిపించకుండా హరిశ్చంద్రుడికి మాత్రమే అది కనిపించింది. అతడే ఆమెకు తగిన భర్త అని చెప్పాడు. "ఆపండి మీ కట్టు కథలు! ఇలాంటి కథలు నూరు కల్పించినా నేను నమ్మను" అన్నాడు హరిశ్చంద్రుడు. "గురుదేవా! ఏమిటీ పరీక్ష? ఇతనిని ఎలా నమ్మించటం?" అన్నాడు ఉశీనరుడు రాజగురువుతో. "మరచారా మహారాజా! యువరాణికి పదేళ్ళ వయసులో ఒక యోగి చూసి ఆమె వరమాలను గాలిలోకి ఎగురవేసినపుడు అది ఎవరి కంఠంలో పడుతుందో అతడే ఆమె భర్త అవుతాడని చెప్పాడు. అది ఇప్పుడు రుజువు చేస్తాను" అన్నాడు.


"సరే! ఇది ఎంతవరకు నిజమా దాం!" అన్నాడుహరిశ్చంద్రుడు. రాజగురువు ఆజ్ఞ మీద చంద్రమతి పరమేశ్వరుడిని తలుచుకుని మాలనుగాలిలోకి విసిరేసింది. అది గాలిలో తేలుతూవచ్చిహరిశ్చంద్రుడి కంఠంలో పడింది. అక్కడ ఉన్నవారందరూ హర్షధ్వానాలు చేశారు. వెంటనే అంతరిక్షంలో మెరుపులు మెరిశాయి. అందరూ గవాక్షం వైపు చూశారు. అక్కడ అశరీరవాణి వాక్కులు వినిపించాయి. "హరిశ్చంద్రా! విను. విను. ఈ చంద్రమతే నీ అర్థాంగి. ఇది పరమేశ్వరుని వరం. మీరిద్దరూ భవిష్యత్తులో ఒక మహత్తర ఇతిహాసానికి కర్తలు కాగలరు. మీరిద్దరూ ఆదర్శ దంపతులై వర్ధిల్లగలరు. నీ కీర్తి ఆచంద్ర తారార్కం నిలిచిపోతుంది" అన్నది..


"మహారాజా! నన్ను మన్నించండి. ఈ క్షణం నుంచి ఈమె నా సహధర్మచారిణి. నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను" అన్నాడు హరిశ్చంద్రుడు ఉశీనరుడితో. రాజకుమారులందరూ లేచి నిలబడి "రాజా! చంద్రమతీ హరిశ్చంద్రుల వివాహం దైవనిర్ణయం. మనం నిమిత్తమాత్రులం. మేము నూతన దంపతులను ఆశీర్వదించి వెళతాం" అన్నారు. అందరూ హర్షధ్వానాలు చేశారు.