బృహదారణ్యాకపనిషత్తు - జీవబ్రహ్మైక్య విధానము


                 వేద అరణ్యమునందలి వేదాంత సుమరాజము బృహదారణ్యకోపనిషత్తు. అరణ్యమున బోధింపబడటం చేత ఇది అరణ్యకమని చెప్పబడింది. ఇది శుక్ల యజుర్వేదమునకు చెందిన శతపథ బ్రాహ్మణము లోనిది. ఉపనిషత్ అంటే జనన = మరణ ప్రవాహ రూప సంసారమును - అపార తాపత్రయమును - నశింపచేసేదశ్రీ శంకరాచార్యుని అభిప్రాయము.


వైదిక యాగాలలో పేరెన్నిక గన్న అశ్వమేధ యాగంచే స్వర్గమనబడు బ్రహ్మలోకాన్ని పొందవచ్చు. కాని ఇట్టి బ్రహ్మలోక ప్రాప్తి, అందలి సౌఖ్యం చివరకు పరిమితము. బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు గల సకల ప్రాణికోటుల భోగానుభవమును అశాశ్వతమే. స్వానుభవంచే గ్రహించినపుడే మానవునకు నిజమైన వైరాగ్యము, ఆత్మ జిజ్ఞాసయు కలుగుచున్నవి. అనిర్వచనీయమగు తన మాయచే ప్రజాపతి వేరుగా స్త్రీ పురుష ద్వయాన్ని వెలువరించెను. వారల సంయోగం వల్ల మానవకోటి వెలువడింది. తర్వాత సకల జీవరాశులను, దేవతలను సృజించెను. కట్టెలలో నిప్పులాగా, ఒరలో కత్తిలాగా, ఆత్మ అన్నింటి యందును నిహితమై ఉంది. ఆత్మను ఎరిగినచో సర్వము ఎఱుకపడును. వాసుదేవుడను ఋషి గర్భము నందుండగానే ఆత్మజ్ఞానము వలన సర్వజ్ఞుడయ్యెను. ఈ ఆత్మయే బ్రహ్మము. శరీర ఇంద్రియ కారణభూతమైన పంచ మహాభూతాలు సత్యమనబడును. పరబ్రహ్మము సత్యస్యసత్యం అనవదు , సమస్త లక్షణాతీతమై భాసిస్తున్నది. ఆదియందు అందరు బ్రాహ్మణ జాతి వారే. తరువాత సమాజ శ్రీ యస్సు కోసం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని నాలుగు జాతులు నిర్మితములైనవి. మానవులే కాక దేవతలును, సకల జీవరాశులును అన్యోన యమునకై విశ్వ సంస్థితికై ఒండొరుల యెడ తమ తమ విధులను నిర్వర్తింపవలసి ఉంది. వేదములు లౌకిక ఉన్నతిని, మోక్షము అను రెంటిని పొందే ఉపాయాలను తెల్పుతుంది.


యాజ్ఞవల్క్యుడను మహర్షి సన్యసించబోతూ కాత్యాయని, తే యి అను తన ఇరువురు భార్యలలో తైతే యికి బ్రహ్మవిద్యా రహస్యాన్ని ఉపదేశించెనుతన సవతితో పాటు తనకును భర్త పంచిపెట్టబూనిన ఐహిక సంపదలను తృణీకరించి తే యి సంస్కార తరుణోపాయాన్ని కాంక్షించింది. " యసీ పతి నిమిత్తమై పతి ప్రియుడగుట లేదుఆత్మ నిమిత్తమై (పతి యందలి తన అంతరాత్మ నిమిత్తమై) పతి ప్రియుడగుచున్నాడు. పతి, సంతానము, సంపద - వేయేల - సర్వ విషయాల విషయము ఇట్టిదే. ఆత్మ కోసమే సర్వము ప్రియమగుచున్నది. (ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియంభవతి- అని ఈ రీతిగా యాజ్ఞవల్క్యుడు ఉపదేశించాడు. సముచిత గురూపదేశం వల్లనూ, మనన ధ్యానాల వల్లనుఆత్మజ్ఞానాన్ని పొందవచ్చును.


దృశ్యప్రపంచమునందలిసర్వము ఒండొంటిని ఆశ్రయించుకొని ఉండి కార్యకారణ సంబంధమున బద్దమై ఉన్నదనియు అన్నింటికిని ఆత్మయే - బ్రహ్మమే - మూల కారణమనియు 'మధువిద్య' తెల్పుతున్నది. వైదిక జ్ఞానము - బ్రహ్మవిద్య - మనోబుద్ది కల్పితము గాక, సాక్షాత్ పరబ్రహ్మము వల్లే హిరణ్య గర్భాదులకు, పరంపరాగతంగా ప్రాప్తించి ఉన్నదని గ్రహింపవచ్చును.


1. గురుచరణ సాధ్యము 2. సముచిత గురుదక్షిణ 3. వేద వేదాంత చర్య 4. తత్త్వ జిజ్ఞాస 5. వినయ విదేయతలతో కూడిన శ్రుత్యనుకూల తర్కము మున్నగునవి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి సాధనాలని ఉపనిషత్తులు చెప్తున్నాయి. . జనక మహారాజు భూరి దక్షణలతో ఒక యాగం చేస్తూ, అచ్చటికి వచ్చిన బ్రాహ్మణులందలి వేదవిదుల్లో మేటియైన బ్రాహ్మణోత్తముని కనుక్కోదలచి, ఒక ఉపాయం ఆలోచించాడు. వేయి ఆవులకు ఒక్కొక్క ఆవు కొమ్ములకు ఎనిమిది తులాల బంగారాన్ని కట్టి, ఒక కొట్టము నందుంచి అతడు సదస్యులను సి "పూజ్యులైన బ్రాహ్మణులారా! మీలో వేదవేత్తలలో మేటి అగు అతడు ఈ గోవులను ఇంటికి తోలుకొని పోవచ్చు" అనెను. అంతట వైదిక జ్ఞాన కర్మకాండలు రెండింటియందును నిరుపమాన ప్రజ్ఞాధురీణుడగు యాజ్ఞవల్క్యునిపై తతమ వేద వేదాంత ప్రశ్న పరంపరను కురియింపసాగారు. అందు గారి యను విదుషీమణి ముఖ్యముగా పేర్కొనతగినది. అతడు వారందరను తన సముచిత సమాధానలచే నిరుత్తరులను చేసెను. అందు గమనింపవలసిన ముఖ్య విషయాలివి.జీవబ్రహ్మైక్య విధానము


ధ్యాన యుక్తములగు కొన్ని యాగ క్రియలచే దివ్యలోక ప్రాప్తి కలుగును. నశ్వరమైన ఇంద్రియాల తోడను, తద్విషయముల తోడను, తాదాత్మ్యము పొందుటయే మరణము. పుత్తేషణ, విశ్లేషణ, లోకేషణ అను ఈషణ త్రయమును పరిత్యజించిననే కాని ఆత్మజ్ఞానము ఉదయింపదు. ఈ శిక్షణమునందు లేక సాధనయందు సన్న్యాసము ఉచితము. కార్య కారణములనునవి స్వతస్సిద్ధముగా పరస్పర భిన్నములు కావు. స్థూలము కార్యమైనచో, సూక్ష్మము కారణము. బుద్ధి సంజనితమగు హేతువాదముచే కాక, ఋషుల అవలోక్షణానుభూతిపై ఆధారపడి ఉన్న వేద ప్రమాణమున మాత్రమే పరబ్రహ్మ తత్త్వము గ్రాహ్యము. సర్వభూత నియామకమగు అంతర్యామియే ఆత్మ, బ్రహ్మము. అది అమృతము. ఆ వాజ్మనస గోచరము అది ఎన్నిటికి ద్రష్టయే కానీ, దృశ్యము కాదు. శ్రోతయే కాని శ్రవణ విషయము కాదు. జ్ఞానమే కాని జేయము కాదు. 'నేతి నేతి" (ఇది కాదు ఇది కాదు) అంటూ సర్వ విశేషణములను త్రోసిరాజనివేదములు దానిని బ్రహ్మమని సూచించుచున్నవి. సృష్టి యందలి క్రమవిధానము - గ్రహనక్షత్రాదుల నిర్ణీత గమనము - మున్నగు అనుమాన ప్రమాణ సంబంధమైన నిదర్శనములచే దానిని గుర్తెరుగవచ్చును. ఎవడు ఈ అక్షర వస్తువును ఎరుంగక, ఈ లోకము నుండి వెడలి పోవుచున్నాడో వాడు కృపణుడు. ఎవడు దీనిని ఎరింగి గతించునో వాడే బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞాని. .


    జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలకు అతీతము, తురీయమగు ఆత్మానుభూతి పొందినవాడే భయ దుఃఖాది విముక్తుడనియు, "నీవిట్టి స్థితినొందితి"వనియు యాజ్ఞవల్క్యుడు జనకునకు ఉపదేశించును. ఆత్మ తేజముననే సర్వము భాసించుచున్నది. అవిద్య వలన బుద్ధీంద్రియాదులతో జీవుడు తాదాత్మ్యమును పొంది, జాగ్రదావస్థ యందును, తన్మూలనమున సుఖ దుఃఖాలను పొందును. వానివలన విసుగు చెందినపుడు - రెక్కలు ముడుచుకుని గూటిని చేరు పక్షివలె - సుషుప్తి యందు స్వస్థితిని పొందుచుండ, ఏటిగట్టులను తాకక స్వేచ్చగా సంచరించు పెద్ద చేప వలె ఆత్మ ఈ వివిధావస్థ లన్నిటికిని అతీతమై, సంసార బంధమనెడి ఏగట్టులను తాకక నిస్సంగముగ వర్తించుచు నిత్య శుద్ధ, బుద్ధ యుక్తమై ప్రకాశించుచున్నది. ద్వైత ప్రపంచానికి చెందిన నానా లోకములందును పడయ తగు నానా రూపములైన ఆనందము బ్రహ్మానందములో పోల్చి చినచో, అందు లవలేశము మాత్రమే. 


జీవుడు జగత్తును స్వతస్సిద్ధముగా పరబ్రహ్మమే - పరిపూర్ణమే. నామ రూపాలు కేవలం అవిద్యా కల్పితములే. ఈ ఎరుకయే ముక్తి సాధనము. ఓంకారము బ్రహ్మోపాసనమునకు తగిన సాధనమువ్యక్తుల అధికార తారతమ్యమును అనుసరించి వివిధోపాసనలు చెప్పబడి ఉన్నవి. లోకత్రయవేదత్రయ, ప్రాణత్రయములు, సూర్యాధిష్ఠాన దేవతయు అను నాలుగు పాదములు కలదైతోడోడనే పరబ్రహ్మ స్వరూపమై ఒప్పు గాంత్రీ మంత్రము సగుణ నిర్గుణ బ్రహ్మూపాసన సాధన భూతమై అలరారుచున్నది. అవసాన కాలమున సూర్యదేవతను ప్రార్థించుచు ఆచారము కలదు. దేవ, మానవ, రాక్షస స్వభావులగు జనులు వరుసగా దమము (అంతరింద్రియ నిగ్రహము) దానము, దయ అనువానిని అవలంబింపవలయును. వ్యాధి, సంజనిత బాధతలను, మరణానంతరము తన తమునకు జరగబోవు దహన సంస్కారము మున్నగు వానిని గురించి వ్యసనపడక, సహనము కలిగి ఉండుట మహత్తరమైన తపస్సు. అట్టి తపోధనుడు పాపరహితుడై పరమ లోకమును పొందును. మరణానంతరం మానవుడు సుకృత ఫల భోగార్ధము చంద్రలోకాన్ని పొంది, అటనుండి క్రమముగా వర్షము, ధాన్యము, వీర్యము, స్త్రీ గర్భము అనువాని మూలమున తిరిగి మానవజన్మము పొందుట దేవతలొనరించు యజ్ఞముగా వివరించుచు ప్రవాహనుడను రాజు గౌతముడను బ్రాహ్మణునకు బోధించును. అర్చరాది మార్గమున దేవయానము, ధూమాది మార్గమున పితృయానము అనేవి విగతజీవునకు క్రమ వికాసానుసారము ప్రాప్తించు గతులు. ఈ రెండు మార్గములకును తగని దుర్మార్గులు క్షుద్ర కీటకాలుగా జన్మిస్తున్నారు.


ఔన్నత్యాన్ని తత్సాధనభూతమగు సర్వ సంపదలను కోరు వైదికుడు దేవతానుగ్రహానికై మంధమనుహవనాన్ని ఆచరిస్తాడు. ఈ క్రియా పరిసమాప్తి యందాతడు సూర్యునకు నమస్కరిస్తూ ఇట్లా ప్రార్థిస్తాడు. "ఓ సూర్యభగవానుడా! దిక్కులన్నిటికిని నీవు అద్వితీయ కమలమువు. నేను అద్వితీయ మానవ కమలమును అగుదును గాక". ,


సత్సంతానముచే వంశము, విజ్ఞానము, సంస్కృతియు సురక్షితమౌతుంది. సతీ పతులు ధార్మిక విధుల ననుసరించి సమాగమాన్ని పొందితే, అట్టి సత్సంతానమును పడయనగును. ఈ మహత్తర ప్రయోజనము కేవల కామసంజాతుడగువానివలన కలుగజాలదు. పశుప్రవృత్తితో కూడిన కామము నింద్యము. కాని ఐహిక భోగోచ్చలను సక్రమ మార్గమంలో నిర్వర్తించుకొనని వానికి మోక్షాసక్తి కలుగుననుట కలలోని వార్త. అఖండ వైరాగ్య నిలయమగు సన్న్యాసమునకు గార్హస్యము సర్వసాధారణంగా సోపానప్రాయము. పరస్పర మానురాగాలతో సత్సంతానేచ్చతో కూడిన సతీపతుల సమాగమము ఒక మహా యజ్ఞము. ఆర్యుడగు పతి మంత్రపూర్వకముగ దేవతా ప్రార్థనలతో, యజ్ఞభావముతో తన సతిని కూడును. అతని పావన మనోభావమున గుహ్యాంగములు, యజ్ఞాంగములు. ఇట్టి చిత్తశుద్ధి లేని కామ వ్యాపార సంజాతులు దానవులనియే కాని, మానవులనతగరు. దానవులనియే కాని, వ్యభిచారము అత్యంత గర్యము.


బల పౌరుషములకును, బీజస్తేజస్సులకును, కారణభూతమగు వీర్యమును ఎన్నడును వ్యర్థం చేయరాదు. బ్రహ్మచర్యము మహత్తర తపస్సు. మహా వ్రతము. ఇదియే సన్న్యాసమునకు ప్రాణప్రతిష్ఠ. క్రమంగా ఇట్టి మనః పరిపాకమును పొందగోరు గృహస్తుల విషయంలో సంతాన నిరోధమునకు సైతం మనస్సంకల్పాత్మకమగు ఉపాయమగు బృహదారణ్యకోపనిషత్తు తెల్పును. - ఈ విధంగా బృహదారణ్యకోపనిషత్తు ధర్మార్థ కామమోక్ష సాధనోపాయములకు ఆలవాలమై, బ్రహ్మచర్యాది వివిధాశ్రమావలంబులకు ఆశ్రయభూతమై జీవబ్రహ్మైక్య విధానమునకు మార్గదర్శకమై జ్ఞాన కర్మములకే గాక, సగుణ నిర్గుణోపాసనములకును, సామరస్య నిలయమై జనక, యాజ్ఞవల్క్య, గార్గి, తే యీత్యాది సనాతనాదర్శ స్త్రీ పురుషుల ద్యివ చరిత్రములకును కాణాచియై వేదశిరోభూతమగు ఉపనిషద్వాజ్మయమున ప్రధాన గణ్యమై సకల జన మాననీయ మానవీయమై భాసిస్తున్నది.