పూర్వం చంద్రవంశపు రాజైన నందుడు తనకి వృద్ధాప్యం రాగానే తన కుమారుడైన ధర్మగుప్తునికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించాడు. తర్వాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి తపస్సు చేసుకోవడానికి రేవా నదీ తీరానికి వెళ్ళాడు. ధర్మగుప్తుడు కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతని పాలనలో ప్రజలు సుఖంగా జీవిస్తున్నారు. ఒకరోజు ధర్మగుప్తుడు వేటకోసం అడవికి వెళ్ళాడు. సాయంకాలం వరకూ వెదకినా ఒక్క జంతువూ అతనికి చిక్కలేదు. దాంతో అతనికి పట్టుదల పెరిగింది. పరివారాన్ని వదలి ఒంటరిగానే గుర్రం మీద అడవి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక జింక రాజు కంట పడింది. దానిని వేటాడుతూ మరింత అడవి లోపలికి వెళ్ళాడు. ఆ క్రమంలో దారి తప్పాడు ధర్మగుప్తుడు. అంతలో సూర్యుడు అస్తమించాడు. క్రమంగా చీకటి కమ్ముకుంది. ఒక చెట్టుకింద సేద తీరేందుకు గుర్రం దిగి నిలబడ్డాడు మహారాజు. - అప్పుడు హఠాత్తుగా ఒక సింహం గర్జిస్తూ మహారాజు మీదికి దూకింది. ఈ హఠాత్ పరిణామానికి మహారాజు నిశ్చేష్టుడయ్యాడు. అదే అదనుగా సింహం ఆయన మీదకు మెరుపుదాడి చేసింది. వెంటనే రెప్పపాటులో తేరుకుని ఎలాగో సింహం బారి నుండి తప్పించుకుని ఎదురుగా ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు మహారాజు. సింహగర్జన విని రాజుగారి గుర్రం ఎటో పారిపోయింది. చెట్టుకిందే కాపు కాసింది
శాడు... పైకొమ్మ మీద కూర్చుని తనవంకూ స్తున్న ఎలుగుబంటి...ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది మహారాజు పరిస్థితి. - కాసేపు ఏం చేయాలో తోచక మిన్నకుండిపోయాడు మహారాజు. అంతలో ఎలుగుబంటి మానవ భాషలో మాట్లాడడం ఆరంభించింది. “మహారాజా! మన ఇద్దరినీ చంపి తినటానికి చెట్టుకింద సింహం సిద్ధంగా ఉంది. అందుచేత మనం ఈ చెట్టు మీదే ఈ రాత్రిని గడపాలి” అంది. “అవును భల్లూకమా!” అన్నాడు మహారాజు. అతని గొంతులో భయం వినిపిస్తోంది. “మహారాజా! భయాన్ని విడిచిపెట్టు. నా మూలంగా నీకు ఎటువంటి కీడు కలగదు. వాగ్దానం చేస్తున్నాను”. “భల్లూకమా! నీ మాటల్ని వినటం తప్ప నాకు మార్గాంతరం లేదు కదా” అన్నాడు మహారాజు. . భల్లూకం బాగా ఆలోచించింది. ధర్మగుప్తుని పేరులో ధర్మం ఉంది. భల్లూకం మనసునిండా ధర్మచింతన ఉంది. అందుచేత అది మహారాజుతో ధర్మబద్దంగా ఒక ఒప్పందం చేసుకుంది. “మహారాజా! నినూ స్తుంటే బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు. కాబట్టి నువ్వు నిశ్చింతగా నిర్భయంగా అర్థరాత్రి వరకు నిద్రపో. అంతవరకూ నిన్ను నేను కాపాడతాను. నన్ను నమ్ము” అంది ఎలుగుబంటి. “భల్లూకమా! నేను నిన్ను త్రికరణశుద్ధిగా నమ్ముతున్నాను”
సింహం. చెట్టుకింద ఆకలితో ఆవురావురంటూ సింహం... తల పైకెత్తి అన్నాడు మహారాజు. ““అర్థరాత్రి తర్వాత నేను నిద్రపోతాను. అప్పుడు నువ్వు నన్ను కాపాడాలి! సరేనా” అంది భల్లూకం. “అలాగే మిత్రమా!” అన్నాడు మహారాజు. ఆ ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ముందుగా ధర్మగుప్తుడు నిద్రపోయాడు. ఎలుగుబంటి మహారాజుని కంటికి రెప్పలా కాపాడింది. అప్పుడు చెట్టుకింద వేచి ఉన్న సింహం “భల్లూకమా! నువ్వూ నేనూ జంతువులం. మహారాజు మానవుడు. అతను ఎప్పటికీ మన శత్రువే. అతనిని నమ్మటంశ్రీ యస్కరం కాదు. నాకు ఆకలిగా ఉంది. నిద్రపోతున్న మహారాజును కిందకి తోసెయ్. హాయిగా తినేసి ఇక్కడినుండి వెళ్ళిపోతాను. నిన్ను వదిలేస్తాను. నా మాట విను” అంది. . “మృగరాజా! నువ్విలా మాట్లాడటం తగునా? రాజుకి ధర్మం గురించి నమ్మకం గురించి చెప్పాల్సిన పని లేదు. ధర్మమే లోకానికి రక్షణ కవచం. నమ్మకం ధర్మం ఈ రెండూ విడదీయరానివి. నన్ను పూర్తిగా నమ్మి ఈ మహారాజు నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఇతనిని కిందకి తోసేస్తే ద్రోహమే అవుతుంది కదా! నేను ద్రోహం చెయ్యలేను. అందువల్ల దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో” అని సింహానికి కరాకండిగా చెప్పేసింది ఎలుగుబంటి. క్రమంగా అర్థరాత్రి అయింది. మహారాజు నిద్ర నుంచి మేలుకున్నాడు. ఎలుగుబంటి మహారాజుని నమ్మి నిద్రపోయింది. అప్పుడు చెట్టుకింద వేచి ఉన్న సింహానికి మళ్ళీ ఆశ కలిగింది. .
“మహారాజా! నాకు ఆకలి మండిపోతోంది. ఎలుగుబంటి నాకు ఆహారం. దానిని కిందకు తోసెయ్. తినేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను” అంది సింహం. కాసేపు ఆలోచించాడు మహారాజు. అతనిలో ధర్మదృష్టి నశించింది. స్వార్థబుద్ది ఆకాశమంతగా పెరిగింది. ఇక మహారాజు క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. వెంటనే నిద్రపోతున్న ఎలుగుబంటిని నిర్దాక్షిణ్యంగా చెట్టుపై నుండి కిందికి తొయ్యబొయ్యాడు. - కానీ సరైన సమయంలో మేలుకున్న ఎలుగుబంటి తెలివిగా చెట్టుమీద నుంచి కింద పడకుండా తప్పించుకుని తనని తాను కాపాడుకుంది. మహారాజు వంక అసహ్యంచూ సింది. దాని కళ్ళు చింతనిప్పుల్లా తయారయ్యాయి. నిట్టూర్పులు వెచ్చగా వెలువడుతున్నాయి. “ఛీకృతఘ్నుడా! నిన్ను అర్థరాత్రి వరకు కాపాడినందుకు... నిన్ను మనస్ఫూర్తిగా నమ్మినందుకు... ఇచ్చిన మాటకి కట్టుబడినందుకు నాకింత ద్రోహం చేస్తావా? ధర్మాన్ని విడనాడిన నువ్వు మహారాజువా? నీ బతుకు వ్యర్థం. నీ రాజపదవి నిష్ఫలం” అంటూ పరుష పదజాలంతో మహారాజుని నిందించింది ఎలుగుబంటి. మౌనంగా తల వంచుకు కూర్చున్నాడు ధర్మగుప్తుడు అసహనంగా. . “మహారాజా! నువ్వు చేసిన ఈ పాపానికి శిక్షని అనుభవించక తప్పదు. ఈ క్షణం నుంచి మతి భ్రమించి తిరుగు. తప్పదు! ” అని ధర్మగుప్తుని శపించింది ఎలుగుబంటి. ఆ శాపం మూలంగా పిచ్చిపట్టి దేశాలు తిరుగుతున్నాడు ధర్మగుప్తుడు. వేట నుంచి మహారాజు మరలి రాకపోవడంతో మంత్రులు ఆయనని వెదికేందుకు వేగుల్ని పంపారు. వాళ్ళూ వెదికి వెదికి చివరికి మహారాజుని పట్టుకున్నారు. మంత్రులు వచ్చి మహారాజుని గుర్తించారు. రేవా నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న ధర్మగుప్తుని తండ్రి నందరాజు దగ్గరికి అతనిని తీసుకెళ్ళారు. నందుడు తన కుమాయూ సిదుఃఖించాడు. “మంత్రులారా!నాకుమారుడు ఎందుకిలా తయారయ్యాడు? అసలేం జరిగింది?” అని అడిగాడు నందరాజు. “ప్రభూ! మహారాజు వేటకోసం అడవికి వెళ్ళారు. సింహం ఆయన మీదకి దాడి చేసింది. పరివారమంతా చెల్లాచెదరయింది. ఆ తర్వాత పిచ్చివారైన మహారాజుని వేగులు వెదికి పట్టుకున్నారు. ఇంతవరకే మాకు తెలుసు” చెప్పారు మంత్రులు. . “అయితే నా కుమారుని పిచ్చి ఎలా తగ్గుతుంది?” అన్నాడు నందరాజు. - “మీ కులగురువైన జైమినీ మహర్షి తప్పక ఈ సమస్యని పరిష్కరించగలరని మా నమ్మకం ప్రభూ!” అన్నారు మంత్రులు. “అవును బాగా గుర్తు చేశారు. పదండి పోదాం అక్కడికి” అన్నాడు నందరాజు. అందరూ కలిసి జైమిని మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. నందరాజు మహర్షికి నమస్కరించాడు. తన కుమారుని విషయాన్ని ఆయనకి చెప్పాడు నందరాజు. యోగదృష్టితో ధర్మగుప్తుడు చేసిన తప్పిదాన్ని గ్రహించాడు జైమిని మహర్షి.
“నందరాజా! నీ కుమారుడు ధర్మగుప్తుడు స్వభావరీత్యా ధర్మబద్దుడే. కానీ పరిసరాల ప్రభావం మూలంగా ఆ క్షణంలో అతని జాతక చక్రంలో ఉన్న గ్రహాల ప్రతికూల స్థితి కారణంగానూ తనకి సహాయం చేసిన ఎలుగుబంటికి ద్రోహం చేశాడు. ఆ భల్లూకం ఇచ్చిన శాపం వల్లనే ఈ విధంగా పిచ్చివాడయ్యాడు” అని వివరించాడు జైమిని మహర్షి. "దయతో ఈ పిచ్చి పోయే మార్గాన్ని సెలవియ్యండి మహర్షి! మా వంశాన్ని కాపాడండి” అని ప్రార్థించాడు నందరాజు వినయంగా. . "నందరాజా” ఆగాడు మహర్షి. “చెప్పండి గురువర్యా! ” ఆతృతగా అడిగాడు నందరాజు. “నీ కుమారు:శ్రీ వేంకటాచలానికి తీసుకుని వెళ్ళు. అక్కడ మహామహిమోపేతమైన స్వామి పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో నీ కుమారుని స్నానం చేయించు. భక్తితో స్వామిని ధ్యానించు. తప్పకుండా శాపవిముక్తి కలుగుతుంది. పిచ్చి కుదురుతుంది” చెప్పాడు జైమినీ మహర్షి. వెంటనే తన కుమారుని వెంటబెట్టుకుని వెళ్ళి గోవింద నామస్మరణం చేస్తూ స్వామి పుష్కరిణిలో అతని చేత స్నానమాచరింపచేశాడు నందరాజు ఆశ్చర్యం... అద్భుతం... ధర్మగుప్తుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. - శ్రీ వేంకటేశ్వరుని కరుణామృత వృష్టి నా మీద కురిసింది. స్వస్థుడినయ్యాను తండ్రీ!” అన్నాడు స్వామి పుష్కరిణిలోంచి బయటికి వస్తూ ధర్మగుప్తుడు. - 'కుమారా! ఇదంతాశ్రీ వేంకటేశ్వరుని మహిమశ్రీ వారి పుష్కరిణీ గరిమ! ఓం నమో వేంకటేశాయ” అన్నాడు నందరాజు.