తరిగొండ వెంగమాంబ కవిత్వంలో శ్రీవేంకటేశ్వర వైభవం


 


తరిగొండ వెంగమాంబ కవిత్వంలో శ్రీవేంకటేశ్వర వైభవం


                                                                             - డా|| మన్నవ భాస్కర నాయుడు


తరిగొండలో వెలసిన శ్రీ నృసింహాలయం పూజారి పుత్రికగా జన్మించి, తిరుమలశ్రీ వేంకటేశ్వరుని అర్చించిన మధుర కవిత్వ సుధాపాత్రికగా తరించిన మహాకవయిత్రి తరిగొండ వెంగమాంబ. క్రీ.శ. 1735-1817 సంవత్సరాల మధ్య జీవించిన వెంగమాంబను గురించి చాలా కట్టుకథలు సాహిత్య ప్రపంచంలో కూడా ప్రాచుర్యం పొందాయి. కానీ కావ్యపుష్పాలతో స్వామివారిని సేవించిన ఆ వ్యక్తిత్వం ఆమె రచనలలో స్పష్టంగా సాక్షాత్కరిస్తుంది. సనాతన సాంప్రదాయిక శ్రోత్రియ కుటుంబంలో జన్మించిన వేంగమాంబచదువుకునోచుకోలేదు.ఆనాటి సామాజికవ్యవస్థలో ఆడపిల్లలు చదువుకునే అవకాశాలు లేవు. చదువుకోవాలన్న ఆర్తి ఉన్నా, అవకాశాలు కలిసి రాని వేంగమాంబ హృదయవేదన ఆమెమాటలలోనే విదితమవుతున్నది. "నా చిన్ననాట ఓనామాలనైన ఆచార్యుల చెంతనే చదువలేదు...


తరికుండపురి నారసింహదేవు డానతిచ్చిన రీతిగ నే నిమిత్త మాత్రమున పల్కుదును..." శ్రీ వేంకటాచల మాహాత్మ్యం 1-21)


మనసున్న చోట మార్గం ఉంటుంది. సంకల్ప బలం కావచ్చు. సంస్కార నిష్ఠమైన అభీష్ట బలం కావచ్చు. వేంగమాంబ కవితాభిలాష సఫలం అయింది. తరిగొండ వెంగమాంబ సహజ వైదుష్యం సంపన్నం అయింది. భక్తి కవితా దీక్షతో రెండు శతకాలు, రెండు పద్యకావ్యాలు, నాలుగు ద్విపద కావ్యాలు, తొమ్మిది యక్షగానాలు, అనేక తత్వకీర్తనలు రచించగలిగింది. "ఈమెవలె ఇన్ని యక్షగానములు ఇంత సమర్థముగా రచించిన కవయిత్రులు లేరు సరికదా, కవులును లేరు" అని విమర్శకులు అంగీకరించారు (ఆచార్య యస్.వి.జోగారావు - ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర). కండ కలిగిన కలకండ రుచులతో ఇన్ని మధుర భక్తికావ్యాలు రచించగలిగినా, వేంగమాంబ వినయ గుణసంపదను వదులుకోలేదు.


"పండితాగ్రణులార! ప్రజలారా! ఇపుడు నా బాలభాష కసూయ పడక, వినుడు" అనీ శ్రీ వేంకటాచల మాహాత్మ్యం 1-19) "భారతిని జిహ్వయందుంచి నారసింహు డే విధంబున బలికించు నా విధమున పలికెదను భాగవతులు! నా బాలభాష వినుడు నెయ్యంబుమీరగ విబుధులార!


అనీ మరీమరీ విన్నవించుకొన్నది. బాలవాక్కు బ్రహ్మవాక్కు అవుతుందో లేదో తెలియదుకాని, వేంగమాంబ చెప్పిన బాలభాష బ్రహ్మానంద పరిపోషితమైన కావ్యభాష అయింది. తరిగొండ వెంగమాంబ తాను నమ్ముకొన్న దేవుని సోదరుడుగా భావించింది, సంభావించింది. ఈ


"సంగతి కృష్ణుండు సైదోడు గాగ వేంగమాంబిక ప్రభవించి"నది (భాగవతం)


అంతేకాదు, తరిగొండ ధాముడు ఒకనాటి "మధ్యాహ్న సమయంబునందు


చిన్నికృష్ణుని రీతి చెంతకువచ్చి పన్నుగాదెఛ భాగవతంబు నన్ను చేకొమ్మని నా చేతికిచ్చి సన్న సైగల నిది సారంబుగాను వరుసగా ద్విపదకావ్యము చేయుమనుచు చిరమైన దయను సూచించియున్నాడు.... .......... అమ్మహామహుడు చెదరక కృతినెట్లు చెప్పింపగలడా? అతని చెల్లెలను నేనా చందమెరుగ"


ననీ వెల్లడించింది. ఆమె నమ్మకం వమ్ము కాలేదు. వేంగమాంబ కవితా హృదయంలోని భగవంతుడు సోదర భావ మాధుర్యంతో అక్షరక్షరంలో సాక్షాత్కరిస్తున్నాడు. వేంగమాంబకు పుట్టినిండ్లు రెండు. ఆమె భౌతిక జీవితానికి పుట్టినిల్లు తరిగొండ. ఆమె బౌద్ధిక ఆధ్యాత్మిక జీవితానికి పుట్టినిల్లు తిరుకొండ. ఆమె మెట్టినిల్లు చిత్తూరు సమీపంలోని నారగుంటపాళెం. ఆమె భర్త ఇంజేటి వేంకటాచలపతి. వేంగమాంబకు మెట్టినిల్లు అచ్చిరాలేదు. భర్త అకాల మరణానికి గురి కావడం వల్ల పుట్టినింటికి చేరింది. కొంతకాలానికి రెండవ పుట్టినిల్లు వంటి తిరుమల చేరుకొన్నది. వేంగమాంబ పుట్టింటివారి పేరు కానాలవారు. అయితే తరిగొండ వేంగమాంబగానే ఆమె పేరు సాహిత్య ప్రపంచంలో స్థిరపడింది. వివాహానంతరం భర్త ఇంటిపేరే భార్యకు సంక్రమిస్తుంది. అందువల్ల ఇంజేటి వేంగమాంబగా వ్యవహారంలో రూఢికి వచ్చి ఉండాలి. కానీ రాలేదు. వేంగమాంబ తన విష్ణుపారిజాతం, భాగవతం, చెంచు నాటకం వంటి ఆరేడు కావ్యాలలో తనపేరు ఇంజేటి వేంగమాంబగానే పేర్కొన్నది. తరిగొండాధిపునిలో శేషాచలపతిని, శేషాచలపతిలో తరిగొండాధిపుని దర్శించిన వేంగమాంబ శేషజీవితం తిరుమలలోనే గడిచింది. తన రచనలలోశ్రీ వేంకటేశ్వర వైభవం చిత్రించి జన్మ ధన్యం చేసుకున్నది శ్రీ వేంకటాచల మాహాత్మ్యం అనే పద్యకావ్యంలో శ్రీ వేంకటేశ్వర వైభవాన్ని మధుర మనోహరంగా వర్ణించింది. ఇష్టదేవతాస్తుతిలో... .


"తిరవైశ్రీ యలమేలుమంగ యురమందే నిల్చి దీపింపగా పరమైశ్వర్య ధురం ధరండగుచు నాపాలన్ కృపన్ నిల్చి సుం దర దివ్యాకృతి నప్పటప్పటికి మోదం బొప్పగా జూపి, మ ద్వరదుండై తగు వేంకటాచలపతిన్ వర్లింతు నశ్రాంతమున్" శ్రీ వేంకటాచల మాహాత్మ్యం 1-15)


సహజంగా కవులు తమ కావ్యాదిలో ఇష్టదేవతలను స్తుతిస్తారు. వేంగమాంబ ఈ కావ్యంలో తన ఇష్ట దైవమైన శ్రీ వేంకటాచలపతిని వర్ణిస్తానని చెప్పడం విశేషం, విశిష్టం! - తిరుమలను ఏడుకొండలుగా, శ్రీ వేంకటేశ్వరుడు ఏడుకొండల స్వామిగా భక్తజనం కొనియాడుతూ ఉంది. వేంగమాంబ వేంకటాద్రిని పదునెనిమిది పేర్లతో సమ్మానించింది. ప్రతి పేరు ఎందుకు కలిగిందో అర్థవంతంగా, సమర్థవంతంగా వివరించింది. శేషాద్రి, క్రీడాద్రి, వేంకటాద్రి అనే పేర్లు ఈ గిరికి ఎందుకు కలిగాయో వివరించుమని శౌనకాది మునులు సూతుని అభ్యర్థించారు. ఈ సన్నివేశంలో సూతుడు ఈ గిరికి ఉన్న 18 పేర్లు వివరిస్తాడు - భక్తుల చింత తీర్చి వారి కోరిక లీడేర్చుతూ ఉండటం వల్ల "చింతామణి"గా, మానవాళికి మహిత జ్ఞానం వృద్ధి చేస్తున్నందువల్ల "జ్ఞానాద్రి"గా, తీర్థజనులకు ముక్తిదాయకాలైన సమర్థ తీర్థములుండటంవల్ల "తీర్థాచలం"గా, తపోధనుల అవసరాలకై పుష్కలంగా పుష్కరిణులు ఉండటం వల్ల "పుష్కరశైలం"గా, వృషభాసురుడు తపస్సు చేసినందువల్ల "వృషభాద్రి"గా, దేవతలకే స్వర్ణప్రభా భాసురమై కనిపిస్తూ ఉండటం వల్ల "కనకాచలం"గా, నారాయణుడనే విశ్రీ పుడు తపస్సు చేసిన చోటు కాబట్టి "నారాయణాద్రి"గా, వైకుంఠం నుంచి గరుడుడు తెచ్చి దించినందువల్ల శ్రీ వైకుంఠాద్రి"గా, నరసింహుడై ప్రహ్లాదుని కాపాడిన భద్రస్థలం కావున "నరసింహగిరి"గా, అంజనాదేవి తపముండి ఆంజనేయుని ప్రసవించిన పవిత్రస్థలము కాబట్టి "అంజనాద్రి"గా, వరాహస్వామి కొలువైనందువల్ల "వరాహగిరి"గా, నీలుడనే వానరవరుడు తపసు చేసి ముక్తి పొందినందువల్ల "నీలాద్రి"గా, శ్రీ మహాలక్ష్మికి నెలవు కావునశ్రీ గిరి"గాశ్రీ సత్రీ మహావిష్ణువు వైభవాన్ని ఉల్లాసంగా ఆస్వాదించిన స్థలం కావున శ్రీ సతిగిరి"గా శ్రీ రమ తన సఖీమణులతో కలిసి క్రీడించిన వనం కాబట్టి "క్రీడాచలం"గా వైకుంఠమునందలి క్రీడాద్రిని గరుడుడు తెచ్చినందువల్ల "గరుడాద్రి"గా, శేషాకృతితో స్వామి విశేషవైభవాలకు నిలయమైనందువల్ల "శేషాచలం"గా, 'వ'కారం అమృతబీజం; క,ట, శబ్దాలు సంపత్కరములు; ఈ మూడక్షరాలు కలిసి అక్షయమైన అమృత సంపదలు అందిస్తాయి కాబట్టి "వేంకటాచలం"గా (1.104-122) నామ వివరణ చేసింది వేంగమాంబ.


ఈ నామ సంపదను పంచుతూ శ్రీ వేంకటాచల వైభవాన్ని మాహాత్మ్యాన్ని భక్తి తాదాత్మ్యంతో వివరించింది. "కావున వేంకటాచలమఘంబుల కెల్ల భయంకరంబునై పావనమై సువర్ణమణి భాస్వరమై ధరణీసురాలికిన్ జీవనమై తపోజన వశీకరమై అజరుద్ర శక్ర సం సేవితమై సుభక్తులకశ్రీ కరమై నుతి పాత్రమై తగున్" శ్రీ వేంకటాచల మాహాత్మ్యం 1-91) -


అంటుంది. పదునెనిమిది పేర్లతో విరాజిల్లుతున్న శ్రీ వేంకటాచలం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా దర్శనమిస్తుందని వివరిస్తూ వేంగమాంబ వేంకటాద్రి వైభవాన్ని మధురచిత్ర హరిత పత్రంగా, మహాద్భుత మహిమ పాత్రంగా వర్ణించింది.


"ఆ వేంకటాద్రి మహాద్భుతంబుగ నొక్కతరి హరి విధమునన్ తనరుచుండు ఒకతరి కనకాద్రి యొప్పున జూపట్టు ఒకవేళ జ్ఞాన సంయుతము నొందు ఒక సమయంబున ప్రకటిత మరకతమణివోలె దీపించు మహిమమీర ఒక కాలమున మహినొప్పును కలికాల పాషాణశైల రూపములుగాను కాన ఆ వేంకటాచల ఘనత నుడువ ఆదిశేషునకైన కాదరయ, నింక నేను జెప్పగనేర్తునే నెమ్మి మీకు పరమ మునులార! విమల కృపాత్ములార!" (1-19)


అని సూతునిచే మునులకు తెలియజేసిందిశ్రీ వేంకటాచల వైభవం వివరించి చెప్పటానికి వేయి నోళ్ళున్న ఆదిశేషునికి అసాధ్యం కావచ్చుకాని, తరిగొండ వెంగమాంబ భక్తి వాక్పటిమకు అసాధ్యం కాలేదు. ఆమె విశ్వసించిశ్రీ నివాసుడే ఆమె నాలుకపై నివసించి ఉన్నాడు కాబట్టి ఈ అద్భుత భావానికి రూపం ఇవ్వగలిగింది. - కపిల తీర్థం నుంచి శ్రీ వారి ఆలయం వరకు ఈ వేంకటాచలంలో గల ఉత్తుంగ శృంగ సమూహాలు, వివిధ సానుప్రదేశాలు, పావన వృక్ష సందోహాలు, అసంఖ్యాక నిర్మల తీర్థాలు, నానావిధ విహగముల కోలాహలములు, విభిన్న మృగ సమూహాలు, గరుడ గంధర్వాది దివ్యవర్గాలతో కన్నుల పండువగా ఉన్న వేంకటాచల వైభవాన్ని (3-179) పరవశించి దృశ్యమానం చేస్తుంది వేంగమాంబ. ఈ వేంకటాచలం కలియుగ వైకుంఠం అని ప్రసిద్ది పొందింది. కానీ వేంగమాంబ ప్రాచీన యుగాలలోని భక్తులకు ఈ పావన క్షేత్రాన్ని దర్శింపచేస్తుంది. బ్రహ్మ రుద్రాది దేవతల నుంచి దశరథుడు, జనకుడుశ్రీ రాముడు, బలరామకృష్ణులు వంటి మహామహుల వరకుశ్రీ వేంకటాచల వైభవ దర్శనానికై రప్పించింది. భువన మోహనమైన, భక్తివరదాయకమైన శ్రీ వేంకటేశ్వర వైభవం తిలకించే అవకాశం ఇప్పించింది. ఈ


ఈ వేంకటాచలం కలియుగ వైకుంఠం అని ప్రసిద్ది పొందింది. కానీ వేంగమాంబ ప్రాచీన యుగాలలోని భక్తులకు ఈ పావన క్షేత్రాన్ని దర్శింపచేస్తుంది. బ్రహ్మ రుద్రాది దేవతల నుంచి దశరథుడు, జనకుడుశ్రీ రాముడు, బలరామకృష్ణులు వంటి మహామహుల వరకుశ్రీ వేంకటాచల వైభవ దర్శనానికై రప్పించింది. భువన మోహనమైన, భక్తివరదాయకమైన శ్రీ వేంకటేశ్వర వైభవం తిలకించే అవకాశం ఇప్పించింది. ఈ ఇటువంటి మహిమోన్నతమైన వేంకటాచలం మీద కొలువుదీరినశ్రీ వేంకటేశ్వర మధుర మోహనరూప వైభవాన్ని వేంగమాంబభక్తి మాధురీసుధారసంతో చిత్రిస్తుంది. అనల్పమైన కవిత్వ కళావిన్యాసంతో శిల్పీకరిస్తుంది.


"మకుట కౌస్తుభరత్న మకరకుండలములు ఘనమేఖలాంగద కంకణాలు వరవనమాలికావైజయంతుల దీప్తి నలరు వేవేయక హారములును కనకాంబరంబిగి కాంతులనీను దేహమునందు వెలుగగా అభయనాన కలిత దక్షిణకరకమలంబు పావన చరణంబు లర్చించు సరవి జూప వామ హస్తాంబుజము కటిసీమనొప్పఆనంద నిలయంలో కొలువుదీరినశ్రీ వేంకటేశ్వర వైభవ శోభను పాఠకులు వేంగమాంబ పద్యశిల్పంలో దర్శించ గలుగుతాడు.


బ్రహ్మదేవుడు వేంకటాచలానికి విచ్చేసి, తన జనకుడైన వేంకటేశ్వరునికి సభక్తికంగా, వైభవోపేతంగా నిర్వహించిన బ్రహ్మూత్సవ సంబరాలను వేంగమాంబ సవివరంగా సుమారు పదునారు గద్యపద్యాలలో వర్ణించింది. తిరుమలనాథుని సేవించుకొంటూ, నిత్యార్చనలలో పాలుపంచుకొంటూ, స్వామివారి ఉత్సవాలను తనివిదీయా చి, అనుభవించి, అణువణువు తాదాత్మ్యమై, భక్తి పారవశ్యంలో మునిగి తేలిన వేంగమాంబ బ్రహ్మూత్సవ రథోత్సవాలను శాస్త్రబద్ధంగా, భక్తిప్రబుద్ధంగా వర్ణించిన తీరు నిరుపమానం.


"అఖిల వైభవములు నానంద నిలయాంబునకు ప్రదక్షిణముగ నలినభవుడు శ్రీ హరి వేంచేపు జేయించి కొనిరాగ...." (2-113)


స్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఆరంభమై చక్రస్నానంతో పరిపూర్ణం అయ్యేవరకు వివిధ వాహన సేవలను వేంగమాంబ ప్రత్యక్ష సాక్షియై అక్షరీకరించింది. శ్రీ వేంకటేశ్వరునికి మహావైభవంగా బ్రహ్మ నిర్వహించిన రథోత్సవం ఆమె హృదయపథోత్సవంగా చిత్రించింది.


"ఘనతరోన్నతముగ కనకాద్రి తుల్యమై నిగ్గుల నొప్పు రథమునందు నెలవుశ్రీ భూమి నీళలతో గూడి హరి నుంచి, బ్రహ్మాదుల లఘు రథము సాగించుచుండగ, సకల దిక్పాలకుల్ గరుడ గంధర్వ కిన్నర గణములు సిద్ధవిద్యాధరుల్ సేవింప దేవదుందుభులు మ్రోయగ మహాద్భుతము దనర పారిజాతసుమంబులా బ్రహ్మరథము పైన రంభాదులట జల్లి పాడి యాడి కనుల పండువుగా జూడగా ధరిత్రి యందుగల మానవులు వేంకటాద్రిమీద!" (2-115)


శ్రీ వేంకటాచల మాహాత్మ్యంలోశ్రీ వేంకటేశ్వరుని మహిమ వైభవాన్ని, భక్తరక్షణ వైభవాన్ని, దయా వైభవాన్ని వేనోళ్ళ ప్రస్తుతించింది వేంగమాంబ. స్వామివారి వైభవలీలల వర్ణనకు దోహదంగా, ఆధ్యాత్మిక మనోల్లాసానికి సాధనంగా అష్టాంగ యోగాలను, వివిధ ఆసనాలను విస్తృతంగా విశదీకరించింది. "అవాజ్మానస గోచరం బైన బ్రహ్మానుభవమే రాజయోగం" అని


వక్కాణించింది (3-145). , ఆర్తత్రాణ పరాయణుడు, ఆపదమొక్కులవాడు, ఆదిమధ్యాంతరహితుడు, తోడని నమ్మి అర్చించిన భక్తుల పాలిట ఏడుగడ అయిన ఏడుకొండల స్వామిని దర్శించుకొని, స్వామి మహిమకు పరవశించిన పరమ మునివర్యుల భక్త్యావేశాన్ని వేంగమాంబ మధురానంద నిష్యందంగా వర్ణించింది.


శ్రీ నివాసుని జూచి ఆనందపరవశులై జడల్ జీరాడ నాడియాడి ఇదమిత్థమననేర కెనలేని ముదమున ఇందిరేశుని చెంత నెగిరి యెగిరి భక్తియుక్తావేశ భరితాత్ములై అఫ్టు చక్కగ చిందులు తొక్కి తొక్కి , ఘనపదక్రమ జటకలిత స్వరంబుల సకలవేదంబుల జదివి జదివి నిలిచి ఆనంద దుగ్గాబ్ది నెమ్మిమునిగి శ్రీ నివాసుని రూపంబు ప్రియము గదుర కనుల పండువుగా జూచి మనములచట మగ్నములొనర్చి రెంతయు మౌనివరులు!" (3-180)


శ్రీ వేంకటాచల మాహాత్మ్యంలోనే కాకుండా ఆమె తన రచనలన్నింటిలోను భక్తిపారమ్యాన్ని వ్యక్తం చేస్తుంది. మహామహిమాన్వితములుగా ప్రసిద్ది చెందిన కుమారధారా ప్రశస్తిని (1.152-156) చెంచునాటకంలో తుంబురుకోన ప్రకృతి రామణీయకతను, భక్తి వైభవ విశిష్ట దృశ్యాలను కన్నులకు కట్టిస్తుంది.


తాను ఓనమాలు కూడా చదువుకోలేదనీ, తనది బాలభాష అనీ నమ్రంగా వెల్లడించిన తరిగొండ వెంగమాంబ కవిత్వంలో చేయి తిరిగిన విదుషీమణిగా కనిపిస్తుంది.


పోతనలాగా కావ్యపాత్రల మిషతో స్వామివారిని పరవశించి ప్రస్తుతించింది. సూతుని ప్రోత్సాహంతో వేంకటాచలాన్ని దర్శించిన శౌనకాది మునులు శ్రీ వేంకటేశ్వర వైభవ దర్శన పారవశ్యంతో స్వామివారిని ప్రస్తుతిస్తారు. ఈ సన్నివేశంలో వేంగమాంబ నాలుగు శ్లోకాల మాలికను భక్తిసుమ మాలికగా గుదిగూర్చింది.


తరిగొండలో జన్మించి, తిరుకొండలో తరించిన వేంగమాంబ తనశ్రీ వేంకటాచల మాహాత్మ్యంలో చిత్రించినశ్రీ వేంకటేశ్వర వైభవం ఆమె స్వయంగా జీవితాంతం వరకు ప్రతినిత్యం అనుభవించి ఆస్వాదించిన అనుభూతి సంపద. తన కవిత్వ నీరాజనాలతో వేంకటేశ్వర వైభవాన్ని అర్చించిన తరిగొండ వేంగమాంబకు మన హృదయ నీరాజనాలు సమర్పించటం సముచితం.