ఉపాయ వైభవము - రామానుజ భట్టర్


దేహమే ఆత్మ అనెడి నిశ్చయముతో ఉన్న అర్జునునకు దేహము యొక్క స్వరూపమును, స్వభావమును; ఆత్మయొక్క స్వరూపమును, స్వభావమును తెలియజేసినాడు. ఆత్మ నిత్యము; దేహము అనిత్యము అని చెప్పినాడు. కర్మ వశము చేత ఆత్మ శరీరమును పొందునని చెప్పినాడు. ఆత్మనాశనము లేనిదని ఎరిగించినాడు. ఆత్మ స్వతంత్రము అనెడి భ్రమను తొలగించినాడు. “నాకే చెంది నా చేతనే ధరింపబడి నా చేతనే నియమింపబడునది ఆత్మ” అని విశదీకరించినాడు. ప్రకృతి యొక్క వికారమే శరీరము. సత్త్వరజస్తమో గుణములు శరీరమునందుండును. వీనిచేతనే అహంకారము కలుగును. ఈ అహంకారము ఎంతో దోషభూయిష్ఠము. ఇంద్రియములు ప్రబలమైనవి. వీనిని ప్రవర్తింప చేయునది మనసు. ఇంద్రియములు, మనసు మన అధీనమున నుండి భగవానుని యందే ప్రవర్తించునట్లు చేయుట ఎంత అవసరమో, ఆ పనిని ఎట్లు చేయవలయునో భగవానుడు అర్జునునకు ఎరిగించినాడు. భగవానుని ఆశ్రయించువారు ఆర్తులు, అధార్డులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అని నాలుగు విధములుగ ఉందురని తెలిపివారివారి ప్రవృత్తులనుగూడ భగవానుడు వివరించినాడు. ఆర్తులు పోయిన ఐశ్వర్యమును మరల కావలయునని తనను ఆశ్రయింతురని; అర్థారులు తమకు ఉన్నది చాలక క్రొత్త ఐశ్వర్యము కావలయునని ఆశ్రయింతురని, జిజ్ఞాసువులు “శరీరము కంటే ఆత్మ వేరు” అని గుర్తించి, తమకు మరల జన్మము లేకుండ ఉండవలయునని ఆశ్రయింతురు అని; జ్ఞానులు నన్నే మించి, నన్ను చేరుటయే ప్రయోజనమని భావించుచు, నన్ను సేవించుచు, నాకతిని కలిగించుచు, నాకు కలిగిన శ్రీ తిహ చి తాము ఆనందించవలయునని కోరుచు నన్ను ఆశ్రయింతురు అని భగవానుడు బోధించినాడు.


భగవానుని ఆజ్ఞారూపమగు శాస్త్రములను, వేదములను అనువర్తించి ప్రవర్తించువారు దైవవర్గమునకు చెందినవారని, వీరు మోక్షార్హులని చెప్పినాడు. శాస్త్రములను, వేదములను ఉల్లంఘించి ప్రవర్తించువారుఅసురవర్గమునకు చెందినవారని, వీరు మరల బంధమునే పొందెదరని భగవానుడు చెప్పినాడు. ఇట్లు అనేక విషయములను భగవానుడు అర్జునునకు చెప్పి, ఆచార్యకృత్యమును నిర్వహించి, తన విశ్వరూపమును దర్శింప చేసినాడు. ఇట్లు దర్శింపచేసి దానిని పొందుటయే పరమ పురుషార్థమని తెలిపినాడు. కావున తానే ఉపాయము (పొందదగినవాడు) అని చెప్పినాడు. ఈ "ఉపాయమును” (తనను) పొందుటకు కర్మ జ్ఞానములు అంగములుగ ఉన్న భక్తిని కలిగి ఉండవలయునని చెప్పినాడు. a ఇది ఎంతో కష్టమే అని అర్జునుడు తన మనసులో అనుకొనినాడు. అంతర్యామికి తెలిసినది.


"అర్జునా! భయపడకు. దానికంటె సులభముగా చేయతగినది, భగవానునకే పరతంత్రమైన ఆత్మయొక్క స్వరూపమునకు అనురూపమగు ఉపాయము ఒకటి యున్నది. అది "ప్రపత్తి”. చూ "ప్రపత్తి” అనగా భగవానుని పొందుటకు “భగవానుడే ఉపాయము అని మనసులో దృఢముగా విశ్వసించుట” అని చెప్పినాడు. ఈవిధముగ అర్జునునకు అంతకు పూర్వము తెలియని అనేక అర్థములను భగవానుడు తెలియజేసి, ఆచార్యుడు చేయు ఉపకారమును తానే మహాభారతములో నిర్వహించినాడు.భగవానుడు "ఉపాయము”. ఉపాయమే కాని మధ్యన ఒకరు లేకుండా తనంత తాను జీవునకు అభిముఖ్యముకలిగించి స్వీకరింపడు. దానిని చేయుటకు మధ్యవర్తినిగా లక్ష్మీదేవి ఉండవలయును. ఈ విషయమే 'ద్వయ” మంత్రములో నిర్దేశింపబడినది. “ద్వయ మంత్రము” పురుషకార వైభవమును చెప్పినది. కాని మహాభారతములో శ్రీ కృష్ణ భగవానుడు తానే పురుషకారము, తానే ఆచార్యుడు, తానే ఉపాయమై ప్రవర్తించినాడు. జీవుడు కోరనక్కర లేకుండగానే, మధ్యవర్తులు లేకుండగానే “తాను రక్షింతును” అని మహాభారతములో స్వామి తన "ఉపాయ వైభవమును” నిరూపించినాడు.


సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః


సర్వేశ్వరుడు దోషములతో నిండిన గుణములు లేని జీవులను కూడ అంగీకరించుట ఆయన స్వభావము. అట్లు స్వీకరించినాడు కదా అని తనలో దోషములే లేవని జీవుడు తలపరాదు. ఆ విధముగా భావించినచో అది జీవుని దోషమే అగును. దోషములున్నను తనను స్వామి స్వీకరించును అని తలచుచు దోషములు చేయుచునే ఉండుట మహా దోషము. అర్జునుడు సర్వేశ్వరునకు ఆత్మ వంటివాడు. అయిననూ అతనిలో దోషములున్నవి. బంఢు తి, క్షత్రియుడు అయి ఉండికూడ శత్రు సంహారమునకు వెనుదీయుట, జాలి పడకూడనివారి విషయములో జాలిపడుట అనునవి అర్జునునిలోని దోషములు.


జితేంద్రియుడు, ఆస్తికుడు, భగవానునకు ఆత్మవంటివాడు అయిన అర్జునునిలోనే ఇట్లు దోషములు ఉండగా సామాన్యుల విషయము చెప్పవలయునా? ఇంకొక ప్రధానమైన దోషము కూడ అర్జునునిలో ఉన్నది. కౌరవసభలో ద్రౌపది "కృష్ణా రక్షింపుము” అని ఆక్రోశించినది. అర్జునుడు అక్కడే ఉన్నాడు. ఆ అత్యాచారమును ఎదుర్కొను శక్తి కూడ ఉన్నది. తనకు ఆప్తుడు, ప్రాణము అయిశ్రీ కృష్ణుని శరణు వేడుచున్నది. తన ప్రాణసముడైన శ్రీ కృష్ణుని శరణు వేడినందులకైనను, మిత్రధర్మము ననుసరించి ద్రౌపదిని అర్జునుడు రక్షింపవలసి యుండెను. కాని రక్షింపలేదు. చుచు ఊరకుండినాడు. భగవానుడు తన విషయములో అపరాధము చేసినను సహించగలడు కాని తన భక్తుల విషయములో, తనను “శరణు" అనినవారి విషయములో అపరాధము చేసినచో సహించడు. “న క్షమామి కదాచన” అని కూడ అనినాడు కదా! ద్రౌపది విషయములో ఇంతటి క్రూరమైన తప్పు చేసినందులకు పాండవులనందరను శ్రీ కృష్ణుడు విడువ వలసిందే. కాని తాను వారిని విడిచినచో ద్రౌపది తన భర్తలను పోగొట్టుకొనవలసి వచ్చును. కౌరవుల బలపరాక్రమములు అట్టివి..అందుచే పాండవులు ఎన్ని తప్పులు చేసిననుశ్రీ కృష్ణుడు వారిని రక్షించినాడు. "శరణు” అనిన వారిని రక్షించుటయే ఆయన స్వభావము. స్వామి మనసులో అనుక్షణము ద్రౌపదీ పరాభవమే మెదలుచున్నది. ఆమె చేసిన శరణాగతియే జ్ఞప్తికి వచ్చుచున్నది. కౌరవుల యెడ క్రౌర్యము పెరుగుటకు, వారి నాశనమునకు ఇదియే కారణమైనది. ద్రౌపదిని పరాభవించినందులకే దుర్యోధనాదులను శ్రీ కృష్ణుడు నశింపచేసినాడు. తనను ఆశ్రయించిన ద్రౌపదికి ఎట్టి హాని కలుగరాదు అనియే స్వామి నిర్ణయము. 


ఇశ్రీ కృష్ణుడు పాండవ దూతగా హస్తినకు వెళ్ళిన సన్నివేశము : -


భగవానుడు హస్తినకు వెళ్ళుచున్నాడు. సంధి చేసుకొని రమ్మని పంచపాండవులు, తమకు మనఃపూర్తిగా ఇష్టము లేకపోయినను భగవానుని పంపినారు. కాని కౌరవసభలో ద్రౌపదికి కలిగిన పరాభవము, రాజసూయ అవభృథస్నాత అయిన ద్రౌపది యొక్క కేశములను దుశ్శాసనుడు పట్టి లాగిన క్రూర దృశ్యము, ఆ విడివడిన కేశములే భగవానుని కన్నుల ముందు కనిపించుచున్నవి. "సంధి కాదు - సమరమే” అని మొదటనే స్వామి నిర్ణయించుకొనినాడు. కౌరవులందరు హతులైన పిద మాత్రమే ద్రౌపది మనసు చల్లబడును అని నిర్ణయించుకొనినాడు. దీనికంతటికి కారణము ద్రౌపది చేసిన ప్రపత్తియే. మరియొక ఉపాయము లేదని ద్రౌపది చేసిన ఆక్రందనమే. అర్జునునకు యుద్ధములో “రథసారథి"గ ఉండి "విజయ సారథి" అయినది కూడ ద్రౌపది కొరకే. “ఆయుధమును ధరించను” అని ప్రతిజ్ఞ చేసినాడు. మరి కౌరవులను చంపుట ఎట్లు అనిశ్రీ కృష్ణుడు ఆలోచించినాడు. వారిని చంపుటకే రథ సారథ్యమును వహించినాడు. గుఱ్ఱములు, కొరడా ఇవే ఆయన వద్ద ఉన్నవి. వాటినే సాధనములుగా చేసుకొని, భారత యుద్ధములో చిత్ర విచిత్ర రథచాలనములతో ఆ రథచక్రముల చేతనే శత్రుసైన్యము హతమగునట్లు చేసినాడు స్వామి. . "న యోత్స్యా మి” అని ప్రతిజ్ఞ చేసినాడు. అర్జునునకు "గీత"ను ఉపదేశించి సమరోన్ముఖుని చేసినాడు. “నేనే రక్షకుడను. నన్ను నమ్మియుండుము” అని ధైర్యము చెప్పినాడు. "నేనే రక్షింతును” అనినాడు. "ప్రపత్తి”ని ఉపదేశించినాడు. "సర్వధర్మాన్... మా శుచః” అనినాడు. ఇట్లు ఇవి అన్నియు చేయుట “శరణాగత” అయిన ద్రౌపది కొరకే. "ప్రపత్తి” అనగా “భగవానుడే ఉపాయము” అని మనసులో స్వీకరించుట. దీనిని మహాభారతములో స్వామి ఉపదేశించి, ఆచరియా పినాడు. అందులకే మహాభారతములో “ఉపాయ వైభవము” ప్రతిపాదింపబడినదని పెద్దలు అందురు.