హిందూ ధర్మంలో జాబిల్లి ప్రాశస్యము


మన భారతదేశంలో హిందూ ధర్మం అనాదిగా ఆచరింపబడుచున్నది. మన హిందూ ధర్మము చాలా విశిష్టమైనది. ఇలాంటి హిందూ ధర్మంలో 'నవగ్రహారాధన' ముఖ్యమైనది. ప్రతి దేవాలయములోను ఒకప్రక్కగా నవగ్రహాలు కొలువుతీరబడి ఉంటాయి. భక్తులందరూ దేవునికి దండం పెట్టుకొని నవగ్రహాలకు ప్రదక్షిణం చేస్తారు. అలా ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనం “ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః


అంటూ పఠిస్తాము. దాని అర్థం ఏమిటంటే నవగ్రహాలలో ఆదిత్యాయ అనగా సూర్యుడు, సోమాయ అనగా చంద్రుడు, మంగళాయ అనగా బుధుడు, గురు (బృహస్పతి), శుక్ర అనగా శుక్రాచార్యులు, శని అనగా శనీశ్వరుడు, రాహువు కేతువులు ఇవన్నీ కలిపి నవగ్రహాలని పిలుస్తాము. కొలుస్తాము. ఇలాంటి నవగ్రహాలలో చంద్రుడు రెండవ స్థానంలో ఉన్నాడు. చంద్రుడు పురాణాలలో కీర్తించబడ్డాడు. కొలువబడినాడు.


చంద్రుడు మానవుని మనసుపై ప్రభావం చూపే దేవుడు. ందంటే కొలనులోని కలువలు విరబూస్తాయి. లేకపోతే విచ్చుకోవు. ఒకానొక సినీకవి ఒక పాటలో ఇలా పేర్కొన్నాడు. అదేమంటే.... “కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం దూరమైన కొలది పెరుగును అనురాగం" అంటూ వర్ణించాడు. అలాగే చంద్రకాంత శిలలు వెన్నెల చేత ప్రభావితమవుతాయి. చల్లని చంద్రకిరణ రశ్మి సోకి అవి కరుగుతాయట. చంద్రుడు చల్లని కిరణములు కలవాడు.


దానివల్ల మానవుని మనస్సు ఎక్కువ ప్రభావితమవుతుందని ఆర్యోక్తి. హిమాలయాలలోని ఓషధీ మొక్కలు చంద్రకిరణాల వెలుగు సోకినంతనే మిలమిలా మెరుస్తాయి. అవి ఔషధ గుణాల్ని వెన్నెలో ఇనుమడింప చేసుకుంటాయి. వైశాఖ పూర్ణిమ నాడు బుద్ధదేవుని పూజిస్తాము. ఆషాఢ శు ధపూర్ణిమ నాడు శ్రీ షిరిడీ సాయిబాబా జయంతిని జరుపుకుంటాము. తర్వాత శ్రావణ పూర్ణిమనాడు వేదవ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమగా వ్యవహరిస్తాము. కార్తీకపూర్ణిమ రోజు దీపోత్సవాలను చేస్తారు హిందూ మహిళలు. ఇలా అనాదిగా ప్రతి పూర్ణిమ రోజూ ఏదో విశేషము ఉండనే ఉంది. తెలుగువారి పంచాంగము చాంద్రమానముపై ఆధారపడి రూపందింపబడుతోంది. అనగా చంద్రుడు ఏ నక్షత్రం ప్రక్కన ఉంటే ఆ మాసాన్ని ఆ నక్షత్రం యొక్క నామాన్ని అనుసరించి పిలుస్తారు. ఎలా అంటే ఉదాహరణకు చిత్తా నక్షత్ర యుక్తుడైన చంద్రుడి పేరిట చైత్రమాసం అని, అలాగే విశాఖ నక్షత్రం ప్రక్కన ఉంటే వైశాఖమాసమని, జ్యేష్ఠ నక్షత్రం ప్రక్కన ఉంటే జ్యేష్ఠమాసమని, ఆషాఢ నక్షత్రం ప్రక్కన ఉంటే ఆషాఢ మాసమని, శ్రవణా నక్షత్రయుక్తుడు చంద్రుడు అయినట్లైతే శ్రావణ మాసమని, పూర్వాభాద్ర నక్షత్రం ప్రక్కన ఉంటే భాద్రపద మాసమని ఇలా ఏ నక్షత్రం ప్రక్కన చంద్రుడు ఉంటే ఆ మాసాన్ని ఆ నక్షత్రం పేరున పరిగణించబడుతోంది. చంద్రగ్రహణాలు కూడా అప్పుడప్పుడు సంభవిస్తూ ఉంటాయి. ఈ చంద్ర, సూర్య గ్రహణాల గూర్చిన పురాణగాథలు ప్రశస్తి గాంచాయి. ఏమంటే పూర్వం క్షీరసాగర మథనం జరిగిన తర్వాత అమృత భాండాన్ని పట్టుకుని మోహినీ అవతారములో ఉన్న శ్రీమహావిష్ణువు అమృతాన్ని దేవతలకు పంచే సమయంలో రాహు కేతువులు అనే పేర్లు గల దానవులు దేవతా రూపాలలో ఉండి అమృతాన్ని పానం చేశారు. దానివల్ల రాహు కేతువులకు మరణం లేదు. దాని ప్రభావం వల్లనే రాహుగ్రస్త సూర్య చంద్రగ్రహణాలు, కేతుగ్రస్త చంద్రగ్రహణ, సూర్యగ్రహణాలు ఏర్పడుతుంటాయి అనునది పౌరాణిక ప్రామాణికత సమేతంగా నిరూపించబడింది. తల్లులు బిడ్డలను ఎత్తుకుని వెన్నెల రాత్రులలో వారికి అన్నం తినిపిస్త అన్నం తినటానికి మారాం చేస్తున్న ఆ పిల్లలకు ఆకాశంలో ప్రకాశిస్తున్న చంద్రుని చూపిస్తూ "చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే గోగుపూలు తేవే” అని బుజ్జగించేది నిత్య సత్యం. ప్రేయసీ ప్రియులు సైతం వెన్నెల రాత్రులలో “ఇది తీయని వెన్నె రేయి, మది వెన్నెల కన్నా హాయి” అనో, ఈ వెన్నెలా - ఈ చల్లని వెన్నెల - అనాడూ ఈనాడూ ఒకే వెన్నెల” అంటూ పాడుకుంటారు. ఇదే కాక భావుకులు స్త్రీలను చంద్రవదనులని పొగిడారు. ఇలా అందానికి, ఆనందానికి ఆయువు పట్టు చంద్రుడే అని వారి దృఢ అభిప్రాయం. ఇలాంటి ఈ చందమామలో తొలుతగా క్రీ.శ 1966 సంవత్సరంలో అడుగు పెట్టిన అంతరిక్ష పరిశోధకుడు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ గొప్పవాడుగా పరిగణించబడ్డాడు. ఆ తర్వాత ఎంతోమంది వ్యోమగాములు చంద్రమండలాన్ని దర్శించుకుని వచ్చారు. చంద్రుని గూర్చిన అనేక వింత విషయాలు, అంశాలు వారు పరిశోధన చేసి తెలుసుకున్నారు. చంద్రకాంతి భూమిని చేరడానికి 11 సెకన్ల సమయం పడుతుంది అని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. . అందమైన స్త్రీలను చంద్రవదనలుగా మన కవులు పొగిడారు. అంతెందుకు శ్రీరాముని రామచంద్రుడు అని పిలుస్తాము. అలా ఎందుకు పిలుస్తామంటే చంద్రుడు తన చల్లని కిరణాలను భూమిపైకి ప్రసరింపచేస్తాడు. అట్టి శశికిరణుడు కాబట్టి చంద్రుని సుధాకరుడు అని పిలుస్తారు. తన గేయంలో డా॥ సి.నారాయణరెడ్డి గారు కథానాయకుని సౌందర్యాన్ని వర్ణిస్తూ ఇలా రాశారు.


అంటూ కవి ఇక్కడ కథానాయకుని రూపాన్ని చంద్రుని రూపంతో పోల్చారు. అది ఎంత హృద్యంగా ఉంటుంది ఇలా అనుకుంటే? చంద్రునికి షోడశ కళలు ఉన్నాయి. ఇరవై ఆరు నక్షత్రాలు చంద్రుని పత్నులు. నవగ్రహాలలో ఒకడైన చంద్రుడు ఆరాధ్యనీయుడు. ఇంకా చెప్పేదేమిటంటే చంద్రుని అన్యమతాల వారు కూడా దేవతగానే భావిస్తారు. ముస్లింలు నెలవంక, నక్షత్రాన్ని, క్రైస్తవులు నక్షత్రాన్ని పవిత్ర గుర్తుగా భావించి పూజిస్తారు. జ్యోతిష శాస్త్రం కూడా చంద్రుని నవగ్రహాలలో ఒకటిగా గుర్తిస్తూ నవజాత శిశువుల జాతక కుండలిని తయారు చేస్తారు. చంద్రుని ప్రభావం మానవుని మనస్సు మీద వుంటుంది అని జ్యోతిష శాస్త్రవేత్తల అభిప్రాయం.