మహాభాగవతం


"భూ వినుత, బ్రహ్మచర్యము తావదలక నిష్ఠచేత తథ్యము గాగన్ భావించి హరి తలంచుచు కోవిదనుతుడై మృకండు గుణముల వెలసెన్" - 33ప - ద్వా.స్కం - భాగవతము


"శౌనకాది మహరులారా! మృకండు అనే ఒక మహర్షి సకల సద్గుణాల చేత, విద్వాంసుల చేత ప్రశంసింప బడుతూ, బ్రహ్మచర్యాశ్రమాన్ని అమిత నిష్ఠతో ఆచరిస్తుండేవాడు. విష్ణుమూర్తిని తన మనసులో గాఢంగా నిలుపుకొని, అచంచలమైన భక్తితో తపస్సు చేశాడు. మృకండుని తపస్సుకు మెచ్చుకుని, హరి హరులిద్దరూ ప్రత్యక్షమై వరం కోరుకొనుమని కరుణామూర్తులైనారు. "సకల సద్గుణాలతో వరిష్టుడైన పుత్రుని ప్రసాదించ'మని వేడుకోగా ఆ వరాన్నిచ్చి శివకేశవులిద్దరూ అంతర్థానమైనారు. ఆ వరప్రభావం వల్ల పుట్టిన మార్కండేయుడు నిష్ణా గరిష్టుడై తపస్విగా ప్రఖ్యాతి వహించాడు. కొద్దికాలానికి మృత్యువు వచ్చి మార్కండేయుని తన పాశంతో కట్టివేసింది. అయినా మార్కండేయుడు భయపడక మృత్యుదేవతను ధిక్కరించి, చెక్కు చెదరక పదివేల సంవత్సరాల కాలంఘోరమైన తపస్సు చేశాడు. మార్కండేయుడు చేస్తున్న కఠినాతి కఠినమైన తపస్సుకు భగ్నం చేయటానికి అప్సరః కాంతలను ముని మీదకు పంపాడు.మార్కండేయునితపోవనమంతా ప్రకృతి శోభతోనిండి వుంది. ఎటూ సినా సువాసనలు విరజిమ్మే పువ్వుల పొదరిళ్ళు. మథురాతి మధురమైన పండ్ల చెట్లు, కోయిలల, చిలుకల, తుమ్మెదల కూజితాలు; చల్లని నీటి తుంపరలను విరజిమ్మే అనేకానేక సరోవరాలు, సఖ్యతతో మెలగుతున్న జాతివైరం గల జంతు సముదాయం - మార్కండేయుని నిశ్చలమైన తపశ్శక్తిని చాటుతున్న ఆ వనంలోకి ప్రవేశించిన దేవతా సుందరీమణులు వీణావాదనతో, వేణుగాన మాధుర్యంతో, విన్యాసాల వైదుష్యంతో, వివిధములైన వినోదాలతో, నృత్య భంగిమలతో మహర్షిని మైమరపు చెందేటందుకు రకరకాల ప్రయత్నాలు చేసి విఫలులయ్యారు. వారి శృంగారాన్ని గాని, శృంగార చేష్టలను గాని మార్కండేయుడు మెచ్చలేదు సరికదా, వాటివల్ల కనీసం చలించనైనా చలించలేదు. జడలను, నారచీరలను ధరించి అగ్నిదేవుడిలాగా తేజోవంతుడై, నిష్ఠాగరిష్టుడై తపస్సు చేస్తున్న మార్కండేయుని కించిత్తు కూడా కదలింపలేక, అప్సరకాంతలు ఓటమిపాలై ఇంద్రుని చెంతకు వెళ్ళి జరిగిన విషయాన్ని తెలిపి మిన్నకున్నారు. మార్కండేయుని అకుంఠిత తపస్సుకు హరి ప్రసన్నుడై ప్రత్యక్షమైనాడు. మార్కండేయుడు పరమాత్ముహూ సి, మ్రొక్కి "దేవదేవా! నీ దివ్యమైన నామాన్ని ఇంతకాలం స్మరించాను. నా నాలుక ఎల్లప్పుడూ నీ నామాన్నే పలుకుతుంది. ఈ శరీరంతోనే అనేక యుగాలు నేను బ్రదికే వరం కోరుకుంటున్నాను. ప్రసన్నుడవైనాకా వరాన్ని ప్రసాదించు" అని వేడుకోగా భగవంతుడందుకు తథాస్తు పలికాడు. అపరిమితమైన ఆనందంతో మార్కండేయుడు విష్ణుమూర్తిని స్తుతించి, భక్తిభావ భరితుడైనాడు.


"స్వామీ! వేదరూపుడవైన విశ్వేశుడవు నీవే! విశ్వవాసుల చేత సన్నుతింపబడేవాడివి నీవే! సృష్టి స్థితి లయాలకు కర్తవు నీవే! నీ మాయను ఎవరు తెలుసుకోగలరు? శంఖ చక్ర గదాధారీ! కమలాక్షా! దేవేంద్రాది దిక్పాలకులు గాని, బ్రహ్మ రుద్రాదులు గాని, దేవతలు గాని చర్చించి అయినా సరే నీ మాయను తెలుసుకోలేరని విన్నాను. అటువంటిది, విష్ణుమాయను తెలుసుకోవటం నాకు వశమా? కాదే! దీనుల యొక్క ఆర్తిని నిర్మూలించే మహానుభావా! నీ మాయ వల్లనే జగత్తంతా భ్రాంతితో కూడి ఉంది. నీ మాయ చక్కగా నాకు తెలిసే విధంగా చెప్పవలసింది" అని మార్కండేయుడు ప్రార్థించే సరికి విష్ణుదేవుడప్రీ తుడై 'మాయ' స్వరూపాన్ని, విశేషాలను తెలిపి వైకుంఠానికి వేంచేశాడు.


ఆ తరువాత మార్కండేయ మహాముని శివపూజ చేస్తూ హరినామ స్మరణను విస్మరించాడు. ఈలోగా వంద సంవత్సరాల పాటు ధారాపాతంగా వర్షాలు కురవడంతో భూమి అంతా జలంతో నిండిపోయింది. నీటితో విశ్వమంతా చీకటితో నిండిపోయేటప్పటికి ఆ గాఢాంధకారంలో మార్కండేయుడు, కన్నులు కనపడక భయంతో ఉండిపోయాడు. అంతలో ఆ జలమధ్యంలో మునికి ఒక వటపత్తం (మట్టి ఆకు) కనిపించింది. ఆ వటపత్తం మీద పద్మరాగమణుల కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న పాదపద్మాలతో విరాజిల్లుతున్న ఒక బాలుడు దృగ్గోచరమయ్యాడు. ఆ బాలుడు పరమాత్ముడే అని గ్రహించి మార్కండేయుడు మ్రొక్కి బాలుని శరీరంలోకి ప్రవేశించాడు. అనేక సంవత్సరాల కాలం బాలుని అనంతమైన ఉదరంలో తిరిగి, తిరిగి, ఆ పరమాఉమని పాదపద్మాలను స్మరించి, తరవాత బాలుని గర్భం నుంచి బయటకు వచ్చి బాలుని కౌగిలింపబోయాడు. ఆ నిమిషంలో బాలుడు మాయను స్వీకరించి మునికి కనపడకుండా మాయమైపోయాడు. అప్పుడు మార్కండేయుడు తన ఆశ్రమానికి వెళ్ళి ఎప్పటిలాగానే తపస్సు చేయసాగాడు.


"ఆ విధంగా మార్కండేయుడు తపస్సు చేస్తున్న సమయంలో శంకరుడు నిలిచిపోయాడు. సమస్త భోగ సౌభాగ్యాలు ప్రసాదించే పార్వతీదేవి పతిదేవుమా సి "హరా! విభూతినే భూషణంగా ధరించి ప్రకాశించిపోతున్న ఈ తపసిన శావా? ఆ మునిని పలకరించి, అతని సంగతి తెలుసుకొందామని కుతూహలంగా ఉంది" అని అనగానే శంకరుడు శాంకరీదేవితో కూడి ఆకాశం నుండి భూతలానికి విచ్చేశాడు. ఏకాగ్రచిత్తంతో తపస్సు చేస్తున్న మునిమా శామా సి, పరమేశ్వరుడు తన యొక్క దివ్య యోగమాయా ప్రభావం వల్ల మార్కండేయుని హృదయంలో ప్రవేశించాడు. నాలుగు బాహువులతో, రుద్రాక్ష మాలను ధరించినవాడై, విభూతినే అలంకారంగా పూసుకొని, త్రిశూల డమరుకాది దివ్యాయుధాలను ధరించి, నందీశ్వరుని అధిరోహించి, ఉమాదేవితో కూడి, ప్రత్యక్షమైనాడు. తనముందు వాత్సల్యామృతాన్ని వర్తిస్తూ నిలబడిన గౌరీశంకరులచూ సి ఆశ్చర్యంతో తల మునకలయ్యాడు మార్కండేయుడు. భక్తి పారవశ్యంతో పార్వతీ పరమేశ్వరులను అనేక విధాల స్తుతించి వారి చరణాల ముందు సాగిలపడ్డాడు ఆ మునివరేణ్యుడు. భక్తవశంకరుడైన శంకరుడు మార్కండేయుని తపోమహిమకు మెచ్చుకొని "భక్తా! మార్కండేయా! నీవు మహాత్ముడివి. పరమ శివుడివి" అని ఆనతిచ్చాడు. ఈశ్వరుని కరుణకు అమితానందభరితుడైన మార్కండేయుడు పార్వతీనాథుని చూ స్తూ 'దేవా! విష్ణుమాయా ప్రభావం గొప్పది. అది దుర్లభమైనది కూడా. అటువంటి విష్ణుమాయను నీ యొక్క దర్శనం వల్లూ డగలిగాను. ప్రభూ! ఇంతకన్నా ఇంకేమి కావాలి చెప్పు. అయినప్పటికీ, నిన్నొక వరం కోరుతాను. నారాయణ చరణాంబుజ ధ్యానాన్ని, మృత్యువును జయించే శక్తినీ నాకు ప్రసాదించు' అని ప్రార్థించాడు. దయా సముద్రుడైన పరమశివుడు "నీ కోరిక నెరవేరుగాక! వృద్దాప్యాన్ని, వ్యాధులను, ఏ వికారాలను పొందకుండా కోటి కల్పాలు పూర్తి అయ్యేవరకు నీవు చిరంజీవిగా జీవిస్తావు. అంతేకాక శ్రీ మన్నారాయణుని అనుగ్రహం నీమీద ఎల్లవేళలా ఉంటుంది" అని ఆనతిచ్చి ఉమాసమేతుడై అంతర్జానం చెందాడు. మహామునులారా! అదీ మార్కండేయ మహర్షి చరిత్ర. సావధానంగా విన్నారు కదా! ఈ మార్కండేయోపాఖ్యానాన్ని ఎవరు వ్రాసినా, విన్నా, చదివినా - వారు మృత్యువాత పడరు. మరొక ముఖ్య విషయం. శౌనకా! విష్ణుభక్తుడైన మహానుభావుడు - ఇతర దేవతలను, ఇతర మంత్రాలను, ఇతర సాధనలను వర్ణించి, దుర్జనులను కలవక, ఎల్లవేళలా నారాయణ, గోవింద, జనార్ధన, విష్ణు మొదలైన నామాలను స్మరిస్తూ, ఆ దేవదేవుని కొలిస్తే - అటువంటి పుణ్యపురుషుడు సదా వైకుంఠంలో నివసిస్తాడు. అంతేకాదుశ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూపం గురించి కాని, నాలుగు రకాల వ్యూహ భేదాల గురించి గాని, నాలుగు మూర్తుల గురించి గాని, లీలావతారాల గురించి గాని చెప్పటం సాధ్యం కాని విషయం" అని సూత మహర్షి వాక్రుచ్చటంతో శౌనకుడు మరో అంశాన్ని లేవనెత్తాడు.


- "దేవతల చేతనే స్తుతింపబడే మహాత్మా! సూతమహర్షీ! శ్రీ మహావిష్ణువు యొక్క కథలు ఎన్నో చెప్పావు. ఆ నారాయణుని చరిత్ర నంతటినీ సాకల్యంగా వివరించావు శ్రీ కృష్ణుని లీలా విలాసాలన్నీ కళ్ళకు కట్టినట్లూ పించావు. ఇవన్నీ చక్కగా తెలిశాయి. ఇంకా ఒక చిన్న అనుమానం నా మనసులో కదలాడుతోంది. అది ఏమంటే - గురుదేవా! సూర్యభగవానుడు చైత్రమాసం నుంచి - ఏయే మాసంలో ఏయే పేరుతో ఆరాధింపబడతాడో – తెలుసుకోవాలని ఉంది. మామీద కృపతో ఆ విషయాలన్నీ వివరించండి" అని శౌనకుడు అడిగిన క్షణం నుంచే సూతుడు చెప్పడం మొదలుపెట్టాడు.


సూర్యుడు ప్రతి మాసంబును చేసే మేరకో సంచరించే క్రమము


"మునులారా! చైత్రమాసం నుండి పన్నెండు నెలలలోనూ సూర్యుని యొక్క ఏడు మూర్తులు, భగవంతుని నియోగం చేత అనేక విధాలుగా సంచరిస్తుంటాయి. సూర్యభగవానుడు శ్రీ మన్నారాయణ స్వరూపుడు. సూర్యుడిది ఒకే రూపం. అయినప్పటికీ కాలము, దేశము, క్రియ మొదలైన గుణాలను బట్టి మహర్పులు అనేక విధాలుగా అభివర్ణిస్తూ భావిస్తున్నారు. ఆ వివరం చెబుతాను వినండి. చైత్రమాసంలో సూర్యుడు 'ధాత' అనే పేరుతో వ్యవహరింపబడతాడు. ఆయనకు - కృతస్థలి, హేతి, వాసుకి, రథకృత్తు,పులస్త్యుడు, తుంబురుడు అనేవారు పరిజనులై వెంట ఉంటారు. ఇక వైశాఖ మాసంలో సూర్యుడు 'అర్యముడు' అనే పేరుతో పిలువబడతాడు. ఆయనకు - పులహుడు, ఓజుడు, ప్రహేతి, పుంజికస్థలి, నారదుడు, కంజనీరుడు అనేవారు పరిజనులు. వారితో కలిసి సూర్యుడు కాలగమనం చేస్తుంటాడు. తరవాత జ్యేష్ఠమాసంలో 'మిత్రుడు' అనే పేరుతో వర్తిస్తుంటాడు. అప్పుడాయనకు - అత్రి, పౌరుషేయుడు, తక్షకుడు, మేనక, హాహా, రథస్వనుడు అనేవారు పరిజనులుగా ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో సూర్యుడు - 'వరుణుడు' అనే పేరుతో కలిగి ఉంటాడు. ఆ మాసంలో ఆయనకు వసిష్ఠుడు, రంభ, సహజన్యుడు, హహావు, శుక్రుడు, చిత్రస్వనుడు అనేవారు సహచరులు. వారితో కూడి కాలం గడుపుతుంటాడు. శ్రావణ మాసంలో సూర్యుడు 'ఇంద్రుడు' అనే పేరుతో స్తుతింపబడతాడు. ఆ నెలలో ఆయనకు విశ్వావసువు, శ్రోత, ఏలాపుత్రుడు, అంగిరసుడు, ప్రమైచ, చర్యుడు అనేవారు తోడురాగా కాలం గడుపుతుంటాడు. భాద్రపద మాసంలో సూర్యుని పేరు - 'వివస్వంతుడు'. ఉగ్రసేనుడు, వ్యాఘ్రుడు, ఆసారణుడు, భృగువు అనుమైచ, శంఖపాలుడు అనేవారు తనను ఆవరించి ఉండగా సూర్యుడు కాలపాలన చేస్తుంటాడు. ఆశ్వయుజ మాసంలో సూర్యుడు 'త్వష్ట' అనే పేరు ధరించి భూమికి సంతోషాన్ని కలిగిస్తూ ఆకాశంలో చరిస్తుంటాడు. ఈ మాసంలో ఋచీక తనయుఐన కంబళాశ్వుడు, తిలోత్తమ, బ్రహ్మూపేతుడు, శతచిత్తు, ధృతరాష్ట్రుడు, ఇవంభరుడు - అనే సభ్యులను కలుపుకుని కాలాన్ని గడుపుతుంటాడు. కార్తీకమాసంలో సూర్యుడు - "విష్ణువు" అని చెప్పబడుతుంటాడు. అశ్వతరుడు, రంభ, సూర్యవర్చసుడు, సత్యజిత్తు, విశ్వామిత్రుడు, మఘాపేతుడు - అనేవారు పరిజనులై కొలుస్తుండగా సూర్యుడు కాలాన్ని నడుపుతుంటాడు. 


మార్గశిర మాసంలో సూర్యుడు 'అర్యముడు' అనే పేరుతో వ్యవహరింపబడుతాడు. ఈ మాసంలో కశ్యపుడు, తార్క్ష్యుడు, ఋతసేనుడు, ఊర్వశి, విద్యుచ్ఛత్రుడు, మహాశంఖుడు అనే వారాయనకు అనుచరులుగా ఉంటారు. వారితో కలిసి సూర్యుడు సంచరిస్తుంటాడు. పుష్యమాసంలో సూర్యుని 'భగుడు' అనే పేరుతో ప్రార్థిస్తుంటారు. ఆ మాసంలో - స్ఫూర్ణుడు, అరిష్టనేమి, ఊర్ణుడు, ఆయువు,కర్కోటకుడు, పూర్వచిత్తి - అనే సభ్యజనులతో పరివేష్టింపబడి కాలగమనం చేస్తుంటాడు సూర్యుడు. మాఘమాసంలో 'పూషుడు' అనే పేరు కలిగి సూర్యుడు - తన పరిజనులైన ధనంజయుడు, వాతుడు, సుషేణుడు, సురుచి, ఘృతాచి, గౌతముడు పరివేష్టించి రాగా సంచరిస్తుంటాడు. సహస్ర కిరణాలతో ప్రకాశించే సూర్యుడు ఫాల్గుణ మాసంలో 'క్రతువు' అనే నామంతో విరాజిల్లుతుంటాడు. ఆ నెలలో చాతుర్య కళా కేళీరతుడిగా వెలుగొందుతుంటాడు. మేధావులందరు ప్రశంసిస్తుండగా సూర్యుడు ఫాల్గుణ మాసంలో కాలాన్ని పరిపాలిస్తుంటాడు. ఆ సమయంలో వర్చసుడు, భరద్వాజుడు, పర్జన్యుడు, సేనజిత్తు, విశ్వుడు, ఐరావతుడు అనేవారితో కలిసి కాలపాలన చేస్తుంటాడు.


ఋషులారా! ఈ విధంగా సూర్యదేవుడు పన్నెండు నెలలలోను పరిమితి లేని అఖండ వైభవంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంటాడు. ప్రాతఃకాలంలోను, సాయం సంధ్యా సమయంలోను - రెండు వేలా తనను ఉపాసించే జనుల పాపాలన్నిటినీ భానుడు పారద్రోలుతూ కరుణా కటాక్ష వీక్షణాలను వారిపై ప్రసరింప చేస్తుంటాడు. ప్రతి నెలలోను ఆయా పరిజనులు తనవెంట నంటి కొలుస్తూ వస్తుండగా, ఉభయ కాలాలలో నివసించే జనులకందరికీ ఇహలోక సౌఖ్యాలను, ఆముష్మిక ఫలాలను ప్రసాదిస్తాడు. మహర్షి శ్రీ ష్ఠులు - ఋగ్యజుస్సామధర్వణ వేద మంత్రాలను పఠిస్తూ, స్తుతిస్తుండగా; అప్సరః కాంతలు పురోభాగంలో నిలిచి నృత్యం చేస్తుండగా; గంధర్వులు తమగానమాధుర్యంతో మార్తాండునిపై కీర్తనలను ఆలపిస్తుండగా; బ్రహ్మవేత్తలయిన అరవై వేల మంది వాలఖిల్య మహర్పులు ఎదురుగా నిల్చి వినుతిస్తూ నడుస్తుండగా; మహాబలంతో, వేగవంతంగా మదపుటేనుగులు ముందువైపు నిల్చి రథాన్ని లాగుతుండగా, బాహుబలంలో సుప్రతిష్ఠులైన నైరృతశ్రీ ష్ఠులు రథానికి వెనుక భాగాన నిల్చి రథాన్ని ముందుకు తోస్తుండగా, ఆద్యంతాలు లేని ఆదిత్యుడైన సూర్యభగవానుడు - ప్రతి కల్పంలోను ఈ విధంగా కాలచక్రాన్ని నడిపిస్తూ తేజరిల్లుతుంటాడు. అందుచేత మునులారా! ఇవన్నీ వాసుదేవ మయములే అని గ్రహించండి" అని పౌరాణికులలో ఉత్తముడైన సూతమహర్షి నైమిశారణ్యంలో నివసిస్తున్న శౌనకాది మహరులమా సి "నాయనలారా! ఇంతవరకూ నేను చెప్పిన విషయమంతా ప్రాయోపవేశంలో ఉన్న పరీక్షిన్నహారాజుకు శుకయోగీంద్రుడు ఉపదేశించిన విషయం సుమా! తపస్వులారా! ఈ భాగవతము పద్దెనిమిది పురాణాలలోను రత్నం వంటిది. అంతటి మహత్తు కలిగిన 'భాగవతాన్ని విన్నవారు,పఠించేవారు, వ్రాసేవారు ఆయురారోగ్య భోగభాగ్యాలతో విలసిల్లుతారు. అంతేకాదు వారికి విష్ణు సాయుజ్యం కూడా లభిస్తుంది. ఇంకో ముఖ్య విషయం చెబుతాను వినండి.


"పుష్కర తీర్థంలో గాని, ద్వారకా నగరంలో గాని, మథురాపురంలో గాని ఆదివారం నాడు ఎవరైతే భక్తి ప్రపత్తులతో, పరమాసక్తితో భాగవతాన్ని చదువుతారో, వారు అప్పటికప్పుడు సంసార సాగరాన్ని దాటి విష్ణుపదమైన వైకుంఠాన్ని చేరుకొంటారు. శౌనకా!


"ఈ పన్నెండు స్కంధాలను మహాత్ముడైన శుకయోగీంద్రుడు లక్ష్మీనాథుని కథలను ఎప్పుడూ పారాయణ చేస్తూ ఉండాలనే మనస్సుగల పరీక్షిన్మహారాజుకు వినిపించి, ఆ మహాభక్తుని ధన్యుని చేశాడు".


"అంతేకాదు. అష్టాదశ పురాణాలలోని శ్లోక సంఖ్య ఎంతో కూడా చెబుతాను వినండి. బ్రహ్మపురాణంలో పదివేల శ్లోకాలు ఉంటాయి. పద్మపురాణం ఏభై అయిదు వేల శ్లోకాలతో కూడి ఉంటుంది. విష్ణు పురాణంలో ఇరవైమూడు వేల శ్లోకాలు వ్రాయబడినాయి. శివపురాణం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో నిండి ఉంటుంది? భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలకు నిలయం. నారదపురాణం ఇరవై అయిదు వేలతో లిఖించబడితే, మార్కండేయ పురాణంలో తొమ్మిది వేల శ్లోకాలు దర్శనమిస్తాయి. అగ్నిపురాణంలో పదిహేను వేల నాలుగు వందల శ్లోకాలుంటే భవిష్యోత్తర పురాణంలో పధ్నాలుగు వేల అయిదు వందల శ్లోకాలు కనిపిస్తాయి. బ్రహ్మవైవర్త పురాణం పద్దెనిమిది వేల శ్లోకాలతో ఉంటే లింగపురాణం పదకొండు వేల శ్లోకాలతో వ్రాయబడి ఉంది. వరాహ పురాణం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో, స్కాందపురాణం ఎనభై ఒక్క వేల నూరు శ్లోకాలతో రచింపబడినాయి. వామన పురాణంలో పదివేల శ్లోకాలు, కూర్మపురాణంలో పదిహేడు వేల శ్లోకాలు ఉన్నాయి. మత్స్యపురాణం పధ్నాలుగు వేల శ్లోకాలు కలిగి ఉంటే గరుడ పురాణం పంథొమ్మిది వేల శ్లోకాలతో పరిఢవిల్లింది. బ్రహ్మాండ పురాణం పన్నెండు వేల శ్లోకాలతో వ్రాయబడింది. ఈ విధంగా పద్దెనిమిది పురాణాలలో ఉన్న మొత్తం శ్లోకాల సంఖ్య నాలుగు లక్షల పరిమాణంతో స్ఫూర్తిమంతమై ఉంటుంది. ఇన్ని పురాణాలలోను భాగవత పురాణం యొక్క ప్రాముఖ్యం గాని, మహిమ గాని అనన్య సామాన్యమైనదనే చెప్పాలి. -


నదులలో గంగానదివలె, దేవతల మధ్య బ్రహ్మదేవుడిలాగా, నక్షత్రాల నడుమ చంద్రుని రీతి, సముద్రాల లోపల క్షీరసాగరం మాడ్కి, పర్వతాల యందు మేరు పర్వతం మాదిరి, గ్రహాలలో సూర్యుని విధంగా, రాక్షసులలో ప్రహ్లాదుని భంగి, రత్నాల మధ్య పద్మరాగం లాగా, వృక్షాలలో హరిచందన వృక్షమా అన్నట్లు, ఋషులలో నారదుని రీతి, ధేనువులలో కామధేనువు మాదిరి, సూక్ష్మాలలో జీవుని విధంగా, జయించలేని వానిలో మనస్సు వలె, వసువులలో హవ్యవాహనుడి (అగ్ని) లాగా, అదితి పుత్రులలో విష్ణువు వలె, రుద్రులలో నీలలోహితుడి వలె, బ్రహ్మలలో భృగువు విధంగా, సిద్ధపురుషులలో కపిలుని లీల, గుట్టాలలో ఉచ్చెశ్రవమా అన్నట్లు, సర్పాలలో వాసుకి వలె, మృగాలలో సింహంలాగా, ఆశ్రమ పద్ధతులలో గృహస్తాశ్రమ విధంగా, వర్ణాలలో (అక్షరాలలో) ఓంకారం వలె, ఆయుధాలలో ధనుస్సు వలె, యజ్ఞాలలో జపయజ్ఞం అనేటట్లు, వ్రతాలలో అహింసలాగా, యోగాలలో ఆత్మయోగం లాగా, ఓషధులలో యవలవలె, సంభాషణలలో సత్యం మాడ్కి, ఋతువులలోవసంత ఋతువు మాదిరి, మాసాలలో మార్గశీర్షమాస రీతి, యుగాలలో కృతయుగం లాగా భాగవత పురాణం ప్రకాశిస్తుంటుంది. ఇంత మహా మహిమోపేతమైన భాగవత పురాణాన్ని పఠిస్తే విష్ణు సాయుజ్యం తప్పక లభిస్తుంది. మహర్షులారా! మహత్తరమైన పుణ్యాన్ని, మోక్షాన్ని ప్రసాదించే భాగవత పురాణాన్ని తెలియజెప్పిన శుకయోగి ఎంత గొప్పవాడో కదా!


"సమస్త ఆగమ శాస్త్రాల పరమార్గాన్ని కూలంకషంగా తెలిసినవాడు, కళంకరహితమైన సకల సద్గుణాలతో ప్రకాశించేవాడు, దేవతలచే వందనములందుకొనే పాదపద్మాలు గలవాడు అయిన శుకయోగికి నేను నమస్కరిస్తున్నాను. దేవకీ వసుదేవుల గారాల పుత్రుడై శ్రీ కృష్ణ పరమాత్ముని అహర్నిశలూ తలపోస్తూ ఉంటాను.


"సకల గుణాలకు అతీతుడయినవాడు, సర్వవిషయాలు తెలిసినవాడు, సమస్తానికి ప్రభువైనవాడు, అఖిల లోకాలకు ఆధారమైనవాడు, ఆదిదేవుడు, పరమ దయామూర్తి, దేవతల చేత నమస్కరింపబడే పాదపద్మాలు గలవాడు, క్షీరసాగరంలో శయనించేవాడు, ఆశ్రయించినవారి కోరికలు తీర్చే కల్పవృక్షం వంటివాడు, మొదలు తుది లేనివాడు, వేదాంతాలలో తెలియబడేవాడు, విశ్వమంతా తానే ఉన్నవాడు, కౌస్తుభమణి చేతశ్రీ వత్సమనే పుట్టుమచ్చ చేత అలంకరింపబడిన మనోహరమైన వక్షస్థలం గలవాడు; శంఖం, చక్రం, గద, ఖడ్గం, శారణం అనే పంచాయుధాలను ధరించేవాడు, శోభాయమానమైన సుందరాకారం గలవాడు, పీతాంబర ధరుడు, రత్నాలతో పొదగబడిన కిరీట కాంతులతో ప్రకాశిస్తున్నవాడు, తెల్ల తామరరేకుల వంటి నేత్రములు గలవాడు, పుణ్యదేహుడు, దేవకీ వసుదేవుల తనయుడు అయిన శ్రీ కృష్ణపరమాత్ముని ఎల్లవేళలా తలపోస్తూ, స్తుతిస్తూ ఉంటాను" అని సూత మహర్షి కృష్ణనామాన్ని స్మరిస్తూ శౌనకాదుల చేత స్మరింపచేస్తూ కొంతసేపు గడిపాడు.


ఈ విధంగా సూతమహర్షిశ్రీ కృష్ణ పరమాత్ముని భక్తి ప్రపత్తులతో స్తోత్రం చేసి భాగవత పురాణాన్ని వీనుల విందుగా చెప్పగా, ఆద్యంతం విని తరించిన శౌనకాది మహర్షులందరూ సంతుష్ట మనస్కులైనారు. విష్ణుదేవుని పట్ల వారి మ అనంతమై విరిసింది. భక్తి మనసుల నిండా నిండి పొంగి పొంగి ఉప్పొంగింది. ఆశ్రీ కృష్ణుని సర్వ సద్గుణాలను పొగుడుతూ ధన్యులయ్యారుశ్రీ మన్నారాయణుని నామ సహస్రాన్ని స్మరిస్తూ పరమోత్సాహంతో తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు.


"జనక మహారాజు పుత్రిక అయిన సీతాదేవి హృదయాన్ని దొంగిలించినవాడు, పిత్రాజ్ఞను పాటించి అడవులలోను, కొండలపైన అనేక విహారాలు సల్పినవాడు, జనుల వాంఛితాలను నెరవేర్చే కల్పవృక్షంవంటివాడు, పుట్టింది మొదలు అనుభవిస్తున్న నిత్య దుఃఖ సమూహాన్ని సంహరించేవాడు, పరబ్రహ్మ అయిన శ్రీ రామచంద్రునికి శ్రీ మహాభాగవత పురాణము అంకితము గావింపబడినది"..


శ్రీ మహాభాగవతము సమాప్తము విష్ణురూపుడైన వ్యాసమహర్షికి ప్రణామాలు సహజ పాండిత్య పోతనామాత్యునికి వందన మందారాలు


సర్వేజనాః సుఖినో భవంతు శ్రీ