శ్రీ మహాభాగవతం యుగధర్మ ప్రాకృతాది ప్రళయ చతుష్టయ వివరణ - డా॥ పులిగడ్డ విజయలక్ష్మి

 



యుగధర్మ ప్రాకృతాది ప్రళయ చతుష్టయ వివరణ


పరీక్షిన్మహారాజా! ప్రళయం ఏవిధంగా సంభవిస్తుందో అడిగావు కదా! విను. ఆవిధంగా మేఘాలు నూరు సంవత్సరాల పాటు నిర్విరామంగా వర్షాలను కురిపించటం వల్ల భూమి తన తన్మాత్ర అయిన "గంధ గుణాన్ని" కోల్పోయి జలంలో విలీనమవుతుంది. జలం తన తన్మాత్ర అయిన "రస గుణాన్ని కోల్పోయి తేజస్సులో (కాంతిలో) అణగిపోతుంది. ఆ తేజస్సు వాయువులో నష్ట "రూపంగా" కలిసిపోతుంది. అప్పుడు ఆ వాయువు తన తన్మాత్ర అయిన "స్పర్శగుణాన్ని" పోగొట్టుకొని ఆకాశంలో ఉండిపోతుంది. ఆ ఆకాశం తన తన్మాత్ర అయిన "శబ్దగుణాన్ని" పోగొట్టుకుని ఆదిభూతంలోకి ప్రవేశిస్తుంది. ఆదిభూతం తేజస్సుతో నిండిన మహద్రూపంగా అహంకారం కలిగి, వికార గుణాలతో కూడి ఇంద్రియాలను తనలో లీనం చేసుకొంటుంది. అహంకారాన్ని సత్త్వము మొదలైన గుణాలు తమలోకి తీసుకొంటాయి. సత్త్వాది గుణాలు కాలం రేపించే ప్రకృతిలో విలీనమవుతాయి.


ప్రకృతి అనాదిగా ఉన్నటువంటిది. నిత్యమైనది. నాశనము లేనిది. వాక్కుకు, మనసుకు గోచరం కాక, సత్త్వ రజ స్తమో గుణాలు లేనిదిగా ఉంటుంది. మహత్తు మొదలైన వాటితో కలియకుండా, స్వప్నాది మూడు అవస్థలూ పొందకుండా, భూమి మొదలైన పంచభూతాలు లేనిదిగా, తర్కానికి అతీతంగా ఉంటుంది. అటువంటి దానిని మూలభూతమైన పదార్థమని చెబుతుంటారు. కాలం, విశిష్టమైన పరిణామం చెందినప్పుడు పురుషుడూ, అవ్యక్తుడూ ఒకరితో ఒకరు కలిసిపోతారు. ఆవిధంగా పురుషుడు, అవ్యక్తుడు విలీనమైన దానిని "ప్రాకృత ప్రళయ" మంటారు. -


రాజా! మరొక విషయం. జ్ఞానమనేది బుద్దిని, ఇంద్రియాలను, ఇంద్రియార్థములైన విషయాలను ఆశ్రయించి ప్రకాశిస్తుంటుంది. ఈ జ్ఞానం కనిపించడమనే లక్షణంతో, విరుద్ధం కాకపోవడమనే లక్షణంతో ఆదిని, అంతాన్ని కలిగి ఉంటుంది. కాంతి కన్న దీపం, కన్నూ, వస్తురూపము వేరైనవి కావు. ఆ విధంగానే బుద్ధి, ఇంద్రియాలు, విషయాలు పరార్థమూర్తి కన్న వేరైనవి కావు. అంటే బుద్ధి, ఇంద్రియాలు, విషయాలు పరమాత్మ కన్న ఎంతమాత్రం వేరైనవి కావు. -


జీవులన్నీ పరమాత్మనుంచే ఉదయిస్తుంటాయి. పరమాత్మలోనే లయమౌతాయి. ఒకే కాంతి అనేక రంధ్రాలలో నుంచి అనేక కాంతులుగా కనిపించే విధంగానే ఒకే పరమాత్మ పెక్కు విధాలుగా భావింపబడుతుంటాడు. బంగారం, అనేక ఆభరణాల రూపాలలో కనిపించినా ఒక్కటే అయినట్లు పరమాత్మ ఎన్ని రూపాలలో గోచరమైనా ఒక్కటే అని భావించాలి. మేఘాల వరస తొలగిపోతే కళ్ళకు సూర్యబింబం ఏవిధంగా కనిపిస్తుందో, అదేవిధంగా ఆత్మజ్ఞానం వల్ల ఎప్పుడు బంధహేతువైన అహంకారం తొలగిపోతుందో అప్పుడు పరమాత్మ నిర్మలంగా గోచరమవుతుంది. ఆ పరమాత్మను యోగులు నిరంతరం తలుస్తూ, పరమాత్మ యందే ఏకాగ్రచిత్తంతో మెసలుతుంటారు. కాలం నడుస్తూ ఉండడం వల్ల ప్రపంచంలో రకరకాల భిన్నదశలు కలుగుతుంటాయి. కాలమనేది పరమేశ్వరుని రూపమే. ఆకాశంలో పగలు నక్షత్రాలు కనిపించనట్లే కాలంలో కల్పావస్థలు కనిపించకుండా తిరుగుతుంటాయి. ప్రళయాలు నాలుగు రకాలు. అవి 1. నిత్య ప్రళయం 2. నైమిత్తిక ప్రళయం 3. ప్రాకృతిక ప్రళయం 4. ఆత్యంతిక ప్రళయం. ఆయా కాలాల్లో సంభవింఫ్రీ మన్నారాయణుని లీలావతారాలు అనేకం. వాటిని వర్ణించి చెప్పటానికి బ్రహ్మదేవుడు, శివుడు మొదలైనవారే చాలరు. నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను. పరీక్షిన్మహారాజా! ఈ సంసార సాగరాన్ని దాటడానికి "హరికథ" అనే నావ తప్ప మరే సాధనమూ లేదు. ఇంకే సహాయమూ దొరకదు. ఒక్కమాట చెబుతాను. శ్రద్ధగా విను.


"నేను మరణిస్తానే. ఎలాగ? అనే భయాన్ని ఇంత కూడా మనస్సులో పెట్టుకోకు. భూమిమీద పుట్టిన మానవులందరికీ చావనేది తప్పనిసరి కదా! ఎవరికైనా సరే - ఎప్పుడో ఒకప్పుడు చావనేది రాక తప్పదు. కాబట్టి నిత్యశ్రీ హరిని భక్తితో స్మరిస్తూ ఉండు. పుణ్యాత్ముడవైన నీకు ఈ భూమిపైన మరో జన్మంటూ లేదు. విష్ణులోకమైన వైకుంఠం చేరి అక్కడ సకల సౌఖ్యాలూ పొందుతూ, విష్ణు సన్నిధానంలోనే నివసిస్తావు. రాజేంద్రా! కుండలలో కనిపించే ఆకాశం కుండ పగలగానే మహాకాశంలో ఏవిధంగా చేరుతుందో, అదేవిధంగా వార్థక్యానికి, మరణానికి కారణభూతమైన శరీరంలో ఉండే జీవుడు - శరీరం ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడే భగవంతునిలో కలిసిపోతాడు. నూనె అయిపోయేంతవరకు వత్తి ఎలా వెలుగుతుందో, అలా శరీరాన్ని ధరించి ఉన్న జన్మ సత్త రజ స్తమో గుణాల చేత ప్రవర్తిస్తూ ఉంటుంద. ఆత్మ అనేది ఆకాశం వలె నిశ్చలంగా, అనంతంగా, వ్యక్తానికి, అవ్యక్తానికి అతీతంగా ఉంటుంది. ఈ విధంగా ఆత్మను ఆత్మస్తునిగా చేసి అక్క భగవంతుని నిజాకారాన్ని భావించగలగటం, ధ్యానించటం చేయాలి. అదే విశిష్టమైన విషయం . పరీక్షిత్తూ! నిన్ను తక్షకుడు కరవలేడు. ఆ సర్పరాజుకు అంత శక్తి లేదు. అనుక్షణం నీవు హరిని తలుస్తూ ఉండు. ధనాన్ని, గృహాన్ని, భార్యను, సంతానాన్ని, పొలాలను, పశు సముదాయాన్ని - ఒకటేమిటి? సుఖాలను ప్రసాదించే సర్వ వస్తువులను, సకల విషయాలను వర్ణించి నీ సమస్తాన్ని నారాయణునికి సమర్పించు. దుఃఖమనే దానిని నీ దరికి కూడా రానీకు. ప్రతినిత్యం విష్ణువును గురించి ధ్యానం చేస్తూ ఉండు. ఆ భగవంతునే పట్టుకో. ఆ దేవదేవుని ఎన్నటికీ వదలకు" అని శుకమహర్షి పరీక్షిన్మహరాజుకు జ్ఞానబోధ చేశాడు. శుకయోగి మాటలను ఔదల దాల్చి, పరీక్షిత్తు దర్భాసనం మీద కూర్చుని జనార్దనుడైన శ్రీ మహావిష్ణువును ధ్యానించసాగాడు. పరీక్షిత్తును ధ్యాన నిష్ఠలో సిన శుకమహర్షి, తన కర్తవ్యం పూర్తి కావడంతో స్వచ్ఛంద విహారియై తపశ్చర్యకు వెళ్ళిపోయాడు.


పరీక్షిత్తు తక్షకునిచే దష్టుడై మృతి చెందడం


"తరువాత కోపావిష్టుడైన శృంగి వల్ల రేపింపబడిన తక్షకుడు బ్రాహ్మణ వేషంతో పరీక్షిత్తును కరిచి, మృతుని చేయటానికి బయలుదేరుతాడు. బ్రాహ్మణోత్తముడైన శృంగి శాపం జరిగి తీరాలి. ఆ కారణంతో తక్షకుడు శీఘ్ర గమనంతో వస్తూ, మార్గమధ్యంలో కాశ్యపుడనే విప్రుని కలుస్తాడు. ఆ కాశ్యపుడు సర్పం యొక్క విషాన్ని పోగొట్టగల సమర్థుడు. అందుచేత కాశ్యపుడు వచ్చి పరీక్షిత్తును బ్రతికించకుండా ఉండటానికి తక్షకుడతనికి అపారమైన ధనాన్ని ఇచ్చి, విధికృతం జరగక మానదని చెప్పి కాశ్యపుని వెనుకకు మళ్ళిస్తాడు. బ్రాహ్మణ శాపం వృధా కారాదన్న విషయాన్ని గ్రహించి కాశ్యపుడు, శక్తిమంతుడైనా, పరీక్షిత్తు వద్దకు వెళ్ళక తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు" అని సూతమహర్షి శౌనకాది మునులకు శుకయోగి పరీక్షిత్తుకు చెప్పిన పరమాత్మ తత్త్వబోధను, పరీక్షిత్తు వద్దకు తక్షకుని రాకను విశదపరచి, తరవాత జరిగిన విషయాన్ని చెప్పసాగాడు.


"శౌనకా! తక్షకుడు పరీక్షిత్తు వద్దకు వస్తున్నాడు. ఈలోగా పరీక్షిత్తు విధికృతం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోలేక తన సమీపస్థులకు తక్షకుడిచ్చిన ఫలాన్ని, వారు తనకివ్వగా దానిని రచూ స్తున్నంతలో, ఆ పండు లోపల నుంచి తక్షకుడు ఒక పురుగులాగా బయటికి వచ్చాడు. వచ్చిన క్షణంలో భయంకరమైన మహాసర్పంలాగా మారిపోయాడు. ఆ విషసర్పం వెంటనే పరీక్షిత్తును కఱవగానే ఆ మహారాజు, ఆ పరమ భక్తుడు - విషాగ్ని వల్ల భస్మమైపోయాడు. విపరీతమైన పరీక్షిత్తు మరణామా సి భూమ్యాకాశాల మధ్య ఉన్న సకల ప్రాణులూ హాహాకారాలు చేశాయి. ఈ విషయమంతా విన్నపరీక్షిన్మహారాజు యొక్క పుత్రుడైన జనమేజయుడు క్రోధావేశంతో సర్పప్రళయం కావాలని నిశ్చయించాడు. అంతే. వెంటనే సర్పయాగం చేశాడు. జనమేజయుని సర్పయజ్ఞంలో వేలకు వేల సర్పాలు వచ్చి హతమైపోయాయి. ఆ సమయంలో ఎన్నిసార్లు పిలిచినా తక్షకుడు వచ్చి హోమగుండంలో పడకపోయేసరికి, ఆ నాగరాజెక్కడ ఉన్నాడా అని ఋత్విక్కులు తమ తపశ్శక్తితో చూ డగా తక్షకుడు దేవేంద్రుని గృహంలో ఉండటం గ్రహించారు. ఇంద్రుని పట్టుకుని ఉన్న తక్షకుడు రావాలంటే, అతనితో పాటు ఇంద్రుడుకూడా వచ్చి హోమగుండంలో పడాలి. అప్పుడు వెంటనే "సహేంద్ర తక్షకాయానుబ్రూహి" అని ఋత్విజుడు పలుకగానే ఇంద్రుడు తానున్న చోటునుంచి కదలి తక్షకునితో కూడి వచ్చి హోమగుండంలో పడబోయాడు. ఆ మంత్ర మహిమను ఆపటం ఎవరితరమూ కాదు. ఆ సమయంలో ఆంగీరసుడు అనే ముని వచ్చి జనమేజయుని అనేక విధాలుగా ప్రస్తుతించాడు.


తరవాత జనమేజయుమా సి ఆంగిరసుడు - "రాజా! భూమిలో జీవించే జీవకోటికి జనన మరణాలనేవి సహజాలు. దొంగలవల్ల, అగ్ని దహించివేయటం వల్ల, పాముకాటుల వల్ల, ఆకలిదప్పుల వల్ల మరణాన్ని పొందే మానవుడు పూర్వం తాను చేసిన పాపకర్మల కారణంగా రక రకాల కష్టాలతో వేదన చెందుతూ ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తాడు. అనుభవించక తప్పదు కూడా. కాబట్టి జనమేజయ మహారాజా! నా యీ ఒక్క మాటా విను. క్రోధాన్ని వదలిపెట్టు. శాంతచిత్తుడివి కావలసినది. ఎందుకంటావేమో? ఇప్పటికే వేలకు వేల పాములు వచ్చి నీ యజ్ఞకుండంలో పడి హతమైనాయి. ఇంతటితో నీ ఆవేశాన్ని దిగమ్రింగి యజ్ఞం చేయటం ఆపివేస్తే, అది నీకూ, ఈ సర్పజాతికీ మంచిది. నీచ సర్పాలు ఎలాగో మృతి చెందాయి. దివ్యసర్పాలను ఆహుతి కాకుండా చేస్తే లోకానికి ఎంతో మంచి చేకూర్చినవాడివవుతావు" అని హితవు పలుకగానే జనమేజయుడు తన గురువైన ఆంగీరసుని ఉపదేశాన్ని శిరసా వహించి, సర్పయాగం చేయటం మానివేశాడు. దానితో సర్పజాతి ఊపిరి పీల్చుకుంది. జనమేజయుని ఉత్తమ గుణానికి హరించిన దేవతలా రాజవరునిపైన పుష్పవృష్టిని కురిపించారు. యజ్ఞశాలను విడిచి, జనమేజయుడుమంత్రి పురోహిత సమేతుడై రాచనగరు లోనికి ప్రవేశించాడు. త్రిగుణాలతో నిండి ఉండే ప్రవృత్తులు విష్ణుమాయ వల్ల రేపింపబడతాయి. వాటి వల్ల ఆత్మ కూడా మోహంతో కొట్టుకుపోతుంది., జనమేజయుడు అటువంటి మాయవల్ల జనించే మనోవికారాలను దూరం చేశాడు. ఇతరులను నిందించకుండా, శత్రుభావాన్ని మనసులో నుంచి తుడిచి వేశాడు. భగవంతుని పాదపద్మాలను హృదయంలో నిలుపుకొని నిత్యం భక్తియుక్తుడై, విష్ణువును కొలుస్తూ ఉన్నాడు. ఆ విధంగా వర్తించిన జనమేజయుడు తప్పక నారాయణ స్థానమైన వైకుంఠానికి చేరుకొంటాడు" అని సూతమహర్షి పరీక్షిత్తు యొక్క, జనమేజయుని యొక్క భక్తి తత్పరతను, వారి హరిపద నివాసాన్ని వివరించి చెప్పగా విని శౌనకాది మునివరులందరు హర్షాతిరేకంతో పులకించి పోయారు.


వేదవ్యాస మహర్షి వేదాలను, మ్యా యవాష పదాలు, పురాణాలను లోకవ్యాపి చెందించటం


"మహరులారా! వ్యాసమహర్షికి ఆర్యులైన శిష్యులు నలుగురున్నారు. వారు పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు అనేవారు. ఆ నలుగురూ తమ గురువైన వ్యాసమహర్షి బోధించిన విధంగా నాలుగు వేదాలను లోకంలో ప్రచారం చేశారు. ఋగ్వేదాన్ని పైలమహరి, యజుర్వేదాన్ని వైశంపాయనుడు, సామవేదాన్ని జైమిని, అధర్వణవేదాన్ని సుమంతుడు లోకంలో ప్రవర్తిల్ల చేశారు" అని సూతమహర్షి చెప్పగానే శౌనకముని "ఏ క్రమంలో పైల జైమిన్యాదులు ఆ వేదాలను లోకంలో ప్రవర్తిల్లచేశారో చెప్పవలసిందని కోరగా వారి శ్రద్ధాసక్తులకు మెచ్చి సూతుడు మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు.


"మునులారా! తొలు దొల బ్రహ్మదేవుడి హృదయంలో నుంచి ఒక నాదం ఉద్భవించింది. ఆ నాదం మనోవృత్తిని నిరోధించటం వల్ల రూపం దాల్చి కనిపించింది. ఆ నాదాన్ని ఉపాసించటం వల్ల యోగివరులు పాపవిముక్తులై ముక్తిని పొందుతారు. ఆ నాదంలో 'ఓం' కారం జనించింది. ఆ ఓంకారమే మంత్రాలకన్నిటికీ మూలమై, ఉపనిషత్తులకు కూడా మూలమై "వేదమాత"గా ప్రఖ్యాతి చెందింది. ఓంకారం - త్రిగుణాత్మకం. త్రివర్ణాలైన 'అ' కార, 'ఉ' కార, 'మ'కారాల సమ్మేళనంతో, గుణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. భగవంతుడైన బ్రహ్మదేవుడు ఓంకారం నుంచి అచ్చులు, స్పర్శములు, అంతస్త్రాలు, ఊష్మాలు, మొదలైన ఉచ్చారణ యుక్తమైన లక్షణాలతో ఉన్న అక్షరాలను కల్పించాడు. ఆ అక్షరాల సహాయంతో బ్రహ్మ తన నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలను ఉత్పన్నం చేశాడు. బ్రహ్మ ఆ వేదాలను బ్రహ్మవాదులయిన తన పుత్రులకు ఉపదేశించాడు. బ్రహ్మపుత్రులు తాము అభ్యసించిన వేదాలను అదే క్రమంలో తమ శిష్యపరంపరకు ప్రబోధించారు. ఆ విధంగానే ప్రతియుగంలోను గురువుల నుంచి శిష్యులకు, వారినుంచి అవ్వారి శిష్యులకు వేదాలు ఉపదేశింపబడుతూనే వచ్చాయి. అలా మహరులందరు వేదాలను సమగ్రంగా అభ్యసించారు. అటువంటి వేదాలను కొంతమంది సమగ్రంగా పఠించడానికి అశక్తులయ్యారు. పఠించలేనివారికి సహాయార్థం ద్వాపరయుగం మొదట్లో విష్ణుమూర్తి పరాశర మహర్షికి సత్యవతీదేవి యందు పుత్రుడిగా ఉద్భవించాడు. పరాశర పుత్రుడే వ్యాసభగవానుడు. వేదాలన్నీ ఒక రాశిగా ఉన్నందుచేత వ్యాసమహర్షి వాటిని ఒక క్రమపద్ధతిలో విభజించి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదముగా ఏర్పరచాడు. పైలమహర్షికి ఋగ్వేదము, వైశంపాయనునికి యజుర్వేదము, జైమినికి సామవేదము, సుమంతునికి అధర్వణవేదాన్ని బోధించి ఆయా వేదాలకు వ్యాసముని లోకవ్యాప్తి కలిగించాడు.


పైల మహర్షి పఠించిన ఋగ్వేదంలో అసంఖ్యాకమైన ఋక్కులు చేరి ఉన్నాయి. అందుచేత ఋగ్వేదం "బహ్వృచశాఖ" అని పేరు పొందింది. తాను నేర్చిన ఋగ్వేదాన్ని పైలుడు ఇంద్ర ప్రమితికి, బాష్కలునికి ఉపదేశించాడు. బాష్కలుడనేవాడు ఆ వేదాన్ని నాలుగు విధాలుగా విభజించి, ఆ నాల్గింటినీ తన శిష్యులైన బోధ్యుడు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు, అగ్నిమిత్రుడు అనేవారికి ఉపదేశించాడు. ఇంద్రప్రమితి అనే ముని తాను నేర్చిన సంహితన "మాండూకేయు"నికి బోధించాడు. మాండూకేయుడు దేవమిత్రుడనే శిష్యునికి చెప్పాడు. దేవమిత్రుడికి సౌభరి మొదలైన శిష్యులు తమ గురువు బోధించిన సంహితలోని విషయాలను, విశేషాలను లోకవ్యాప్తి చెందించారు. సౌభరి కుమారుడైన "శాకల్యుడు" తాను అభ్యసించిన శాఖను ఐదు విధాలుగా విభజించి తన శిష్యులకు క్రమంగా ఉపదేశించాడు. వాత్స్యుడు, మొదల్యుడు, శాలీయుడు, గోముఖుడు, శిశిరుడు - అనేవారే శాకల్యుని ఐదుగురు శిష్యులు. ఆ అయిదుగురు జాతుకర్ణి అనేవానికి సంహితార్థాన్ని బోధించారు. జాతుకరి తానెరిగిన విషయాలనన్నిటిని - బలాకునికి, పైంగునికి, వైతాళునికి, విరజునికి ఉపదేశించాడు. అంతేకాదు. బాష్కలుని పుత్రుడైన బాష్పలి - వాలఖిల్యమనే పేరుగల సంహితను బాలాయని, గార్డ్యుడు, కాసారుడు అనే శిష్యులకు ఉపదేశించాడు. -


శౌనకాది మహరులారా! ఈ విధంగా "బహ్వృచ" సంహితలు అనేక పద్ధతులలో ఇంద్రప్రమతి, బాష్కలాది బ్రహ్మచారుల చేత లోకప్రశస్తి పొందాయి.


యజుర్వేదాన్ని స్వీకరించిన వైశంపాయన మహరి యొక్క శిష్యబృందము సకల యజ్ఞాలు నిర్వహించటంలో ఆధ్వర్యువులుగా ప్రకాశించారు. యాజ్ఞవల్క్యుడు వైశంపాయనునికి కూడా శిష్యుడే. యాజ్ఞవల్క్యుడు గురువైన వైశంపాయనునిపట్ల అపరాధం చేసి గురువుకోపానికి గురైనాడు. క్రుద్దుడైన వైశంపాయనుడు తానుపదేశించి ఇచ్చిన వేదాలను మరల తనకిచ్చి పొమ్మనమని ఆదేశించటంతో యాజ్ఞవల్క్యుడు గురువు నుంచి తాను చదివిన యజుర్గణాన్ని తనకు చెప్పబడిన క్రమంలోనే బయటకు క్రక్కివేశాడు. ఆ యజుర్గణాలు రక్తంతో కలిసి బయటకు రావడంతో - ఆ యజుర్మంత్రగణాల అధిష్టాన దేవతలు తిత్తిరి పక్షుల రూపంలో వచ్చి వాటిని భుజించారు. ఆ కారణం చేత ఆ యజర్వేద శాఖలు తైత్తిరీయ శాఖలుగా చెప్పబడ్డాయి. తాను నేర్చిన విద్య తనకు దక్కకపోవడంతో యాజ్ఞవల్క్యుడు అమితమైన వేదనకు గురైనాడు. ఆవేదనను పోగొట్టుకోవటానికి తపస్సు చేయటానికి పూనుకొన్నాడు. యాజ్ఞవల్క్యుని ఉగ్రమైన తపస్సుకు సూర్యభగవానుడు సంతోషించి అశ్వరూపంలో అతనికి ప్రత్యక్షమైనాడు. ఆవిధంగా సూర్యదేవుడు ప్రత్యక్షమై యాజ్ఞవల్క్యుడికి యజుర్గణాన్ని ఉపదేశించాడు. హయరూపంలో వచ్చి భాస్కరుడు ఉపదేశించిన కారణంగా ఆ యజుర్గణం - 'వాజసనేయ' శాఖగా పిలువబడింది. అప్పటినుంచి ఆ యజుర్గణాన్ని - ఆ శాఖను - కాణ్వుడు, మాధ్యందినుడు మొదలైన వారంతా అభ్యసించారు. ఈవిధంగా లోకంలో యజుర్వేదం ప్రవర్తిల్లింది. 


జైమిని మహర్షి సామవేదాన్ని అధ్యయనం చేసి తన కుమారుడైన సుమంతునికి ఉపదేశించాడు. సుమంతుడు తన సుతుడైన సుకర్ముడికి తెలియజెప్పాడు. సుకర్ముడు సామవేదాన్ని వేయి శాఖలుగా విభజించి - కోసలుని కుమారుడైన హిరణ్యనాభునికి, తన పుత్రుడైన 'పౌష్పంజి' యనేవాడికి - అన్నిటినీ ఉపదేశించాడు. తరవాత హిరణ్యనాభుడు, పౌష్పంజి అనే వారిద్దరూ కలిసి బ్రహ్మజ్ఞాన సంపన్నులయిన "ఆవంత్యులు", "ఉదీచ్యులు" అని చెప్పబడే అయిదు వందల మందికి ఉపదేశించారు. ఆ అయిదు వందల మందిని సామవేదంలో నిష్ణాతులుగా చేసి, లోకమందంతటా సామవేద ఘనతను వ్యాపింపచేసి తరించారు.


అధర్వవేత్త అయిన సుమంతుడు అధర్వవేద విషయ పరిజ్ఞానాన్ని తన శిష్యులకు బోధించాడు. తరవాత సుమంతుని శిష్యుడు అధర్వణ సంహితను వేదదర్శుడు, పథ్యుడు అనే ఇద్దరి శిష్యులకు బోధించాడు. వేదదర్శుడు - శౌల్కాయని, బ్రహ్మబలి, నిర్దోషుడు, పిప్పలాయనుడు అనే శిష్యులకు తాను నేర్చిన విద్యనంతటినీ ఉపదేశించాడు. పథ్యుడు - కుముదుడు, శునకుడు, జాబాలి, బభ్రువు, అంగిరసుడు, సైంధవాయనుడు అనేవారికి ఉపదేశించి అధర్వణ వేదస్థ విషయాలను వెలుగులోకి తెచ్చాడు. శౌనకా! ఈవిధంగా అధర్వవేదం వృద్ధి చెందింది. సమస్త వేదాలు ఏ రకంగా ఉత్పన్నమయ్యాయి, మరేవిధంగా అభివృద్ధి చెందాయి అన్న విషయం సవిస్తరంగా వివరించాను.


ఇప్పుడిక పురాణాలు ఏ క్రమంలో వచ్చాయో, ఏవిధంగా ప్రచారాన్ని పొందాయో చెబుతాను. జాగ్రత్తగా వినండి. లోకంలో ప్రసిద్ధులయిన పురాణ ప్రవర్తలను ఆరుగురిగా చెబుతారు. త్రయ్యారుణి, కశ్యపుడు, సావర్ణి, అకృతణుడు, వైశంపాయనుడు, హారీతుడు - అను వారే ఆ ఆరుగురు. పురాణాల గురించి, పురాణ ప్రవర్తకుల గురించి - నా జనకుడు, వ్యాసమహర్షి శిష్యుడు అయిన రోమహర్షణుడు చెప్పగా తెలుసుకొన్నాను. పురాణం – పది లక్షణాలతో ఒప్పుతుంటుంది. కొంతమంది పురాణం - పంచ లక్షణాలతో ప్రకాశిస్తుంటుందని చెబుతుంటారు. పురాణ లక్షణాలను సమగ్రంగా తెలుసుకొన్న ఋషులు చెప్పిన పురాణాల పేర్ల వరుసను క్రమంగా చెబుతాను, విని అర్థం చేసుకోండి. పురాణాలు పద్దెనిమిది అని, అవి మహాపురాణాలుగా వ్యాప్తి లోకి వచ్చాయని ఋషుల వాక్కు. బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణుపురాణం, శివపురాణం, భాగవతం, భవిష్యోత్తర పురాణం, నారదపురాణం, మార్కండేయ పురాణం, అగ్నిపురాణం, బ్రహ్మవైవర్తపురాణం, లింగపురాణం, వరాహపురాణం, స్కాందపురాణం, వామనపురాణం, కూర్మపురాణం, మత్స్యపురాణం, బ్రహ్మాండ పురాణం, గరుడపురాణం - అనేవి ఆ పద్దెనిమిది పురాణాలు. ఈ మహాపురాణాలే కాకుండా ఉపపురాణాలు కూడా ఉన్నాయి. ఈ పురాణాలను వ్రాసినా, చదివినా, విన్నా పాపాలన్నీ పటాపంచలైపోతాయి" అని చెప్పటం ఆపాడు సూతమహర్షి. వెంటనే శౌనకాది మునులు సూతునివైచూ సి, తమ కోరికను ఆయన ముందు బయటపెట్టారు.


"మహానుభావా! సూతమహరీ! ఇంతవరకు మాకు శ్రీ మహావిష్ణువు యొక్క సద్గుణాలనన్నిటినీ వర్ణించి చెప్పావు. ఆ నారాయణుని కథలు ఎన్నో తెలియబరిచావు శ్రీ హరి మహిమలను చెవుల తుప్పు వదిలేటట్లు వర్ణించి చెప్పి మమ్మల్ని తరింపచేశావు. మాకు ఒక సందేహం ఏర్పడింది. అదేమంటే - దోషాలు చేసేవారు, పాపకృత్యాలలో మునిగిపోయేవారు అయిన దుష్టజనులు ఏవిధంగా సంసార సముద్రాన్ని దాటగలుగుతారు? ఎప్పటికి వారికి ముక్తి లభిస్తుంది? ఈ విషయాలన్నీ సుస్పష్టంగా తెలియజెప్పి మమ్మల్ని ఉద్దరించు. నీ బోధలు విని లోకులందరు పాప పంకిలం నుంచి బయట పడతారు. వాటిని వక్కాణించు మహాత్మా" అని వినయ సంపన్నులై అడుగుతున్న శౌనకాది మునులమూ సివారడిగిన దానిని చెప్పసాగాడు సూతమహరి. "శౌనకాది మహరులారా ! పూర్వయుగంలో తపస్సు చేయటం వల్ల ఋషులు సర్వ విషయాలలోను సమర్థులై ఉండేవారు. వారి మహిమలు అద్భుతంగా ఉండేవి. అందుకుగాను, మీకొక ఉదాహరణ చెబుతాను వినండి. మార్కండేయుడనే మహ శ్రీ హరిని తన మనస్సులో దృఢంగా నిల్పుకొని, ఆ పరమాత్ముని ఎప్పుడూ వదలకుండా, ఆయననే ధ్యానిస్తూ ఆనందాతిశయంతో, నిర్మలంగా బ్రదికాడు. ప్రళయ వేళలో లోకాలన్నీ జలమయమై ఉంటాయి. ఆ కల్పాంతంలో ఎక్కడ చూ సినా అంధకారమే. కన్ను పొడుచుకున్నా ఏమీ కానవచ్చేది కాదు. అటువంటి సమయంలో ఒక బాలుడు మార్కండేయుడికి దర్శనమిచ్చాడు. ఆ బాలుడు కోటి బాలసూర్యుల ప్రభలతో ప్రకాశిస్తున్నాడు. ఆ అంధకారంలో ఏకాకిగా చరిస్తున్న మార్కండేయ ముని ఆ బాలుని హృదయంలో ప్రవేశించి, అనేక వేల సంవత్సరాలు అక్కడే - బాలుని హృదయంలో సంచరించి - మళ్ళీ వటపత్రశాయిగ ఉన్న ఆ బాలచూ శాడు" అని చెప్పి సూతమహర్షి ఆగాడు. -


వెంటనే శౌనకాది మునులు సూతభూ సి - "మహాత్మా! మార్కండేయ మునికి బాలుని హృదయంలోకి ప్రవేశించగల మహిమ ఎలా లభించింది? తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. చెప్పండి" అని అడిగారు. దానికి సమాధానంగా సూతుడు మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. . (సశేషం)