శ్రీ వేంకటేశ అష్టోత్తర శతనామావళి       


 


శ్రీ వేంకటేశ అష్టోత్తర శతనామావళి                                      - డా|| కె.వి. రాఘవాచార్య


43.ఓం వామదేవ ప్రియాయ నమః


వామదేవ మహర్షికి ప్రియుడైన వేంకటేశునకు నమస్కారము. "వావదేవః ప్రియః యస్య సః" అను విగ్రహ వాక్యంతో బషబ్రీ హి సమాసముగా దీనిని పరిగణించి వామదేవుడు ఎవరికి ప్రియమైనవాడో ఆ వేంకటేశునక నమస్కారము అని ఈ నామమునకు అర్థము చెప్పవచ్చును.


వామదేవుడు వేంకటాద్రిపై నూరు సంవత్సరములు తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రత్యక్షము చేసికొని, ఆయన వలన స్వామిపుష్కరిణి మాహాత్మ్యమును వేంకటాద్రి క్షేత్ర, దైవత, తీర్థ మాహాత్మ్యములను, బ్రహ్మూత్సవ వైభవమును, మహిమను తెలుసుకొన్నాడు. వేంకటాద్రి క్షేత్ర తీర్థ మాహాత్మ్యములకు వేంకటాద్రిపై వెలసియునశ్రీ నివాసుని సాన్నిధ్యమే కారణమని గ్రహించినాడు.


మహర్షి వామదేవుడు బ్రహ్మజ్ఞాని. "శాస్త్ర దృష్ట్యా తూపదేశ్ వామదేవవత్" (1-1-31) అను బ్రహ్మసూత్రము వలన వామదేవుడు శాస్త్రము తెలిసిన వారిలో ఉత్తముడుగ గౌరవింపబడినాడని విదితమగుచున్నది. అందుచే వామదేవుడు వేంకటేశునకు (భగవంతునకు) అత్యంత ప్రియుడని గ్రహించాలి. వామదేవుని వృత్తాంతము వామన పురాణములో 43వ అధ్యాయములో తెలుపబడింది. ఈ వామదేవుడు నిమి పుత్రుడు జనకమహారాజుకు తెల్పినవేంకటాచలమాహాత్మ్యమునే తర్వాతి కాలములో శతానందుడు (గౌతమ మహర్షి పుత్రుడు) సీత తండ్రి,శ్రీ రాముని మామయగు జనక మహారాజుకు తెలిపినాడు. వామదేవుని వలన వినిన నిమి పుత్రుడు జనకుడు వేంకటాచలమునకు తీర్థయాత్రగా వచ్చి, వేంకటేశుని సేవించి కృతార్థుడైనట్లే శతానందుని వలన వేంకటాద్రి మహిమగ్రహించి మనోరథ సిద్ధిని పొందినాడు. కాని వాల్మీకి రామాయణములో జనకుని వేంకటాచల తీర్థయాత్ర వర్ణింపబడలేదు.శ్రీ రామ దశరథ, జనకుల వృత్తాంతములకు వాల్మీకి రామాయణమే ప్రమాణము. తదితర పురాణములు కావు గదా!


44. ఓం జనకేష్ట ప్రదాయ నమః సీత తండ్రి జనక మహారాజునకు మనోరథములను అనుగ్రహించిన వేంకటేశునకు నమస్కారము. a సీత తండ్రి, మిథిలాధిపతియైన జనక మహారాజు తన పురోహితుడగు శతానందుని వలన పూర్వము వామదేవ మహర్షి నిమి పుత్రుడగు జనక చక్రవర్తికి చెప్పిన వేంకటాచల క్షేత్ర, దైవత, తీర్థముల మాహాత్మ్యములను విని, తన్మయుడై చేస్తున్న యజ్ఞమును పూర్తిచేసి రాజ్యభారమును మంత్రులకు అప్పగించి వేంకటాచల తీర్థయాత్ర చేసినాడు. జనక మహారాజు వేంకటాద్రి చేరి, స్వామి పుష్కరిణిలో స్నానము చేసి, పవిత్రుడై వరాహస్వామిని దర్శించి, పిమ్మట ఆనంద నిలయము చేరి, వేంకటేశ అష్టాక్షరీ మంత్రమును జపించి, వక్షస్థల లక్ష్మీయుతుడైన వేంకటేశుని సేవించి, కృతార్థుడైనాడు. జనకుడు కొంతకాలము వేంకటాద్రిపై నివసించి, వేంకటేశుని పలుమార్లు సేవించి, సకలాభీష్టములను పొంది, మరల మిథిలకు వెళ్ళి, రాజ్యపాలన కొనసాగించినాడని వామన పురాణము (44-41-43 శ్లో ||) వెల్లడించింది.వామన పురాణము వామదేవుని వలన వేంకటాద్రి క్షేత్రదైవత తీర్థముల మాహాత్మ్యమును నిమి పుత్రుడగు జనక మహారాజు వినుటను వర్ణించి వామదేవుడు తెలిపిన వేంకటాద్రి వృత్తాంతమును విని ఆనందముచే వికసించిన నేత్రములు, పులకించిన శరీరము గలవాడై, చేయుచున్న యజ్ఞమును సంపూర్తి చేసి, రాజ్యభారమును మంత్రికి అప్పగించి వృషాద్రి శిఖరముననున్న పరబ్రహ్మ యగు వేంకటేశుని దర్శించుటకై నిమి పుత్రుడు, మిథిలాధిపతియైన జనక మహారాజు ప్రయాణమైనాడని తెలిపింది.


 45. ఓం మార్కండేయ మార్కండేయ మహర్షికి పుణ్యతీర్థము లన్నింటియందు స్నానము చేయుటచే గలుగు విశేష పుణ్యమును అనుగ్రహించిన వేంకటేశునకు నమస్కారము. మనస్వినీ మృకండుల పుత్రుడైన భక్తమార్కండేయుడు శివుని గూర్చి తపస్సు చేసి, మృత్యుంజయుడు దీర్ఘాయుర్దాయ సంపన్నుడైనాడు. అట్టి మార్కండేయ మహర్షి -


పుణ్యక్షేత్రములకు తీర్థయాత్ర చేయుట, పుణ్యతీర్థములందు స్నానము చేయుట వలన గలుగు పుణ్యము వాని వంశము (కులము) నంతను పవిత్రము చేయునని విని ఒకనాడు సమస్త పుణ్య తీర్థములలో స్నానం చేయవలెనను సంకల్పముతో తల్లితండ్రుల అనుమతిని పొంది తీర్థయాత్రకు బయలుదేరినాడు. మార్కండేయ మహర్షి కాశీకి వెళ్ళి గంగానదిలో స్నానము చేయు సమయమున గరుత్మంతుని దర్శించినాడు. గరుడునితో మార్కండేయుడు మాట్లాడుతూ తనకు గల సమస్త పుణ్య తీర్థములలో స్నానం చేసి పుణ్యమును సంపాదించవలెనను కోరికను వెళ్ళడించినాడు. అంతట గరుడుడు అతని కోరిక అసాధ్యమని చెప్పి, వేంకటాద్రితో సమానమైన పుణ్యక్షేత్రము గాని, స్వామిపుష్కరిణితో సమానమగు పుష్కరిణి గాని లేదు. కనుక నీవు వేంకటాద్రి పుణ్యక్షేత్రమును దర్శించి, స్వామి పుష్కరిణిలో స్నానము చేయుమని ఆ పుష్కరిణిలో స్నానము చేయదగిన కాలమును చెప్పినాడు.


సౌరమాన ధనుర్మాసమున శుక్లపక్షమున ద్వాదశి తిథినాడు అరుణోదయ కాలమున సకల తీర్థములు వచ్చి స్వామి పుష్కరిణిలో చేరును. ఆ సమయమున స్వామిపుష్కరిణిలో స్నానము చేసిన సమస్త పాపములు తొలగిపోవును. అశేష పుణ్యము చేకూరునని చెప్పి, గరుడుడు నీ కోరిక యగు సమస్త పుణ్య తీర్థములలో స్నానము చేసిన గలుగు పుణ్యము లభించునని మార్కండేయుని కోరిక నెరవేరు సులభోపాయమును చెప్పినాడు. అంతట మార్కండేయ మహర్షి వేంకటాచలమునకు తీర్థయాత్రగా వచ్చి కపిల తీర్థములో స్నానము చేసి, కొండను ఎక్కి, స్వామి పుష్కరిణిలో స్నానము చేసి, పవిత్రుడై ముందు వరాహ స్వామిని దర్శించి, పిమ్మట వేంకటేశుని దర్శించి ఇట్లు స్తుతించినాడు -


వేంకటేశా! నాకు నీవు తప్ప వేరొక ప్రభువు లేడు. నిన్నే ఎల్లప్పుడు స్మరిస్తుంటాను (శరణాగతి శ్రీ హరియైనవేంకటేశా! నన్ను అనుగ్రహింపుము. నేను కోరిన వరమును ప్రసాదించుము (19). ఓ వేంకటేశా! నీ పాద పద్మములకు నమస్కరించు కోరికతో చాలా దూరము నుండి వచ్చి నిన్ను సేవించుచున్నాను. ఈ ఒక్కసారి సేవించుట చేతనే ప్రతి దినము నిన్ను సేవించిన గలుగు ఫలము అనుగ్రహించుము (20 శ్రీ హరీ! శేషాచలపతీ! అజ్ఞానముచే నేను చేసిన దోషములన్నింటిని నశింపచేయుము. దోషకారియైన నన్ను క్షమింపుము (21). , పై మూడు శ్లోకములను వేంకటేశ సుప్రభాత కర్తయగు ప్రతివాది భయంకర అణ్ణన్ స్వామి తను రచించిన వేంకటేశ నివసించి, చాంద్రమాన మార్గశీర్ష (సౌరమాన ధనుర్మాసమున) శుక్లపక్షమున ద్వాదశినాడు అరుణోదయ వేళలో స్వామి పుష్కరిణిలో మూడు పర్యాయములు స్నానము చేసి సమస్త పుణ్యతీర్థములలో స్నానము చేసిన ఫలమును పొందినాడు. అంతట ఒకనాడు మార్కండేయునందు] తుడై వేంకటేశుడు ప్రత్యక్షమై, వరము కోరుకొనుమనగా మార్కండేయుడు -


                     జనార్ధనా! నా అభీష్టము ఇంకేమి కలదు? వేంకటేశ్వరా! నాకు ఎల్లప్పుడును నీయందే తలంపు ఉండునట్లు నన్ను కరుణింపుము. భక్తుల యందు వాత్సల్యము గలవాడా! నీకు నమస్కారమని పలికినాడు. అంత వేంకటేశ్వరుడు అట్లే యగునని మార్కండేయునకు వరమొసంగినాడు. ఇట్లు మార్కండేయుడు పర్వతిథియందు స్వామి పుష్కరిణిలో స్నానములు చేసి వేంకటేశ్వరుని అనుగ్రహమును, సమస్త పుణ్యతీర్థములలో స్నానము చేసిన గలుగు పుణ్యమును పొంది కృతారుడైనాడు. స్వామిపుష్కరిణిలో తొమ్మిది పుణ్యతీర్థములు ఉన్నాయి. తూర్పు దిక్కున ఆయువును వృద్ధిచేయు మార్కండేయ తీర్థము, ఆగ్నేయములో పాపహరమైన ఆగ్నేయ తీర్థం, దక్షిణ దిక్కున నరకాన్ని నివారించే యామ్య తీర్థము, పశ్చిమ, వాయువ్య దిశలలో మోక్షప్రదములగు వరుణ, వాయు తీర్థములు, ఉత్తర దిక్కున సంపదల నొసంగు ధనద తీర్థం, ఈశాన్యమున ఇహ పర సాధకమైన గాలవ తీర్థము, మధ్యభాగములో మహా పాతక నాశకమగు సరస్వతీ తీర్థములు ఉన్నాయి. ఈ తొమ్మిది తీర్థములతో కూడిన స్వామి పుష్కరిణి యొక్క స్నాన పానాది సేవనం మానవులకు సర్వ పురుషార్థ సాధకమని బ్రహ్మ పద్మ పురాణములు వెల్లడిస్తున్నాయి. "మార్కండేయం తథా తీర్థం స్నానా దాయుష్య వర్ధనమ్" మార్కండేయ తీర్థమున స్నానము చేయుట ఆయుష్య వర్ధనమని బ్రహ్మపురాణం ప్రశంసించింది.