శ్రీ  కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి లీలామృతము

శ్రీ  కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి లీలామృతము                                             గంగారపు విజయరమణ


కోరిన వారికెల్ల కోరికలను తీర్చిన కల్పతరువు శ్రీ కర్మ ఘాట్ ఆంజనేయస్వామి. క్రీ.శ.1143 సం||లో కాకతీయ రాజులచే నిర్మించబడిశ్రీ కర్మ ఘాట్ ధ్యానాంజనేయస్వామి మరియు విఘ్నేశ్వర శ్రీ స్ఫటిక లింగేశ్వరశ్రీ రామాలయ, శ్రీ విశ్వనాథశ్రీ సంతోషిమాతశ్రీ దుర్గామాత, నవగ్రహశ్రీ జగన్నాథ మరియు వేణుగోపాలస్వామి మరియు శ్రీ సరస్వతి ఆలయముల సముదాయమును దర్శించుకోవచ్చును. చారిత్రాత్మక నేపథ్యమును కలిగి అతి పురాతన ప్రాశస్తం కలిగి భక్తజనులు కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షమై రంగు రంగుల పూలతోటల ఉద్యానవనమై, నలువైపుల ప్రాకార, విమాన గోపుర నిర్మాణములతో, చిత్ర విచిత్రాలతో దేదీప్యమానమైన వివిధ విద్యుత్ కళాకాంతులతో ప్రసిద్ధమై దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లుచున్నశ్రీ ధ్యానాంజనేయస్వామి వారిని కనులారా వీక్షించి దర్శించిన జన్మపావనము అవుతుంది. శ్రీ కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి ఆలయము హైదరాబాద్లోని సరూర్‌నగర్ మండలము, రంగారెడ్డి జిల్లాలో ఉందిశ్రీ స్వామివారి చరిత్ర విన్నా, కన్నా బ్రతుకు పావనమవుతుంది. అభయకరమైనశ్రీ ధ్యానాంజనేయస్వామి ఆలయ చరిత్ర మనకు ఒక విశేషదాయకము. ఆలయ చరిత్ర : క్రీ.శ 1143 సం||లో గోల్కొండ దుర్గమును నిర్మించిన కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడు తన సైన్యముతో వేటకై బయలుదేరి అప్పటి "చల్చిం" అనుపేరు (ఇప్పటి హైదరాబాద్) సమీపంలో అరణ్యప్రాంతమైన లక్ష్మిగూడెము అను గ్రామమునకు సమీపములో ఉన్న (కర్మన్‌ఘాట్ గ్రామము) అరణ్య ప్రాంతమునకు వచ్చినవాడై ఆ రాజు వేటాడి అలసి విశ్రమించెను. ఆ సమయములో రాజు విశ్రమించిన స్థలమునకు కొద్ది దూరములో ఒక పులి అరుపు వినిపించెను. ఆ రాజు పులిని వేటాడే తలంపుతో ధైర్యముతో ఒంటరిగా ఆ ధ్వని వచ్చిన దిశగా వెళ్ళెను. ఎంత దూరము వెళ్ళినను ధ్వని తప్ప పులి మాత్రము కనిపించలేదు. అటు పిమ్మట కొంతసేపటికి చెట్ల గుబురు నుంశ్రీ రాంశ్రీ రాం అనే శబ్దము విన్నవాడై ఆ రాజు నిర్మలమైన మనస్సుతో ఆ గుబురులో ఉన్న ఆకులను తొలగించూ డగా పద్మాసనము వేసుకొని ధ్యానముద్రలో నుండి దివ్యమైన తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగుచున్న శ్రీ రామభక్తుడు శ్రీ ధ్యానాంజనేయస్వామి శిలాప్రతిమను గాంచెను. ఇక ఆ రాజు స్వామివారిని భక్తితో పూజించి తన దుర్గమునకు వెడలెను. అదేరాత్రి రాజు గారికి స్వప్నములో మారుతి కనిపించి తనకొక ఆశ్రమమును నిర్మించమని ఆదేశించెను. ప్రతాపరుద్రుడు నిద్ర నుండి లేచి ఆ స్వామికి భక్తితో ప్రణమిల్లి, స్వామి ఆజ్ఞానుసారముగా చేసెదనని తెలిపెను. ఇక ఆ రాజు ఉదయముననే లేచి తన సపరివారముతో వెడలి నిత్యమశ్రీ స్వామివారికి పూజలు జరుగునట్లు ఏర్పాటు చేసెను.ప్రతాపరుద్రుని తరువాత ఎందరో రాజుత్రీ స్వామివారి అభీష్టానుసారము ఇష్ట దైవములైన గణపతి శ్రీ రామ, శివ, వేణుగోపాల, జగన్నాథ మరియు అమ్మవారి ఆలయములను నిర్మించిరి. ఆలయములో పూజ నిర్వహణకు భక్తులు చుట్టు ప్రక్కల ఉన్న భూములను స్వామివారికి అర్పించిరి.


అటు పిమ్మట 17వ శతాబ్దములో ఔరంగజేబు గోల్కొండ దుర్గమును వశపరచుకొని మతోన్మాదముతో ఈ దేవాలయమును ధ్వంసము చేయుటకు తన సైన్యమును పంపెను. కాని స్వామివారి మహిమచే దేవాలయ సరిహద్దులను కూడా చేరలేకపోయెను. అంతట ఔరంగజేబు తానే స్వయంగా ఆలయమును ధ్వంసము చేయుటకు రాగా సింహద్వారాము చేరుకోగానే చెవులు చిల్లుపడేటట్లు శబ్దము వినిపించెను. అంతేకాక గర్భగుడిలో నుండి "హే రాజన్ మందిర్ తోడ హైతో పహలే తుమ్ కరోమనఘట్" (ఓరాజా! నా ఆలయమును ధ్వంసము చేయదలచినచో ముందుగా నీ మనస్సును గట్టి పరచుకొనుము) అన్న పలుకులు విన్నవాడై ఆ రాజు, హే భగవాన్ నీలో సత్యముంటే నీ సత్యాన్ని నాకూ పించు (హే భగవాన్ తుమ్ సచ్ హైతో తుమారా సచ్చాయి బతావ్) అనినంతనే తాటిచెట్టు ప్రమాణములో స్వామివారి రూపము కనిపించెను. అప్పటినుండి ఆ ప్రాంతమునకు "కర్మన్‌ఘాట్" అనే పేరు ప్రసిద్ధి గాంచింది. అప్పటినుండి స్వామివారు నిత్యము ధూప దీప నైవేద్యములతో పూజలు అందుకొనుచు భక్తుల మనోభీష్టములను నెరవేర్చుచున్నాడు.


సంతాన ప్రాప్తి : "అపుత్రస్య గతిర్నాస్తి" అనెడి మాటల ప్రకారము పుత్రులు లేనివారికి గతులు ఉండవు. సంతానము లేనివారు "ధ్యానాంజనేయస్వామిని" భక్తిశ్రద్ధలతో దర్శించి నలభై రోజులు పూజలు చేసిన వారికి నిష్ఠ గలిగిన వారికి స్వామి దయతో సంతానాన్ని ప్రసాదిస్తాడు. ఇది అదృష్టముగా భావించి సంతానము లేనివారు స్వామిని సేవించి వంశమును నిలుపుకుంటారు. దీర్ఘవ్యాధి నివారణ : రోగగ్రస్తులు వైద్య విద్యకు లొంగని జబ్బులకు శ్రీ స్వామివారి సన్నిధిని చేరి అనునిత్యము ధ్యానము చేస్తారు. 40 రోజులు పూజలు చేసి దీర్ఘరోగముల బారినుండి బయటపడతారు.


దీర్ఘవ్యాధుల నుండి విముక్తిని పొందినవారు వారి శక్తి కొలది భక్తితో స్వామికి కానుకలను సమర్పించుకొంటారు. మరికొందరు ఆలయము యొక్క అభివృద్ధి పనులను చేపడతారు. పండుగలలో ప్రత్యేక పూజలను నిర్వహించుట : ఉగాది, శ్రీ రామనవమి, శ్రీ హనుమాన్ జయంతి, నాగపంచమి, కార్తీక పౌర్ణమి, వినాయక చవితి, మహాశివరాత్రి రోజులలో ఇక్కడ ప్రత్యేక పూజలు, దేవతలకు అర్చన, సహస్ర నామార్చన, సిందూర అభిషేకము, రుద్రాభిషేకము, నవగ్రహపూజలు, శ్రీ సత్యనారాయణస్వామి వారి వ్రతములు ఘనముగా జరుపబడును. ఇక వాహన పూజలు కూడా జరుపబడును. స్వామివారి గర్భగుడిలో ఆకుపూజ, సిందూర అభిషేకము, అర్చన, సహస్రార్చన, వెండి, తమలపాకుల పూజ, ముడుపు, సువర్ణ పుష్పార్చనలు జరుపబడతాయి. మండలపూజ ఒక ప్రత్యేకమైన విశేషము. కార్తీక పౌర్ణమి సందర్భంగా సుప్రభాతము, ధ్యానాంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకము, స్వామివారికి హారతి, మంత్రపుష్పము, తీర్థ ప్రసాదాల వితరణ, స్వామివారికి అష్టోత్తరములు అర్చనలు, ఆకుపూజలు, ఆకాశ దీపారాధన, పల్లకి సేవ, ఊరేగింపు వంటివి జరుగుతాయి. ఇక్కడ భక్తుల విరాళాలతో గో పోషణ నిర్వహింపబడును. శ్రీ రావశ్రీ రామ అనే పిలుపు ఎంతో శుభకరము. ఎక్కశ్రీ రామ నామముంటుందో అక్కడ ఆంజనేయస్వామి కొలువై ఉంటాడు. శ్రీ రామ నామస్మరణము చేసినవారికి ఆంజనేయస్వామి తోడై వుంటాడుశ్రీ రాముని పట్టాభిషేక అనంతరము హనుమ చేసిన సహాయానికి, భక్తికి మెచ్చి సీతాదేవి తన మెడలో ఉన్న ముత్యాల మాలను మారుతికి ఆప్యాయంగా ఇచ్చింది. హనుమంతుడు ఆ ముత్యాలను వింతనూ స్తూ ఒక్కొక్క ముత్యాన్ని త్రుంచి వేయసాగాడు. ఆ చర్యను సభలో అందరూ వింతనూ సి ఇది ఏమిటని అడుగగా, నా రాముడు ఇందులో లేడు అనగా మయా పుము రాముడు ఎందులో కలడని సభికులు అడగగా, శ్రీ రామ్ అని తన వక్షస్థలాన్ని రెండుగా చీల్చాడు. అతని వక్షస్థలంలో దేదీప్యంగా శ్రీ సీతారాములు దివ్యంగా వెలిగిపోతున్నారు. ఆరూ సి సభికులందరూ హనుమంతుని భక్తికి మెచ్చుకున్నారు. చేతులెత్తి యొక్కసాగారు. సిరికన్న హరి గొప్ప అనే భావముహనుమ వ్యక్తము చేశాడు. చిరంజీవి అయిన హనుమంతుడు భక్తసులభుడు. స్వామివారి అండదండలు ఎల్లవేళలా మనపై ప్రసరించాలి. హనుమంతుని తోడు, నీడ ఆయన భక్తులపై నిండుగా ఉండాలి.


సత్రములుశ్రీ స్వామివారి దర్శనమునకు వచ్చు యాత్రికుల సౌకర్యం కోసం ఆలయమున అన్నదాన వసతి మొదలగునవి ఏర్పాట్లు చేయబడుచున్నవి. అందుబాటులో హోటల్స్ మరియు లాడ్జి సౌకర్యములు కలవు. ప్రతి శని, మంగళ వారాలలో ఈ దేవస్థానమందు అన్నదాన కార్యక్రమము నిర్వహించబడును. భక్తులు భక్తితో అన్నదానానికి విరాళములు ఇచ్చి తమ జన్మ ధన్యము చేసుకుంటారు.