శ్రీవేంకటేశ శరణాగతి దీక్ష
గత సంచిక తరువాయి రామానుజాచార్య దివ్యాజ్ఞా వర్థతాం ! అభివర్థతాం !!
"నిన్ను ఆశ్రయించిన భక్తులను విడిచి ఒక్కక్షణమైన ఉండలేన"ని ప్రతిజ్ఞ చేసి మాపైన అపారమైన మతో భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రమున దివ్యమంగళ విగ్రహ రూపముతో స్థిరముగా నిలచిశ్రీ వేంకటేశా! నీకు శరణు! స్వామీ! నీవు అపార మాసముద్రానివి. నిన్ను తలచిన చాలును. దర్శించిన చాలును. స్తుతించిన చాలును. పరమ సంతోషముతో మా పాపరాశుల నెల్ల మటు మాయము చేసిమా కోర్కెలను నెరవేర్చి మమ్ము బ్రోచుటకు సిద్ధపడెదవు.
కానీ స్వామీ! మేము క్షుద్రులము. మాంసఖండము కొరకు కాకిని నక్క స్తోత్రము చేసినట్లుగా మా వాంఛా పరితృప్తికై నిన్ను స్తోత్రము చేయు స్వార్థపరులము. కామక్రోధములతో కలుషితములైన మా మనస్సులు నిన్ను కొలుచుటలోన ఎపుడూ మోసంతో నిండినవే. వాటికి విషయ చింతనలపైనున్న శ్రద్ధ నిజముగ నీ పాదములపై లేదు. నీ కరుణకయోగ్యులమైన కపటులము మేము. - నీవు సుగుణాల ప్రోవువు. మేము దోషరాశులము. నీతో సహా ప్రపంచములోని ప్రతి వస్తువూ మా భోగానుభవము కొరకే ఉన్నదని భ్రమించి జీవించు అజ్ఞానులము. తాత్కాలిక సుఖముల వెంట పరుగులిడి యాతనా సముద్రములోన మునకలిడుచు శ్రీ యస్సునకు దారి తెలియక దుఃఖించు దీనులము మేము. రాగద్వేషముల రొచ్చునుండి మమ్ము తరింపచేసెడి వాడవు నీవని తెలిసినప్పటికీ, నీ చేయి పట్టుట ఎట్టులో తెలియక చావు పుట్టుకల ఊబిలో కూరుకున్నవారము. ఓ వేంకటేశా! ఇవి యన్నియు నీకు తెలియనివి కావు. కాని ఏమియు తెలియని వానివలె, మమ్ము తరింపచేయుటకు నీవెన్నోజన్మలెత్తితివి కదా!
మా పాపకర్మల నుండి మమ్ము పరిశుద్ధులను చేయుటకు నీవు ఎన్నియో ఉపాయములు పన్నితివి. అన్నియును విషయ లాలసులమైన మా ముందు వ్యర్థములే. అయిననూ విసుగులేని కృషీవలుడవు నీవు. - నిన్ను మించుటెట్టులో నేర్పుటకు నీ దివ్యసూరులను మానవులుగా మార్చి మాకు ఉదాహరణముగా నిలుపుచుంటివి. ఆ భక్తుల అడుగుజాడలలో నడచి నిన్ను చేరెదమను పేరాశ నీది. నాలుగడుగులు వేసి చతికిలబడు చవట బ్రతుకులు మావి. నడచుట కిష్టపడని మాకు నడత నేర్పుటకు వేంకటేశా! నీవెంత కష్టపడుచుంటివయ్యా! అర్చామూర్తివై విగ్రహరూపమున ఉలుకు పలుకు లేక నీవు నిలుచున్నది మా దోషదర్శనమునకు కాదు. మమ్మనుగ్రహించుటకు. అట్టి నినచ పి ఆరాధించుటెట్టులో మాకు నేర్పిన గురుడు రామానుజుండు. ఆ మహితాత్ముడు మతో నీ కొరకు చేసిన ఘనకైంకర్యములు మాబోటి భక్తులకు బహుస్తుతి దాయకములు.
నీ కొండ క్రింద నీ భక్తుడు తిరుమలనంబి చెంత రామాయణ రహస్యములు గ్రహించు రామనుజుని వద్దకు లక్ష్మణ హనుమ సుగ్రీవాంగద సహితముగ శ్రీ రామచంద్రమూర్తివై విగ్రహరూపమున నీవు చేరినావు. - నీవట్లు చేరగా ఆ మహానుభావుడు శ్రీ మూర్తికి సీతను జతచేసి నీ కొండపైనున్న నీ దివ్యాలయమునకు ఆ మూర్తులను చేర్చి నీకు నిత్యారాధనమును, కళ్యాణమును నియమంబుగా ఏర్పరచి మమ్ము తరింపచేసి. నీ దివ్యాలయమున ధనుర్మాసమునందు తిరుప్పావై గానమును వినిపించుటతో పాటు నీ శ్రీ కృష్ణమూర్తి స్వరూపమునకు దివ్యపర్యంక శయన భోగవిలాసమును ఆ రామానుజుండు వ్యవస్థగా ఏర్పరచె.. శ్రీ నివాసా! నీ రామకృష్ణావతార తత్త్వరహస్యంబులపై మాకఫ్రీ తి పెంచ రామానుజులను ఈ విధముగా సాధనము చేసుకుంటివి కదా. శ్రీ వేంకటేశా! నీకంటే ముందుగా నీ కొండపై చేరి జ్ఞానప్రదాత అయిన నీ వరాహమూర్తి స్వరూపమును ముందుగా మేము సేవించవలెనని నీవేర్పరచిన నియమమును రామానుజుడు ఆచారముగా గట్టిపరచె. నీ వరాహమూర్తి ఉత్సవ విగ్రహమును అవతరింపచేసి, వరాహ జయంతి యందు విశేషోత్సవము జరుపవలెనని యతిరాజు శాసనము చేసె. ఇది యంతయూ సుజ్ఞానమును మాకు అందించునీ మప్రకటనమే కదా.
శ్రీ వేంకటాచలపతీ! నీతోమాల సేవ సమయమున నీకిష్టమైన ఆళ్వార్ల దివ్య ప్రబంధ గానమును నీ అనుమతితో నియమంబుగా ఏర్పరచె రామానుజుండు. ఇన్ని నియమంబులున్నను, ఇవి అసలగు వ్యవస్థ లేకుండిన సర్వము నిష్పలంబగునను సత్యమెరిగిన రామానుజుండు నీ క్షేత్ర పాలనకు తగు వ్యవస్థను చేసెను. - నీ ద్రవ్యవమును హరించు పేరాశతో పాపకర్ములు నీ దివ్యదేశమున అపరాధములు జరుపకుండునట్లుగ, నీ దివ్యవైభవ ప్రకటనకు, ఆచార విశేష వ్యవస్థల పరిరక్షణకు తగిన వ్యక్తులను రామానుజుండు ధర్మరక్షకులుగా నియమించె. భక్తి వైరాగ్య ప్రధానుండై, నీ దివ్యదేశవాసియై, నీ సర్వ పరికర నియంతగా శఠకోప యతీంద్రుని 'జీయరు'గా రామానుజుండేర్పరచి, అతనికి సహాయకులుగా నలుగురు ఏకాంగులను నియమించె. దోషరహితంబైన నీ కైంకర్య రక్షణకు సాధనభూతుండు 'హనుమంతుడు' కనుక, హనుమ చిహ్నములతో కూడిన నీ దేవాలయపు (తాళంచెవిని) కుంచికను, ఉంగరమును, గంటను, ధ్వజమును శఠకోపయతి జీయరుకు రామానుజుండు అందజేసి. నీ దివ్యాలయమున కెదుట నిలచిన 'హనుమ మందిర' సమీపముననే 'జీయరు'కు రామానుజుండు నివాసమేర్పరచె. ఆ మఠమునందున తానారాధించిన శ్రీ రామచంద్రమూర్తులను ప్రతిష్టించి శఠకోపయతికి స్వాధీనపరిచె.. కలిదోషవశమున ఆస్తికులకుకూడ ద్రోహచింతన కలుగును. కనుక నీసంపదలకు, మర్యాదలకుహాని జరుగరాదను తలపుతో అనంతార్యుని వంటి ఉత్తములతోడి "ధర్మాచార్య పురుష" వ్యవస్థను రామానుజుండేర్పరచె.. నీ నిమిత్తమై తానేర్పరచిన ధర్మమర్యాదలు మీరకుండ, ఆలయ పాలనమును పర్యవేక్షించమని ఆ దేశపాలకుడైన యాదవరాజునకు హితమునుపదేశించె యతిరాజ మౌని. "సర్వలోక హితకరమైశ్రీ మద్రామానుజాచార్యుని దివ్యాజ్ఞ సమస్త దేశములందును, దిక్కులందును, కాలములందును అప్రతిహతముగా వర్ధిలుగాక" యని శ్రీ రామానుజుని నియమములను] తితో ఆమోదించినశ్రీ వేంకటేశా! నీకు శరణు! శరణు.
శ్రీ వేంకటేశ శరణాగతి -7
కోనేటి రాయా! కోరిన వరములనిమ్ము! శ్రీ వేంకటేశా! నీ లీలా విశేషభరిత కథా వృత్తాంతం మృత్యు సదృశమైన మా సంసార బాధలకు దివ్యామృతం. నీ గాథలను విన్నవారు, స్మరించినవారు, చదివినవారు అధిక పుణ్యరాశులతో తరిస్తారు. ఇక నిన్ను గురించి మాట్లాడుకోవడమంటే నరకాన్ని దూరం చేసుకోవడమే కదా! నీవు నమ్మినవారిభయాలను పారద్రోలినిశ్చింతనుప్రసాదించే శ్రీ మన్నారాయణుడవు. ఓశ్రీ నివాసా! ఆశ్రితపారిజాతా! నీ దివ్యపాద మహిమను ఏమని కొనియాడగలము? నీ పాదమును కడిగి బ్రహ్మ ధన్యుడయ్యాడు. నీ పాదమును తాకి గంగ పరమ పునీత అయింది. నీ పాదోదకాన్ని శిరస్సున దాల్చి పరమశివుడు లోకారాధ్యుడయ్యాడు. పావనమైన నీ పాదాన్ని తన తలపై మోసి బలి చరితార్థుడయ్యాడు. నీ పాదస్పర్శ వల్లనే కదా అహల్య పునర్జన్మను పొందింది. నీ పాదాన్ని ఆశ్రయించిన ఉద్దవుని వంటి భక్తులెందరో ముక్తి లాభాన్ని పొందగలిగారు. నిజానికి ఈ విశ్వరాశి యంతయు నీ పాదధూళియే కదా. అయినను ఒక్కమాట. మేము సామాన్యులము కాము. పైవారితో మాకు సామ్యమ్ము లేదు. సౌమనస్యమునకు దూరమై, దురహంకారముతో నిలువెల్ల విషము నిండిన కాళియుని సంతతి వారము మేము. నీ దివ్యపాద మర్ధనమే మా విర్రవీగుడుకు విరుగుడు. స్వామీ! అందుకే కోరుచున్నాము నీ పాదస్పర్శను. అనుగ్రహించి మా తలలపైన నీ పాదముద్రను రక్షగా నిలుపుము.
నీ భక్తప్రియత్వము లోకవిదితము. అది ప్రకటించుటకు నీవు ఎన్ని లీలలను నెరపుచుంటివి? "ఓయీ! నీవు వేంకటేశునికి ప్రియభక్తునివా? ఆ స్వామినీతో మాటాడి పాచికలాడునా? నీవంతటి గొప్పవాడవైన బండెడు చెరకును ఈ రాత్రికి తిని నీ భక్తిని నిరూపించుమరూ తమని గేలి చేసి నీ భక్తుడు బావాజీని నిర్బంధించిన వారికి బుద్ధి చెప్పుటకశ్రీ వేంకటేశా! నీవు గజేంద్రుడవైతివి. "విధవరాలవు. ఏ దిక్కూలేని అనాథవు. నీకీ కోవెలతో పనిలేదు. నిత్యకళ్యాణ మూర్తి అయినశ్రీ నివాసునకు నీవంటి అయోగ్యురాలు హారతి పట్టుట తగదు" అని నీ మహాభక్తురాలు వేంగమాంబను నీ మందిరము నుండి తరిమిన వారికి నీవు నేర్పిన గుణపాఠము బహువిచిత్రము. మాడ వీధులయందు ఊరేగించుచున్న నీ దివ్యరథమును వేంగమాంబ ఇంటి ముంగిట కదలనీయక నిలిపి, నీ భక్తురాలిని ఈసడించినవారి తప్పు తెలియునట్లుగా ఆమెపై నీ అనుగ్రహమును బహిరంగపరచితివి. అమ్మ అలమేల్మంగతో అన్నమయ్యకు నీ కమ్మని ప్రసాదములను తినిపించి, అతనిని నీ వైభవ ప్రకటనము చేయు ఆస్థాన గాయకునిగా కట్టిపడవేసితివి.. ఇటుల ఎన్నియో విధముల నీ భక్తులతో శ్రీ నివాసా! సయ్యాటలాడితివి. మరి మాకెన్నడో కదా ఆ అదృష్టము? మా సుకృతములు పండునంతలో నిన్ను మరువక నీకు సేవలందించు భాగ్యమ్ము మాకిమ్ము.
ఓ వేంకటేశా! కోరిన వరములనెల్ల కూరిమిగ సమకూర్చు భక్తవరదుడవు నీవు. కాని లాభమేమి? ఏది అడుగుటయో తెలియక, ఏదేదియో అడిగి అవి పొందియు దుఃఖ నాశనములనే చివరకు మిగుల్చుకొను దౌర్భాగ్యులము మేము. శ్రీ నివాసా! కోరుట తెలియునని తమ తెలివికి గర్వించి, కోరిన వరములు పొంది కొఱగాని బ్రతుకులతో వ్యర్థులైన వారి వరుసలో మమ్ముంచబోకు. వారి గడబిడలు మాకేల! బాలలము మేము. మమ్మేలు నాథుడవు నీవు. పోషకుడవు. రక్షకుడవు నీవె. మాకేది ఉచితమో, దేనికి మేము తగుదమో దానిని ఇచ్చి మమ్ము బ్రోచువాడవు నీవు. ఇన్ని తెలిసియూ నిన్ను కోరుచున్నాము కొన్ని కోరికలు. కాదనక, లేదనక కనికరించుము మమ్ము. ఓ వేంకటరమ! నీ కింకరులమై వాడవాడలా నీ దివ్యలీలలను చాటు శక్తి మాకిమ్ము. భోక్తవు, కర్తవు, కర్మవు నీవేయన్న స్ఫురణనిచ్చి, మేము నీ చేతి పరికరముగ మారెడు భక్తినిమ్ము. నీ క్షేత్ర మర్యాదల నతిక్రమించి ప్రవర్తించు మందభాగ్యుల నరికట్టి మంచి మార్గమున నడుపు తేజస్సు మాకిమ్ము. లక్ష్మన్న, హనుమన్న, గరుడన్న, ఆదిశేషన్న, అంబరీషుడు, ప్రహ్లాదుడు - వీరు వారని పేరులేల నీ సేవకై నిరీక్షించెడి నిత్యసూరుల బాటలో మమ్ము నడిపి, వారికిచ్చిన భత్యమేదో అదియే మాకిచ్చిన చాలును. - ఆరని విషయ భోగముల చిచ్చులో ఎన్నియో జన్మలను దగ్గము చేయుచుండియు తనివి తీరక అవే ఆశల తీర్చమని మరల మరల నిన్ను కోరె మందభాగ్యుల సరస చేరకుండెడి విరక్తి వరముగా మాకిమ్ము చాలను. - నిన్ను మరచిన క్షణమునందె మా చేతన మచేతనముగా మారు వరము నిమ్ము. మాకదే చాలును. నీ ఉనికిని తెలుపునట్టి, నీ మను పంచునట్టి గట్టి ఉదాహరణమ్ముగా మేము బ్రతికెడు వరమునిమ్ము. మాకదే చాలును. అంతటా వ్యాపించిన నీ దివ్యతత్త్వమును అనుభవించెడి మంచి మనస్సును మాకందజేయుము. నిఖిల జగమునకు నీ దాసులుగ సేవలందించు సౌభాగ్యమిమ్ము మాకదియే చాలు.
ఓం నమో వేంకటేశాయ!
శ్రీమతే రామానుజాయ నమః
ప్రశ్న: ఇకముందు మేం జీవితం ఎలా గడపాలి? సంక్షేపంగా మాకొక తరుణోపాయం చెప్పండి అని కోరిన శిష్యులకు భగవద్రామానుజులవారు అనుగ్రహించిన ఉపదేశం ఏమిటి?
జవాబు : శ్రీ భాష్యాన్ని పెద్దల వద్ద సేవించి శిష్యులకు చెప్పండి. 2. అది సాధ్యం కాకపోతే ఆళ్వార్ల దివ్య ప్రబంధాన్ని వ్యాఖ్యానంతో సేవించి శిష్యులకు విశదీకరించండి. 3. అదీ కుదరకపోతే ఏదైనా దేవాలయంలో మీకు చేతనైన కైంకర్యం చేయండి. 4. అదీ చేయలేకపోతే యాదవాద్రిలో – అదే మన మేల్కోటలో ఒక ఇల్లు కట్టుకుని అక్కడ నిత్య నివాసం చేయండి. 5.అదీ చేయలేకపోతే ద్వయమంత్రాన్ని అర్థానుసంధానంతో సేవించండి. 6. అదీ చేతకాకపోతే 'వీడు నావాడు' అని ఓవైష్ణవోత్తముడు అనుకొనేటట్లు ప్రవర్తించండి. చేరగలిగితే ఇవేవైన చేయండి - చేయలేకపోతే మానండి. అంతేగాని భాగవతాపచారం మాత్రం ఎన్నడూ చేయకండి.