ధన్వంతరీ స్వరూపి శ్రీ వీరరాఘవ స్వామి


శ్రీ వీరరాఘవ స్వామి -- ఇలపావులూరి వేంకటేశ్వర్లు


ప్రాంతంలో తొండై మండలంగా చరిత్రలో పేరొందిన నేటి చెన్నై లయాలలో తిరు వీరరాఘవ స్వామి ఆలయం ఒకటి. ఆదిశేషుని మీద స్వామి శయన భంగిమలో కొలువుతీరిన ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ, మార్కండేయ పురాణాలతో పాటు అనేక తమిళ గ్రంథాలలో పేర్కొనబడింది. | కృతయుగంలోని సంతానం లేని ముని దంపతులు నియమ నిష్టలతో సంవత్సరం పాటు "శాలి యజ్ఞం" చేసి పరమాత్మ అనుగ్రహంతో ఒక కుమారుని పొందారట. యజ్ఞఫలంగా జన్మించిన ఆ బాలునికి "శాలిహోత్రుడు" అని నామకరణం చేసి చిన్నతనం నుండి ఆచార వ్యవహారాలతో, భగవద్భక్తిలో కావలసిన విషయజ్ఞానం కల్గించారట. పెద్దవాడైన శాలిహోత్రుడు తపమాచరించడానికి తగిన స్థలాన్వేషణలో దీక్షారణ్యం కడప చేరుకొని అక్కడి ప్రకృతి రమణీయతకు, ప్రశాంతతకు పస్సు చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఆ సరస్సును "హృదయ తాప నాశనీ తీర్థం" అంటారు. దానిలో స్నానం చేసినవారి జన్మ జన్మల పాపాలను హరిస్తుందని అంటారు. వసిష్ఠ, వామదేవ, వ్యాస మహర్షులు ఇక్కడ తపమాచరించినట్లుగా చెబుతారు. మధు కైటభులనే రాక్షసులనుశ్రీ మహావిష్ణువు సంహరించిందిక్కడే అంటారు. శివుని ఆహ్వానించకుండా యజ్ఞాన్ని తలపెట్టి, పిలవకుండా వచ్చినదని కుమార్తె సతీదేవిని అవమానించి, ఆమె అగ్నిలో దూకి ఆత్మత్యాగం చేయడానికి కారణమైనవాడు దక్ష ప్రజాపతి. అతనిని సంహరించిన వీరభద్రునికి సంక్రమించిన బ్రహ్మహత్యా దోషం ఈ తీర్థంలో స్నానమాచరించిన తరువాత తొలగిపోయినట్లుగా, దానికి సాక్ష్యంగా ఇక్కడి వీరభద్ర ఆలయాన్ని, ఆయన చూపుతారు.



| ఇంతటి ప్రశస్తి కలిగిన క్షేత్రంలో తపస్సును కూడా చేయదలచినాడు శాలిహోత్రుడు. సంవత్సరమంతా చేసి ఒక్కరోజున భోజనం చేసి తిరిగి తపస్సు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్రకారం మొదటి గడిచిపోయింది. ధాన్యం సేకరించి వండి దానిని భాగాలుగా చేశాడు. ఒకటి అతిథికి, రెండు మూడోది పశుపక్ష్యాదులకు, నాలుగోది తనకు అతిథి కోసం నిరీక్షించగా ఒక వృద్దబ్రాహ్మణుడు పెట్టుకొన్న భాగాన్ని ఆయనకిచ్చాడు. దానిని తీరలేదు అనగా, మిగిలిన మూడుభాగాలనుకూడా స్వీకరించి, ఆశీర్వదించి ఎలావచ్చినవాడు అలాగే ఆ వృద్ధుడు. అతిథి భగవంతునితో సమానంసంతృప్తిపరచగలిగానని తిరిగి తన తపస్సు కొనసాగించాడుశాలిహోత్రుడు. రెండో సంవత్సరం, మూడో సంవత్సరం మొదటిసారి జరిగినట్లే జరిగింది. మూడవసారి తీసుకొన్న తరువాత తాను అలసిపోయాననితీసుకోవడానికి స్థలం ఏది? (నాన్ వశిప్పా తారిక్కు ఉళ్ ఎవుల్) అని అడిగాడట ఆవృద్దుడు. దానికి శాలిహోత్రుడు తన కుటీరామా పాడు.


| కొంత తడవు తర్వాత కుటీరం లోనికి వెళ్ళిన ఆదిశేషుని మీద శయనించిన సర్వలోక శ్రీ మన్నారాయణుడు దర్శనమిచ్చాడట. శాలిహోత్రుడు ఎన్నోవిధాలుగా ప్రస్తుతించి అక్కడే కొలువుతీరమని స్వామి అంగీకరించాడు. వృద్ధుని రూపంలో అడిగిన "ఎవుల్" అన్న దానికి గౌరవ సూచకమైన "తిరువళ్ళూరు" (తిరు+ఎవుల్+ఊరు) గా పిలవబడసాగింది| ఎన్నో గాథలు ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని, గొప్పదనాన్ని స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుత ఆలయాన్ని రాజులు నిర్మించారు. తరువాత చోళులు, విజయనగర రాజులు తమవంతు సహకారం ఆలయాభివృద్ధికి అందించారు అని లభించిన శాసనాల ద్వారా నగరం మధ్యలో సువిశాల ప్రాంగణంలో ఆలయాలతో, ప్రతి నిత్యం విచ్చేసే భక్తులతో ఉంటుందీ ఆలయం.


| పూజా సామగ్రి అమ్మేదుకాణాల మధ్యనుండి వెళితే వస్తుందిమూడంతస్తుల రాజగోపురం.ప్రవేశద్వారం గుండా లోనికి వెళితే ఎన్నోమండపాలు, గోపురానికున్న ఉపాలయాలు ఉంటాయి. ప్రదక్షిణా మార్గంలో మొదటగా వచ్చేది అమ్మవారుశ్రీ కమలవల్లి తాయారు సన్నిధి. తరువాత వరసగా సూక్ష్మ చెక్కడాలతో సుందరంగా ఉండే ఊంజల్ రుక్మిణీ సత్యభామ సమేతశ్రీ కృష్ణ వేదాంత రామానుజాచార్యుల సన్నిధులుంటాయి..


విష్ణు సహస్ర నామాలలో "భీషజం భిషక్" అన్న నామానికి శరీరాన్ని శుద్ధిచేసి అన్ని అనారోగ్యాలను నివారించి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించేవాడు అని అర్థం. ఈ నామం కారణంగానోమరో కారణంగానో వీరరాఘవ స్వామిని శతాబ్దాలుగా వీర రాఘవునిగా భావిస్తారు భక్తులు. నమ్మిశరణు కోరినవారిని కాపాడేవాడు వీరరాఘవుడు అన్న నమ్మకంతో ప్రతి నిత్యం ఎందరో వస్తుంటారు. తమ ఆరోగ్యం కొరకు ఉప్పు మిరియాలను పైన స్వామి పాదాలున్న మండపంలో భక్తిప్రపత్తులతోసంపూర్ణ విశ్వాసంతో వదిలి పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు. ప్రదక్షిణ పూర్తి చేసుకుని ముఖమండపం గుండా అర్ధమండపం చేరితో గర్భాలయంలో ఆదిశేషువు పడగల ఛాయలో దక్షిణం వైపుకు తల, ఉత్తరం వైపుకు పాదాలు ఉంచి శిరస్సు వద్ద ఉన్న శాలిహోత్ర మహర్షిని ఆశీర్వదిస్తున్నట్లుగాఎడమ చేతితో నాభినుండి ఉద్భవించిన కమలంలో ఆసీనుడైన బ్రహ్మకు ఉపదేశం చేస్తున్నట్లుగా దివ్య మంగళంగా రమ్యమైన అలంకరణతో దర్శనమిస్తాడు శ్రీ వీరరాఘవ స్వామిగర్బాలయం వెనుకశ్రీ నారసింహ మరియశ్రీ చక్రత్తాళ్వార్ సన్నిధులు ఉండడం విశేషం. తిరుమలై చై ఆళ్వార్ మరియు తీరు మంగై ఆళ్వాశ్రీ వీరరాఘవ స్వామిని కీర్తిస్తూ పన్నెండు పాశురాలను గానం చేశారు.


| అన్ని పర్వదినాలలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక్కడ. ఈ దివ్యదేశం చెన్నై అరక్కోణం రైలు మార్గంలో ఉన్నది. అన్ని లోకల్ రైళ్ళు, కొన్ని దూరప్రాంత రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. స్టేషన్ నుండి ఆలయం మూడు కిలోమీటర్ల దూరం. ప్రస్తుతం జిల్లా కేంద్రం అయిన ఇక్కడ అన్ని వసతులు లభిస్తాయి. || జై మన్నారాయణ ||