ఊర్వశిపురూరవులు


దగ్గరలో ఉన్న నర నారాయణాశ్రమానికి చేరారు. శివుడు పార్వతీదేవిని ఎంతగానో సముదాయించి ఆమెను ఓదార్చాడు. శంకరుడు ఆవేశంతో ఈరోజు నుండి ఏ పురుషుడైనా ఈ ఉద్యానవనంలోకి అడుగుపెడితే తక్షణం స్త్రీగా మారిపోవు గాక! అని శపించాడు. అప్పటినుండి తెలిసినవారెవరు ఆ వనంలోకి అడుగుపెట్టరు. సుద్యుమ్నునికి ఈ విషయం తెలియక ఆ ఉద్యానవనంలోకి వెళ్ళి అనుచరులతో సహా తనూ స్త్రీ రూపాన్ని ధరించి తిరగసాగారు. స్త్రీగా మారిపోయిన సుద్యుమ్నుడు ఆ వనం వీడి తన అనుచరులతో ఇవతలకు వచ్చి ఆ అరణ్యంలోనే ఉండిపోయాడు. రాజ్యానికి వెళ్ళడానికి మనసు ఒప్పక అలా అరణ్యంలోనే సంచరించసాగాడు. అతడు ఇళ అనే నామధేయంతో పరివారం చెలికత్తెలుగా సేవలు అందిస్తూ ఉంటే కాలక్షేపం చేయసాగాడు. ఇలా ఉండగా ఒక రోజు చంద్రుని కుమారుడు బుధుడు అడవికి వేటకు వచ్చాడు. ఇళ సౌందర్యానికి ముగుడై ఆమెను మోహించాడు. హావభావాలు ఆకర్షించాయి. ఇళ కూడా స్పందించడంతో ఇరువురూగాంధర్వవిధిని వివాహముచేసుకొని ఆనందంగా విహరించసాగారు. వారి దాంపత్య చిహ్నంగా వారికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి పురూరవుడు అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగారు. కొంతకాలం తరువాత బుధుడు వెళ్ళిపోవడంతో ఇళకు గతం గుర్తుకు వచ్చి దుఃఖం ముంచుకువచ్చింది. తన బ్రతుకు ఇలా తయారైనందుకు చింతిస్తూ కులగురువైన వసిష్ఠుని ప్రార్థించాడు. ఆయన వచ్చి సుద్యుమ్నుమా సి జాలిపడి, శంకరుని ప్రార్థించాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై తన శాపానికి తిరుగులేదు కాబట్టి పూర్తిగా స్త్రీత్వాన్ని తొలగించడం సాధ్యం కాదు కానీ మధ్యే మార్గంలో అతను కొన్నాళ్ళు పురుషుడిగా మారేటట్లు వరమిస్తానని చెప్పి, సుద్యుమ్నుడు ఇకనుంచి ఒక నెలరోజుల పాటు పురుషునిగా, మరొక నెల రోజుల పాటు స్త్రీగా ఉండేటట్లు వరమిచ్చి రాజుని అనుగ్రహించాడు.


శివానుగ్రహానికి సుద్యుమ్నుడు పొంగిపోయి, పురుషునిగా మారి రాజ్యానికి వెళ్ళాడు. వసిష్ఠుని అనుగ్రహంతో మరల రాజ్యపాలనసాగించాడు.స్త్రీరూపాన్ని పొందిన నెలరోజులు రాజు బయటకు రాకుండా ఎవరికంట పడకుండా అంతఃపురంలోనే కాలక్షేపం చేస్తూ రాజ్యపాలన సాగించేవాడు. ఇది ప్రజలకు నచ్చలేదు. అయినా అలాగే సహనం వహించారు. పురూరవుడు యవ్వనంలోకి అడుగు పెట్టాడు. వెంటనే సుద్యుమ్నుడు అతనికి రాజ్యమప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు. నారదుడు ఉపదేశించిన నవాక్షర మంత్రాన్ని జపిస్తూ తీవ్రంగా తపస్సు చేసి జగన్మాత అనుగ్రహం పొంది దివ్య లోకాలకు వెళ్ళిపోయాడు. పురూరవుడు సహజంగా చాలా అందగాడు. గుణవంతుడు కూడా. ప్రతిష్టానం రాజధానిగా చేసుకుని వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతూ సమర్థవంతమైన రాజ్యపాలన చేస్తూ ప్రజల మన్ననలను పొందాడు. పరాక్రమశాలిగా ముల్లోకాలలోనూ పేరు ప్రఖ్యాతులు గడించాడు. పురూరవుని కీర్తి ప్రతిష్ఠలను తెలుసుకున్న ఊర్వశి రాజుపై ముచ్చటపడింది. బ్రహ్మదేవుని శాపం కారణంగా భూలోకంలో నివసిస్తున్న ఊర్వశి పురూరవుని మోహించి వరించింది. రాజు కూడా ఊర్వశి రూప లావణ్యాలకు మోహితుడయ్యాడు. ఊర్వశి వారి వివాహానికి మూడు షరతులు విధించి వాటికి అంగీకరిస్తేనే వివాహము చేసుకుంటానని చెప్పడంతో రాజు విధిలేక అంగీకరించాడు. 1.నేను నెయ్యి మాత్రమే భక్షిస్తాను. 2.సంభోగ సమయంలో తప్ప నువ్వు నాకెప్పుడూ దిగంబరంగా కనిపించకూడదు. 3. నాకు రెండు పెంపుడు పొట్టేలు పిల్లలు ఉన్నాయి. వాటిని మతో నువ్వు సంరక్షించాలి. అవి అంటే నాకు ప్రాణం. వీటికి నువ్వు అంగీకరిస్తే వివాహం చేసుకుంటానని ఊర్వశి అనడంతో రాజు అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. . పురూరవుడు ఊర్వశి మోజులో పడి రాజధర్మ యజ్ఞ కర్మలనన్నిటిని మరచాడు. పూర్తిగా ఊర్వశికి వివశుడైపోయాడు. ఈ సృష్టిలో ఊర్వశి తప్ప అతనికి ఇంకేదీ కనిపించడం లేదు. అలా కొన్నేళ్ళు గడిచిపోయాయి. ఉన్నట్టుంది. ఒకరోజున దేవేంద్రునికి ఊర్వశి గుర్తుకు వచ్చింది. ఆమె లేని స్వర్గం బోసిపోయినట్లు అనిపించింది. ఊర్వశిని రప్పించడానికి మార్గం అన్వేషించి, గంధర్వులను పిలిపించి ఆమె పెంచుతున్న పొట్టేలు పిల్లలను అపహరిస్తే పురూరవుడు షరతులను మరచి బయటకు వస్తాడని, ఊర్వశి ఆగ్రహించి రాజుని విడిచిపెట్టి వస్తుందని చెప్పడంతో గంధర్వులు కార్యరంగానికి దిగారు. ఒకరోజు రాత్రి గంధర్వులు వెళ్ళి పిల్లలను అపహరించారు. అవి బెదిరి అరవడంతో ఊర్వశి ఉలిక్కిపడి పురూరవుని వెళ్ళూ డమంది. ఆ కారుచీకట్లో పురూరవుడు నగ్నంగానే బయటకు వెళ్ళాడు. అంతలో ఊర్వశి బయటకు వచ్చింది. గంధర్వులు ఒక్కసారి మెరుపుకాంతి సృష్టించి మాయమయ్యారు. ఊర్వశి దిగంబరంగా ఉన్న పురూరవుని సి ఒక్కసారిగా అంతర్ధానమయింది. చక్రవర్తి పిచ్చివానిలా ఆమె కోసం దేశ దేశాలు తిరిగాడు. ఎట్టకేలకు కురుక్షేత్రంలో అతనికి ఊర్వశి కనిపించింది. ముఖం విప్పారింది. రాజు ఆమె చెంతకు చేరడూ సి, ఊర్వశి అతనికి తత్వోపదేశం చేసి స్వైరిణి అయిన స్త్రీ పై ఇంత వ్యా మోహం పనికిరాదని బుద్ది చెప్పి, తనని మరచిపోయి రాజ్యపాలన చేయమని చెప్పి దేవలోకానికి వెళ్ళిపోయింది.