మహాపురాణము


పదమూడవ అధ్యాయము


శ్రీ పరాశరుడు చెబుతున్నాడు - సత్త్వతునకు, భజన, భజమాన, దివ్య, అంధక, దేవావృధ, మహాభోజ, వృష్టి అని ఏడుగురు పుత్రులు. భజమానునకు నిమి, కృకణ, వృష్టులనువారు, సవతితల్లి పుత్రులు శతజిత్, సహస్రజిత్, అయుతజిత్ అనువారు ముగ్గురు. దేవవృధునకు బభ్రువని పుత్రుడు. వారిని గురించి ఒక శ్లోకమిట్లా - దూరం నుండి ఎట్లా వింటున్నామో, దగ్గరుండి అట్లాగేచూ స్తున్నాము. బభ్రువు మనుష్యులలోశ్రే షుడు. దేవా! వృధుడు దేవతలతో సమానుడు. అరువది ఆరువేల మంది పురుషులు, ఇంకా ఎనిమిది మంది బభ్రుదేవా వృధులు ఉపదేశించిన మార్గాన్ని అనుసరించి అమృతత్వాన్ని పొందారు. మహాభోజుడు అతి ధర్మాత్ముడు. ఆతని వంశంలో మృత్తికాపురంలో ఉండే భోజులు మూర్తికావరులైనారు. వృష్ఠికి సుమిత్రుడు, యుధాజిత్తు అని ఇద్దరు పుత్రులు. పిదప అనమిత్రుడు, ఆతనికి నిఘ్నుడు, ఆతనికి ప్రసేనజిత్తు, సత్రాజిత్తు అని ఇద్దరు. ఆ సత్రాజిత్తునకు సూర్యుడు మిత్రుడయ్యాడు. ఒకరోజు సత్రాజిత్తు సముద్రతీరంలో ఉండి సూర్యుని స్తుతించాడు. మనఃపూర్వకంగా స్తుతించినందువలన సూర్యుడు ఎదురుగా కనిపించాడు. అస్పష్ట రూపాన్ని ధరించిన సూర్యుమా చి సత్రాజిత్తన్నాడు. నేను నిన్ను ఆకాశంలో అగ్నిగోళంగా ఎట్లూ స్తున్నానో అట్లాగే ఎదురుగా నున్నావు. నాకేమీ మార్పు కనిపించలేదు. నిన్ను విశేషందూ డదలిచాను అనగానే సూర్యుడు తన కంఠం నుండి స్యమంతకమణిని క్రిందపెట్టి తన రూపాస్తూ పాడు. ఎర్రని నేత్రాలు, పొట్టి శరీరము, కొద్దిగా పింగళవర్ణము కలిగిన నేత్రాలు కల సూర్యుని సత్రాజిత్తూ చాడు. సత్రాజిత్తు నమస్కరించి స్తుతించాడు. సూర్యుడన్నాడు - నా వలన నీకు కావలసిన వరం కోరుకో అని. ఆ స్యమంతకమణిని సత్రాజిత్తు అడిగాడు. సూర్యుడు ఆ మణిని సత్రాజిత్తునకిచ్చి తన స్థానానికి వెళ్ళాడు. సత్రాజిత్తు కూడా నిర్మలమైన మణిరత్నాన్ని కంఠమందు ధరించి సూర్యుని వలె వెలుగుతూ దిక్కులనంతా ప్రకాశింప చేస్తూ ద్వారకకు వచ్చాడు. ద్వారకలో నున్నవారు వస్తున్న సత్రాజిత్తునచూ చి, ఆది పురుషుడైన భగవంతుని పురుషోత్తముని భూభారాన్ని తగ్గించటానికి అంశగా మనుష్య రూపంగా అవతరించిన కృష్ణునికి నమస్కరించి అన్నారు. భగవాన్! నినూ డటానికి సూర్యుడు వస్తున్నాడని. కృష్ణుడన్నాడు - ఆతడు సూర్యుడు కాడు సత్రాజిత్తు అని. ఆతడు సూర్యుడిచ్చిన స్యమంతకమణిని ధరించి వస్తున్నాడు. జాగ్రత్తనూ డండి అని. వాళ్ళట్లాడూ శారు. సత్రాజిత్తు స్యమంతకమణిని తన ఇంటిలో ఉంచాడు. ఆ మణి ప్రతిరోజు ఎనిమిది బారువుల (కొలమానం) బంగారాన్ని ఇస్తున్నది. దాని ప్రభావం వల్ల రాష్ట్రానికంతా ఉత్పాతములు, అనావృష్టి, సర్పముల వల్ల, అగ్నివల్ల, దుర్భిక్షాదుల వల్ల కలిగే భయం లేదు (అవన్నీ లేవు). కృష్ణుడు ఈ దివ్యరత్నము రాజైన ఉగ్రసేనునకు యోగ్యమని ఆశపడ్డాడు. కాని తమ వంశంలో విభేదాలొస్తాయని భావించి సమర్థుడైనా కృష్ణుడు ఆ హారాన్ని సత్రాజిత్తు నుండి తీసుకోలేదు. సత్రాజిత్తు కూడా కృష్ణుడు ఈ మణిని ఇమ్మని అడుగుతాడని ఎంచి, మణి మీది ఆశతో దానిని ప్రసేనజిత్తుకిచ్చాడు. వాడు ఆ మణి శుచిగా ఉంచితేనే సమస్త బంగారాన్ని ఇస్తుంది, లేకున్న ధరించినవానినే చంపుతుంది అని తెలియక, ఆ ప్రసేనజిత్తు ఆ కంఠమందున్న స్యమంతకమణితోనే గుర్రముపై ఎక్కి అడవికి వేటకై వెళ్ళాడు. అక్కడ సింహం ప్రసేనుని చంపింది. గుర్రాన్ని కూడా చంపి ఆ రత్నాన్ని నోటితో పట్టుకొని బయలుదేరగా, జాంబవంతుడూ చి ఆతడు ఈ సింహాన్ని చంపాడు. ఆతడు ఆ మణిరత్నాన్ని తన గుహలోకి తీసుకునివెళ్ళి, సుకుమారుడనే పిల్లవాడికి ఆటవస్తువుగా ఇచ్చాడు. ప్రసేనుడు తిరిగి రాకపోగా, కృష్ణుడు రత్నానికి ఆశపడినాడు. బహుశా ఆతడే ఈ రత్నాన్ని తీసుకున్నాడని యాదవులంతా అనుకున్నారు. కృష్ణుడు ఈ అపవాదాన్ని విని యదుసైన్యాన్ని తీసుకుని ప్రసేనుడు వెళ్ళిన గుర్రము జాడగా బయలుదేరాడు. దారిలో చనిపోయిన ప్రసేనుణ్ణి, గుర్రాన్ని, కొంతదూరంలో సింహాసన చాడు. ఆపైన ఎలుగుబంటు (జాంబవంతుడు) అడుగుజాడల ననుసరించి వెళ్ళాడు. కొండ దగ్గర ఆ సైన్యాన్ని ఉంచి, జాంబవంతుని అడుగుజాడలు గమనిస్తూ వెళ్ళి గుహలోకి ప్రవేశించాడు. లోనికి వెళ్ళి సుకుమారుని లాలించే ధాత్రి మాట విన్నాడు. సింహము ప్రసేనజిత్తుని చంపింది. ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సుకుమారకా! ఏడవకు. ఈ స్యమంతకము నీదే, అని విని కృష్ణుడు స్యమంతకం జాడ తెలిసి లోపలికి చేరి సుకుమారకునకు ఆటబొమ్మగా చేయబడ్డ ధాత్రి చేతిలో మెరిసిపోతున్న స్యమంతకమణిమా చాడు. స్యమంతకం కావాలూ స్తున్న కొత్త పురుషడూ చి ధాత్రి, రక్షించండి, రక్షించండి అని అరిచింది. ఆ శబ్దం వినగానే కోపంతో జాంబవంతుడు వచ్చాడు. వారిద్దరికీ ఇరువది ఒక్క రోజులు యుద్ధం జరిగినది. ఆ యదు సైనికులు ఏడెనిమిది రోజులు కృష్ణుడు వస్తాడని ఎదుమా సి, పిదప కృష్ణుడు ఈ బిలంలోనే నశించి ఉండవచ్చును. ఒకవేళ బ్రతికి ఉంటే శత్రువును జయించటానికి ఇన్ని రోజులా, అని తలచి, ద్వారకకు తిరిగివచ్చి కృష్ణడు చనిపోయాడని చెప్పారు. కృష్ణుని బంధువులు మరణం తరువాత చేసే ఉత్తర క్రియలన్నీ కృష్ణునికి చేశారు. కృష్ణుడు యుద్ధం చేస్తుండగా, ఇక్కడ చాలా శ్రద్ధతో ఇచ్చే విశిష్టమైన అన్నము నీటితో అక్కడ కృష్ణునికి బలము, ప్రాణపుష్టి జరిగింది. జాంబవంతుడు ప్రతిరోజు పిడిగుద్దులతో అవయవాలన్నీ పీడింపబడి ఆహారం లేక బలహీనుడయ్యాడు. కృష్ణుడు జయించాడు. జాంబవంతుడు నమస్కరించి కృష్ణునితో ఇట్లా అన్నాడు.   (సశేషం)