మన మహర్షులు


అగస్త్యమహరికి చిన్నతనంలో ఉపనయనం, ప్రణవ పంచాక్షరీ మంత్రోపదేశం అన్నీ దేవతలే చేశారు. ఆయన బ్రహ్మచర్యం తీసుకుని తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకసారి అడవిలో తిరుగుతూ సల్లకీ చెట్టుకి తలక్రిందులుగాబ్రీ లాడుతూ ఉన్న మునులచ సి మీరెందుకు ఇలా ఉన్నారని అడిగాడు అగస్త్యమహర్షి. ఆ మునులు అగస్త్యుయా సి నాయనా! మమ్మల్ని పితృదేవతలంటారు. నీకు పెళ్ళయి సంతానం కలిగితేనే మాకు పైలోకాలకి వెళ్ళే అర్హత వస్తుంది. నిన స్తే బ్రహ్మచర్యం వదలనంటున్నావు. మాకు పుణ్యలోకం రావాలంటే నువ్వు పెళ్ళి చేసుకోవాలి. లేకపోతే మా గతి ఇంతే అన్నారు. ఇది విని అగస్త్యుడుమరి పెళ్ళి చేసుకోవాలంటే మంచి వధువు కావాలి కదా! అందుకని తన తపోబలంతో పుత్రకాముడన్న విదర్భరాజుకి ఒక చక్కటి కుమార్తె పుట్టాలని వరం ఇచ్చాడు. ఆ అమ్మాయి పేరు లోపాముద్ర. లక్ష్మీదేవంత అందంగా, సరస్వతీ దేవికున్నంత విద్యతో సుగుణాలరాశిలా ఉంది. ఆ లోపాముద్రని అగస్త్యుడు పెళ్ళి చేసుకుని తనతో ఆశ్రమానికి తీసుకువచ్చాడు. పెళ్ళి చేసుకున్నాక కొంచెమైనా ధనం ఉండాలి కదా. అగస్త్యుడు తన తపశ్శక్తిని కోల్పోవడం ఇష్టం లేక 'శ్రుతర్వుడ'నే రాజుని అడిగాడు. ఆ రాజు దగ్గర కూడా సరిపడినంత ధనం లేదని ఇద్దరూ కలిసి 'ప్రధృశ్వుడ'నేరాజు దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గర కూడా అలాగే జరిగింది. ముగ్గురూ కలిసి 'త్రిసదన్వుడు” అనే రాజు దగ్గరికి వెళ్ళారు. ఆయనది కూడా అదే పరిస్థితి. మణిమతీ పురానికి రాజు 'ఇల్వలుడు'. ఆయనకి 'వాతాపి' అనే తమ్ముడుండేవాడు. ఇల్వలుడు తన తమ్ముడు వాతాపిని చంపి బ్రాహ్మణులకి వండి పెట్టేవాడు. తర్వాత వాతాపిని పిల్వగానే వాతాపి బ్రాహ్మణుల కడుపులోంచి బయటకు వచ్చేవాడు. ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ కలిసి బ్రాహ్మణులని చంపేసేవాళ్ళు. , అగస్త్యుడు తను కలిసిన రాజులు ముగ్గుర్నీ తీసుకుని ఇల్వలుడి ఇంటికి వెళ్ళాడు. మామూలుగానే ఇల్వలుడు వాతాపిని చంపి, వండిపెట్టి మళ్ళీ వాతాపిని పిలిచాడు. కానీ అగస్త్యుడు భోజనం కాగానే 'జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం' అన్నాడు. వాతాపి జీర్ణం అయిపోయాడు. ఇల్వలుడు ఎంత పిలిచినా వాతాపి బయటకు రాలేదు. ఉంటే కదా! రావటానికి. మీరెప్పుడయినా గమనించారా! పసిపిల్లలకి పాలు పట్టగానే 'జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం' అని పసిపిల్లల పొట్టమీద రాస్తారు. వాతాపిని కూడా అరిగించుకోగలిగినంత జీర్ణశక్తి పిల్లలికి రావాలని అలా అంటారు. అప్పటి అగస్త్యుడి మంత్రం ఇప్పటి పిల్లలికి కూడా ఉపయోగపడుతోంది. ఇల్వలుడు అగస్త్యుడికి ధనం, బంగారం, ఆవులు అన్నీ ఇచ్చి పంపించాడు. తర్వాత అగస్త్యుడికి ధృడస్యుడు అనే కొడుకు, తేజస్వి అనే మనుమడు కలిగారు. పితృదేవతలు పుణ్యలోకాలకి వెళ్ళిపోయారు. ఒకసారి బ్రహ్మదేవుడు అగస్త్యుడి ఆశ్రమానికి వచ్చాడు. అగస్త్యుడు ఎదురు వెళ్ళి తీసుకువచ్చి, ఆయనకి తగినవిధంగా సత్కారం చేసి ఆజ్ఞాపించండి స్వామీ! అన్నాడు. నీ భార్య లోపాముద్ర విష్ణుమాయ అంశన పుట్టింది. ఇప్పుడు విష్ణుమాయ కవేరరాజుకి ముక్తినివ్వడానికి ఆయన కుమార్తెగా పుట్టి ఘోర తపస్సు చేస్తోంది. ఆమెను నువ్వు పెళ్ళి చేసుకో అన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవా! నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను అని చెప్పి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు అగస్త్యుడు. పెళ్ళి కాగానే కవేరకన్య కావేరీనదిగా ప్రవహించింది. కావేరీనదిలో స్నానం చేసిన కవేరరాజుకి ముక్తి కలిగింది. వృత్రుడు అనే రాక్షసుడు ఇంద్రుణ్ణి జయించి ధర్మచరిత్ర గల మహరులందరినీ రాత్రి సమయంలో చంపి పగటిపూట సముద్రంలో దాక్కుని ఉండేవాడు. మహరులందరూ కలిసి ఆ సముద్రజలాన్ని అగస్త్యమహర్షికి దానమిచ్చారు. అగస్త్యుడు ఆ సముద్రాన్ని తన కమండలంలో పట్టి ఒక్క గుటకలో త్రాగేశాడు. - వృత్రాసురుడు బయటపడ్డాడు. దధీచి దేహాన్ని ఆయుధాలుగా చేసుకుని దేవతలు వృత్రుణ్ణి చంపేశారు. అగస్త్యమహర్షి దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా శ్రీ రాముడు అరణ్యవాసం చెయ్యడానికి వెళుతూ అగస్త్యమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఖడ్గము, విల్లు, బాణాలు, అక్షయమైన అమ్ములపొది రాముడికిచ్చి దీవించాడు అగస్త్యుడు. కొంతకాలం తర్వాత రామ రావణ యుద్ధంలో రావణ బాణాలకి రాముడు గాయపడి బాధపడుతూ ఉండగా అగస్త్యుడు రాముడిని విష్ణుమూర్తిగా గుర్తుచేసి స్తోత్రం చేసి రాముడికి ఆదిత్యహృదయం అనే మహాస్తవం ఉపదేశించాడు. మనం ఇప్పటికీ ఉదయానే చదువుకుంటున్న ఆదిత్యహృదయం అగస్త్యమహర్షి శ్రీ రాముడికి ఉపదేశించిందేనన్నమాట. పూర్వం నహుషుడనే రాజు నూరు అశ్వమేధ యాగాలు చేసి ఇంద్రపదవిని పొందాడు. కానీ ఐశ్వర్యం ఉందన్న అహంకారంతో శచీదేవిని తనతో ఉండమని అడిగాడు. శచీదేవి మునులను వాహనంగా చేసుకుని రమ్మంది. నహుషుడు శచీదేవి దగ్గరికెడుతూ మునులని రథం మొయ్యమని చెప్పాడు. పూర్వాచార్యుల మంత్రాల్నీ, బ్రాహ్మణుల్నీ నిందించటం తప్పని చెప్పిన అగస్త్యుడి తలమీద తన్నాడు నహుషుడు. నహుషుడిని క్రూర సర్పంగా మారమని శపించాడు అగస్త్యుడు. తర్వాత నహుషుడి కోరిక మీద పూర్వజ్ఞానం ఉండేలా కరుణించాడు అగస్త్యుడు. అగస్త్యుడు 'ద్వాదశ వార్షిక యజ్ఞం' చేశాడు. అంటే ఆ యజ్ఞం పన్నెండు సంవత్సరాలు జరిగింది. దానికి ఇంద్రుడు సహకరించలేదు. అప్పుడు అగస్త్యుడు తానే ఇంద్రపదవిని పొంది వర్షాలు కురిపించి నిధులు తెచ్చుకుంటాను అన్నాడు. ఇంద్రుడు భయపడి కుంభవృష్టి కురిపించాడు.


సూర్యుడు మేరుపర్వతం చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తిరగడం లేదని వింధ్యపర్వతం కోపగించి సూర్య, చంద్ర, నక్షత్రాల గమనం ఆపేసినప్పుడు అగస్త్యుడు కాశీని వదలలేక వదిలి వింధ్యపర్వతం దగ్గరకు వచ్చాడు. 'పర్వతరాజా! మా దంపతులం పెద్దవాళ్ళం. నీమీద ఎక్కడం దిగడం మాకు కష్టం. మేం తిరిగి వచ్చేవరకు నువ్వు భూమికి సమానంగా ఉండు. మేమిప్పుడు దక్షిణాపథం వెడుతున్నామని చెప్పాడు. ఈ విధంగా వింధ్యపర్వతానికి సహజంగా ఉండే పెరుగుదల కూడా లేకుండా దాని గర్వాన్ని అణిచాడు అగస్త్యుడు. తర్వాత అగస్త్యుడు భార్యతో కలిసి యాత్రలు చేస్తూ గోదావరీ తీరంలో ఉన్నపంపా సరోవరం, దండకారణ్యం, గోదావరీతీరం, కోటిపల్లి, పలివెల, భీమేశ్వరం, ద్రాక్షారామం, వీరభద్రశిఖరం మొదలైననూ సి, కొల్లాపురం చేరి అక్కడ లక్ష్మీదేవికి స్తోత్రం చేశాడు. లక్ష్మీదేవి అగస్త్యుణ్ణి ద్వాపరయుగంలో వేదవ్యాసుడవై పుట్టి వారణాసిలో ఉంటావని దీవిస్తుంది. లోపాముద్ర అగస్త్యుణ్ణి ఏయే తీర్థాలు ముక్తినిస్తాయని అడిగిం ది. బాహ్యతీరాల కంటే మానస తీరాలే ముక్తినిస్తాయి. ఎందుకంటే బాహ్య తీర్థాలలో ఎప్పుడూ ఉండే కప్పలు, తాబేళ్ళు, చేపలు, మొసళ్ళలాంటివి అన్నీ మోక్షం పొందాలి కదా! అలా జరగట్లేదేం? మానసికంగా పవిత్రంగా ఉన్నప్పుడే తీర్థాలలో మునిగిన ఫలితం ఉంటుంది అన్నాడు అగస్త్యుడు. అగస్త్యుడుశ్రీ శైలం వెళ్ళినప్పుడు ఆయనకు కుమారస్వామి దర్శనం ఇచ్చి కాశీమహత్వం గురించి తెలియజేశాడు. శిష్యసమేతుడైన వ్యాసమహర్షి కూడా కనిపించాడు. మహరులిద్దరూ కుశలప్రశ్నలు వేసుకున్నారు. వ్యాసుడు తను కాశీని వదిలి అన్నపూర్ణాదేవి ఆజ్ఞతో ఈ దణకాశీకి వచ్చిన కారణం చెప్పాడు. అగస్త్యుడు తన తపోమహిమతో వ్యాసుడికి ద్వాదశ క్షేత్రాల గురించి చెప్పి పంచతీరాలలో స్నానం చేయించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు అగస్త్యుడు ఇచ్చిన కృష్ణకవచాన్ని ధరించే ఇరవై ఒక్కసార్లు రాజుల్ని చంపగలిగాడు. అందుకు అగస్త్యుడి ప్రోత్సాహ ప్రోద్బలాలు కూడా ఉన్నాయన్నమాట. ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ అగస్త్యుడు రావడరా డలేదు. అగస్త్యుడికి కోపం వచ్చి ఏనుగువై పుట్టమని శపించాడుశ్రీ మద్బాగవతంలో గజేంద్రమోక్షంలో ఉన్న గజేంద్రుడే ఈ ఇంద్రద్యుమ్నుడు. కుబేరుడు కుశపతి చేస్తున్న సత్రయాగానికి రాక్షస బలాలతో విమానంలో వెడుతూండగా కుబేరుడి స్నేహితుడు మణిమంతుడు క్రిందకి ఉమ్మేశాడు. అది తపస్సులో ఉన్న అగస్త్యుడి మీద పడింది. అతణ్ణి అతని బలగాలని ఒకే మనిషి చేతిలో చనిపోయేట్లుగా అగస్త్యుడు శపించాడు. అదేవిధంగా వాళ్ళందరూ భీముని చేతిలో మరణించారు. కొంతకాలం అగస్త్యుడు పుష్కర తీర్థంలో కుమారస్వామికి పూజచేసి, అందిలావృతవర్షంలో ఉండగా నారాయణుడు అగస్త్యుడికి కనిపించి నీకు ఎప్పుడూ ఏ లోటూ ఉండదని చెప్పి వెళ్ళిపోయాడు. . అగస్త్యుడు రాసిన గ్రంథాలు 'అగస్త్యగీత, అగస్త్య సంహిత'. అగస్త్యమహరి ఎప్పుడూ లోకం కోసమే పాటుపడ్డాడు. ఎంతోమందికి విద్యాదానం చేశాడు. ఎంత చెప్పినా తరగని గొప్పదనం ఆయనది. ఇప్పటికీ అగస్త్యమహరి భాద్రపద మాసంలో భూలోకంలో నక్షత్రరూపంలో కనిపిస్తాడు. నక్షత్ర దర్శనం అవగానే బ్రాహ్మణులు అగస్త్యుడి బొమ్మచేసి, దానికి పూజచేసి రాత్రి జాగరణ చేస్తారు. అలా చేస్తే అగస్త్య, లోపాముద్రల అనుగ్రహం ఉంటుందని వారి నమ్మకం. . ఇదీ అగస్త్యమహర్షి దివ్యచరిత్ర. అగస్త్యుడుమహరులందరిలో గొప్పవాడు. ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతుంది. ఎప్పుడూ ఎవరికో ఒకరికి సహాయపడుతూ, ముక్తి పొందడానికి ఉపదేశాలు చేస్తూ, ఇప్పటికీ మనకి కూడా ఉపయోగపడేలా విష్ణుపూజా విధానం, ఆదిత్యహృదయం మొదలైనవి చెప్పిన గొప్ప మహర్షి.