వేంకటాచల మాహాత్యం (స్కాంద పురాణాంతర్గతం)


15. వివాహ ముహూర్త నిశ్చయం: -


వకుళాదేవి మాటలు విని రాణి ధరణీదేవి మిక్కిలి సంతుష్టురాలై ఆకాశరాజును పిలిచి, పద్మావతిని సమీపించి మంత్రుల మధ్య వకుళమాల చెప్పిన విషయాన్ని వివరించింది. అంతట ఆకాశరాజు సద్రీ తుడై పురోహితులు, మంత్రులతో “మనమ్మాయి అయోనిజ, దివ్య, మనోహరి పద్మాలయ అయిన ఆమెను వేంకటాద్రి నివాసియైనశ్రీ నివాసుడు అర్థించాడు. ఈరోజు నా మనోరథం పూర్ణమైంది. ఇది మీ అందరకు సమ్మతమేగా చెప్పండి” అని అడుగగా మంత్రులందరూ రాజుగాఁ ష్టమైన మాటలు విప్రీ తమానసులై ఆకాశరాజుతో “రాజేంద్రా! మనమంతా కృతార్థులమైనాము. ఈ సంబంధం వలన మీ వంశం సర్వోత్కృష్టమవుతుంది. అసమానురాలైన మీ కుమార్తె లక్ష్మీదేవితో కూడ ఆనందిస్తుంది. భగవంతుడు, దేవదేవుడు అయినశ్రీ నివాసునికి పద్మావతినిచ్చి వివాహం జరిపించండి. ఇది వసంత ఋతువు. ఎంతో శోభాయమానంగా ఉంది. ఆ శుభకార్యాన్ని వెంటనే జరిపించండి. బృహస్పతిని పిలిపించి వివాహానికి లగ్నం పెట్టించండి” అని చెప్పారు.


అంతట ఆకాశరాజు 'అలాగే'నని దేవలోకం నుండి బృహస్పతిని ఆహ్వానించి వధూవరులకు వివాహ లగ్నాన్ని నిర్ణయించమని అడిగాడు. కన్య జన్మనక్షత్రం 'మృగశీర్ష'. దేవదేవుని జన్మ నక్షత్రం 'శ్రవణం'. వారి వివాహ పొంతనలను విచారించండి. అనగా విని దేవగురువు 'రాజా! వీరికి ఉత్తరఫల్గుణీ నక్షత్రం చాలా అనుకూలమని, సుఖాభివృద్ధి కలిగిస్తుందని దైవజ్ఞులు చెబుతారు. కావున వైశాఖమాసంలో ఉత్తరఫల్గుణీ నక్షత్రంలో విధివిధానంగా వివాహం చేయండి' అని వివాహ ముహూర్తాన్ని నిశ్చయించారు. ఆతర్వాత బృహస్పతిని పూజించి, పంపించివకుళమాలికతో 'సుందరీ! నీవు నీ ప్రభువు నివాసానికి వెళ్ళు. వైశాఖమాసంలో శ్రీ నివాసునికి కళ్యాణాన్ని నిశ్చయించామని, కావున వివాహ సన్నాహం చేసుకొని రావలసిందని చెప్పు' అన్నాడు. ఆపైన పద్మావతికి ప్రియమైన చిలుకను దూతగా ఆమెతో కూడ పంపాడు. ఆ తరువాత రాజు ఇంద్రుడు, వాయువు మొదలైన దేవతలను ఆహ్వానించటానికి తన కుమారుడైన వసుదానుని నియోగించాడు.


ఆకాశరాజు విశ్వకర్మను పిలిచి పట్టణాన్ని అలంకరించే కార్యంలో నియోగించగా అతడు నిముషంలో నారాయణ పురాన్నంతటినీ అలంకరించాడు. ఇంద్రుడు పుష్పవృష్టి కురిపించాడు. అప్పరోగణాలు నృత్యం చేశాయి. కుబేరుడు ధనధాన్యాదులతో ఆ గృహాన్ని నింపాడు. యమధర్మరాజు భూలోకవాసుల్ని రోగరహితులుగా చేశాడు. వరుణుడు ఆ గృహాన్ని రత్నాలతోను, ముత్యాలతోను నింపాడు. దేవతలి విధంగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి, సంభారాలను సమకూర్చి వేంకటాచలానికి వెళ్ళారు.


16. శుకసందేశం :


వకుళమాలిక చిలుకతో కూడి గుఱ్ఱంపై వేంకటాచలానికి వెళ్ళి దేవాలయ సమీపాన గుఱ్ఱం దిగి చిలుకతో పాటు లోపలికి వెళ్ళింది. అక్కడ లక్ష్మీదేవితో రత్నపీఠంపై ఆసీనుడైన సుందరనేత్రాలు గతీ నివాసుని దర్శించి నమస్కరించి "ప్రభూ! నీవు చెప్పిన పని నెరవేర్చాను. మీ వివాహ వార్తను చెప్పడానికి ఈ చిలుక వచ్చింది” అని సంతోషంతో చెప్పిందిశ్రీ నివాసుడు ఆ చిలుకను అక్కడి విశేషాలు చెప్పమన్నాడు. అప్పుడా చిలుక ఆయనకు నమస్కరించి “భూపుత్రియైన పద్మావతి నిన్ను 'మాధవా! నన్నంగీకరించవా' అని అర్థిస్తున్నది. ఇంకను ఆమె 'నీ నామాలనే పలుకుతున్నాను. నీ రూపాన్నే సదా ధ్యానిస్తున్నాను. భుజాలు మొదలైన శరీరావయవాలపై నీ చిహ్నాలు ధరిస్తున్నాను. పంచ సంస్కారాలు కల నీ భక్తులనే పూజిస్తున్నాను. నేను నీ ప్రీ తి కొరకే కర్మల నాచరిస్తున్నాను. ఈ విధంగా ఎల్లప్పుడు నీ ధ్యాన పరాయణురాలవై ఉన్న నన్ను మా తండ్రిగారి అనుమతితో అనుగ్రహించి స్వీకరించు' అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నది' అని చెప్పింది. ఈ విధంగా తనకు మిక్కిలి] తికరమైన చిలుక పలికిన పలుకులు వినిఖీ నివాసుడు 'ఓ శుకరాజా! నేను పద్మావతిని వివాహం చేసుకోవటానికి దేవగణాలతో వస్తానని ఆమెకు చెప్పు' అన్నాడు. అంతట ఆ చిలుకు నివాసుని మాటలు విని ఆ దేవదేవుడిచ్చిన వనమాలికను తీసుకుని వెంటనే పద్మావతి వద్దకు వెళ్ళింది. ఆమెను సమీపించి కస్తూరీ పరిమళభరితమైన తులసిమాలను ఆమెకిచ్చి, నమస్కరించిశ్రీ నివాసుడు చెప్పిన శుభవార్తను ఆమెకు తెలియజేసింది. పద్మావతి ఆతులసిమాలను తీసుకొని శిరస్సున ధరించింది. మరలశ్రీ నివాసుని రాకకు నిరీక్షిస్తూ ఉచితమైన అలంకారాన్ని చేసుకొంది. ఇంతలో ఆకాశరాజు సంతోషంతో చంద్రుని సాదరంగా ఆహ్వానించి 'రాజా! వివిధ రసాలతో కూడిన పరమాన్నాన్ని తయారు చేయాలి. ఆ పరమాన్నాన్నిశ్రీ మన్నారాయణునికి నివేదించడానికి యోగ్యమైందిగాను, దేవతలకు, ఋషులకు, నరులకు కూడ ఇష్టమయ్యేటట్లు చేయాలి. పరిమళయుక్తమైన భక్ష్య, భోజ్య, లేహ్య, పేయ రూపాలైన చతుర్విధ అన్నాలను నీ అమృత కిరణాలతో సమకూర్చు' అని కోరాడు. ఈ విధంగా ఏర్పాట్లు చేసి మంత్రులతో కూడ సఫ్రీ తుడై పద్మావతిని అలంకరింపచేసి, భార్య ధరణీదేవితో కూడి ఆకాశరాజు శ్రీ నివాసుని శుభాగమనం కొరకు నిరీక్షిస్తున్నాడు.


1శీ నివాసునికి వివాహాలంకారాలు :


దేవదేవుడైన శ్రీ నివాసుడు తన భార్య లక్ష్మీదేవిని పిలిచి 'కళ్యాణీ! ఇపుడు వివాహానికి ఏమి చేయాలో చెప్పు. నీ సఖులను పరిణయాలంకార వస్తువులను తెమ్మని ఆజ్ఞాపించు' అన్నాడు. వెంటనేశ్రీ దేవి తన సఖులను ఆయా వస్తువులను తెమ్మని ఆజ్ఞాపించింది. అంతటప్రీ తి' అనే సఖి సుగంధ తైలాన్ని తెచ్చింది. 'శ్రుతి' పీతాంబరాన్ని తెచ్చి శ్రీ నివాసుని సన్నిధిలో నిలిచింది. 'స్మృతి ఆనందంతో మణిభూషణాలను తీసుకొని వచ్చింది. ఆ తరువాత 'ధృతి' అనే ప్రియసఖి అదాన్ని, 'కాంతి' అనే నెచ్చెలి కస్తూరిని తెచ్చారుహీ ' అనే చెలికత్తె పునుగును, 'కీర్తి' అనే సఖి బంగారు పట్టీని, రత్నకిరీటాన్ని సమర్పించారు. శచీదేవి ఛత్రాన్ని, సరస్వతి చామరాన్ని, పార్వతీదేవి మరొక చామరాన్ని, విజయ-జయ అనే సఖులు వింజామరలను తెచ్చారు. వచ్చిన వారందరి' చి లక్ష్మీదేవి వెంటనే లేచి సుగంధ తైలాన్ని తీసుకుని శ్రీ నివాసుని తలపై అలమి, పరిమళ రాలతో నలుగు పెట్టి దేవదేవుని శరీరమంతటా అలది, ఆ తరువాత ఆకాశగంగ నుండి ఏనుగులు వందల కొలది బంగారు కలశాలలో తీసుకొచ్చిన జలాలలో కర్పూరాది పరిమళ ద్రవ్యాలు వేసి ఒక్కొక్క కలశమే తీసుకొశ్రీ నివాసునికి అభ్యంగన స్నానం చేయించింది. నల్లని కురులకు సుగంధ ద్రవ్యాలతో ధూపం వేసి జుట్టు ముడివేసింది. ఆ స్వామి శరీరానికి బంగారు వర్ణంతో ఉన్న సుగంధాన్ని అలదింది. పచ్చని పట్టు వస్త్రాన్ని మొలనూలుతో నడుముకు బిగించి కిరీటాది భూషణాలతో లక్ష్మీదేవి నివాసుని అలంకరింపచేసింది. స్వామివారి అన్నివేళ్ళకు మంచి ఉంగరాలను తొడిగింది. 'ధృతి' అనే సశ్రీ నివాసునికి అద్దాన్ను పించింది. స్వావిశ్రీ నివాసుడు ఆ అద్దంటూ స్తూ ఊర్ధ్వపుండ్రాలను ధరించాడు. ఆ తరువాత శ్రీ నివాసుడు లక్ష్మీసమేతుడై గరుడ వాహనాన్నధిరోహించి బ్రహ్మ రుద్ర ఇంద్ర వరుణ యమ కుబేరాది దేవగణాలు, వసిషాది మహరులు, సనకాది యోగులు, భక్తులు, భాగవతోత్తములు సేవిస్తుండగా నారాయణపురానికి వెళ్ళాడు. అప్పుడు గంధర్వులు పాడారు. అప్సరోగణాలు నృత్యం చేశాయి. స్వామి సన్నిధానంలో దేవదుందుభులు మ్రోగాయి.మునులు స్వస్తి వాచకాలు పలుకుతూ స్వామిని అనుసరించారు. ఈ విధంగాశ్రీ నివాసుడు దేవతా గణాలతో, విష్వక్సేనాది సేనాసమూహాలతో కూడి రథంలో వకుళమాలిక మొదలైన సఖీజనులతో పరివేష్టితుడై స్వర్గలోకం వలె అలంకరిచబడిన ఆకాశరాజపురంలో ప్రవేశించాడు.


1శ్రీ పద్మావతీ పరిణయోత్సవం:


ఆకాశరాజు తమ నగరానికి శ్రీ నివాసుడు వేంచేయడం చూ చిపద్మావతిని ఐరావతంపై అధిష్టింపచేసి పురప్రదక్షిణం చేసి గోపురద్వారం వద్దకు తీసుకొని వచ్చాడు. అక్కడ వధూవరుల నిద్దరిని సమావేశపరచి బంధువులతో కూడ దేవదేవుడైన శ్రీ నివాసుని సేవించాడు. శ్రీ నివాసుడు మందస్మితంతో తన మెడలో నున్న పూలమాలను తీసి పద్మావతి భుజాలపై అలంకరించాడు. పద్మావతి కూడ మల్లెమాలనుశ్రీ నివాసుని మెడలో అలంకరింపజేసింది. ఈవిధంగా వారిరువురును మూడు పర్యాయాలు చేసి, వాహనాలు దిగి, క్షణకాలం పీటలపై కూర్చుని, ఆ తర్వాత శుభగృహంలో ప్రవేశించారు. బ్రహ్మాది దేవతలు కూడా వారితోపాటు ఆ గృహంలో ప్రవేశించారు. బ్రహ్మదేవుడు అంకురార్పణము నుండి మాంగల్య సూత్రధారణ, లాజహోమం మొదలైన వివాహ కార్యాలన్నింటిని జరిపించి, వైవాహిక కార్యాలను పరిసమాప్తి గావించి, పద్మావతీశ్రీ నివాసులను శయనింపచేశాడు. నాల్గవ రోజున చతుర్ముఖ బ్రహ్మ సర్వకార్యాలను పూర్తిచేసి, ఆకాశరాజు అనుమతి పొంది, గరుడునిపై శ్రీ దేవి, పద్మావతులతో శ్రీ హరిని అధిష్టింపజేసి, దేవతలతో పాటు బయలుదేరుటకు ఉపక్రమించారు. దివ్యదుందుభి నిరోషాలతో వృషభాచలం చేరారు. బ్రహ్మాది దేవతా గణాలు దేవాదిదేవుని స్తుతించినై. శుకాది యోగిపుంగవులు కూడా ఆ పురుషోత్తముని సేవించారు. ఈ విధంగా వారందరూస్తుతిస్తుండశ్రీ నివాసుడు శ్రీ దేవి భూదేవులతో (రమా, పద్మావతులతో) మణిమండపాన్ని ప్రవేశించి సింహాసనాన్ని అలంకరించాడు.


19. ఆకాశరాజు కానుకలు :


నూతన వధూవరులైన పద్మావతీశ్రీ నివాసుల ప్రయాణ సమయంలో ఆకాశరాజు వాపీ తికొరకు అనేక కానుకలను సమర్పించాడు. బంగారు గంగాళాలలో శాలితండులాల్ని, అనేక పాత్రలలో పెసరపప్పు, నూరు బంగారు నేతి బిందెలను, వేయి పాలకుండలను, లెక్కలేనన్ని పెరుగు భాండాలను, మామిడిఅరటి-నారికేళ ఫలాలను, ఉసిరి ఫలాలను, గుమ్మడికాయలను, పెద్ద చక్కెరకేళి పండ్లను, పనసపండ్లను, మాదీఫలాలను, చక్కెర నింపిన ఘటాలను, బంగారు ఆభరణాలను, మణులను, మాణిక్యాలను, ముత్యాలను, కోట్లకొలది పట్టు వస్త్రాలను, వేలకొలది దాసీ జనాలను, కోట్లకొలది గోవులను, లక్షల కొలది చంద్రహంసలవలె తెల్లనైన గుజ్రాలను, వందకు పైగా ఎత్తైన మదించిన ఏనుగులనశ్రీ నివాసునికి కానుకగా సమర్పించాడు. ఇంకను నాలుగు వేల మంది నాట్య గీత విశారదులైన అంతఃపుర పరిచారికలను కూడే నివాసునికి సమర్పించాడు.


20శ్రీ నివాసుని వరప్రదానం :


ఆకాశరాజు నివాసునికి ఈ కానుకలను సమర్పించి ఆయన ముందర నిలబడ్డాడు. ఉభయ దేవేరులతో కూడిశ్రీ నివాసుడు ఈ సంరంభమంటూ సి మిక్కిలి సంతుష్టుడై మామగారితో 'మహారాజా! నా వలన నీకేమి వరం కావాలో కోరుకో' అనగా విని ఆకాశరాజు 'స్వామీ! సుదృఢమైన నీ సేవాభాగ్యం నాకు లభించుగాక! నా మనస్సు నీ పాదపద్మాల యందు నిశ్చలంగా ఉండుగాక! నీయందు స్థిరభక్తి కలుగనట్లు అనుగ్రహించు' అని అడుగగాళీ నివాసుడు 'మహారాజా! నీవు కోరినట్లే కాగలదు' అని ఆయనకు వరమిచ్చి ఉచితరీతిని గౌరవించాడు. అంతటిశ్రీ హరి సంతోషంతో బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైన దేవతలను యధోచితంగా సత్కరించి, స్వర్గలోకానికి వెళ్ళడానికి అనుమతించాడు. వారందరూ తమ తమ స్థానాలకు వెళ్ళగా శ్రీ నివాసుడు లక్ష్మి, పద్మావతులతో కూడి స్వామిపుష్కరిణి తీరంలో విహరిస్తూ, కుమారస్వామి చేత పూజింపబడుతూ దివ్యాలయంలో నెలకొని ఉన్నాడు.