శ్రీ రామాయణ రత్నాకరం - రాళ్ళబండ్రీ నివాసన్ కలు 


దివ్యాస్త్రాలు


మరునాడు ఉదయం విహిత అనుషానాలు నిర్వర్తించారు. రామ శాడు మహరి. మందహాసం చేశాడు. ' రామా' అని మధురంగా అంటున్నాడు. నీ పరాక్రమానికి ఆనందించాను. సర్వ అస్తాలు నీకు స్వాధీనం చేయాలనుకున్నాను. దేవతలు, అసురులు, గంధర్వులు, నాగులు ఎవ్వరైనా సరే నీకు వశమవుతారు. వారిని జయించగలవు. నీకు భద్రమగుగాక. విశ్వామిత్రుడు తూర్పువైపు ముఖం పెట్టి కూర్చున్నాడు. రాముణ్ణి ఎదురుగా కూర్చోమన్నాడు. నలభై రెండు అస్త్రాలు, నాలుగు చక్రాలు, రెండు శక్తులు, రెండు గదలు, ఒక శూలం - అన్నీ సమంత్రపూర్వకంగా ఉపదేశించాడు. అన్నీ ప్రత్యక్షమయ్యాయి. రామునికి నమస్కరించాయి. 'మేం నీ కింకరులం. నీ ఆజ్ఞ శిరసావహిస్తాం '. రాముడు కరస్పర్శతో వాటిని స్వీకరించాడు. 'మీరందరూనా మనస్సులో ఉండండి. అవసరమైనప్పుడు స్మరిస్తాను. సాయం చేయండి' - అది రాముని వినయం.


లేచారు ముగ్గురూ.మళ్ళీ నడకసాగించారు. దారిలో 'అస్త్రాలు ఉపదేశించారు. వాటి ఉపసంహారం తెలియజేయాల'న్నాడు రాముడు. ఉపసంహార మంత్రాలు ఉపదేశించాడు బ్రహ్మరి. ఆ మంత్రాలను స్వీకరించాడు రాముడు. జపించాడు. అందరూ రాముని ముందు నిలిచారు. కొందరు దివ్యతేజస్సులతో ఉన్నారు. కొందరు అగ్నిలా ఉన్నారు. కొందరు ధూమంలా ఉన్నారు. కొందరు సూర్యచంద్రుల్లా ఉన్నారు. అందరికీ నమస్కరించాడు రాఘవుడు. “నేను పిలుస్తాను అపుడు రండి. ఇపుడు ఇష్టం వచ్చిన చోట ఉండండి” అన్నాడు. అందరూ అదృశ్యమైనారు. తను నేర్చినవి లక్ష్మణునికి ఉపదేశించాడు రాముడు. ఆమాట వాల్మీకి చెప్పలేదు. మనం ఊహించటంలో దోషం లేదు. దివ్యాస్త్రాల ప్రయోగ ఉపసంహారాలు రెండింటి ఉపదేశం పొందాడు రాముడు. బ్రహ్మాస్త్రం ఉపసంహారం అశ్వత్థామ అడగలేదు. ద్రోణుడు చెప్పనూలేదు. ఉపసంహారం చెప్పలేదు కనుక తన కొడుకు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడని తలచాడాయన. కాని దానివల్ల ఎంత అనర్థం జరిగిందో. కృష్ణుడెలా ఉత్తర గర్భం కాపాడాడో - మరో భారతం తెలియచెబుతోంది. అటు దేశభద్రత ఇటు ప్రజారక్షణ బాధ్యత ఆనాడు క్షత్రియులదే కనుక శస్తాస్త విద్యలకు వారే యోగ్యులు. అర్హులు. అందుకే వారికే నేర్పబడ్డాయి. దేశ ప్రజా రక్షణ కోసం ఆర్మీ ఇత్యాది త్రివిధ రక్షణ శాఖలు ఈనాడు పని చేస్తున్నాయి. ఆయుధాలు వారి వద్దనే ఉండాలి. కాని ఆ మారణాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. దేశైక్యత సమగ్రత పరిరక్షణ భద్రతలు కష్టతరమవుతున్నాయి ఈనాడు. అంతేకాదు ప్రపంచాన్ని వణికిస్తోంది ఉగ్రవాదం. ఏకలవ్యుడు బోయవాడు. ఒక సామాన్యుడు. క్షత్రియ పుత్రుడు కాడు. క్షత్రియ విద్య నేర్పాలన్నాడు ద్రోణుణ్ణి. ఆయన తిరస్కరించాడు. స్వయంకృషితో అసాధారణ శక్తిసంపన్నుడైనాడు. తన దివ్యాస్త్ర నైపుణ్యంతో ఒక జీవి (కుక్క)ని నిష్కారణంగా హింసించాడు. ఆదూ సి ద్రోణుడు ఆశ్చర్యపోయాడు. ప్రియశిష్యుడు అర్జునుని మించినవాడని గ్రహించాడు. అద్భుత నైపుణ్యంతో భవిష్యత్తులో ఎందరిని హతమారుస్తాడో - ఎంతటి వినాశనం సృష్టిస్తాడో - అని భయపడ్డాడు. బొటనవేలు గురుదక్షిణగా స్వీకరించాడు. ఒక సామాన్యుడు ఆర్మీవాళ్ళనడిగి - తనకు ఏ.కే 47 తదితర ఆయుధాలలో తర్ఫీదు ఇవ్వాలని అడిగితే- వారు అంగీకరిస్తారా? దానికి ఒక అర్హత యోగ్యత శిక్షణ అత్యావశ్యం కదా. అందుకే ద్రోణాచార్యుడు ఏకలవ్యుని అభ్యర్థన తిరస్కరించాడని చెప్పాలి. ఏది ఏమైనా ఏకలవ్యుని లాంటి శిష్యుడు - ద్రోణుని లాంటి గురువు న భూతో న భవిష్యతి. రామలక్ష్మణులు తమ దివ్యాస్త్ర సంపదని వ్యర్థపుచ్చలేదు. . దుష్టశిక్షణ - శిష్టరక్షణ కోసమే వినియోగించారు. తాటక - మారీచుడు – ఇంద్రజిత్తు - విద్యుజ్జిహ్వుడు ఇత్యాదులు తమ విద్యానైపుణ్యాన్ని దురుపయోగం చేశారు.


సిద్ధాశ్రమం


విశ్వామిత్రుడు చెబుతున్నాడు, రామా ఇది సిద్ధాశ్రమం. మహావిష్ణువు తపస్సు చేసింది ఇక్కడే. ఆయన సిద్ధి పొందింది. ఇక్కడే. అదితి కశ్యపులు తపస్సు చేసింది ఇక్కడే. మహావిష్ణువు వామనుడిగా అవతరించింది ఇక్కడే. ఆ స్వామి పాదస్పర్శతో పునీతమైన ప్రదేశం ఇదే. అందుకే నేను సాణ్వాశ్రమం విడిచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడే ఈ పుణ్యస్థలంలో సిద్ది పొందాలనుకున్నాను. శ్రద్ధా భక్తులతో దీక్ష స్వీకరించాను. ఈ చుట్టుప్రక్కల రాక్షస సంచారం ఉంది. వారంతా దుర్మార్తులు. విఘ్నకారకులు. ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. ఆ క్రూర కర్ములను హతమార్చాల్సిన ప్రదేశం ఇదే. ఈ సిద్ధాశ్రమం తవాహ్యేతద్యధామమ. నాది మాత్రమే కాదు నీది కూడా. III


ఆ రాత్రి గడిచింది. తెల్లవారింది. దీక్ష స్వీకరించాడు విశ్వామిత్రుడు.మహరిని పలకరించినమస్కారించాలనుకున్నారు రామలక్ష్మణులు. మహర్షి మౌనంగా ఉంటాడు. ఆరు రోజులు సావధానులై ఉండండి అని అక్కడి మునులు రాకుమారులకు చెప్పారు. ప్రశంసించారు వారిని. మునుల సూచన శిరసా వహించారు. రక్షణ బాధ్యత స్వీకరించారు. కంటిమీద కునుకు లేదు. ఐదు రోజులు ట్రే పగలూ పూర్తయ్యాయి. అది ఆరో రోజు. ఉన్నట్టుండి యజ్ఞవేది ఒక్కసారిగా భగ్గుమంది. ఆకాశంలో భయంకరమైన శబ్దం. హోమకార్యాలు సమంత్రపూర్వకంగా సాగుతున్నాయి. వేదికమీద పానపాత్రలు సుక్కులు సమిధలు అలంకరణకై పుష్పాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. నిర్మలాకాశంలో కారుమబ్బుల్లా దిగబడ్డారు మారీచ సుబాహులు. వారి వెంట పెద్ద రాక్షససేన. కుండపోతగా రక్తపువాన కురిపించారు. చూ శాడు రాముడు. యజ్ఞవేది పరిసరాలు తడిశాయి. కోపించాడు. మానవాసం ప్రయోగించాడు. అది మారీచుని రొమ్ములో దూసుకుపోయింది. నూరు యోజనాల దూరంలోని సముద్రంలో పడ్డాడు. ఆ అస్తం పరమ శక్తిమంతం. పరమ భాస్వరం.ఆ రాక్షసుడు తెలివి తప్పాడుకాని చావలేదు. ఆ అస్త్రాన్ని శీతేషువు అని కూడా పిలుస్తారు. తమ్మునితో అన్నాడు రాముడు “కఠినాత్ములు, పాపకర్ములు, యజ్ఞం ధ్వంసం చేసేవారు, రక్తం తాగేవారు, మాంసభక్షకులు వీళ్ళు. ఈ రాక్షసుల్ని చంపుతాను”. ఆ వెంటనే ఆగ్నేయాస్త్రం వేశాడు రాముడు. అది సుబాహు గుండెల్లో దిగింది. అక్కడికి అక్కడే చచ్చాడు వాడు. తర్వాత వాయువ్యాస్త్రం ప్రయోగించాడు. మిగిలిన రాక్షసులందరూ హతమైనారు. యజ్ఞం నిర్విఘ్నంగా సమాప్తమైంది. రాక్షసులను జయించిన ఇంద్రునిలా రాముడు మునుల చేత పూజలందుకున్నాడు. కృతార్దోస్మి మహాబాహో కృతం గురువచస్త్వయా సిద్ధాశ్రమ మిదం సత్యం కృతం రామ మహా యశః మహాబాహూ, మహా యశస్వీ రామా తండ్రి గారికి ఇచ్చినమాట నిలబెట్టావు. సిద్ధాశ్రమం పేరు సార్థకం చేశావు. నీ వల్ల నేను కృతార్థుడనయ్యాను - అని విశ్వామిత్రుని కృతజ్ఞతా వచనాలు. రాక్షసులందరినీ చంపావు. మారీచుణ్ణి ఎందుకు వధించలేదని అడగలేదు విశ్వామిత్రుడు. ఆయన త్రికాలవేది. తాటక అవిద్య అయితే సుబాహు సంచితకర్మ. మారీచుడు ఆగామి కర్మ. సీతాపహరణానికి మారీచునితో అవసరం ఉంది. అందుకే వదిలేశాడు రాముడు. అది గ్రహించాడు మహర్షి. శత్రుశేషంతో కష్టాలపాలయ్యాడు రాముడు. శేషం లేకుండా ఎక్కడికి అక్కడే శత్రవుల్ని హతమార్చాడు కృష్ణుడు.


సిద్ధాశ్రమం వీడటం


ఆ రాత్రి అందరూ హాయిగా నిద్రించారు. తెల్లవారింది. నిత్యకృత్యాలు ఆచరించారు. రామలక్ష్మణులు మహర్షి చెంతకు వెళ్ళారు. ఆయన అగ్నిదేవుడిలా ఉన్నాడు. అభివాదం చేశారు అన్నదమ్ములు. "మునీశ్వరా మేం మీ కింకరులం. ఇంకా ఏం చేయాలో చెప్పండి. ఆచరిస్తాం” అది రాముని వినతి. “మిథిలా నగరంలో జనక మహారాజు ఉన్నాడు. పరమ ధార్మికుడు. ఒక యజ్ఞం తలపెట్టాడు. మనం ఆ యజ్ఞం ద్దాం. పూర్వం మిథిలాధిపతి దేవరాతుడు యజ్ఞం చేశాడు. యజ్ఞఫలంగా శివధనుస్సు ఇచ్చారు. దేవతలు. అది తేజో విరాజమానమైంది. భయంకరంగా కనిపిస్తుంది. అప్పటినుండి ఆ ధనుస్సు ఆ ఇంట ఉంది. దాన్ని మీరూ డవచ్చు. మనం ఇపుడు మిథిలవైపు వెడదాం” అది విశ్వామిత్రుని సమాధానం. సిద్ధాశ్రమానికి ప్రదక్షిణం చేశారు. “ఓ వనదేవతలారా! మీకు శుభం. నేను ఇక్కడ సిద్ధి పొందాను. ఇక హిమాలయాలకి వెళ్తాను” అన్నాడు. బయలేదేరాడు. అందరూ ఆయనని అనుసరించారు. అగ్నిహోత్ర సంభారాలున్న శకటాలు ముందు వెడుతున్నాయి. ఆశ్రమంలోని మృగాలు పక్షులు మహర్షి వెంట వస్తున్నాయూ శాడాయన. ఆగాడు. వాటిని వెనక్కి పంపాడు. సకల ప్రాణి మమూర్తి ఆ బ్రహ్మరి. మృగ పక్షి సమూహానికి ఏమని ఓదార్చాలో తెలియదు. అవి ఆగిపోయాయి. - నడక సాగింది. చాలా దూరం వెళ్ళారు. శోణానదీతీరం చేరారు. సూర్యుడస్తమించాడు. స్నానాలు చేశారు. అగ్ని కార్యాలు ఆచరించారు. ఈ ప్రదేశం డముచ్చటగా ఉంది. ఎవరిది - అడిగాడు రాముడు. చెబుతున్నాడు మహర్షి.


కుశనాభుని కుమార్తెలు


కుశుడు మా వంశానికి మూలపురుషుడు. అతడు మహా తపస్వి.ధార్మికుడు.అతని భార్యవైదర్భి. ఆ దంపతులకు నలుగురు కొడుకులు.కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తజనుడు, వసువు. నలుగురికీ నాలుగు నగరాలు ఉన్నాయి. ప్రస్తుతం చిన్నకొడుకు వసురాజ్యం ఇది. కుశుని మరోభార్య ఘృతాచి. ఆమె ఒక అప్సరస. వాళ్ళకి నూరురు కుమార్తెలు పుట్టారు. అసమాన రూపవతులు. రూప యౌవనసంపన్నులు.ఒకనాడు ఉద్యానవనంలో విహరిస్తున్నారు. వీణలు వాయిస్తున్నారు. పాడుతున్నారు. ఆడుతున్నారు. వాయుదేవుడచూ శాడు. అందరినీ పెండ్లాడుతానన్నాడు. దేవకన్యలవుతారన్నాడు. యవ్వనం అక్షయమవుతుందన్నాడు. అంటున్నారు వాళ్ళు – నీ ప్రభావం తెల్సు మాకు. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటావు. మా జోలికి రాకు. నిన్నే కాదు దేవేంద్రుణ్ణి సైతం లెక్క చేయం. మిమ్మల్ని పదవీ భ్రష్టులం చేయగల శక్తి ఉంది మాకు. మేం తండ్రి చాటు బిడ్డలం. ఆయన ఎవరికిచ్చి పెండ్లి చేస్తారో వారినే భర్తగా వరిస్తాం. విన్నాడు వాయుదేవుడు. కోపం వచ్చింది. వారిలో ప్రవేశించాడు. అందరినీ గూనివాళ్ళుగా చేశాడు. భంగపడ్డారు వాళ్ళు. రాజభవనం చేరారభూ శాడు తండ్రి. విషయం తెల్సుకున్నాడు. అపరాధులను క్షమించారు. అది నిజంగా స్త్రీలకు అలంకారం. గొప్పగా ప్రవర్తించారు. క్షమ ఒక యజ్ఞం. క్షమ ఒక దానం. క్షమ ఒక సత్యం. క్షమ ఒక యశస్సు. ఈ జగత్తు క్షమ మీదే ఆధారపడింది – అలా ఓదార్చాడు కూతుళ్ళని. . బ్రహ్మదత్తుడు కాంపిల్య నగర రాజు. తన కూతుళ్ళు నూరురిని అతనికిచ్చి వివాహం చేశాడు. అతడా కన్యల చేయి పట్టుకున్నాడు. అంతే కుబత్వం పోయింది. పూర్వంలా దివ్యసుందర రూపులైనారు. తర్వాత కుశనాభుడు పుత్రకామేష్టి చేశాడు. కొంతకాలానికి కొడుకు పుట్టాడు. అతడే గాధి. అతడే నా తండ్రి. కుశనాభుని వంశంలో పుట్టాను. అందుకే నన్ను కౌశికుడన్నారు. మా అక్క సత్యవతి. కౌశికి నదిలా ప్రవహిస్తోంది. నేను ఆ నదీతీరాన ఉండేవాణ్ణి. యజ్ఞం కోసం సిద్ధాశ్రమం వచ్చాను. అలా కథలన్నీ ముగించాడు మహర్షి. రాత్రి చాలా పొద్దుపోయింది. ఆకాశం గ్రహ నక్షత్రాలతో ప్రకాశిస్తోంది. చంద్రుడు వెన్నెల కాస్తున్నాడు. అందరూ నిదురపోయారు.


గంగానది


తెల్లవారింది. అందరూ లేచారు. ప్రాతరాహ్నికాలను ముగించారు. ప్రయాణమైనారు. శోణనదిలో నీళ్ళు లోతుగా లేవు. అక్కడక్కడ ఇసుక దిబ్బలున్నాయి. నడిచిపోవచ్చు. నావతో పనిలేదు. నది దాటారు. చాలాదూరం నడిచారు. మధ్యాహ్నమైంది. మునిజన సేవితం పరమ పావనం అయిన గంగానది దర్శనమిచ్చింది. అందరిలో ఆనందం. ఆ పుణ్యనదిలో స్నానాలు చేశారు. యథాశాస్త్రంగా పితృతర్పణాలు వదిలారు. అగ్నికార్యం ఆచరించారు. అమృతం లాంటి హవిస్సు భుజించారు. అంటున్నాడు రాముడు “మహాత్మా ఈ గంగ మూడు పాయలుగా అయ్యింది. ముల్లోకాల్లో ప్రవహిస్తోంది. సముద్రుణ్ణి ఎలా చేరింది? తెల్సుకోవాలని ఉంది”. మందహాసం చేశాడు మహర్షి. చెప్పడం మొదలుపెట్టాడు. హిమాలయాల పర్వతాలకు అధిపతి. పర్వతరాజు. వెండి ఇనుము బంగారు ఇత్యాది ధాతువులున్న గనిగా హిమవంతుడు ప్రసిద్ధుడు. అతని భార్య మనోరమ. ఆ దంపతులకు ఇద్దరు పుత్రికలు. అప్రతిమాన సుందరీమణులు. పెద్దపిల్ల పేరు గంగ. చిన్నపిల్ల పేరు ఉమ (పార్వతి). ఇద్దరూ జగత్ ప్రసిద్ధులు. లోకహితం కోసం గంగను కావాలన్నారు దేవతలు. హిమవంతుడంగీకరించాడు. లోకపావని గంగాదేవిని దేవతలకు ఇచ్చాడు. రెండో కూతురు ఉమ. మహోగ్ర తపస్సు ఆచరించింది. రుద్రుడికి ఆమెనిచ్చి వివాహం చేశాడు పర్వతరాజు. అందుకే ఆమె పార్వతి అయింది. ఆమె ముల్లోకాలకు పూజ్యురాలైంది. అలా గంగాదేవి కథను సంక్షిప్తంగా చెప్పాడు మహర్షి.


పార్వతి శాపం


నీలకంఠుడు పార్వతిని వివాహమాడాడు. ఉభయులు మోహ పరవశులయ్యారు. రతిక్రీడలో పాల్గొన్నారు. అలా ఆ ఆనందంలో నూరేళ్ళు గడిపారు. శివతేజం చలించలేదు. ఆమె గర్భం దాల్చలేదు. తే చ్చ కొరతగా ఉంది. వారికి కల్లే బిడ్డడు అమేయ బలాడ్యుడైతే ఆ తేజోవంతుణ్ణి లోకం భరించగలదా - అది దేవతల సందేహం. అందరూ మహాదేవుని సమీపించారు. లోకహితం కోసం మీ తేజాన్ని మీలోనే నిలుపుకోవాలి అని కోరారు. చలిస్తున్న నా తేజాన్ని భరించేవారెవరని అడిగాడు శివదేవుడు. భూమి భరిస్తుందని వారి జవాబు. వెంటనే భూమిమీద తన తేజస్సు విడిచాడాయన. పార్వతికి పట్టరాని కోపం వచ్చింది. కన్నులు నిప్పులు చెరిగాయి. “నాకు కలిగే పుత్రుణ్ణి అడ్డుకున్నారు. ఇక మీ భార్యలకు సంతానం కలగదుపో” – అది ఆమె శాపం.. అయినా ఉమాదేవి శాంతించలేదు. పృథివిమా చింది. “వసుంధరా నీవు చౌడు నేలగా మారుతావు. అంతేకాదు రకరకాల రూపాలు పొందుతావు. నీవు బహుభార్యవు (రాజులకు భూదేవి భార్య) కాగలవు. నీకుపుత్రయోగం ఉండదు” అందామె.


కుమారస్వామి


దేవతలు ఋషులు కలిశారు. బ్రహ్మదేవుని కడకు వెళ్ళారు. ప్రణమిల్లారు. విన్నవించుకున్నారు ఇలా. "పరమశివుడు మా సేనాపతి. ఇపుడు ఆ మహానుభావుడు పార్వతితో కూడి తపస్సు చేస్తున్నాడు. కాగల కార్యం కర్తవ్యం ఆలోచించు. మాకు మీరే దిక్కు” అన్నారు. (సశేషం)