శ్రీ వారి బ్రహ్మోత్సవాలు

 కలియుగ ప్రత్యక్ష దైవశ్రీ వేంకటేశ్వరస్వామి. ప్రపన్న జన కల్పద్రుమమై అర్చామూర్తిగా ఏడు కొండలపై అలరారుతున్నాడు. వేదములలో, పురాణములలో, ఇతిహాస గ్రంథాలలో, ఆగమాలలో, శ్రీవేంకటేశ్వరస్వామి కథామృతము కొనియాడబడినది. శ్రీవేంకటేశ్వరునికి నిత్యకళ్యాణాలు తిరుమల తిరువీధులకు పచ్చతోరణాలు. స్వామి సేవలో పాలు పంచుకోవడానికి వచ్చే భక్త బృందాలతో తిరుమల అనాదిగా దేదీప్యమానమై విరాజిల్లుతున్నది. ఆ సంవత్సరం ఎన్ని ఉత్సవాలు జరిగినా శ్రీనివాసునికి జరిగే బ్రహ్మోత్సవాలు భక్తకోటికి అక్షయానంద సంధాయకమైనవి.


ఆదిజుడైన బ్రహ్మదేవుడు మొట్టమొదటిసారిగా మహర్షి, దేవగణాలతో ఈ ఉత్సవాలను నిర్వహించాడు. కనుక వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు. నవబ్రహ్మలు నవాహ్నిక దీక్షతో తొమ్మిది రోజులు నిర్వహించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలు. తిరుమల యజ్ఞవేదికపై అర్చాస్వరూపమై వెలసిన


పరబ్రహ్మము జరిపించుకునే ఉత్సవాలు కనుక ఇవి బ్రహ్మోత్సవాలు. కలియుగ ప్రత్యక్ష దైవమై ఆవిర్భవించిన స్వామివారికి జరిగే 450 పైగా ఉత్సవాలలో అతి పెద్ద సంరంభంతో నిర్వర్తించబడేవి కనుక ఈ మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు. - చారిత్రకంగా పరిశీలిస్తే శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి 58కి పైగా శాసనాలు లభిస్తున్నాయి. క్రీ.శ. 966 సం|| సమావై అనే పల్లవరాణి శాసనం నుండి క్రీ.శ. 160శ్రీ బొక్కసం కృష్ణయ్యన్ శాసనాల వరకూ మరియు ఇతర చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే బ్రహ్మోత్సవాల రోజుల సంఖ్యలోనూవాహన క్రమంలోనూ వైవిధ్యాలు గోచరిస్తాయి. అంకురార్పణం ఆదిమధ్యాంతరహితుడు,దేవతాకోటిపరిరక్షకుడైశ్రీ నివాస స్వామివారి సర్వసైన్యాధినాథుడు ఆ విష్యక్సేనులు శంఖం, చక్రం, గద, చాపం, ఖడ్గం అనే ఆయుధాలను ధరించి త్ర, చామర మంగళవాద్యాలతో, భేరీ నినాదాల నడుమ స్వామివారి ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మండపం వద్దకు విచ్చేస్తారు. అక్కడ భూమిపూజ చేసి భూదేవిని వివిధ స్తోత్రాలతో స్తుతించి, మట్టిని గ్రహించి నవధాన్యాలతో అంకురార్పణం చేస్తారు. ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాలకు ముందు రోజున నిర్వహిస్తారు. అన్నమయ్య ఈ అంకురార్పణాన్ని అత్యంత విలక్షణంగా ఒక సంకీర్తనచే ఆవిష్కరించాడు.


అంకురార్పణ మంటపం వద్ద శేషవస్త్రం పై నిలువెత్తు గరుడాళ్వార్ల చిత్రాన్ని సూర్యచంద్ర అష్ట మంగళ పంచాయుధాలతో చిత్రించడం, ప్రాణ ప్రతిష్ట చేయడానికి మహదనుజ్ఞ స్వీకరించడం, ఆచార్యులు నిర్వహిస్తారు. వేదనాదాల మధ్య నిర్విఘ్న సమాప్తికై విష్వక్సేనుల పూజను ఆచరిస్తారు. భూతేశుని అర్చించి భేరీతాడనం చేసి తరువాత దిక్పాలకులకు బలిని సమర్పిస్తారు. వివిధ స్తోత్రాలతో సన్నుతిస్తారు. ధ్వజ పటాన్ని ఎగురవేయడం ద్వారా సర్వదేవతలను ఆహ్వానించడం అనే పవిత్ర కార్యం పరిపూర్ణమవుతుంది.


బ్రహ్మోత్సవ సంరంభం


“నానాదిక్కుల నరులెల్లా, వానలలోనే వత్తురు కదిలి” అన్న సంకీర్తనలో అన్నమయ్య బ్రహ్మోత్సవ ఘన వైభవాన్ని కనుల ముందుమహావైభవంగా ఆవిష్కరించారు. రాజులు, చక్రవర్తులు, కళాకారులు, కవులు, పండితులు, సామాన్యులు, ఎందరెందరో ఎన్నో కష్టాలకోర్చి స్వామి సేవలో తరించడం చారిత్రక వాస్తవం. “ఈ కీర్తనలో వానలలో వత్తురు” అని వర్షాకాలంలో (పురట్టాశి మాసంలో) బ్రహ్మోత్సవ నిర్వహణ జరుగుతున్నది. కాని భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు అని తెలియజేశారు. అంతేకాదు వారు ప్రతి సంవత్సరం వచ్చి అనంతమైన పుణ్య సంపదను ఆర్జిస్తున్నారు. వాహనసేవలలో ముందుగా పూర్ణకుంభంతో, పూలహారాలతో, కదళీదళాలతో శోభిల్లే బ్రహ్మ శూన్యరథాన్ని, రాజసానికి ప్రతీకలుగా అశ్వాలను, ఐశ్వర్యానికి చిహ్నంగా గజాలను, ధర్మానికి సంకేతంగా వృషభరాజాలను నడిపించడం, దివిటీలతో, వాద్య విశేషాలతో, నృత్యాలతో, గోవింద నామాలతో సేవిస్తున్న భాగవతులు, నాలాయిర ప్రబంధ పారాయణం చేసే శ్రీ వైష్ణవ శిరోమణులు, స్వామివాహనం వెనుకగా అప్రాకృతమైన దివ్యమైన వేదనాదం ఇవన్నీ బ్రహ్మోత్సవాల వేళ భక్తులు వీక్షించి తరిస్తారు. ఈ ఘన వైభవం కోనేటిరాయుని బ్రహ్మోత్సవాలకే సొంతం.


వాహన సేవలు


వాహనం


ధ్వజారోహణం జరిగిన రోజు రాత్రి ఉభయ దేవేరులతో ఏడుతలల బంగారుశేషుని వాహనంగా చేసుకుశ్రీ వేంకటపతి విశేషాలంకరణతో తిరు మాడవీధులలో భక్తజనులకు కనువిందు చేస్తాడు శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలో మొట్టమొదటి వాహనం ఆదిశేషుడు. శేషుడు శ్రీ వారికి నివాసభూమి, పడక, సింహాసనం, పాదుకలు, వస్త్రం, ఆనుకొనే దిండు, గొడుగు ఇలా ఆయా సమయాలకు కామరూపియై సేవలందిస్తాడు.


ఇలా కైంకర్యంలో స్వామికి అత్యంత సన్నిహితుడు, ఘనుడు శేషుడు. అందుకే దాసభూతమైన ఈ ప్రపంచాన్ని శేషభూతంగా సంప్రదాయయజ్ఞులు వ్యవహరిస్తారు. 'శేషశబ్దానికి ఇష్టం వచ్చిన రీతిలో ఉపయోగించుకునే అర్హత అన్న భావం సార్థకమైనది. ఈ శేషుడు③ తాయుగంలోశ్రీ రాముని తమ్ముడైన లక్ష్మణునిగా, ద్వాపరయుగంలోశ్రీ కృష్ణుని అగ్రజుడైన బలరామమూర్తిగా, కలియుగంలో గోవిందరాజుగా, వేంకటాచలంగా, ఆయుర్వేద వైద్యుడు చరకుడిగా, పాణినీయ భాష్యకర్త, యోగసూత్ర వ్యాకర్త పతంజలిగా – విశిష్టాద్వైత ప్రచారకులశ్రీ రామానుజులుగా వివిధ రూపాలలో కలియుగ దైవానికి అభీష్ట సేవకుడని సంప్రదాయజ్ఞుల విశ్వాసం. గొడుగుగా, పాదుకలుగా అన్ని రకములుగా స్వామి తనువు యొక్క సుఖాన్ని శేషుడు పొందుతున్నాడు. అంతకన్నా ఎక్కువగా అంటే మొత్తం తనకే ఆ నిరంతర సుఖ స్పర్శ లభించాలన్న తపనతో లక్ష్మీదేవిశ్రీ నివాసుని వక్షఃస్థలాన్ని అధిరోహించిందని ఆదిత్యపురాణం పేర్కొంటున్నడి శ్రీ వేంకటేశ సహస్రనామాలలో స్వామి శేషశాయీ, శేషస్తుత్యః, శేషాద్రి నిలయః భోగేంద్ర భోగ సంస్థానః అని ప్రశంసించబడుతున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం శాసనాల వల్ల శేషవాహనంపై దర్శనమిచ్చే బ్రహ్మోత్సవాలరాయుని ప్రశంస 1508 నుండి స్పష్టంగా లభిస్తున్నది. ఎనిమిదికి పైగా శాసనాలు శేష వాహన సేవను తెలియజేస్తున్నాయి.


చిన్నశేష వాహనం


చిన్నశేషవాహనంపై రెండవరోజు ఉదయశ్రీ కృష్ణమూర్తియై స్వామివారు దర్శనమిస్తారు. "అనంతశ్చాస్మి నాగానః సర్పణామస్మి వాసుకి:” నాగజాతి లో అనంతుడిని, సర్పజాతిలో వాసుకిని అని గీతాచార్యులు పేర్కొన్నారు. కాబట్టి పెద్ద శేషవాహనం “ఆదిశేషుడి”గా చిన్నశేషవాహనం “వాసుకి”గా భావించవచ్చును. శుద్ద సత్త్వానికి ప్రతీకయైన పరమశివుని హస్తాభరణంగా, గళాభరణంగా విరాజిల్లే వాసు. నివాసుని సేవలో తరిస్తున్నాడు. కనుక ఈ శేషుని అనుంగు సోదరుని “శేషశబ్దం” తోనే వ్యవహరించడం ప్రసిద్ది. చారిత్రకంగా పరిశీలిస్తే క్రీ.శ. 1614 సం|| నాటి తిరుమల తిరుపతి దేవస్థానం శాసనం ఒకటి ఈ వెండి శేషవాహన ప్రశంసను విశేషంగా పేర్కొంటున్నది.


హంస వాహనం


"హంస" శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరమాత్మ అని, సూర్యుడు అని, నిర్మలమైన, స్వచ్ఛమైన, పరిశుద్ధమైన మనో మందిరమని కూడా అర్థాలున్నాయి. యోగి పుంగవులైన యతే షులకు, “పరమహంస పరివ్రాజకాచార్య అన్న వ్యవహారం ప్రసిద్ధం. పరమాత్మ వేదోపదేశాన్ని హంస రూపంలో చేశాడు. హంస మంత్రం యొక్క ప్రభావం అద్భుతమైనది. హంస మంత్రం ఓంకారంతో సమానమని పాశుపత, బ్రహ్మోపనిషత్తు స్పష్టపరుస్తున్నది. సింహ వాహనం అనంత తేజోమూర్తి, శిష్టజన రక్షకుడుశ్రీ వేంకటేశ్వరుడు. లోకంలో సింహబలుడని, సింహస్వప్నం, సింహావలోకనం వంటివి సింహం యొక్క విశిష్టతను చాటుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో మూడవనాడు సింహవాహనం మీద దర్శనమిస్తాడు. గీతాచార్యులు “మృగాణాంచ మృగేడీ హం” మృగాలలో నేను సింహాన్ని అని తెలియజేశారుశ్రీ విష్ణు సహస్ర నామాలలో స్వామి “సింహః” అని కీర్తించబడుతున్నాడు. సింహం తామస గుణం కలిగిన “గజం” వంటి జంతువులను సంహరిస్తుంది. శ్రీ హరి తామసగుణ పూర్ణులైన రాక్షస గణాలను శిక్షిస్తాడు. హిరణ్యకశిపుని సంహరించడానికి విష్ణువు నరమృగాకృతిని దాల్చవలసి వచ్చినప్పుడు శ్రీ నివాసుడు సింహాకృతి శిరస్సుగా దాల్చి సాక్షాత్కరించాడు. ప్రహ్లాదుని రక్షించాడు. - యోగశాస్త్రంలో సింహం వాహన శక్తికి, గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు.శ్రీ వేంకటేశ్వరుడు తనలోని సింహ పరాక్రమాన్ని ప్రపంచీకరించడానికి ఈ సింహ వాహనంపై భక్తులకు కనువిందు చేస్తున్నాడని భావించవచ్చును.


 


ముత్యపు పందిరి వాహనం


నవరత్నాలలో ముత్యం ప్రసిద్ధమైనది. తెల్లనిది, చల్లనివాడైన చంద్రునికి ప్రతీకగా జ్యోతిష్య శాస్త్రం ముత్యాన్ని ప్రశింసించినది. స్వాతికార్తె మేఘపు వాన చినుకు సముద్రంలోని చిప్పలో పడి పరిపూర్ణత చెంది మనోహరమైన ముత్యంగా పరిణమించడం సృష్టి వైభవం. .బ్రహ్మోత్సవాలలో మూడవరోజు రాత్రి శ్రీ నివాసుడు ముత్యపు పందిరిపై మనోజ్ఞంగా దర్శనమిస్తాడు. ఆదిశేషుని వేయి పడగలను తెనాలి కవిశ్రీ హరికి ముత్యాల గొడుగుగా కీర్తించాడు. పద్మపురాణంలోని 26వ అధ్యాయంలో శుకమహర్షి - ముత్యాల గొడుగువలె ఉన్న శేషుని పడగల క్రింద వున్న శ్రీ నివాసుని మహిమను అద్భుతంగా కొనియాడాడశ్రీ వేంకటేశ సహస్రనామాలలో “మౌక్తికస్రగ్వీ” అంటే వేంకటేశ్వరుడు. ముత్యముల మాలను ధరించేవాడుగా తెలియజేయబడినది. మాఘకవి స్వామివారి మెడలో మరువు గొలిపే ముత్యాల హారాన్ని శ్రీ వారి బొటన వేలియందు ఉద్భవించి పైకి పొంగి స్వామికి ఇరువైపులా ఆవరించినట్లుగా వర్ణించాడు.


కల్పవృక్ష వాహనం


బ్రహ్మోత్సవాలలోశ్రీ వేంకటేశ్వరుడు నాల్గవరోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిస్తాడు. కల్పవృక్షం అంటే కోరిన కోర్కెల తీర్చే దేవతా తరువు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన ఈ వృక్షాన్ని సమీపిస్తే ప్రాణికోటి క్షుత్పిపాసలు తొలగిపోతాయని, పూర్వజన్మ స్మృతి లభిస్తుందని భారతం ప్రబోధిస్తున్నది. పారిజాత తరువు నుండి వీచే గాలుల స్పర్శకు ద్వారకలో వృద్ధులకు వార్డక్య లక్షణాలు తొలగి యౌవనం చేకూరినట్లు తెలియజేశారు. కల్పవృక్షం నుండి తయారైన చీరలు వివాహ సమయంలో మంగళదాయకమైనవిగా మనుచరిత్ర చెబుతున్నది. కల్పవృక్షాదులు అన్న వస్తాదులు వంటి కోర్కెలు తీర్చగలవు గానీ, మోక్షాన్నీ, స్వర్గాన్ని అందించలేవు. వాటి శక్తి పరిమితమైనది. కానీశ్రీ నివాసన ప్రభువు శాశ్వతమైన కైవల్య ప్రదాత అని స్పష్టపరచినది. ప్రాచీన వాజ్మయాన్ని పరిశీలిస్తే శ్రీ వేంకట విభుడు కల్పవృక్షం కన్నా అధికమైన ఫలాన్ని శాశ్వతంగా లభించేటట్లు అనుగ్రహించగలడని, ఆ స్వామి దర్శనం అక్షయానంద సందాయకమని చెప్పవచ్చును.


సర్వభూపాల వాహనం


శ్రీ వారి బ్రహ్మోత్సవాలలో నాల్గవరోజు రాత్రి స్వామి సర్వభూపాల వాహనంపై భక్తబృందాలకు దర్శనమిస్తాడు. “నా విష్ణుః పృథివీ పతిః” విష్యంశ లేనివాడు రాజు కాలేడు. శ్రీ నివాసుడు అంశి, భూపాలురు అంశభూతులు. వారికి అధికారశ్రీ హరివలన సిద్ధిస్తున్నది. అందుకే శ్రుతి వేంకటవిభుని “రాజాధిరాజాయ విద్మహే” అని తెలియజేస్తున్నది. ఈ బ్రహ్మోత్సవాలలో సర్వభూపాల వాహనంపై అధిరోహించి తన సర్వలోకైశ్వర్యత్వాన్ని చాటే విశిష్టమైనశ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం ఆశ్రిత భక్తకోటికి అధికార సంపదను అనుగ్రహిస్తుంది. ఆదిత్య పురాణంలోని రెండవ అధ్యాయంలో దిక్పాల సంసేవితుడై రమా సహితుడై దర్శనమిస్తున్నప్పుడశ్రీ నివాసుని అనుగ్రహం విశేషమని తెలియజేయబడింది. ఈ సర్వభూపాల వాహనంలోని స్వామి సేవ జీవులలో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇచ్చే మహిమాన్వితమైనది.


మోహినీ అవతారం


బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైన రోజు అయిదవ రోజు. ఆనాటి ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం జరిగే గరుడసేవ విశిష్టమైనవి. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి శ్రీ వారికి అందజేయు పట్టుబట్టల బహూకరణ, చెన్నై నుండి వచ్చే వెల్ల గొడుగులు, గోదాదేవి వేంకటపతికి బహూకరించే పవిత్రమైన పుష్పమాలిక వంటి ప్రత్యేకతలు ఉంటాయి. అన్ని వాహన సేవలు వాహన మండపం వద్ద నుండి ప్రారంభమవుతాయి. కానీ మోహినీ అవతారం పల్లకిపై సాక్షాత్తు తిరుమలేశుని ఆలయంలో నుండి ఆరంభమవుతుంది. మరో పల్లకిపై బాలకృష్ణుని రూపంలో ముగమోహనంగా స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామివారు పల్లకిపై నాలుగు మాడ వీధులలో ఊరేగుతున్నా ఆందోళికా వాహన సేవ ఆగకుండా ఉండటం గమనారంశ్రీ వారి మిగతా రూపాలు ఎలా ఉన్నా ఈ అవతారం భువన సమ్మోహనం. జితేంద్రియుడైన పరమేశ్వరుడే మోహింపబడ్డ జగన్మోహన సంధాయకత్వం . "పుంసాం మోహన రూపాయ” అని వాల్మీకి చేత కీర్తించబడిన మంగళ స్వరూపుడు. మన్మథుని గర్వాన్ని అణగ దొక్కిన సౌందర్యమూర్తి. జనులందుమోహాన్నికర్మఫలాన్ని అనుసరించి అనుగ్రహించే మాయా స్వరూపిశ్రీ వేంకటపతి నా యందు అనుగ్రహాన్ని కలిగి ఉండాలని వేడుకొంటే మానవాళికి జన్మధన్యమవుతుంది.


గరుడ వాహనం


బ్రహ్మోత్సవంలో సర్వోత్కృష్టమైన వాహనసేవ గరుడసేవ. ఈ సేవ నాడు నేల ఈనినట్లు తండోప తండాలుగా తిరుమలకు భక్తకోటి తరలి వస్తారు. అసలుశ్రీ వారి నిత్య వాహనం గరుడాళ్వారులే.


వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతునికి "పెరియ తిరుపడి” అని వ్యవహారం ఉంది. గరుడుడు వేదాత్మకుడు. స్వామివారు వేదప్రతిపాద్యుడు. తన స్వరూపాన్ని పరమాత్మ గరుడాళ్వారులలో వీక్షిస్తారని సంప్రదాయజ్ఞుల విశ్వాసం. యామునాచార్యులవారు వేదమూర్తి అయిన గరుత్మంతుడు స్వామికి దాసుడు, సఖుడు, వాహనం, ఆసనం, వ్యజనం, ధ్వజం, చాందినిగా సేవలందిస్తున్నాడని పేర్కొన్నారు.


సర్వవేదమయుడు, సన్నుత కాముడు, అప్రమేయుడు, సుచరిత్ర విధేయుడు అయిన గరుడుని రెక్కలవల్ల పుట్టిన గాలి అసాధారణమని ఆశ్రిత భక్తకోటికి పాపములు మాసిపోతాయని కృష్ణరాయలు ప్రశంసించాడు. అన్నమాచార్యులు “ఇటు గరుడుని నీవెక్కినను, పట పట దిక్కులు బగ్గనె పగిలే” వంటి కీర్తనలలో గరుడ వాహన రూఢుడైన వేళ స్వామివారి విశేష పరాక్రమాన్ని భక్తజన రక్షణా ధురంధరత్వాన్ని అద్వితీయంగా కొనియాడారు. తిరుమల దేవుని అత్యంత ప్రశస్తి గాంచిన గరుడసేవ నాడు గోదాదేవిశ్రీ విల్లిపుత్తూరు నుండి పంపిన తులసిమాలతో, ఆ సేవ వేళ మాత్రమే అలంకరణ చేసే మూలవిగ్రహం మీద ఉన్న బంగారు గొలుసు, మకరకంఠి, లక్ష్మీహారం, వేంకటేశ్వర సహస్రనామాల వంటి వాటిలో మలయప్ప స్వామి విశిష్టంగా దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.


హనుమద్వాహనం


బ్రహ్మోత్సవాలలో ఆరవనాటి ఉదయం హనుమద్వాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, నీలమేఘ శ్యాముడు. మలయప్పస్వామి భక్తజనులను అనుగ్రహిస్తాడు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో సిరియతిరువడిగా హనుమంతుని కైంకర్యాన్ని కీర్తిస్తారు. నాలాయిరంలో కులశేఖరులు తిరుమంగై ఆళ్వారులు, పెరియాళ్వార్లు పవన తనయుడిని పలు పలు విధాలుగా సన్నుతించారు. సంప్రదాయజ్ఞులు శ్రీ వేంకటేశ్వరుని సేవలో తరిస్తున్న హనుమంతుని సేవ బ్రహ్మోత్సవాలలో విశేషమైనదిగా భావిస్తారుశ్రీ వేంకటేశ సహస్రనామాల్లో “హనుమత్పరిపోషిత” అన్న నామం ప్రసిద్ధి చెందినదిశ్రీ వారికి ఎదురుగా నిలబడ్డ బేడీ ఆంజనేయస్వామి విగ్రహం నుండే “గరుడసేవ రోజు” భక్తితో రాష్ట్ర ప్రజల పక్షాన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తెచ్చి సమర్పిస్తారు.


గజ వాహనం


బ్రహ్మోత్సవాలలో ఆరవరోజు రాత్రి గజవాహనం. నివాస ప్రభువు దర్శనమిస్తాడు. గజం ఐశ్వర్యానికి ప్రతీక. “హస్తినాద ప్రబోధినీం” అని శ్రుతి. గజానికి మరో ప్రసిద్ధ నామం సామజం. గజారోహణం ఒక గొప్ప గౌరవం. భాగవతంలో గజేంద్ర మోక్షం ఘట్టం అత్యంత ప్రసిద్ధమైనది. సముద్ర మథనంలో ఐరావతమనే ఉత్తమ గజం జన్మించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. చతురంగ బలాలలో గజసైన్యం కూడా ప్రధానమైనదిశ్రీ నివాస పద్మావతీదేవిల కళ్యాణానికి కూడా ఒక గజరాజం మూలకారణమయింది. వంసతోత్సవవేళ స్వామి కళ్యాణ మూర్తిగా గజవాహనంపై దర్శనమిస్తాడుశ్రీ వేంకటేశ సహస్ర నామాలలో “గజరక్షకః” అనిశ్రీ హరిని పేర్కొనడం జరిగింది. మాయామయమైన సంసార భ్రాంతిలో కలవరపడవద్దని శుద్ద సాత్త్విక ప్రవృత్తి గలవాడవు కమ్మని, నేరములొనర్పవద్దని ప్రబోధిస్తూ - గజేంద్రుని రక్షంచిశ్రీ నివాసుని ఆశ్రయించమని తెలియజెప్పాడు. ఇందులో జీవుడు ఎంతటి ఆవేదనతో పరితపిస్తున్నా కరుణాంతరంగుడై గజేంద్ర రక్షకుడు కాపాడుతాడని అన్నమయ్య ఆంతర్యం.


సూర్యప్రభ వాహనం


బ్రహ్మోత్సవాలలో ఏడవనాటి ఉదయం ఏడుకొండలస్వామి ఏడు రశ్ములతో శోభిల్లే ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించే సూర్యదేవుని ప్రభపై దర్శనాన్ని ప్రసాదిస్తాడు. కారణం సూర్యుడు ద్వాదశాత్మ నారాయణుడు కేశవాది ద్వాదశనామకుడు, సూర్యుడు అదితి పుత్రుడు. సూర్యభగవానుడ శ్రీ నివాస పద్మావతి కళ్యాణానికి ముందు స్వామి తపస్సుకు సాక్షీభూతుడైనాడు. లక్ష్మీదేవిని పద్మావతితో తన వివాహానికి తీసుకురాగల సజ్జనుడిగ్రీ నివాసుడు పేర్కొన్న ఘట్టాన్ని భవిష్యోత్తర పురాణం వివరిస్తున్నది. ఇలాశ్రీ వేంకటపతి సన్నిహితుడుగా, లక్ష్మీదేవికి విశ్వాసపాత్రునిగా, ప్రఖ్యాతి చెందిన సూర్యభగవానుడు కమల లోచనుడైన స్వామికి బ్రహ్మోత్సవాలలో వాహనమై దర్శనమిస్తున్నాడు. భక్తులను తరింపచేస్తున్నాడు.


చంద్రప్రభ వాహనం


చంద్రుడు భగవంతుని మనస్సు నుండి జన్మించాడు. అందువల్ల చంద్రుడు ఉదయించినా, చంద్రశబ్దం చెవినపడ్డా ప్రకృతి చల్లదనంలో పులకించిన అనుభూతి హాయిని గొల్పుతుంది. చంద్రుడు ఓషధీశుడు. చంద్రకిరణాల వలన వరిపైర్లు పుష్కలంగా పండుతాయి. క్షీర సాగర మథనంలో ఉద్భవించిన చంద్రుని తోబుట్టువు లక్ష్మీదేవి. చంద్రుని సుతుడు సకల వేద వేదాంగ వేత్త బుధుడు. బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహనంపై దర్శనాన్ని అనుగ్రహించే వేంకటేశ్వరుడు ఆశ్రిత భక్తులకు శాశ్వతమైన సిరిసంపదలనే కాక, ఆజీవనం ఆకలి బాధ లేకుండా ఆహార సమృద్ధిని అనుగ్రహిస్తాడని భక్తకోటి విశ్వాసం.


రథోత్సవం


బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు ఉదయం ఉభయ దేవేరులతో భక్తుల మనోరథాన్ని ఈడేర్చే కొంగుబంగారం వేంకటేశ్వరుడు రథోత్సవంలో భక్తులకు కనువిందు చేస్తాడు. వివిధ వర్గాల పుష్పాలతో, అరటి మొలకలతో, మామిడి ఆకులతో అలంకరింపబడిన రథంపై అత్యంత విలాసంగా వేంకటపతి దర్శనమిస్తాడు. రథ వాహనంపై ఉన్న మలయప్ప స్వామి దర్శనం జ్ఞానాన్ని జన్మకర్మాణి బంధములు లేని శాశ్వత ముక్తిని అనుగ్రహిస్తుంది. గీతాచార్యులు సకల వేద వేదాంతసారమైన గీతను రథంపైనే నరుడికి బోధించాడుశ్రీ కృష్ణస్వామి రుక్మిణి అమ్మవారిని గౌరీపూజ అనంతరం వివాహార్థం తీసుకొని వెళ్ళింది రథం పైనే. గోదాదేవి స్వామిని తనను వివాహార్ణం రథం పైన తీసుకొని వెళ్ళమని ఆరతా బంధురంగా గానం చేసింది. నమ్మాళ్వారులు మధుర భక్తితో “ఆడి నటుం తేరు ఆళియన్ శెల్వన్” అని నాయకామణిగా తన ఆర్తిని విన్నవించుకొన్నాడు. కఠోపనిషత్తులో మానవ దేహాన్ని రథంతో పోల్చి పంచేంద్రియాలు గుర్రాలు, ఆత్మ రథికుడు, బుద్ది సారథి, మనసు కళ్ళెం, రథ మారాలు విషయాలుగా విశ్లేషించబడింది. అన్నమయ్య ఈ కఠోపనిషత్తులోని భావాన్నే “గుర్రాలు గట్టని తేరుకొంక కెంటైనా భారీ విర్రవీరు దేనినీ వేడుకతో జీవుడు” అన్న కీర్తనలో చాటి చెప్పాడు. వేదకాలమందు రథ నిర్మాణమొక ప్రత్యేక కళగా గణింపబడుచున్నది. ఈ రథోత్సవం తిరుమలలో అనేకసార్లు నిర్వహించబడినట్లు శాసనాధారాలు స్పష్టపరుస్తున్నాయి. సకల లోకాలను పాలించే పరమాత్మ రథోత్సవంలో అత్యంత ప్రసన్నుడై భక్తజనులను విశేషంగా అనుగ్రహిస్తాడని భాగవతుల విశ్వాసం.


అశ్వ వాహనం


చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది. ఇది రాజసానికి చిహ్నం. అశ్వం అన్నా, తురగం అన్నా వేగంగా పరుగెత్తేదని అర్థం. అశ్వారూఢుడైన అనంతుని దర్శనం అనంత ఫలప్రదంశ్రీ నివాసుని పారువేట ఉత్సవం అశ్వవాహనంపైనే నిర్వహించబడుతుంది. కలియుగాంతమందు శ్రీ నివాసుడు అశ్వారూఢుడై దుష్టశిక్షణ గావిస్తాడు.


శ్రీ నివాస పద్మావతీ దేవేరుల తోతి పుల వేళ, ప్రణయవేళ, పరిణయవేళ, సాక్షిగా వాహనంగా నిలిచినది అశ్వమే. భవిష్య పురాణం వాయుదేవుడు అశ్వంగా మారాడని, లక్ష్మీదేవి కళ్ళెమైనదని సకల సలక్షణాలు కల ఆ అశ్వంపై వేటకశ్రీ వారు వెళ్ళారని తెలియజేస్తున్నది. శ్రీ నివాసస్వామి వేటకు, కళ్యాణానికి ఉపకరించిన దివ్యవాహనమైన అశ్వంపై ప్రపన్న జనులకు అనంత కళ్యాణ సౌభాగ్యాలను అనుగ్రహిస్తాడని శ్రీ వేంకటపతి భక్తులకు అచంచల విశ్వాసం.


చక్ర స్నానం


వివిధ వాహన సేవలలో అత్యంత విలాసంగా సేవలందుకున్న శ్రీ నివాస ప్రభువు సేద తీరటానికి అందుకునే కైంకర్యం అవభృధ స్నానం. స్వామిపుష్కరిణీ తీరంలో క్షేత్ర నాయకుడైన వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో వివిధ ద్రవ్యాలతో అభిషేకాన్ని అందుకుని దివ్యమంగళ స్వరూపుడై భాగవతులను రంజింపచేస్తాడు. మలయప్పస్వామి ఉభయ దేవేరులతో చక్రత్తాళ్వారులతో, ధూప, దీప, నీరాజనాలనూ వైఖానస సంప్రదాయబద్ధంగా స్వీకరిస్తాడు. స్వామికి ఆత్మస్థానీయుడైన చక్రత్తాళ్వారులు స్వామి పుష్కరిణిలో మంగళస్నానం అందుకోవడంతో ఈ బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతాయి.


ధ్వజావరోహణం


చక్రస్నానం జరిగిన సాయంత్రం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభంపై ఎగురవేసిన దేవతాహ్వాన పూర్వక ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన దేవతాకోటికి ధ్వజావరోహణం గరుడాళ్వారు సాక్షిగా వీడ్కోలు పలకడమే. .


బ్రహ్మోత్సవ ఫలం


అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం, ఆశ్రితుల కొంగుబంగారం, తంగేటి జున్ను ఆపదమొక్కులవాడు, శ్రీ వేంకటేశ్వరస్వామివారు శ్రీ వారి బ్రహ్మోత్సవాలు అనంత ఫలదాయకాలు. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలుపంచుకుంటారో వారు సమస్త పాప విముక్తులౌతారు. ధన ధాన్య సమృద్ధి, విష మృత్యు నాశనం, రాజ్య పదవులు వంటి సకల ఐహిత్ర యస్సులు పొందుతారు. పరాంతకాలం వరకు జనన, మరణ, వికారములు లేకుండా సర్వ లోకాలనీ యధేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకుంటారు.