శ్రాశ్రావణ సోమవార వ్రతం - డా|| మరుదాడు అహల్యాదేవి

శ్రావణమాసంలో సోమవారాలకు ఒక ప్రత్యేకత ఉంది. కారణం ఈ వ్రతం | పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినది కావడం. నియమ పూర్వకంగా ఈ వ్రతం ఆచరించడం వలన ఫలం తప్పక లభిస్తుంది. స్కాంద పురాణం ప్రకారం ఈ వ్రతం చైత్రం, వైశాఖం, శ్రావణం, కార్తీక, మార్గశిర మాసాల్లో జరుపుకోవచ్చు. కాని విశేషించి శ్రావణ మాసానికి అధిక ప్రాధాన్యత ఉంది. |


వ్రత విధానం


వ్రతం పాటించేవారు సోమవారం ఉదయం స్నానాదులు ముగించి, “మమ క్షేమ సైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్థం సోమవ్రతం కరిష్యే” అని మనసులో భావించాలి. ఇలా సంకల్పం చేసుకున్న తర్వాత “ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరి నిభం చారు చంద్రావతంసం, రత్నకల్పోజ్వ లాహం పరశు మృగవరాభీతి హస్తం ప్రసన్నం, పద్మాసీనం నమతాస్తు మమర గణైః వ్యాఘ్రకృతం వసానం, విశ్వార్థం విశ్వవంద్యం నిఖిల భయహరం పంచవక్తం త్రినేత్రం...” అని పఠించాలి. తర్వాత “ఓం నమః శివాయః” అంటూ శివునికి, “ఓం నమః శివాయై” అంటూ పార్వతీదేవికి షోడశోపచార పూజ చేసి సమీపంలో ఉన్న పూలతోటలో ఏకభుక్త భోజనం చేయాలి. ఈ విధంగా 14 సంవత్సరాలు వ్రతం చేసి ఉద్యాపన చేయాలి. ఇలా చేయడం వలన పురుషులకు భార్యాపుత్రులు, స్త్రీలకు భర్త, సంతానంతో పాటు అఖండ సుఖ సౌభాగ్యాలు లభిస్తాయి. శివరహస్యం అనే ప్రాచీన శైవ గ్రంథంలో ఇలా చెప్పబడింది. శ్రావణమాసంలో సోమవారం కేదార్‌నాథ్ చేరి అక్కడ స్వామివారికి వివిధ గంధ పుష్పాదులతో ధూప, దీప, నైవేద్యాది ఉపచారాలు చేసి, శక్తి గలవారు ఉపవాసం చేయాలి. అలా కేదార్‌నాథ్ వరకు వెళ్ళలేనివారు స్వస్థలంలోనే వ్రతం పాటించాలి. ఉపవాసం చేయడం ఉత్తమం. అలా చేయలేనివారు శక్తి వ్రతం (రాత్రి మాత్రమే భోజనం) చేయడం వలన పరమశివుడు ప్రసన్నుడవుతాడు. పురాణ గాథ ప్రాచీన కాలంలో విచిత్రవర్మ అనే రాజు తన కుమార్తె సీమంతినికి నలుని కుమారుడైన చిత్రానందుడనే భర్త ఉ ండేవాడు. అతడు ఒకసారి నౌకాయాన సమయంలో నౌక తలక్రిందులై నదిలో పడి నాగలోకానికి చేరాడు. అతడు ఈ వ్రతాన్ని ఆచరించి మళ్ళీ భూలోకం చేరి విచిత్రవర్మ రాజ్యానికి వారసుడై చాలాకాలం రాజ్యం పాలించాక స్వర్గం చేరుకున్నాడు.


శైవగ్రంథాల్లో శ్రావణ సోమవార వ్రత మహాత్యం


వ్రతానుష్ఠానంలో ఈ కథ తప్పక శ్రవణం చేయాలి. పూర్వం ఒక సంపన్నుడు ఉండేవాడు. అతనికి ధన, కనక, వస్తు సామగ్రికి లోటు లేదు. కాని సంతానం లేదు. పుత్రవాంఛతో అడు ప్రతి సోమవారం సోమవ్రతం చేసి శివుని అర్చించి, సాయంకాలం శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించేవాడు. అతని భక్తి ప్రపత్తులూ సి జాలిపడిన పార్వతీదేవి ఒకసారి పరమశివునితో ఇలా అంది. “స్వామీ! మీరు భక్తులపై అపార వాత్సల్యదూ పుతారు కదా. ఆ సంపన్నుడు ఇంత భక్తిగా మిమ్మల్ని అర్చిస్తున్నాడు. మరి ఇతని కోరిక తీర్చకూడదా?” అని.


శివుడు ఇలా సమాధానం చెప్పాడు. “దేవీ! ఈ భూలోకం కర్మక్షేత్రం. ఇక్కడ కృషీవలుడు ఏ గింజ నాటితే అదే ఫలం పొందుతాడు. అలాగే ప్రాణులు ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి ఫలమే పొందుతారు” అన్నాడు. జగన్మాత మళ్ళీ పతిదేవుని అనునయిస్తూ “అతడు మహాభక్తుడు. అతనికి కోరిక ఎలాంటిదైనా మీరు నెరవేర్చడం న్యాయం. మీరు భక్తుల అభీష్టం నెరవేర్చకపోతే లోకంలో ఇక మీ వ్రతం పై, మీ దయపై విశ్వాసం కూడా సన్నగిల్లుతుంది” అంది. “అతని ప్రాప్తంలో పుత్రుడు కలిగే యోగం లేదు. అయినా నీవు ఇంతగా బతిమాలుతున్నావు కనుక అతనికి ఒక పుత్రుడు కలిగే వరం ప్రసాదిస్తాను. కాని ఆ బాలుడు అవుతాడు. అతడు కేవలం పన్నెండేళ్ళు బతికి ఉ ంటాడు. ఇంతకన్నా ఎక్కువ అతనికోసం నేనేమీ చేయలేను” అని శివుడు పార్వతీదేవికి చెప్పాడు. ఆది దంపతుల మధ్య సాగిన సంభాషణ శివభక్తుడైన సంపన్నునికి వినపడుతూనే ఉంది. శివుని పలుకుల వలన అతనికి ఆనందం కాని దుఃఖం కాని కలుగలేదు. ఎప్పటిలాగే భక్తితో శివపూజ చేస్తూనే ఉన్నాడు. కొంతకాలానికి సంపన్నుని భార్య గర్భం దాల్చి చక్కని బాలుడిని ప్రసవించింది. ఆ ఇంట్లో బాలుని జననంతో ఆనందం వెల్లి విరిసింది. కాని పుత్రుని జన్మరహస్యం తెలిసిన తండ్రి అంత ఉత్సాహా పలేదు. ఆ సంగతి ఎవరికీ చెప్పనూలేదు. ఎప్పటి మాదిరిగానే తన పూజను కొనసాగిస్తున్నాడు. సంపన్నుని కుమారునికి పదకొండేళ్ళు వచ్చాయి. వివాహయత్నం చేద్దామని భార్య సూచించింది. అవుతాడు. అతడు కేవలం పన్నెండేళ్ళు బతికి ఉ ంటాడు. ఇంతకన్నా ఎక్కువ అతనికోసం నేనేమీ చేయలేను” అని శివుడు పార్వతీదేవికి చెప్పాడు. ఆది దంపతుల మధ్య సాగిన సంభాషణ శివభక్తుడైన సంపన్నునికి వినపడుతూనే ఉంది. శివుని పలుకుల వలన అతనికి ఆనందం కాని దుఃఖం కాని కలుగలేదు. ఎప్పటిలాగే భక్తితో శివపూజ చేస్తూనే ఉన్నాడు. కొంతకాలానికి సంపన్నుని భార్య గర్భం దాల్చి చక్కని బాలుడిని ప్రసవించింది. ఆ ఇంట్లో బాలుని జననంతో ఆనందం వెల్లి విరిసింది. కాని పుత్రుని జన్మరహస్యం తెలిసిన తండ్రి అంత ఉత్సాహా పలేదు. ఆ సంగతి ఎవరికీ చెప్పనూలేదు. ఎప్పటి మాదిరిగానే తన పూజను కొనసాగిస్తున్నాడు. సంపన్నుని కుమారునికి పదకొండేళ్ళు వచ్చాయి. వివాహయత్నం చేద్దామని భార్య సూచించింది.


“నా కుమారునికి ఇప్పుడే వివాహం చేయను. మేనమామతో కాశీనగరంలో విద్యాభ్యాసానికి పంపుతాను” అని ధనవంతుడు బదులిచ్చాడు. బావమరిదిని పిలిపించాడు. అతనికి ధనమిచ్చి, తన కుమారుడిని కాశీనగరానికి తీసుకెళ్ళి విద్యాబుద్ధులు నేర్పించమని చెప్పాడు. మార్గమధ్యంలో ఎక్కడ మజిలీ చేసినా యజ్ఞం చేసి, బ్రాహ్మణులకు సంతర్పణ చేయించాలని ఆదేశించాడు. అలాగే ఆ బాలుని వెంటబెట్టుకొని, కాశీనగరం వైపు ప్రయాణం సాగించాడు మేనమామ. బావ చెప్పినట్లే మార్గంలో ఆగిన చోట యజ్ఞాలు, బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తూ ముందుకు సాగాడు. ఒక నగరంలో వారు బస చేశారు. ఆ సమయాన ఆ నగరం రాజు తన కుమార్తెకు పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ వధువును వివాహమాడటానికి వస్తున్న రాజకుమారుడు ఏకాక్షి (ఒక కన్ను లోపం ఉన్నవాడు). తన కుమార శాక వధువు తల్లితండ్రులు వివాహం చేయటానికి నిరాకరిస్తారేమో అని ఏకాక్షి తండ్రి సందేహం. సంపన్నుని కుమారూ డగానే అతనికి ఒక ఉపాయం తోచింది. “ఈ బాలుడు చాలా అందంగా ఉన్నాడు.


వరుని స్థానంలో ఇతమ్మా పించి వివాహం జరిగాక రాజకుమార్తెను తన కోడలుగా ఇంటికి తీసుకెళ్ళవచ్చు” అని ఆలోచించాడు. బాలుని మేనమామకు కొంత ధనం ఇస్తానని ఆడ పి ఒప్పించాడు. ఎదుర్కోలు, వివాహం ఆ బాలునితోనే చేయించాడు. కాని బాలుడు వివాహ సమయంలో రాజకుమార్తె మేలిముసుగుపై ఇలా రాశాడు. “నేను అసలు వరుణ్ణి కాను. నీకు కాబోయే భర్త ఏకాక్షి. నేను విద్యాభ్యాసానికి కాశీకి వెళుతున్న విద్యార్థిని” అని. వివాహ తంతు ముగిశాక బాలుని మేనమామకు ధనమిచ్చి వారిద్దరినీ ఆ ఊరి నుండి పంపించివేశాడు ఏకాక్షి తండ్రి. రాజకుమార్తె తన మేలిముసుగుపై ఉన్న విషయం చదువుకొని ఏకాక్షి వరునితో వెళ్ళటానికి నిరాకరించింది. “నా భర్త కాశీలో విద్యాభ్యాసానికై వెళ్ళాడు. అతడు వచ్చేదాకా వేచి ఉంటాను” అని పట్టుబట్టింది. ఆమె తల్లితండ్రులు అసలు విషయం తెలుసుకొని ఏకాక్షిని, అతని తండ్రిని వెనక్కి పంపారు. కుమార్తెను తమ దగ్గరే ఉంచుకున్నారు. ఇక్కడ బాలుడు మేనమామతో కాశీనగరం చేరాడు. ఇద్దరూ కాశీలో యజ్ఞాలు నిర్వహిస్తూ సంతర్పణలు చేస్తున్నారు. ఇంతలో బాలునికి పన్నెండేళ్ళు ముగిసే సమయం ఆసన్నమయింది. ఒక రోజు బాలుడు యజ్ఞం చేస్తూ మేనమామతో “నాకు నీరసంగా ఉంది. స్వస్థత లేదు” అన్నాడు. గదిలోకి వెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకో” అని మేనమామ చెప్పాడు.బాలుడుగదిలోనికి వెళ్ళి పడుకున్నాడు. అతని ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోయాయి. కొంత సేపటికి మేనమామ లోపలికి వచ్చి బాలుడిచూ సి నిశ్చేష్టుడయ్యాడు. కాని యజ్ఞం పూర్తయ్యేదాకా నోరు మెదపకుండా మౌనం వహించాడు. అక్కడకు వచ్చినవారందరూ వెళ్ళిపోయాక పెద్దగా రోదించసాగాడు. అదే సమయంలో ఆకాశమార్గాన విహరిస్తున్న పార్వతీ పరమేశ్వరులకు ఆ రోదన వినిపించింది. ఇద్దరూ అక్కడ దిగి ఆ దృశశదా శారు. బాలుడిని బ్రతికించమని శంకరుని వేడుకుంది పార్వతీదేవి. "స్వామీ! ఈ బాలుడు నీ భక్తుని కుమారుడే. ప్రాణదానం చేసి రక్షించు” అంది. వీలుకాదన్న బోళాశంకరుడు పార్వతీదేవి విన్నపానికి జాలి తలచి బాలునికి పునర్జన్మ ప్రసాదించాడు. ఆదిదంపతులు అంతర్థానమయ్యారు. బాలుడు పునర్జీవితుడై లేచాడు. మేనమామ ఆనందం చెప్పనలవి కాదు. కాశీనుంచి తిరుగు ప్రయాణమయ్యారు. గతంలో బాలునికి వివాహం జరిగిన నగరానికి చేరుకున్నారు. అక్కడ రాజు గుర్తించి సకల మర్యాదలతో ఆహ్వానించాడు. తన కుమార్తెతో పాటు అపారముగా కానుకలు ఇచ్చి సాగనంపాడు. వధూవరులతో కలిసి నగరానికి చేరుకున్న మేనమామ తన బావగారికి ఈ శుభవార్త చెప్పాలని వెళ్ళాడు. ఆ సమయంలో సంపన్నుడు తన భార్యతో కలిసి ఇంటి పైకప్పుపై కూర్చుని ఉన్నాడు. తమ కుమారుని మరణవార్త తెలిసిన క్షణాన అక్కడనుండి కిందకు దూకి మరణించాలనేది వారి చింతన. “మీ కుమారుడు క్షేమం. వధువుతో కలిసి వస్తున్నాడు” అని బావమరి బిగ్గరగా పలికాడు. ఈ మాటలు విన్న సంపన్న దంపతులకు మొదట నమ్మకం కలగలేదు. అయితే తమ బిడ్డను కనులారూ సుకొని, శివుని కరుణకు పరవశించిపోయారు. శ్రావణ సోమవారం వ్రతం పాటించినా, ఈ కథను విన్నా, చదివినా సమస్త కోరికలు నెరవేరి సుఖసౌఖ్యాలు పొందుతారు.