శ్రీ రామాయణ రత్నా కరం - 


“దేవతలారా” పిలిచాడు చతుర్ముఖ బ్రహ్మ. నారాయణుడు దశరథ పుత్రులుగా అవతరించబోతున్నాడు. ఆయనకు మనం సాయపడాలి. నేను ఒకసారి ఆవలించాను. అపుడు జాంబవంతుడు పుట్టాడు. అతడు ఋక్షరాజుగా ప్రసిద్ధుడు. అప్సరసలు, గంధర్వాంగనలు, యక్షవనితలు, నాగకన్యలు, కిన్నెర స్త్రీలు, విద్యాధర యువతులు ఎందరో ఉన్నారు. వారితో సంతానం పొందండి. సింహ పరాక్రములు, అస్త్ర శస్త్ర ప్రయోగ నిపుణులు, వాయువేగ గమనులు, కామరూపులు, మహావీరులు, యుక్తిశాలురు అయిన భల్లూక వానర వీరులను పుట్టించండి. దేవేంద్రుని వల్ల వాలి - సూర్యుని వల్ల సుగ్రీవుడు -బృహస్పతి వల్ల తారుడు - విశ్వకర్మ వల్ల నలుడు - అగ్నిదేవుని వల్ల నీలుడు - వరుణుడి వల్ల సుక్షేణుడు - వాయుదేవుని వల్ల హనుమంతుడు పుట్టారు. అందరిలో ఆంజనేయునికి 4 విశేషణాలు ప్రయోగించాడు వాల్మీకి. 1. వజ్రశరీరుడు 2. గరుడ గమనుడు 3. బుద్ధిమంతుడు 4. బలవంతుడు. అలా వేలకొద్దీ భల్లూకాలు (ఎలుగుబంట్లు), వానరులు పుట్టారు. వానర భల్లూక కొండముచ్చులు (గోపుచ్చాలు) , అని మూడు రకాల జాతులు దేవతల సంతానం. అందరూ సాటిలేని పరాక్రమవంతులు. పర్వతాకారాలు, కామరూపులు, దృఢశరీరులు. బండరాళ్ళు, చెట్లు, గోళ్ళు, కోరలు ఆయుధాలుగా ఉపయోగిస్తారు. వేల కోట్ల సంఖ్యలోని వాళ్ళంతా రామ కార్యార్థమై సిద్ధంగా ఉన్నారు. మూడు జాతుల వారికీ రాజు మహాబలశాలి వాలి. - పార్వతికి కొడుకు కావాలని కోరిక. భర్తతో చెప్పింది. ఒకరోజు ఇద్దరూ రతిక్రీడలో ఉన్నారు. దేవతలు వచ్చారు. ప్రభూ మీకు పుత్రుడు కలిగితే మేం ఆగగలమా? మా గతి - అథోగతి అని విన్నవించుకున్నారు. బోలాశంకరుడు పార్వతిని వదిలి వెళ్ళిపోయాడు. దాంతో వారిపై కోపగించిందామె. నాకు సంతానం లేకుండా చేశారు. మీ భార్యతో మీకు సంతానం కలుగరాదని శపించింది. అందుకే ఇతర స్త్రీలతో రామకార్యార్థమై సంతానం పొందారు దేవతలు. కోడలిని కుమార్తెను బలవంతాన అనుభవించేవాడు 'మహాజ్వాల' అనే నరకంలో పడతాడు. పరస్త్రీని పొందేవాడు 'శబల' అనే నరకంలో పడతాడు. తన భార్య చేసే వ్యభిచారంతో బతికే వాడు 'రుధిరాంధ'మనే నరకంలో పడతాడు. పార్వతి శాపం వల్ల దేవతలు అలా సంతానం పొందారు. దేవకార్యాల్లోని అంతరార్థాన్ని మనం గ్రహించాలి. విమర్శించరాదు. అంతేకాని వాళ్ళు చేశారని మనం ఆచరించరాదు. వేల కోట్ల వానరులు ఇపుడు కనిపించడం లేదే అని ప్రశ్న. రామావతార ప్రయోజనంసిద్ధించింది. దుష్టరాక్షససంహారం జరిగింది. ఆ వానర భల్లూకాలన్నీ దేవతాంశ సంభూతులే కనుక అదృశ్యమైనారని చెప్పాలి. హనుమంతుడు ఒక్కడూ చిరంజీవి. హనుమత్ ఉపాసకులకి దర్శనమివ్వగలడని కొన్ని సంఘటనలు (తులసీదాసుకి) తెలియజెబుతున్నాయి. గంధమాదన పర్వతం (బదరీ క్షేత్రం) మీద హనుమ ఉంటాడని ప్రతీతి. దశరథుడు పుత్రుల కోసం ఏకంగా పుత్రకామేష్టి చేయకుండా మొదట అశ్వమేధ యాగం ఎందుకు చేశాడని ప్రశ్న. అతడు యుక్తవయసులో ఉన్నపుడు అనుకోకుండా ఒక రోజు అర్థరాత్రి మునిబాలుణ్ణి చంపాడు. దాని పాప పరిహారార్థం ఆ యాగం చేశాడు. కులగురువు బ్రహ్మరి వసిష్ఠుడు కూడా అందుకు సమ్మతించడం విశేషం.


శాంతా ఋష్యశృంగులను దశరథుడు గొప్పగా సమ్మానించాడు. ఆ దంపతులు రోమపాదునితో అంగదేశానికి వెళ్ళారు. రెండు యాగాలు నిర్వహించటంలో అహర్నిశలూ కృషి చేసిన వారందరినీ సముచిత రీతిలో సత్కరించాడు మహారాజు, రామ జననం ఒక సంవత్సరం గడిచింది. అది చైత్రమాసం శుక్లపక్షం. నవమి తిథి. పునర్వసు నక్షత్రం. కర్కాటక లగ్నం. అయిదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. కౌసల్యాదేవి ప్రసవించింది. మగబిడ్డ. ఆ బిడ్డడే రాముడు. ఇంద్రుణ్ణి పుత్రునిగా పొందిన అదితిలా శోభించింది కౌసల్య. పునర్వసు నక్షత్రం - కైకేయి భరతుణ్ణి కనింది. ఆశ్లేషా నక్షత్రాన సుమిత్ర కవలలను కనింది. వారే లక్ష్మణ శత్రుఘ్నులు. దశరథునికి నలుగురు కొడుకులు పుట్టారు. ఆ వార్త అయోధ్యలో వ్యాపించింది. నగరవాసుల ఆనందమే ఆనందం. నర్తకులు ఆడారు. గాయకులు పాడారు. వివిధ వాద్యాలతో జయ జయ నినాదాలతో మారుమ్రోగింది అయోధ్య. . , అది పదకొండవ రోజు. వసిష్ఠుడు నామకరణం చేశాడు. పురప్రజలకు మృష్టాన్నదానం జరిగింది. కుమారులు నలుగురూ చదువులన్నీ చదివారు. విలువిద్యలో ఆరితేరారు. నలుగురూ నలుగురే. వారి వారే సాటి. రాముడంటే లక్ష్మణునికి ప్రాణం. లక్ష్మణుడంటే రామునికీ అంతే. శత్రుఘ్నుడు భరతునికి ఆరో ప్రాణం. రామ లక్ష్మణులు ఒక జత. భరత శత్రుఘ్నులు ఒక జత. ఒక తల్లి పిల్లలు కాకపోయినారామభరతలక్ష్మణశత్రుఘ్నులు ఎంతో ఐకమత్యంతో ఉన్నారు. మానురాగాలకు పెట్టింది పేరుగా నిలిచారు. ఈనాడు ఒకే తల్లికి పుట్టినవారున్నారు. పుడుతూ అన్నదమ్ములు - పెరుగుతూ దాయాదులు - అన్న సామెతని అక్షరాలా నిజం చేస్తున్నారు కొందరు. అన్నదమ్ములు ఎలా కలిసిమెలిసి ఉండాలో శ్రీ రామాయణం నేర్పుతుంది మనకు. నలుగురూ యుక్త వయస్కులైనారు. ఈడు జోడు కుదిరిన కన్యలతో పుత్రులకు పెండ్లి చేయాలనుకున్నాడు దశరథుడు. గురువులతో బంధువులతో ఆలోచిస్తున్నాడు. విశ్వామిత్రుని రాక


మహాముని తేజశ్శాలి విశ్వామిత్ర మహర్షి. అయోధ్యా నగరానికి వచ్చాడు. "గాధి కొడుకు, కౌశిక వంశస్తుడు, విశ్వామిత్రుడు వచ్చాడని రాజుగారికి చెప్పండి” ద్వారపాలకులతో మహర్షి మాటలు అవి. విన్నారు వాళ్ళు. కలవరపడ్డారు. భయంతో పరుగులు తీశారు. రాజప్రాసాదం చేరారు. మహారాజుకి వినిపించారు ఆ వార్త.. సంతోషించాడు. దశరథుడు. పురోహితులతో వెళ్ళాడు - బ్రహ్మదేవుని దగ్గరికి ఇంద్రుడు ఎదురేగినట్లళ్లూ శాడు బ్రహ్మర్దిని. అర్ఘ్యమిచ్చాడు. పాద్యమిచ్చాడు. సత్కరించాడు మహారాజు. దశరథుణ్ణి కుశల ప్రశ్నలడిగాడు విశ్వామిత్రుడు. దీవించాడతణ్ణి. అందరూ రాజభవనంలోకి ప్రవేశించారు. మహరిని స్తుతించాడు మహారాజు. 'మీ రాకతో నాకు అమృతం లభించినట్లయింది. నీళ్ళు లేనిచోట వాన కురిసినట్లయింది. నష్టపోయిన వానికి నిధి దొరికినట్లయింది. పతికి సతివల్ల పుత్రులు కల్గినట్లుంది. మహానుభావా నీకిదే స్వాగతం. 'అద్యమ్ విశ్వామిత్రుని రాక మహాముని తేజశ్శాలి విశ్వామిత్ర మహర్షి. అయోధ్యా నగరానికి వచ్చాడు. "గాధి కొడుకు, కౌశిక వంశస్తుడు, విశ్వామిత్రుడు వచ్చాడని రాజుగారికి చెప్పండి” ద్వారపాలకులతో మహర్షి మాటలు అవి. విన్నారు వాళ్ళు. కలవరపడ్డారు. భయంతో పరుగులు తీశారు. రాజప్రాసాదం చేరారు. మహారాజుకి వినిపించారు ఆ వార్త.. సంతోషించాడు. దశరథుడు. పురోహితులతో వెళ్ళాడు - బ్రహ్మదేవుని దగ్గరికి ఇంద్రుడు ఎదురేగినట్లళ్లూ శాడు బ్రహ్మర్దిని. అర్ఘ్యమిచ్చాడు. పాద్యమిచ్చాడు. సత్కరించాడు మహారాజు. దశరథుణ్ణి కుశల ప్రశ్నలడిగాడు విశ్వామిత్రుడు. దీవించాడతణ్ణి. అందరూ రాజభవనంలోకి ప్రవేశించారు. మహరిని స్తుతించాడు మహారాజు. 'మీ రాకతో నాకు అమృతం లభించినట్లయింది. నీళ్ళు లేనిచోట వాన కురిసినట్లయింది. నష్టపోయిన వానికి నిధి దొరికినట్లయింది. పతికి సతివల్ల పుత్రులు కల్గినట్లుంది. మహానుభావా నీకిదే స్వాగతం.సఫలం జన్మ జీవితంచ సుజీవితం' - మహామునీ నా జన్మ నేడు సఫలమైంది. నా జీవితం చరితారమైంది. తమరి రాకతో మా ఇల్లు పావనమైంది. తమరి దర్శన భాగ్యంతో కృతారుణయ్యాను. ఏపని మీద వచ్చారో చెబితే నెరవేర్చటానికి సిద్ధం నేను. చేస్తానా లేదా అని సందేహం వద్దు. ఏ లోటూ లేకుండా చేసి పెడతాను. కారణం తమరు దైవ సమానులు. అనుగ్రహించండి అన్నాడు. చెవులకింపైన మాటలు విన్నాడు విశ్వామిత్రుడు. పులకితగాత్రుడైనాడు. ' రాజై షా! నేను ఒక లక్ష్యసిద్ధి కోసం యజ్ఞం చేస్తున్నాను. ఇద్దరు రాక్షసులు దాన్ని భగ్నం చేస్తున్నారు. వాళ్ళు కామరూపులు. నేను దీక్షలో ఉన్నాను. కోపించరాదు, శపించరాదు. పదే పదే విఘ్నాలు కల్గిస్తున్నారు. నా శ్రమ వృథా అవుతోంది. యజ్ఞవాటిక విడిచిపెట్టాను. ఇక్కడికి వచ్చాను. నీ పెద్ద కొడుకు రాముడు. జులపాలజుట్టువాడు. సత్యపరాక్రముడు. ఆ రామునికి అండగా ఉంటాను. దివ్యతేజస్సుతో రాముడా రాక్షసుల్ని చంపేస్తాడు. ఆ రక్కసుల్ని హతమార్చడం మరొకరికి చేతకాదు. వాళ్ళు ఎన్నో పాపకార్యాలు చేశారు. అందుకే వాళ్ళకి చావు మూడింది. రాజా, పుత్ర మతో రాముని శక్తిని తక్కువగూ డవద్దు. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నీ కొడుకు వాళ్ళని చంపుతాడు. నా యాగాన్ని రక్షిస్తాడు. అనే. యస్సులు పొందుతాడు. నామాట నమ్ము. మహాత్ముడైన రాముడు సాటిలేని సత్యపరాక్రముడు. ఆ విషయం నాకు తెల్సు. తపస్వి తేజస్వి అయిన వసిష్ఠునికి తెల్సు. ఇక్కడ కూర్చున్న తాపసులకు తెల్సు. రాముణ్ణి పంపించు. నా యజ్ఞం పూర్తి కావించు. రాజీవలోచనుని రక్షణ భారం నాది. పది రోజులు చాలు. రాముణ్ణి పంపు. నీకు మేలు కల్గుతుంది.


వేడికోలు


వినయ విధేయతల్లో - మాతాపితరుల సేవలో - ప్రజాహిత కార్యాల్లో - నలుగురు కొడుకులు మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో రాముడు సర్వజనాదరణ పొందాడు. అది దశరథుని ఆనందపరవశుణ్ణి చేస్తోంది. కొడుకు పెండ్లి విషయాలు చర్చించే సమయం అది. విశ్వామిత్రుడు వచ్చాడు. ఒక్కసారిగా ఉబ్బి తబ్బిబ్బయ్యాడు మహారాజు. ఆనందం అందలమెక్కిస్తుంది. పెద్దవాళ్ళముందు తొందరపడి మాట్లాడరాదు. అడగక ముందే ఏదైనా చేసి పెడతానని మాటివ్వరాదని శ్రీ రామాయణం చెబుతోంది మనకు. విశ్వామిత్రుని మాట విన్నాడు దశరథుడు. నిరుత్తరుడైనాడు. నిశ్చేష్టుడైనాడు. అంతలో తేరుకున్నాడు. అంటున్నాడు ఇలా “మహామునీ! పదారేళ్ళు కూడా నిండనివాడు నా రాముడు. రాజీవలోచనుడు. రాక్షసులతో యుద్ధం చేయలేడు. అస్తవిద్యా నైపుణ్యం లేనివాడు. రాక్షసులు కపట యుద్ధ నిపుణులు. నా సైన్యంతో వస్తాను. యజ్ఞాన్ని రక్షిస్తాను. అంతేకాని రాముణ్ణి పంపాలని అడగకు. వాడిని విడిచి క్షణం కూడా ఉండలేను. ఇంతకూ ఆ రాక్షసులెవరు? ఎవరికి చెందినవారు? సమాధానమిస్తున్నాడు విశ్వామిత్రుడు. 'రాజా! పులస్త్య వంశంలోనివాడు విశ్రవసువు. అతని కొడుకు రావణుడు. బలపరాక్రమవంతుడు. తపస్సంపన్నుడు. కుబేరుని తమ్ముడు. వాని అనుచరులే మారీచ సుబాహులు. యజ్ఞ విఘ్న కారకులు. విన్నాడు. దశరథుడు. భయపడ్డాడు. ఆ రాక్షసులు కదనరంగంలో కాకలు తీరినవారు. వారితో నేను పోరాడలేను. నేను నా సేన అశక్తులం. ఇక రాముని మాట చెప్పాలా? వాడు బాలుడు. వాణ్ణి పంపాలని కోరకు.


ఆగ్రహోదగ్రుడైనాడు విశ్వామిత్రుడు. ప్రజ్వరిల్లే అగ్నిలా మండిపడ్డాడు. భూమి కంపించింది. దేవతలు భయపడ్డారు. అంటున్నాడు - "రాజా నేను నిన్నేమీ అడగలేదు. ఏ పనైనా చేసి పెడతానని నీవే అన్నావు. కాకుస్థ వంశంలోని వాడవు. మాట తప్పావు. మంచిది. నేను వెడుతున్నాను. సుఖీభవ సబాంధవః - నీవూ నీవాళ్ళు సుఖంగా ఉండండి”. పరిస్థితి గమనించాడు. వసిష్ఠుడు. నెమ్మదిగా అన్నాడు ఇలా - "రాజా! ఇక్ష్వాకు వంశజుడవు. ధర్మస్వరూపుడవు. శ్రీ మంతుడవు. ధైర్యవంతుడవు. సువ్రతుడవు - అని లోకంలో పేరు పొందినవాడవు. ఇపుడు ధర్మహాని చేయతగదు. ప్రసిద్ధి కెక్కిన వంశానికి మచ్చ తేరాదు. బాగా ఆలోచించు. ముందుగా మాట ఇచ్చావు నీవే - ఆడిన మాట తప్పరాదు. ఇంతవరకు చేసిన ధర్మకార్యాలు, అశ్వమేధాది యాగాలు నిష్ఫలం కారాదు. రాముణ్ణి పంపించు”. “రామునికి శస్తాస్త బలం లేదని విచారపడకు. జ్వలించే అగ్ని రక్షణలోని అమృతంలా-రాముణ్ణి విశ్వామిత్రుడు కాపాడుతాడు. ఆ బ్రహ్మరి ఎవరనుకున్నావ్ - ధర్మమే రూపుదాల్చినవాడు - శక్తి సామర్థ్యాలలో మేటి. తాపసుల్లో మేలుబంతి. అస్త్ర ప్రయోగంలో దేవ రాక్షసాదులెవ్వరూ సాటి రారు అతనికి. శస్త్ర బలసంపన్నుడే కాదు నూతన అస్తాల సృష్టికర్త కూడా. సర్వరాక్షస సంహార దక్షకుడు. అయినా రామునికి మేలు చేయాలని వచ్చాడు. అతని అభ్యర్థన తిరస్కరించకు. అంది వచ్చిన అవకాశం. అడ్డుపడకు” అని కులగురువు హితవచనాలు. దశరథుడు ప్రసన్నుడైనాడు. రాముని పంపటానికి సమ్మతించాడు.


రామునితో పాటు లక్ష్మణునికి అనుమతి లభించింది. మంగళాశీర్వాద మంత్రాలతో రామలక్ష్మణులతో అభిమంత్రించాడు వసిష్ఠుడు. విశ్వామిత్రునికి వాళ్ళని అప్పగించాడు. దశరథుడు. ఆ సమయంలో గాలి చల్లగా వీచింది. దేవదుందుభులు మ్రోగాయి. పూలవాన కురిసింది. రాజభవనంలో శంఖాలు పూరించబడ్డాయి. - ముందు విశ్వామిత్రుడు - వెనుక రామలక్ష్మణులు నడుస్తున్నారు. బ్రహ్మదేవుని వెంట అశ్వనీదేవతల్లా ఉన్నారు అన్నదమ్ములు. చేతుల్లో ధనుస్సులు. ఆ చేతులకి ఉడుం చర్మపు తొడుగులు. భుజాలకు అటు ఇటు అమ్ముల పొదులు. పడగ విప్పి కదలాడుతున్న మూడుతలల పాముల్లా భాసిల్లుతున్నారు రామలక్ష్మణులు. వారి నడుం భాగాన వేలాడుతున్నాయి కత్తులు. ఒకటిన్నర యోజనం (19 కి.మీ) నడిచారు. సరయూనది దక్షిణ తీరం చేరారు. బల - అతిబల ' రామా' - మధురంగా పిలిచాడు మహర్షి. . ఈ నదిలో దిగు. ఆచమనం చెయ్. బల అతిబల మంత్రోపదేశం చేస్తాను. ఈ మంత్ర ప్రభావంతో అలసట ఉ ండదు. ఆకలి దప్పులుండవు. శత్రువులు నిన్నేం చేయలేరు. మహాతేజోవంతమైన ఈ రెండు మంత్రాలు బ్రహ్మ సృష్టించాడు. నా తపోబలంతో సాధించాను నేను - అంటూ మంత్రోపదేశం చేశాడుమహర్షి. స్వీకరించాడు రాముడు - శరత్కాల సూర్యునిలా విరాజిల్లాడు రఘునందనుడు. ఆ రాత్రి - ఆ నదీతీరం - పచ్చిగడ్డి వారి పడకలు. పుణ్యకథలు వింటూ గురువుగారికి పాదసేవలు చేశారు. క్రమంగా నిద్రలోకి జారుకున్నారు. ఇంకా తెలవారలేదు. విశ్వామిత్రుడు లేచాడు. దర్భశయనుడైన శాడు. పుంసాం మోహనరూపుడు. ఎంత అందం. ఎంత సోయగం. ఎంత లావణ్యం. ఎంతసేవూ సినా ఇంకా ఇంకూ డాలనిపించే చక్కదనాల రాముడు. అందాల రాముడు. బ్రహ్మరి మైమరచిపోయాడు. మనసు పొరల్లోంచి మధుర భావన పొంగి పొర్లింది. పెదవులు కదిలాయి. పలుకులు వెలువడ్డాయి. -


రాముణ్ణి కన్నతల్లి ఎంత అదృష్టవంతురాలు. ఓ కౌసల్యా తనయా రామా! తూర్పుదిక్కు ఎర్రబారుతోంది. లే. పురు. షా. స్నానాది నిత్యకర్మ లాచరించవయ్యా - అది విశ్వామిత్రుని మేలుకొలుపు. శ్రీ మాన్ ప్రతివాది భయంకర అణ్ణన్ 14వ శతాబ్దివాడు. ఆ మహానుభావుడు తిరుమల వెళ్ళాడు. వేంకటేశుని దర్శించాడు. భక్తితో స్తుతించాడు స్వామిని. కౌసల్యా సుప్రజా రామా అంటూ ఆశువుగా కీర్తించిన శ్లోకాలు 72.


వీరులు రామలక్ష్మణులు విన్నారు. లేచారు. నిత్యకృత్యాలు ముగించారు. సూర్యునికి అర్ఘ్యం వదిలారు. గాంత్రీ జపం చేశారు. విశ్వామిత్రునికి నమస్కరించారు. ప్రయాణమైనారు ముగ్గురూ. నడిచారు. నడిచారు. సరయూ - గంగా నదులు కలిసే చోటు చేరారు. కామాశ్రమం


ఆ నదీ సంగమం ఒక పుణ్యస్థలం. అది అంగదేశంలోని కామాశ్రమం. పరమశివుడు ఒకప్పుడు తపస్సు చేసిన పవిత్రభూమి. శంకరుని మూడో కంటికి మన్మథుడు బూడిదైన చోటు అదే. కాముడు తన అంగాలు త్యాగం చేశాడు కనుక అంగదేశమని - కామాశ్రమం అని ప్రసిద్ధి గాంచింది. ఆనాటి శివుని శిష్యులు పరంపరలుగా అక్కడ తపస్సు సాగిస్తున్నారు. వాళ్ళంతా పాపరహితులు. పరమ ధార్మికులు. కామ క్రోధ లోభాలు - స్వరానికి మహాద్వారాలంటుంది గీతామాత. అవి బొత్తిగా నమ్మరాని చుట్టాలు. తపస్సంపన్నులే కాదు మహామహులు కూడా వాటికి లోనై బోల్తా పడ్డారు. బహు జాగరూకులై ఉండాలని - వాటిని జయించడం కష్టమని - భగవంతుని శరణు వేడాలని ఆ సన్నివేశం హెచ్చరిస్తోందిమనల్ని. ఆ ఆశ్రమవాసులు దివ్యదృష్టితో శారు. విశ్వామిత్రాదుల రాక తెల్సుకున్నారు. వెళ్ళారు. స్వాగతం పలికారు. అధ్య పాద్యాదులర్పించారు. కుశల ప్రశ్నలు ముగిశాయి. ఆ రాత్రికి ఆ ఆశ్రమంలో గడిపారు. ముగ్గురూ. కామాశ్రమం ఒక పుణ్యక్షేత్రం. తీరక్షేత్రం. తీర్థక్షేత్ర దర్శనం పుణ్యప్రదం. తిరుమల - పుష్పమంటపం, కంచి - త్యాగమంటపం, శ్రీ రంగం - భోగమంటపం, మేల్కోట (తిరునారాయణపురం, జ్ఞానమంటపం. జీవితంలో ఆ నాల్గింటిని దర్శించి జన్మసార్థకం చేసుకోవాలంటారు పెద్దలు.


బ్రహ్మదేవుడు కైలాస పర్వతం మీద ఒక సరస్సు సృష్టించాడు. అది ఆయన మానసిక సంకల్పం. అందుకే దానికి మానస సరస్సు అని పేరు. బ్రహ్మ సరస్సు అని కూడా పిలుస్తారు. అది హిమాలయాల్లో ప్రవహించింది. అయోధ్యను కొంతమేర చుట్టింది. సరస్సులోంచి పుట్టిందని దానికి సరయూ అని పేరు వచ్చింది. గంగానది సంగమం చోట - తరంగాల ఘర్షణ. అద్భుతమైన ధ్వని. ఆ సంగమస్థలానికి చేరారు ముగ్గురూ. నదికి నమస్కరించారు. నావ మీద ప్రయాణం. గంగ దాటారు. వేగంగా నడిచారు. అక్కడ జనసంచారం లేదు. దట్టమైన అడవి. కీచురాళ్ళ రొద. క్రూరమృగాల అరుపులు. పక్షుల కూతలు నిశ్శబాల్ని చీల్చివేస్తున్నాయి. పలురకాల చెట్ల గుంపులు. భయంకరంగా ఉంది. ఎందుకు ఇలా ఉందని అడిగాడు రాముడు. చెబుతున్నాడు విశ్వామిత్రుడు. పూర్వం ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపాడు. బ్రహ్మహత్యాపాతకం పట్టుకుందాయనని. అపవిత్రుడయ్యాడు. ఆకలి దప్పులు బాధించాయి. అపుడు దేవతలు మహరులు అతణ్ణి ఇక్కడికి తీసుకువచ్చారు. మంత్రపూరితంగా ఈ


గంగానది చేయించారు. అశుచి ఆకలి పోయాయి. ఇంద్రుడు అన్నాడు ఇలా “నా శరీర మలినాలు గ్రహించాయి కనుక ఈ ప్రదేశాలు మలద, కరూశ పేర్లతో ప్రసిద్ధి పొందాలి' అని. అందుకు అందరూ సంతోషించారు. రెండు దేశాలుగా నిర్మించారు. అవి ధనధాన్యాలతో వర్ధిల్లాయి. , తాటక


కొంతకాలం గడిచింది. ఇక్కడికి తాటక అనేక ఒక రాక్షసి వచ్చింది. అది యక్షిణి. కామరూపిణి. పుట్టుకతోనే వెయ్యి ఏనుగుల బలంతో పుట్టింది. దాన్ని సుందుడు అనేవాడు పెళ్ళి చేసుకున్నాడు. మారీచుడు వారి బిడ్డడే. వాడు మహా పరాక్రమవంతుడు. మహాబల సంపన్నుఏడు. కామరూపుడు. సుందుడు అగస్త్య మహర్షి చేత హతుడైనాడు. తల్లీ కొడుకులు ఆ తపశ్శాలి మీద పడ్డారు. వాళ్ళని శపించాడాయన. ఆ శాపగ్రస్తుల క్రోధావేశానికి ఈ రెండు దేశాలు నిర్మానుష్యమైనాయి. ఒకటిన్నర యోజనం దూరం ఆక్రమించింది తాటక. ఆ రాక్షసి ఉన్న వనంలోకి వెళ్ళాలి మనం. ఆ తాటక మషబే కి. మహా ఉపద్రవవారిణి. దాన్ని నువ్వే చంపాలి. స్త్రీని చంపటం ఎలా అని ఆలోచించకు. లోకహితం కోసం వధించు. నాలు కులాల వారికి మేలు చేయాలి. అదే ప్రజా రక్షణ. అదే రాజధర్మం . అదే క్షాత్ర తేజం. పూర్వం విరోచనుడి కూతురు ఉండేది. ఆమె పేరు మంధర. ఆమె పృధ్విని నాశనం చేయాలనుకుంది. దేవేంద్రుడామెను సంహరించాడు. అంతేకాదు. పూర్వం భృగు భార్య - శుక్రాచార్యుని తల్లి పేరు ఉశన. ఇంద్రాది దేవతలను చంపాలనుకుంది. అందుకామె దృఢవ్రతం పూనింది. దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించారు. ఆ శ్రీ మన్నారాయణుడు ఆమెను వధించాడు. అధర్మ పరులైన స్త్రీలను సత్పురుషులు, మహానుభావులు చంపుతారు. కనుక దుర్మార్గురాలైన తాటకను వధించు. దోషం లేదు.


తాటక వధ


“తమరు ఏం చెబితే అది చేయమన్నాడు మా నాన్న. తండ్రి ఆదేశం పాటిస్తాను. మీ శాసనం నా కర్తవ్యం. తాటకను చంపుతాను” – అది రాముని మాట. వెంటనే కోదండం తీశాడు. పిడికిలి పట్టాడు. ధనుష్టంకారం చేశాడు. ఆ శబ్దానికి దిక్కులు అదిరాయి. ఉలిక్కిపడింది తాటక. క్షణకాలం దానికి దిక్కు తోచలేదు. ఉత్తరక్షణంలో చుట్టూ సింది. క్రోధ పరవశురాలయింది. శబ్దం వచ్చిన దిశ పసికట్టింది. సుడిగాలిలా లేచింది. తుఫాన్లో దూసుకుపోయింది. వికృతమైన ముఖం. వికృతమైన ఆకారం. తాటిచెట్టంత తాటకనమూ శాడు రాముడు. అంటున్నాడు లక్ష్మణునితో “ఈ రాక్షసి భైరవాకాడర శావా? అంతంతమాత్రం ధైర్యం ఉన్నవాడు గుండె పగిలి చస్తాడు. దీనిని ఎవ్వరూ ఎదిరించలేరు.


ఆడది కదా చంపాలనిపించటం లేదు” అని. రామలక్ష్మణులను చూ సింది తాటక. చెలరేగింది. చేతులెత్తింది. గర్జించింది. రాముని మీద పడబోయింది. హుంకరించాడు విశ్వామిత్రుడు. స్వస్తి రాఘవయోరస్తు - రామలక్ష్మణులకు శుభం. జయం - ఆశీర్వదించాడు మహర్షి. తాటక చేతులు బారచాపింది. అన్నదమ్ముల పై దుమ్ము ఎగజిమ్మింది. ముహూర్తకాలం వాళ్ళకేం కనిపించలేదు. అది మాయశక్తితో కనిపించలేదు. రాళ్ళవాన కురిపించింది. శరపరంపరతో శిలావరం అడ్డుకున్నాడు రాముడు. అది కనబడింది. తనమీదికి రాబోతున్న దాని చేతులు నరికాడు. భుజాలదాకా తెగాయి. రొప్పుతోంది. కేకలు వేసింది. కిందపడింది. లక్ష్మణుడు దాని రెండు చెవులూ ముక్కూ కోశాడు. తాటక తన కామరూపంతో అనేకవిధాల కనపడింది. మళ్ళీ మాయమైంది. మళ్ళీ రాళ్ళవాన కురిపించింది. ఆ వర్షంలో రామలక్ష్మణులు చిక్కుకున్నారు. . “రామా ఇంతవరకు ఆమె మీరూ పిన జాలి చాలు. అది యక్షిణి. దుష్టచారిణి. పాపి. యజ్ఞ హంత్రిణి. మాయతో తన బలం పెంచుకుంటోంది. సంధ్యా సమయం సమీపిస్తోంది. ఈలోగా దాన్ని చంపెయ్. సూర్యుడు అస్తమించాక రాక్షసులు బలోపేతులవుతారు. అపుడు ఎదుర్కోవటం కష్టం”. విన్నాడు విశ్వామిత్రుని సూచన. శబ్దవేధి విద్య ప్రదర్శించాడు రాముడు. తాటక ఆటలు సాగలేదు. కనపడింది. గర్జించింది. పిడుగులా అన్నదమ్ముల మీద పడబోయింది. బాణం తొడిగాడు రాముడు. విడిచాడు. అది తాటక గుండెల్లో దిగబడింది. కిందపడింది. చచ్చింది. ఇంద్రాది దేవతలు వచ్చారు. రాముణ్ణి మెచ్చారు. బ్రహ్మరితో అంటున్నాడు ఇంద్రుడు. “నీవు ఎన్నో అస్త శస్త్రాలు ఆర్జించావు. తపోబలంతో నీలో వర్ధిల్లుతున్నాయి. వాటిని ఆ రాకుమారునికి సమర్పించు. దేవతల కార్యం నెరవేర్చాలతడు”. అందరూ వచ్చిన దారిన వెళ్ళారు. తాటక వధతో మహరి సంతుష్టుడయ్యాడు. మతో రాముని నుదురు ముద్దాడాడు. రామా మనం ఈ రాత్రికి ఇక్కడే ఉందాం. రేపు మన ఆశ్రమానికి వెడదాం అన్నాడు. రామావతార ప్రయోజనాన్ని ఆవిష్కరించింది తాటక వధ. దుష్టశిక్షణకు నాంది ఇది. తాటక ముక్కు చెవులు కోశాడు లక్ష్మణ స్వామి. ఇంకా ఇద్దరు స్త్రీలకు అదేపని చేస్తాడు. స్త్రీల ముక్కు చెవులు కోయటంలో ఆంతర్యం ఏమిటని ఆలోచించాలి. (సశేషం)