వేంకటాచల మాహాత్మ్యం (స్కాంద పురాణాంతర్గతం) డా|| విష్ణుభట్ల గోపాలకృష్ణమూర్తి


, వేంకటాచల మాహాత్మ్యం (స్కాంద పురాణాంతర్గతం) 


9. పద్మావతీ పరిణయ కారణాలు:


“పూర్వం పవిత్రమైనత్రే తాయుగంలో నేను రావణుని సంహరించాను. అప్పుడు 'వేదవతి' అనే కన్య లక్ష్మీదేవికి సహాయం చేసింది. భూలోకంలో లక్ష్మీదేవి జనక చక్రవర్తికి కుమార్తెగా భూమినుండి సీతగా అవతరించింది. పంచవటిలో నేను మారీచుని సంహరించటానికి వెళ్ళగా నా తమ్ముడు లక్ష్మణుడు కూడా సీత రేపించగా నన్ననుసరించాడు. ఇంతలో రాక్షసేంద్రుడైన రావణుడు సీతను అపహరించటానికి అక్కడకు వచ్చాడు. అప్పుడు అగ్నిహోత్ర వేదికలో ఉన్న అగ్నిదేవుడు రావణుని ప్రయత్నాన్ని తెలుసుకొని సీతను పాతాళలోకంలో తన భార్యయైన స్వాహాదేవి వద్ద ఉంచాడు. ఆ తరువాత పూర్వం రావణునిచే స్పృశించబడి, అగ్నిలో తన దేహాన్ని వదలిన ఆ వేదవతిని రావణ సంహారం కోసం సీతవలె తయారు చేసి ఆ ఆశ్రమంలో ఉంచాడు. రావణుడు ఆ వేదవతినే సీత అనుకొని ఆమెను అపహరించి లంకకు తీసుకొని వెళ్ళాడు. రావణ సంహారం తరువాత ఆమె మరల అగ్ని ప్రవేశం చేసింది. అప్పుడు అగ్నిదేవుడు స్వాహాదేవిచే రక్షింపబడిన లక్ష్మీదేవి అవతారమైన సీతను నా చేతిలో సమర్పించి సీతతో కూడిన నాతో, ' రామా! ఈమె వేదవతి. సీతకు హితకారిణి. సీతకొరకై లంకానగరంలో రావణునిచే బంధించబడింది. కావున నీవు ఈమెకు ఏదైనా వరమిచ్చి ఈమెను సంతోషపరచు' అన్నాడు. అగ్నిదేవుని మాటలు విని సీతాదేవి నాతో 'నాథా! ఈ వేదవతి నాకు నిత్యం ప్రీ తిని కలిగిస్తున్నది. ఈమె పరమ భాగవతోత్తమురాలు. కావున మీరీమెను వరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను' అంది. ఆమె మాటలు విని నేను 'దేవీ! రానున్న ఇరవై ఎనిమిదవ కలియుగంలో అట్లే చేస్తాను. అప్పటివరకు ఈమె బ్రహ్మలోకంలో దేవతలచే పూజింపబడుతూ ఉండుగాక! ఆ తరువాత ఈమె భూపుత్రియై ఆకాశరాజు కుమార్తె కాగలదు' అని ఈ విధంగా నేను, లక్ష్మి కూడా పూర్వం ఈ వేదవతికి వరం ఇచ్చాము. ఆ వేదవతియే ఇప్పుడు నారాయణపురంలో భూమినుండి ఉద్భవించింది. ఆమె పద్మం వంటి ముఖం కలది.కమలాలవంటి నేత్రాలు కలది. ఆ మనోహరిణి, పద్మావతి లక్ష్మీదేవి చేత వరం పొందినదై అనుకూలురైన సఖులతో ఉద్యానవనంలో పూలు కోస్తూ వేటకై తిరుగుతున్న నాకు కనబడింది. ఆమె సౌందర్యాన్ని నేను నూరు సంవత్సరాలైనా వర్ణించలేను. లక్ష్మీదేవి వలె ఆమెతో నేడు నాకు సంబంధం కలిగితే నా ప్రాణాలు నిలబడతాయి. ఇది సత్యమని నమ్ము. ఓ వకుళమాలికా! నీవు అక్కడికి వెళ్ళి ఆ కన్యచూ చి పద్మదళాల వంటి విశాల నేత్రాలు కల ఆ పవిత్ర కన్యామణి రూపలావణ్యాదులచే నాకు తగినదేమో తెలుసుకో' అని చెపిగ్రీ నివాసుడు మరల మోహపరవశుడయ్యాడు.


10. వకుళమాలిక రాక:


వకుళమాలికతోశ్రీ మోహవివశుడైశ్రీ నివాసునితో వకుళమాలిక 'దేవాదిదేవా! మనోహరి ఎక్కడ ఉందో అక్కడికి ఇప్పుడే వెళ్తాను. రమాపతీ! నాకు ఆమె నివాసానికి వెళ్ళే మార్గాన్ని తెలుపు' అని అడుగగా వకుళమాలికతోశ్రీ నివాసుడిలా అన్నాడు - 'పూజ్యురాలా! నీవీ పర్వతాన్నుండి శ్రీ నృసింహ గుహమార్గంలో కొండ దిగి అగస్త్యాశ్రమానికి వెళ్ళి, ఆయనచే పూజింపబడే “ఆగస్త్యేశ్వరుడు'గా ప్రసిద్ది చెందిన శివలింగాన్ని దర్శించి, సువర్ణముఖరీ తీరం వెంట వెడుతూ తరంగాలతో కూడిన సువర్ణముఖయా స్తూ తర్వాత శుకమహర్షి వనానికి వెళ్ళు. అక్కడ పవిత్రమైన పద్మాలతో కూడిన పద్మ సరోవరముంది. దానిలో స్నానమాచరించి, దాని ఒడ్డున తపస్సు చేస్తున్న ముశ్రీ ష్ఠుడైన ఛాయాశుకునికి నమస్కరించి, మహర్షిచే నిరంతరం ఆరాధించబడే బలరామసహితుడు, ఇంద్రనీలమణి వలె నల్లనివాడు, పీతాంబరాన్ని ధరించి శ్రీ కృష్ణునికి మరియు తీర్థయాత్రలకు వెళ్తున్నవాడు ప్రయాణానికి సిద్ధమై పాదుకలు ధరించిన బలరామునికి నమస్కరించి ఆ సరస్సు నుండి ఒక స్వర్ణకమలం తీసుకుని సువర్ణముఖరిని దాటి, వనాలను ఉపవనాలను అతిక్రమించి, ఆరణి నదీతీరాన్ని చేరి, అక్కడ వనమధ్యంలో విశ్రమించి, నారాయణపురాని చి నీవు ఆశ్చర్యపడతావు.


అక్కడి ఉపవనంలో పుష్పఫలభరితాలైన పనస, మామిడి, దిరిసెన, తిరుగుడు, తుమ్మికి, కలిగొట్టు వృక్షాలను, సురపొన్న, పొన్న, ఉలిమిరి, అందుగు, ఊడుగు, సంపెంగ చెట్లను, పొగడ, ఉసిరి, మది, తాటి, గిఱకతాడి, పద్మక వృక్షాలను, నేరేడు, వేప, కడప, పెద్దయేలకి, ఊషణ, ఇప్ప, ఎఱుమద్ది, ంకణ, ఇంగువ, ఖర్జూర, ఓమ (వాము), అశోక, లొద్దుగ (లోధ్ర) చెట్లను, రావి, మేడి, జువ్వి, రేగు, బుజపత్తిరి, వెదురు, చింత, మోదుగు, మందార, బూరుగు,మాదిఫలవృక్షాలను, పోక, నారింజ, నిమ్మ, కొబ్బరి తోటలతో నిండిన ప్రదేశాలను, మల్లె, జాజి, మొల్ల, అడవి మొల్ల, మొగిలి చెట్లతో కూడిన వాటిని, గన్నేరు పూలతో నిండిన ప్రదేశాలను, టేల చెట్లతో విరాజిల్లే వాటిని, నెమళ్ళు, చిలుకలు, గ్రద్దలు, బెగ్గురు, పక్షులతో కూడిన ప్రదేశాలను, తుమ్మెదల ఝంకారాలతో మారుమ్రోగుతూ మనస్సును దోచే సుందరమైన ఉపవనాలననూ స్తూ పరమానందాన్ని పొందుతావు. ఆ నదీతీరం వెంట వెళ్ళి పుష్పోత్తర మార్గంలో గంగవలె ఉన్న, ఆరణి నదిచే చుట్టబడిన ఇంద్రపురితో సమానమైన ఆకాశరాజ నగరానికి వెళ్ళి అక్కడ నీకు తోచినట్లు చేయి' అని చెప్పి శ్రీ నివాసుడు ఆమెను పంపించి తెల్లని శయ్యపై పరున్నాడు. . అంతట వకుళమాలిక శ్రీ నివాసునికి నమస్కరించి గురివెందమణి వంటి ఎఱ్ఱని గుజ్జాన్నెక్కి వివిధ మృగాలను, పర్వతాకారంతో నున్న తెల్లని దంతాలతో శోభిల్లుతున్న ఆడ ఏనుగు గుంపులతో కూడిన, నీటిని త్రాగుతున్న ఏనుగులను స్తూ శ్వేత ఘనాలనుగా ప్రఖ్యాతి గాంచిన, ఆడ సింహాలు అనుసరిస్తున్న సింహాలను, శార్దూలాలను, ఎలుగుబంటులను, ఖడ్గమృగాలను, శరభాలను, చమరీమృగాలను, నల్లని జింకలను, నక్కలను, కుందేళ్ళను, సారస పక్షులను, నెమళ్ళను, అడవి పిల్లులను, తోడేళ్ళను, చిలుకలను, అడవి పందులను, మధుర ధ్వనులు చేస్తున్న పక్షులను, వివిధ రకాలైన ప్రాణులను స్తూ మాటిమాటికి సంతోషిస్తూ వృక్ష సమూహాలతో కూడిన ఆరణీనది పశ్చిమ తీరాన్ని చేరింది. ఎఱ్ఱని గుఱ్ఱం నుండి దిగి అగస్త్యేశ్వర లింగాన్ని దర్శించి, ఆ నదిలో స్నానపానాలు ముగించుకొని నదీతీరంలో విశ్రమించింది. ఇంతలో రాజగృహాన్నుండి దైవసన్నిధికి వచ్చిన పద్మావతీదేవి చెలికత్తెలమూ చి వకుళమాలిక వారి వద్దకు వెళ్ళి 'స్త్రీ రత్నములారా! విచిత్రాభరణాలతో కూడిన మాలలను ధరించిన మీరెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకిక్కడ ఏం పని?' అని అడుగగా వారామె మాటలకు చిరునవ్వు నవ్వుతూ 'దేవీ! మేమెవరమో చెబుతాము. సావధానంగా విను' అని తమ గురించి ఇలా చెప్పారు.


11. పద్మావతి వృత్తాంతం :


మేము ఆకాశరాజుగారి అంత:పుర స్త్రీలం. మహారాజపుత్రి పద్మావతికి సఖులము. పూర్వం ఒకనాడు రాజకుమార్తెతో కూడ మేము ఉద్యానవనానికి వెళ్ళి పూలు కోస్తూ ఒక చెట్టుమూలకు చేరాము. అంతలో ఇంద్రనీలమణివలె నీలమేఘశ్యాముడు, వక్షస్థలంలో లక్ష్మి గల ఒక పురుష శాం. అతడుమందస్మిత వదనారవిందుడు, అందమైన బలిసిన దీర్ఘబాహువులు గలవాడు, పీతాంబరాలు ధరించాడు. బంగారు ధనుర్బాణాలు ధరించి ప్రకాశిస్తున్నాడు. సువర్ణకిరీట హార కేయూరాలను అలంకరించుకున్నాడు. పద్మపత్రాల వంటి విశాల నేత్రాలు కలవాడు, దివ్యపురుషహ చి మేలిమి బంగారు శరీర ఛాయ గలమా సఖి పద్మావతి మమ్మయా డండా డండి' అన్నది. మేమతనినూ స్తుండగానే అతడు అంతరితుడయాయడు. ఇంతలో మా సఖి మూర్చపోగా మేము ఆమెను రాజమందిరానికి తీసుకుని వెళ్ళాము. ఆకాశరాజు తన కుమార్తె అస్వస్తురాలవడూ సిజ్యోతిష్కుని పిలిపించి, 'ఓ ద్విజోత్తమా! మా కుమార్తె గ్రహచారఫలం ఎలా ఉందో చెప్పండి' అని అడిగాడు. బృహస్పతి సముడైన ఆ బ్రాహ్మణుడు మనసులో నక్షత్రాలను, గ్రహాలను గుణించుకొని 'రాజా! నీ కుమార్తెకు గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. కాని నిత్యం గ్రహఫలం కొంచెం భ్రాంతికరంగా ఉంది' అని చెబుతూ ప్రశ్నకాలాన్ని విచారించి ఛాయను, లగ్నాన్ని, దాని ఫలితాలను బాగా లెక్కించి రాజుతో మరల 'మహారాజా! లగ్నంలో లగ్నాధిపతి అయిన చంద్రుడు, కేంద్రమున బృహస్పతి ఉన్నారు. దినపక్షి నిద్రిస్తున్నది. ప్రశ్నపక్షి రాజ్యంలో ఉంది. అందువల్ల ఈమెకు తప్పక స్వస్థత చేకూరుతుంది. ఒకానొక ఉత్తమ పురుషుడు ఈమెవద్దకు వచ్చి ఉన్నాడు. అతనిచూ సి ఈమె మూర్చితురాలైంది. ఈమెకు ఆయనతో సమాగమం ఏర్పడగలదు. అతనిచేత పంపబడిన ఒక కన్యక ఇక్కడకు రాగలదు. ఆమె చెప్పేది మీకు మేలు చేకూరుస్తుంది. కావున మీరు ఆమె చెప్పినట్టు చేయండి. నేను నిజమే చెబుతున్నాను. అయినను సర్వారాలను సిద్ధింపజేసే, సర్వవ్యాధులను పోగొట్టే, మీ కుమార్తెకు సుఖాన్ని కలిగించే ఉపాయం చెబుతాను. అగస్త్య లింగానికి బ్రాహ్మణులచే అభిషేకం చేయించండి' అని చెప్పి ఆ జ్యోతిష్కుడు మరలాడు.


ఆ తరువాత ఆకాశరాజు వేదవిదులైన బ్రాహ్మణులను పిలిపించి, వారిని పూజించి, 'ఓ బ్రాహ్మణోత్తములారా! మీరు దేవాలయానికి వెళ్ళి ఈశ్వరునికి మంత్రపూర్వకంగా, మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయండి' అని వారిని ఆజ్ఞాపించి, మమ్మల్ని పిలిచి, 'ఓ కన్యకలారా! మీరు వెంటనే మహాభిషేక సంభారాలను సమకూర్చండి' అని ఆజ్ఞాపించగా మేము ఆ పూజాసామగ్రిని తీసుకొని వచ్చాము. ఓ సుందరీ! నీవు ఈ దివ్యాశ్వాన్ని అధిరోహించి దేవలోకం నుండి వచ్చినట్లున్నావు. నీవెవరు? నీ ఆగమన కారణాన్ని మాకు వెంటనే చెప్పు. నీవు ఎక్కడి నుండి వచ్చావు? ఎవరి పనిమీద ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు?” అని చెలికత్తెలు అడుగగా వకుళమాలిక ఆ బాలికలను సంతోషపెడుతూ మధురంగా ఇలా అంది -


'నేను వేంకటాద్రి నుండి ఇక్కడికి వచ్చాను. నా పేరు వకుళమాలిక. నేను ధరణీదేవిమా డగోరి ఈ గుజ్రాన్నెక్కి వచ్చాను. ఆ రాజమందిరంలో నేను ధరణీదేవిని దర్శించడానికి వీలవుతుందా?” అని అడుగగా ఆ రాజ కన్యకలు 'మాతో పాటు మీరామెను దర్శించవచుచ' అన్నారు. అంతట వకుళమాలిక ఆ కన్యలతో పాటు రాజమందిరానికి వెళ్ళింది.


12. ధరణీదేవి సోదె అడగడం :


, ఇంతలో ఒక సోదెకత్తె గురివెందగింజలతోను,శంఖాలతోను అలంకరించుకొని, పాలుత్రాగే పసిబిడ్డను వీపున చీరకొంగుతో కట్టుకొని, 'భూత భవిష్యద్వర్తమానాలను చెబుతాను వినండి” అని వీధివీధిన అరుస్తూ ఆ రాజవీధికి వచ్చింది. ధరణీదేవి సోదెకత్తెను పిలిచి, బంగారు చాటలో ముత్యాలను పోసి మూడు రాశులుగా చేసి, ఆమెకిచ్చి, నీవు జరుగబోయేదాన్ని, జరిగినదాన్ని నిజంగా చెప్పు' అని అడిగింది. అప్పుడా సోదెకత్తె ధరణీదేవి మనసులో అనుకున్న దానిని గుర్తించి 'కళ్యాణీ! నీవు మధ్యరాశిని కోరుకున్నావు కదా! నిజం చెప్పు' అని అడిగింది. ధరణీదేవి అవునని అంగీకరించి, 'సరే! నేననుకొన్న రాశిని చెప్పావు. దాని ఫలితాన్ని కూడా చెబితే నీకు ధనరాశినిస్తా'నన్నది. అంత సోదెకత్తె 'మహారాణీ! మీ శిరోరత్నాన్గా నాకి సేదాస్తే నిజం చెబుతాను' అన్నది. అంత ధరణీదేవి బంగారు పాత్రలో క్షీరాన్నాన్ని తీసుకుని వచ్చి సోదెకత్తెకిచ్చి నిజం చెప్పమని అడిగింది. సోదెకత్తె ఆ క్షీరాన్నాన్ని పసిబిడ్డకు పెట్టి 'తల్లీ! నీవు నీ కుమార్తె అనారోగ్యాన్ని గురించి అడుగుతున్నావు. ఇది ఒక పురుషుని వల్ల కలిగింది. అతడు కనబడకపోవుట వలన మీ కుమార్తె మదనపీడితురాలై శరీరతాపాన్ని పొందింది. అతడు దేవాదిదేవుడు, వైకుంఠం నుండి స్వయంగా వచ్చాడు. అతడశ్రీ వేంకటాచలంపై స్వామిపుష్కరిణి తీరంలో ఉన్నాడు. అతడు మాయావి. పరమానందస్వరూపుడు. లక్ష్మీదేవితో కూడ ఆ లక్ష్మీపతి స్వేచ్చారూపధారియై తన భక్తుల కోరికలను తీరుస్తూ విహరిస్తున్నాడు. అతడొకనాడు గుజ్రాన్నధిరోహించి వనాంతరంలో విహరిస్తూ రాజుగారి ఉపవనానికి వచ్చి మీ కుమార్తెనూ శాడు. లక్ష్మీ సమానురాలైన ఈమెనూ చి ఆయన అక్కడ మన్మథవశుడై తన సఖిని (వకుళను) నీ వద్దకు పంపగలడు. ఈమె లక్ష్మీదేవి వలె ఆయనను పొంది చిరకాలం సుఖించగలదు. నా మాట నిజం. నా పుత్రునికి అన్నం పెట్టు' అని చెప్పి ఊరుకుంది. అంతట ధరణీదేవి ఆ బిడ్డకు అన్నం పెట్టి ఆమెను పంపించింది. 


ఆమె వెళ్ళగానే ధరణీదేవి లేచి ఆ ముంగిలి నుండి అంతఃపురంలోకి వెళ్ళింది. అక్కడ మదన జ్వరపీడితురాలై తన సఖులతో కూడి ఉన్న తన కుమార్తె పద్మావతిని సమీపించి 'అమ్మాయీ! నేను నీకు ఏమి చేయాలి? నీకు ఏది ఇష్టమైనది?” అని అడుగగా మనస్విని అయిన పద్మావతి తల్లితో నెమ్మదిగా 'తల్లీ! లోకంలో సకలజన నయనాభిరాముడు, సత్పురుషుల మనస్సుకు ప్రియమైనవాడు, బ్రహ్మాదులూ డగోరువాడు, సర్వవ్యాపి, పూజనీయుడు, తేజోవంతులలో తేజస్వి, దేవాదిదేవుడు, సత్పురుషులచే భక్తులచే పొందదగినవాడు, దుష్టులచే ఒకప్పుడు కూడా పొందరాని వానియందు నా మనస్సు లగ్నమైంది. భక్తాభీష్ట ప్రదుడైన అతడే మనచే అన్వేషింపదగినవాడు' అని పలుకగా విని ధరణీదేవి భగవంతుని లభింపచేసే భక్తుల లక్షణాలను తెలుపమని పద్మావతిని అడిగింది.


13. భక్తుల లక్షణాలు :


అంతట పద్మావతి తల్లితో భక్తుల లక్షణాల నిలా చెప్పింది. 'ఇది చాలా రహస్యమైనది. భక్తుల భుజద్వయంలో నిత్యం శంఖ చక్ర చిహ్నాలుంటాయి. వారు ఊర్ధ్వపుండ్రాలను ధరిస్తారు. కొందరు విశేషంగా ద్వాదశ పుండ్రాలను ధరిస్తారు. లలాటంలో, ఉదరంపైన, హృదయంపైన, కంఠంపైన, జఠరంపైన, ఉభయ పార్శ్వాలలోను, భుజద్వయంపైన, వీపుకు రెండువైపుల, మెడమీద కేశవాది నామాలతో, ద్వాదశ స్థానాల్లో ద్వాదశ పుండ్రాలను ధరించి వాసుదేవునికి శిరస్సు వంచి నమస్కరిస్తారు. భక్తుల మంచి నియమాలను కూడా చెబుతాను విను. వారు వేదపారాయణంలో ఆసక్తులై వైదిక కర్మలను ఆచరిస్తారు. సత్యాన్నే చెబుతారు. ఒకప్పుడు కూడా ఇతరులనూ సి అసూయపడరు. ఇతరులను నిందించరు. పరధనాన్నపహరించరు. పరస్త్రీలు ఎంత సుందరమైన వారైనప్పటికీ వైష్ణవులు వారిని స్మరించయా డరు, తాకరు. వారు సర్వభూతదయ కలవారు. సర్వభూత హితులు. వారు ఎల్లప్పుడు భగవంతుని కీర్తిస్తుంటారు. ఇటువంటి వారే భక్తులని తెలుసుకో. వారు ప్రాప్తమైన ధనంతో సంతోషిస్తూ స్వభార్య యందే ఆసక్తి కలవారుగా వుంటారు. వాళ్ళు రాగాన్ని, క్రోధాన్ని, భయాన్ని వదలినవారు. వారిని వైష్ణవులుగా, భక్తులుగా తెలుసుకో.


ఈ లక్షణాలు కల వైష్ణవ భక్తులు పంచాయుధ చిహ్నాలను కూడా ధరిస్తారు. తండ్రి లేదా ఆచార్యుని ద్వారా భక్తుడు తన వంశాచార ప్రకారం అగ్నిని ప్రజ్వలింపచేసి చక్రాది ఆయుధ మంత్రాలతో పదహారు ఆహుతులతో హోమం చేయాలి. ఆ తరువాత మూలమంత్రంతో, పురుషసూక్తంతో, ఆపై 'జాతవేద' అనే మంత్రంతో, నూట ఎనిమిది సార్లు మహావ్యాహృతులతో హోమం చేసి చక్రాదులను అగ్నిహోత్రంలో కాల్చాలి. ఈ విధంగా ఆచార్యులు తగినంతగా వేడిచేసిన ఆ చక్రాదులను శిష్యుడు మంత్రం వలె ధరించాలి. రెండు భుజాలపైన శంఖచక్రాలను, శిరస్సుపైన శారంగ శరాలను, లలాటంపై గదను, హృదయంపై నఖడ్గానినధరించాలి. ఈ విధంగా ముముక్షువులైన విష్ణుభక్తులు ఈ ఐదింటిని ధరించాలి. లేదా భుజాలపై సులక్షణ యుక్తమైన చక్రశంఖాలను ధరించవచ్చు. ఈ విధమైన చిహ్నాలతో కూడిన భక్తులు వైష్ణవులనబడతారు. అటువంటి సదాచార సంపన్నులకు ఆ పరబ్రహ్మలభిస్తాడు. ఆయనయందే నాక. తి కలదు. ఆయన్నే నా మనసు పొందగోరుచున్నది. నా మనసు విష్ణువును కాక మరెవరినీ కోరడం లేదు. నీలమేఘశ్యాముడైన ఆశ్రీ పతిని ధ్యానిస్తున్నాను. స్మరిస్తున్నాను. ఆయన గురించే మాట్లాడుతున్నాను. అచ్యుతుడైన శ్రీ హరితోనే నేను జీవిస్తాను. కావున ఆయనతో కలిసే మార్గం ఆలోచించండి' అని చెప్పి పద్మావతి విరమించింది.


అది విని ధరణీదేవి విష్ణువు ఏవిధంగా ప్రసన్నుడౌతాడా అని ఆలోచించసాగింది. ఇంతలో రాజకన్యలు అగస్త్యేశుని ఆరాధించి వకుళమాలికతో కూడి ధరణీదేవిని దర్శించడానికి విచ్చేశారు. ధరణీదేవి అగస్త్యలింగార్చన చేసి వచ్చిన బ్రాహ్మణులను మృష్టాన్నాలతో సంతోషపెట్టి వస్త్రాలంకారాలతో పాటు పూర్ణదక్షిణలనిచ్చి పూజించింది. వారు అభీష్టం నెరవేరాలని ఆశీర్వదించి వెళ్ళగా, ఆమె ఆ కన్యలను 'ఓ కన్యలారా! ఈవిడ నాకు పూజ్యురాలుగా కనబడుతున్నది. ఈమె ఎవరు? మిమ్మల్ని ఎక్కడ కలిసింది? ఇక్కడకు ఎందుకు వచ్చింది?” అని అడుగగా ఆ కన్యలు 'దేవీ! ఈ దివ్యాంగన ఒక కార్యారమై మీ దగ్గరికి వచ్చింది. దేవాలయంలో శివసన్నిధిలో ఈమె మాతో కలిసింది. మేమడుగగా ఈమె మిమ్మల్ని దర్శించడానికే వచ్చినట్లు చెప్పి, మా ద్వారా రాజగృహాన్ని దర్శించడానికి వీలవుతుందా? అని అడిగింది. మేము 'మాతో రండి. మేము ధరణీదేవి దాసీలము. రాజగృహానికి వెళుతున్నాము' అని చెప్పగా ఆమె మాతోపాటు మీవద్దకు వచ్చింది. ఆమె వచ్చిన పని ఏమిటో మీరే ఆమెను అడగండి' అని చెప్పగా విని ధరణీదేవి వకుళమాలికతో 'దేవీ! మీరెక్కడనుంచి వచ్చారు? నాతో మీకేమి పని? మీరు వచ్చిన పని ఏమిటి? నిజం చెప్పండి చేస్తాను' అని అడుగగా వకుళమాలిక ధరణీదేవితో ఇలా అంది.


14శ్రీ నివాసును మ వృతాంతం :


'నేను వేంకటాద్రి నుండి వచ్చాను. నా పేరు వకుళమాలిక. మా స్వామిశ్రీ మన్నారాయణుడు. వేంకటాచలంలో ఉన్నాడు. వసంతకాలంలో ఒకనాడు ఆ ప్రభువు హంసవలె తెల్లని, మనోవేగం గల అశ్వాన్నధిరోహించి శ్రీ వేంకటాద్రి సమీపంలో వేటకై వెళ్ళాడు. అక్కడ అడవిలో తిరుగుతూ జింకలను, ఏనుగులను, సింహాలను, గురుపోతులను, శరభాలను, దుప్పులను, శుకాలను, పావురాలను, హంసలను ఇతర పక్షి సమూహాలచూ స్తూ మరొక వనంలో మదజలాన్ని వర్తిస్తున్న ఆడ ఏనుగులతో కూడిన ఉన్నతమైన ఒక గజరాజుచూ శాడు. ఆయన ఒక వనం నుండి మరొక వనానికి వెళుతూ ఆరణి నదిని సమీపించి, దాని ఒడ్డున విహరిస్తుండగా పద్మాలు, కలువలపై నుండి వీచే శీతల వాయువులు ఆ వనం నుండి నెమ్మదిగా వీస్తూ వచిశ్రీ నివాసుని శ్రమను పోగొట్టాయి. అక్కడి వృక్షాలు ఆయనపై పుష్పవృష్టిని కురిపించి సేవించాయి. ఈ విధంగాశ్రీ నివాసుడు పుష్పభారంతో వంగిన వృక్షాల మధ్య విహరిస్తూ గజరాజును వెతుకుతూ మంచి రూపం కలవారు, మేఘాల మధ్య మెరుపుతీగె వలె నున్న మనోజ్ఞలైన, పూలతీగెలవలెనున్న కన్యలనుచూ శాడు. వారిమధ్యలో సుమనోహరిణి, లక్ష్మి సదృశురాలు, బంగారు వర్ణం కల కన్యచూ చి ఆమెయందు మనస్సును లగ్నం చేశాడు. 'ఈమె ఎవరు?” అని అతడా కన్యలను అడిగాడు. 'ఈమె ఆకాశరాజు కుమార్తె' అని వారు చెప్పగా విని వెంటనే గుఱ్ఱం ఎక్కి వేగంగా తన నివాసమైన వేంకటాద్రికి వెళ్ళాడు. స్వామి పుష్కరిణీ తీరంలో ఉన్న తన నివాసానికి వచ్చి నన్ను పిలిచి 'ఓ సఖీ! వకుళమాలికా! నీవు ఆకాశరాజ పురానికి వెళ్ళి అంతఃపురంలో ప్రవేశించి రాణి ధరణీదేవిని కుశలమడిగి ఆమె కుమార్తె సౌందర్యవతియైన పద్మావతిని నాకొఱకు యాచించు. రాజుగారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని వెంటనే తిరిగి రమ్ము' అని శ్రీ నివాసుడు ఆజ్ఞాపించగా మీ వద్దకు వచ్చాను. రాజుగారితోను, మంత్రులతోను ఆలోచించి మీకు తోచిన విధంగా చేయండి. మీ అమ్మాయిని విచారించిన తర్వాతనే మీ అభిప్రాయాన్ని చెప్పండి' అంది. (సశేషం)