- ప్రహ్లాదుడు చెప్పిన | పరమాత్మ తత్త్వం - - డా|| కూర్మాచలం శంకరస్వామి వినుడి - 

- ప్రహ్లాదుడు చెప్పిన | పరమాత్మ తత్త్వం                - డా|| కూర్మాచలం శంకరస్వామి వినుడి - 


వినుడి వినుడి ఓ విజ్ఞులారా మహాభాగవతము చెవులారా కనుడి కనుడి ఓ ప్రాజ్ఞులారా కమ్మని కావ్యం కనులారా బమ్మెర పోతన భక్తి రసామృతం ద్వాదశ స్కంధాల ధర్మసంజాతం దశావతారాల దివ్య సందర్శితం దురిత జాలములు బాపు దివ్యత్వం


తెలుగు సాహిత్య వినీలాకాశంలో బమ్మెర పోతన రచించిన మహాభాగవతం మణిపూస వంటిది. ముఖ్యంగా భక్తి సాహిత్యంలో ఇది మకుటాయమానమైనది. “భద్ర గజధీర గతి తామ్రపర్లి నుండి భక్తిరస జీవనం చంద్రభాగ వరకు” అన్న పుట్టపర్తి వారి అభిప్రాయం ప్రకారం అత్యంత భక్తిరస ధారను పలికించిన మహాకవి బమ్మెర పోతన. ఇది తెలుగునాట ఆబాల గోపాలాన్ని ఎంతగానో అలరించింది అనుటలో ఏమాత్రం సందేహం లేదు. పన్నెండు స్కంధాలలో దశమ స్కంధానికి ఎంతటి ప్రాచుర్యమున్నదో, అంతే ప్రాధాన్యత సప్తమ స్కంధానికి కూడా ఉంది. అందులో ప్రహ్లాద చరిత్ర ప్రత్యేకంగా పేర్కొనవచ్చు. హిరణ్యకశిపునకు విచిత్ర చరిత్రులునలుగురు కుమారులు పుట్టారు. అందులో ప్రహ్లాదుడు మహాభక్తుడు. అతనికి సర్వభూతదయ అతి బాల్యం నుండే సంక్రమించింది. పరస్త్రీలను తల్లిలాగా మనస్సులో భావించేవాడు. పెద్దలు కనిపిస్తే వినయంతో నమస్సులర్పించేవాడు. కష్టాలలో నున్నవారిని ఆదుకునేవాడు. అందరిని



సమభావంతో చేవాడు. స్నేహితుల్నిసోదరులదా చేవాడు. మంచి అందంతో పాటు సంపూర్ణ విద్యాగంధం మెండుగా కల్గినవాడు. కావలసినంత సంపద సౌభాగ్యమున్నవాడు. అయినా విషయేంద్రియాలకు అందకుండా ఉండేవాడు. బలం, వయస్సు, ప్రతిభ, ప్రాభవం ఉన్నను అందరితో ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవాడు. కామక్రోధాదులు లేనివాడు. ఎన్ని భోగాలున్నా అనుభవించేవాడు కాదు. నిత్యం హరినామ స్మరణ తప్ప ఇతరం ఎరుగడు.


రాక్షసరాజైన హిరణ్యకశిపుని కుమారుడైనా దేవతల చేత కీర్తించబడినవాడు ప్రహ్లాదుడు. పిల్లలతో ఆడేటప్పుడు పరిహాసానికైనా అబద్దమాడేవాడు కాదు. ఎప్పుడూశ్రీ హరి నామామృత పానంతోనే మత్తెక్కి ఉండేవాడు. నారాయణుడు తన పక్కనే యున్నట్లు అతనితో మాట్లాడుతున్నట్లు ఉండి స్నేహితులు పిలిచినా పలుకకుండా పరధ్యానంలో ఉండేవాడు. తన హృదయంలో నారాయణుడు పూర్తిగా యుండడంతో అందరినీ మరిచిపోయేవాడు.


ఈ విషయాన్ని గమనించిన హిరణ్యకశిపుడు బాగా ఆలోచించి, తనకు విరోధులైన దేవతలను ధ్యానించడం ఇష్టం లేక తన దానవ విద్యోపదేశం చేయించాలని భావించి ఒకనాడు కుమారుని రావించి చదువు గురించి ఈ విధంగా వివరించాడు.


అని చెప్పి శుక్రాచార్యుని కుమారులైన చండా మార్కులకు అప్పగించాడు. వారి దగ్గర కూడా ప్రహ్లాదుడుశ్రీ హరి కథలనే వల్లె వేస్తూ గురువులు చెప్పింది వినకుండ్రీ హరి చరణారవింద భజనే చేసేవాడు. ఇలా కొన్ని రోజుల తరువాత హిరణ్యకశిపుడు గురువుల వద్ద చదువుతున్న తన కుమారుడైన ప్రహ్లాదుని రప్పించి ఇంతవరకు నేర్చుకున్న శాస్త్రమొకటి చెప్పుమనగా... పితృదేవా ! “ఎల్లశరీరధారులకునిల్లనుచీకటినూతిలోపలన్” అనగా ఈ దేహాన్ని ధరించే వారందరికీ తమ గృహమనే చీకటి నూతిలో పడిపోక, నావారు, పరవారు అనే భేదభావం లేకుండా ఉండాలి. అందరూ మతి చలించి తిరుగుతున్నారు. ఈ సర్వముశ్రీ హరి యొక్క కటాక్షమని భావించి ప్రశాంతంగా నారాయణుని మయమే సర్వమని భావించి వనంలో జీవించుటే జన్మకు సార్థకమని ప్రహ్లాదుడు చెప్పిన మాటల్లో మానవులు సంసార చక్రంలో చిక్కుకోకుండా శ్రీ మన్నారాయణుని ధ్యానించాలని పరమాత్మ తత్వాన్ని ధ్వనింపచేస్తాయి. అలాగే గురువుగారు నెమ్మదిగా మందలించినప్పుడు ప్రహ్లాదుడు ఇలా అన్నాడు. గురువర్యా! కొందరు మూడులశ్రీ మన్నారాయణుడే సర్వాంతర్యామి అని తెలుసుకోలేక నేను, నాది, ఈ సంసారం, ఈ ప్రభుత్వం అంతా నాదేనని భేదభావంతో ఉంటారు. ఆ బ్రహ్మాదులే ఆ పురుషోత్తముని దర్శనం చేసుకొనగలుగుతారు అని ప్రహ్లాదుడు మాటల్లో నాది, నా ఆస్తి అనే అహంకారం విడనాడాలని ప్రబోధించాడు. పరమాత్మను చేరాలంటే అహంకారము, మమకారాదులను వదిలి వేయాల్సిందే. ఈ మాటలు విన్న హిరణ్యకశిపుడు ఆగ్రహించి హరి లేడు, గిరి లేడని పలుకగా అప్పుడు ప్రహ్లాదుడు అతి ప్రశాంతంగా ఇలా అన్నాడు. తండ్రీ! ఇనుము అయస్కాంతము దగ్గరకే చేరునట్లు నా హృదయం కూడా సర్వకాల సర్వావస్థల్లో ఆశ్రీ హరి వైపే పరిగెడుతుంది. నాకు దీనిలో ఆవగింజంత ప్రమేయం లేదు. ఇది విను...


ఓ తండ్రీ! ప్రతిదినము మందార పుష్పాల యొక్క మకరందాన్ని గ్రోలేతుమ్మెదలు ఉమ్మెత్త పూలను ఆశ్రయిస్తాయా? తో మానస సరోవరంలో విహరించే రాజహంసలు వాగులకు వంకలకు పోనట్లే,తో లేత చిగుర్లు ఆరగించి కమ్మగా పాడే కోకిలలు గడ్డిపరకలను ఆరగించవు. చంద్రుని వెన్నెలలు కోరే చకోర పక్షుల్లా నా మనస్సు కూడా శ్రీ హరి పాదపద్మముల యందే నిలిచియున్నది అని చెప్పిన మాటల్లో ప్రహ్లాదుని చిత్తశుద్ది, దైవభక్తి ఎంతగానో కనబడుతుంది. ఈ పద్యం భాగవత మహాపురాణంలోనే అపూర్వం. సహృదయ సమ్రాట్టులకు వేద్యం, గొప్ప నైవేద్యం. అపూర్వ మాధుర్యం. కవితార్డులకెల్ల యిది కంఠగతం. పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు తన తండ్రిని తన దివ్యవాక్య చమత్కృతితో ఎంతగా లాలించాడో, సద్గుణశీల సంపదలతో నుతింపబడినవాడా అని వెంటనే నీవు వేయి మాటలు మాట్లాడతావెందుకు? నేను చెప్పినది జాగ్రత్తగా విననవయ్యా! అని అనడంలో విద్యార్థి బాగుకొరకు ఆచార్యుడు గద్దించినట్లు సుతిమెత్తంగా మందలింపూ ఉంది. మందారపుష్పం అందంగా, ఆకర్షణీయంగా, మృదువుగా ఉంటుంది. అటువంటి పుష్పంలో ఉండే మకరంద మాధుర్యం మహనీయంగా అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూవుల పైకి పోతుందా? ఇందులో 'మా' అనే అక్షరాలు అయిదున్నాయి. 'మా' అనగాశ్రీ మహాలక్ష్మి. నిర్మలాతి నిర్మలంగా ఉన్న పరమపావని గగన గంగా తరంగాలలో తేలియాడుచు అందులోగల తామర తూడులను భక్షించు రాజహంస చిన్న మురికి గుంటలాగున్న తరంగిణిలో చేరుతుందా? తీయమామిడి గున్న చిగురుటాకులే తిని ఆనందించు సంగీత సారస్వత కోకిలమ్మ గడ్డిపరకలు వేస్తుందా? పరిపూర్ణ పూర్ణిమ చంద్రునిలో గల అమృత కిరణాల్ని ఆహారంగా చేసుకొని చకోరం దట్టమైన మంచుగడ్డలకు చేరుతుందా? అలాగే శ్రీ మన్నారాయణుని పాఠ, ధ్యానామృత పానంతో విశేషమైన మత్తుగల నా చిత్తం యింకొక దానిలో చేరుతుందా? అని ప్రహ్లాదునిచే పలికించిన ఈ పద్యమెంత మధుర మంజుల మకరందాల మహనీయ, మనోహర మహా కవితా రసాన్ని మనకు అందించారో పోతనామాత్యులు. ఇక్కడ తుమ్మెద గూర్చి ఎంత ధ్వనిని చెప్పాడు. తుమ్మెద పచ్చపురుగుని తెచ్చి దాని చుట్టూ “ఝం” అని ఏకాగ్రభావంతో జృంభిస్తుంది. అలా కొంతవరకు జృంభించగా పచ్చపురుగు ఆశ్చర్యంగా తుమ్మెదగా మారిపోతుంది. అలాగే తండ్రీ! నీ గర్భంలో పుట్టాను. కానిహరిభక్తి అనే తుమ్మెద ఝంకారమువలశ్రీ హరి భక్తునిగా మారిపోయాను. ఆ పచ్చపురుగు ఎలా తుమ్మెదగా మారి మరల పచ్చపురుగుకాలేదో అలాగే నేనుమరల మీరాక్షసగుణసంపత్తిని పొందలేను. మూడు లోకాలను గెలిచిన హిరణ్యకశిపునికి మృదువుగా మధురంగా చెప్పాడు ప్రహ్లాదుడు.


ఆ మాటలకు గురువులు ఆగ్రహించి అయిదు వత్సరాల బాలుడు రాక్షస చందనవనంలో కంటకుడుగా మారాడని అనేక విధాల దండించినా ప్రహ్లాదునిలో మార్పు రాలేదు. మళ్ళీ హిరణ్యకశిపుడు కుమారుణ్ణి దగ్గరకు తీసుకొని చదువుకున్న విశేషాలను చెప్పుమనగా ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు.


తండ్రీ! గురువులు ఎంతగానో చదివించిరి. నేను ఏది నేర్వాలో అది నేర్చితిని. అంతేకాదు చదువులలో దాగియున్నరహస్యాలను కూడా తెలుసుకొంటిని అని ప్రహ్లాదుడు చెప్పినట్లు రచించిన ఈ పద్యం పోతన ప్రాస ప్రజ్ఞా పాటవాలు తెలియజేస్తున్నాయి. ఈ పద్యంలో “చదివించి, చదివితి, చదివినవి, చదువుల అనే నాలుగు శబ్దాలు సరిగ్గా ప్రాస స్థానాల్లో వాడారు. పద్యానికి బిగువు, అందం ఎంతో వచ్చింది. రసజ్ఞ పాఠకుల మరో చమత్కారం “చదువులలో మర్మమని” చెప్పడం పోతన కవిత్వ పటిమకు నిదర్శనం. ఇంకా పరమాత్ముని గూర్చి వివరిస్తూ.... త్రికరణ శుద్ధిగాశ్రీ హరిని ముఖ్యమిత్రునిగా అతని పాదసేవా భావాన్ని భావించి, “తన హృద్భాషల సఖ్యమున్” అనే పద్యంలో నమస్కారం, అర్చన, దాసత్వం, ఆత్మజ్ఞానంతో, సంకీర్తిస్తూ, నిరంతరం చింతిస్తూ సర్వాంతర్యామి నారాయణుని గాఢమైన భక్తితో నమ్మడం సజ్జనులకు, జ్ఞానులకు శ్రీ యోమార్గం.


శ్రీ హరి భక్తి లేనివారికి ఈ పనులన్నీ కన్నులు లేనివాడికి వెన్నెల వెలుగులా, చెవిటికి శంఖధ్వనిలా, నోరులేనివానికి మంచి గ్రంథం చదవడంలా, చేసిన మేలు మరచిన కృతఘ్నతా బంధుత్వంలా, బూడిదపై హవిర్భావంలా, పిసినారి ధనంలా, పందికి పూసిన సుగంధంలా ఉంటాయని ఎంతో ఉ పమానాయుక్తంగా వర్ణించాడు పోతన.


అలాగే శ్రీ హరిని సేవించని వాని శరీరం గాలి నింపిన తోలుతిత్తి, హరిని కీర్తించని నోరు డమడమ లాడు డక్కయని, హరిని పూజించని చేతులు కట్టెతో చేసిన తెడులని, కమలేశుని చూ డని నేత్రాలు, శరీమును గోడకు పెట్టిన రంధ్రాలనిశ్రీ పతిని గురించి ఆలోచించని జన్మ గాలిబుడగ యని, విష్ణుభక్తి లేని పండితుడు రెండు కాళ్ళ పశువని, అలా భక్తిభావామృతంలో తేలుతూ మునుగుతూ శరీర స్పృహ లేకుండా హరిని గూర్చి మాట్లాడుతుంటే హిరణ్యకశిపుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. అసలే మద్యం మత్తులో ఉన్న అతని నేత్రాలు ఎరుపెక్కాయి. అయినా ప్రహ్లాదుడు శ్రీ హరి సాక్షాత్కరించి అతనితో మాట్లాడుతున్నట్లు హరి ప్రశంసలు చేస్తూ..... తండ్రీ! ఈ సంసారమను మేఘాలు తొలగాలంటేశ్రీ హరి సేవా ఝంఝా మారుతం కావాలి. సంసార తాపత్రయ దావాగ్ని చల్లారాలంటేశ్రీ విష్ణు సేవా వృష్టి కురియాలి. మన పాపాగ్ని సాగరాలింకిపోవాలంటే హరి అనుగ్రహ బడబాగ్ని కావాలి. మన సర్వ ఆపదలు, అంధకారం సమసిపోవాలంటే శ్రీ మహాలక్ష్మీనాథుని కటాక్ష భాస్కర కిరణాలు ప్రసరించాలని, మనకు మరల జన్మలు లేకుండా ఉండాలన్నా ముక్తినిధి కావాలన్నాశ్రీ నారాయణ స్మరణ అనే అంజనం కావాలి. అంతకన్నా వేరేమార్గం లేనే లేదని ప్రహ్లాదుడు హరినామ తన్మయత్వంతో హిరణ్యకశిపుని తొడమీద కూర్చుని చెప్పాడు. ఆగ్రహించిన హిరణ్యకశిపుడు ఈ జ్ఞానం నీకెలా వచ్చిందని అడగగా...


కన్నులు లేనివాడింకొక గ్రుడ్డివాడిని వెంబడిస్తే ఎలా మార్గం తెలుస్తుంది? ఎప్పుడూశ్రీ హరిని ధ్యానించేవారికే సర్వమూ అవగతమౌతుంది. ఓ దానవేంద్రా! సర్వశాస్త్రాల సారాన్ని చెబుతాను విను. ఈ సంసార సాగరాన్ని తరించాలంటే భార్యాబిడ్డలూ మొసళ్ళూ మొదలైన జల జంతువులకు చిక్కకుండా ఉండాలన్నా ఆ మాధవుని పాదపద్మాలే గతి. మరొక దారి లేదు అన్న ఈ మాటల్లో ఎంత పరమాత్మ తత్త్వముందో మనకు అర్థమవుతుంది. అంతేకాదు హిరణ్యకశిపుడు పెట్టిన అన్ని చిత్రహింసలనశ్రీ మన్నారాయణుని స్మరణతో ఎదుర్కొని నిలబడ్డాడు. ప్రహ్లాదుడు రాక్షస బాలురతో చెప్పిన రహస్యాలు అనన్య సామాన్యమైనవి. ఆటలాడుటకు రమ్మన్న రాక్షస బాలురను చుట్టూ కూర్చుండబెట్టుకుని ఇలా చెప్పాడు. మిత్రులారా! మన వయస్సువారెందరో చనిపోవడం మీద స్తున్నారు. మన గురువుగారు మనకు పనికివచ్చే విషయాలను బోధించడం లేదు. ఆ విషయాలను నేను వివరించెదను శ్రద్ధగా వినండి. “ఈ భూమ్మీద కొన్ని లక్షల ప్రాణులున్నాయి. అన్ని ప్రాణుల్లో నరజన్మ ఉత్తమమైన జన్మ. దీనిలో పురుషుడై పుట్టడం పుణ్యం చేస్తే కాని జరగని పని. మనకు సరిగా నూరు సంవత్సరాల వయస్సు. అందులో సగభాగం మహాంధకారమైన రాత్రి భాగాన పోతుంది. దీనిలోనే నిద్ర, కలలు కూడా ఉన్నాయి. ఇక మిగిలిన యాభై వత్సరాలలో బాల్యం, యౌవనానికి ఇరవై ఏళ్ళు గడుస్తాయి. ఇంక మిగిలిన మూడు పదుల సంవత్సరాలలో ఇంద్రియాలకు చిక్కి కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే త్రాళ్ళతో బంధించబడి వాటికి బానిసలవుతున్నారు. మరికొందరు దురాశలకు లోనై దొంగలుగా మారుతున్నారు. దురాశపరులైన మానవులు భార్యా వ్యా మోహంలోనూ, ఇతర స్త్రీల సంభోగంలో పడి సంసార సాగరంలో మునుగుతూ, తేలుతూ సర్వం అర్పించుకుంటారు. ఇంకొందరు మహనీయమంజుల మధురంగా పలికే పలుకులకు వశమై శీల, వయస్సు, రూప, లావణ్య కన్యలను కంటారు. ఇంకొందరు వినయ, విద్య, వివేక కుమారులు కావాలని, తాము చెప్పినట్లు చేసే సోదరులని పొందాలని ఆరాటపడుతుంటారు. మరికొందరు తల్లితండ్రులు, ఆలు పిల్లలు, బంధువులు, ధన కనక వస్తు వాహనాల మాయల్లో సాలెపురుగుల్లా కొట్టుకుపోతుంటారు. బాహ్యపరమైన వస్తువులపై వ్యామోహం చెందకుండా భగవంతునిపై నమ్మకంతో అతని నామస్మరణ చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. దానికోసం ఏమి చేయాలో ప్రహ్లాదుడు ఇలా వివరించాడు.


అంతే కాదు. మనమందరూచూ స్తున్నాం కదా! గృహస్తులై యుండి ముందు ఆలోచన లేక పిచ్చివాళ్ళలాగా బ్రతుకుతున్నారు. సంసారాన్ని విడిచిపెట్టలేక చస్తూ పుడుతూ, మరల చస్తూ పుడుతూ ఇలా నానా క్రిమికీటకాల యోనుల్లో పుట్టి మరణిస్తున్నారు. గర్భనరకం భరింపరానిది. తామెవ్వరో, తమకర్మమేమో తెలియక సంసార తరంగాలలో కొట్టుకుంటున్నారు కాబట్టి మనమందరమూ చావు పుట్టుక లేని ఒక గొప్ప మార్గాన్ని వెతుక్కుని ఆమార్గం గుండా ప్రయాణించడం శ్రీ యోదాయకం. తాగిన మత్తులో స్త్రీల వాడి చూపుల్లో పడి మహావిద్వాంసులైనవారు కూడా స్త్రీ లోలురు అవుతున్నారు. ఇంద్రియ సుఖాలు కోరి వాటికి బానిసలై వర్తించే రాక్షసమూకలో మనం చేరొద్దు. ముక్తి మార్గం చేకూర్చే మంచి మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. ఈ వయస్సులో విజ్ఞులు చెప్పే సకల విషయాలను చెవులారా విందాం. భగవంతుడు త్రిగుణాత్మకమైన మాయచేత మనందరిని ఆటాడిస్తాడు. మీరందరు మీమీ రాక్షస తత్వాన్ని విడిచి సర్వభూతాల యందు దయతో, మతో ఉన్న ఆశ్రీ హరి సంతోషించి కటాక్షిస్తాడు. పురుషార్థాలను ప్రసాదిస్తాడు. ఈ ఆత్మ నిత్యమైనది. పరిశుద్ధమైనది. నాశనం లేనిది. ఈ దేహమనిత్యమైనది. కాబట్టి దానిపై ఏమాత్రం మమకారం ఉండకూడదు. బంగారానికి పుటం పెట్టినట్లుగా ఆత్మను ఆశ్రయించి శరీరాన్ని కల్మషరహితంగా మార్చుకోవాలి. మూలప్రకృతి మహదహంకారాలు, పంచతన్మాత్రలు ఇవి ఎనిమిది ప్రకృతులు అంటారు. రజస్సత్వాలు మూడు ప్రకృతికి గుణాలు. వాక్వాణి పాదయుపస్త్రాలు, కర్మేంద్రియాలు, శ్రవణ, నయన రస నత్వణఘా మనస్సు జ్ఞానేంద్రియాలు. మహి సలిల వేదో వాయురాకాశాలను పదహారు వికారాలు. ఈ ఇరువది యేడింటిని ఆత్మకూరుకుని ఉంటుంది. ఈ అనేకంతో కూడినదే దేహం. దేహంలో ఉన్న ఆత్మను జాగ్రత్తగా వెదకాలి. భగవత్సాక్షాత్కారం పొందాలంటే సద్గురు శుశ్రూష, త్యాగం చేయడం. అనునిత్యం శ్రీ హరి నామస్మరణం చేసినప్పుడే ఆత్మ సాక్షాత్కారమవుతుంది. పరమాత్మ తత్త్వం బోధపడుతుంది అని పలికిన భక్షా సరుడైన ప్రహ్లాదుని ప్రవచనాలు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికైనా శిరోధార్యాలే. సర్వం శ్రీ మన్నారాయణ చరణం శరణం ప్రపద్యే.