ధారావాహికం -5 మహాభారతంలోని మహాపాఖ్యానాలు - డా|| పులిగడ్డ విజయలక్ష్మి


గత సంచిక తరువాయి


“నీ తదగ్గమకాగ దేవ నిర్మితంబిది” “ఈ సర్పయాగం నీకోసమే దేవతల చేత కల్పించబడింది. ఇతరులు దీనిని చేయలేరు. ఈ యాగం పురాణ ప్రసిద్ధ ప్రాచీనమైనది. నీ ఒక్కనికే సాధ్యమైనది” - అన్న ఋత్విజుల వాక్కు ననుసరించి యాగం చేశాడు జనమేజయుడు. ఈ సర్పయాగానికి వ్యాస, వైశంపాయన, పైల, జైమిని, సుమంత, శుక, మౌద్గల్య, ఉద్దాలక, మాండవ్య, నారద, పర్వత, రోమశ మొదలైన వందలాది త్రికాలజ్ఞాన సంపన్నులైన మహరులెందరో సదస్యులుగా విచ్చేశారు. ఉదంకుడు పరమానందంతో తన వాంఛ ఫలిస్తోందని గురువులకు నమస్కరించి అక్కడే ఆసీనుడయ్యాడు. యాగ మంత్రాల ప్రభావానికి ప్రముఖ సర్పరాజులు వేలాదివేలు ఆ యాగాగ్నిలో పడి, మాడి మసైపోయారు. ఈ యాగానికి మూలకారకుడు, దేవసర్పరాజు అయిన తక్షకుడు మాత్రం దేవేంద్రుని శరణు వేడి, ఆతని రక్షణ పొందాడు. అదే సమయంలో నాగదేవుడైన వాసుకి మాటను, కన్నతల్లి, నాగభగిని అయిన జరత్కారువు మాటను పాటించి ఆస్తీక మహర్షి సర్పయాగ స్థలానికి వెళ్ళి, జనమేజయుని వేనోళ్ళ ప్రశంసించి, ఆశీర్వదించాడు. ఆస్తీక మహామునికి నమస్కరించి, ఆతిథ్యమిచ్చి


“నీ కోరికను తెలియ చెప్పు. తప్పక తీరుస్తాను” అని వినయంగా పలికాడు జనమేజయుడు. అంతే.


“కోపాన్ని ఉపశమించుకుని, దయతో, సర్పాల యొక్క మనోవ్యధ తీరేటట్లుగా, నాకును ప్రియమయేటట్లుగా ఈ సర్పయాగాన్ని మానివేయుము” అని కోరాడు లోక కళ్యాణ కారకుడైన ఆస్తీకుడు. - నిజానికి జనమేజయునికి సర్పయాగం ఆపివేయడం ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆస్తీకుడు "మానిత సత్యవాక్య” అని సంబోధిస్తూ ఇచ్చిన మాటను నిలుపుకోమని హెచ్చరిస్తూ ఆతని వంశాన్ని స్తుతిస్తూ - తన మేనమామల వంశాన్ని కాపాడమని కోరుకున్నాడు. ఆహూతులైన వారందరూ కూడా ఆస్తీకముని కోరిక తీర్చమని జనమేజయుని ప్రోత్సహించారు. అతిథి దేవుడైన ఆస్తీకముని కోరిక, సదస్యులైన మహరులందరి కోరిక ఒకటే కావడంతో, ఇచ్చిన మాట మేరకు జనమేజయుడు వెంటనే యాగాన్ని ఆపివేశాడు. కానీ, మంత్ర మహిమతో అప్పటికే హెూమాగ్నిలో పడబోతున్న తక్షకుడిని - తన తపశ్శక్తితో మధ్యలోనే ఆపి, అగ్నిలో పడకుండా కాపాడి, ఆస్తీకుడు - తల్లి కోరికను తీర్చిన తనయుడయ్యాడు. ఇక్కడ ఒకానొక విశేషాన్ని గ్రహించాలి. అటు ఉదంకునికి, ఇటు జనమేజయునికి ఆగ్రహం కలిగించి, సర్పయాగానికే మూలకారకుడైన తక్షకుడు - అగ్నికి ఆహుతి కాలేదు. మాట మేరకు జనమేజయుడు ఊరుకోక తప్పింది కాదు. మరి ఉదంకుడు! సదస్యులలో గురువుకే గురువు అయిన వ్యాసభగవానుడున్నాడు. గురువైన పైల మహర్షి ఉన్నాడు. వారందరి కోరిక కూడా యాగం పూర్తి కాకూడదనే కదా. వినయ సంపన్నుడు, గురుభక్తి పరాయణుడు, గురు ప్రశంసితుడు అయిన ఉదంకుడు తక్షకునిపై తనకు కలిగిన క్రోధాన్ని ఉపశమించుకున్నాడు. గురువు మాటను పాటించడం శిష్యుని ప్రథమ కర్తవ్యం. అందుకే తానుగా మౌనం వహించాడు. మహాభారత కథా పరమార్థం అమృతత్వ సాధనం. గరుడుని కథ - అమృతం తాగకుండానే అమరుడైన పక్షీంద్రుని కథ. అమృతాన్ని అందించినా అందుకోలేని పాముల కథ. ఉదంకుని కథ - లోక కంటకాలైన దుష్ట సర్పాలను అగ్నికి ఆహుతి చేయించిన కథ. వాసుకి, తక్షకాది దేవ సర్పరాజాలు ముల్లోక వాసుల చేత పూజలందుకుంటూ వరప్రదాతలైన కథ. ,


గరుడుడు మాతృభక్తి పరాయణుడైతే - ఉదంకుడు గురుభక్తి ప్రపూర్ణుడు. గరుడుడు మాతృ దాస్య విమోచన కార్యాచరణ దక్షుడైతే - ఉదంకుడు గురుకార్య నిరతుడైన శిష్యోత్తముడు. పాండవుల మాతృభక్తి గరుడుని మాతృభక్తితో పోల్చదగినదైతే - పాండవ మధ్యముని గురుభక్తి ఉదంకుని గురుభక్తికి దీటైనది. మహాభారతంలోని ఏ ఉపాఖ్యానమైనా ప్రధాన కథకు ఉపబలకంగా, అనుబంధంగా భాసిస్తుంది.


ఉదంకుడు - 2


కనులు మూసుకుని క్షణం పాటు ఆగాడు సూతమహర్షి. శౌనకాదులు కూడా సూతుడుకనులు తెరిచేవరకు ఆగి “అదేమిటి మునీంద్రా ! ఉన్నట్టుండి ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయారు” - అని అడగడంతో సూతముని “మరేంలేదు శౌనకాదులారా! ఈ ఉదంకుని కథ చెప్తూంటే నాకు మరో ఉదంకుడు మదిలో మెదిలాడు” – అన్నాడు. “ఆ! మరో ఉదంకుడా? ఆతడు కూడా గొప్పవాడేనా!? ఆ ఉదంకుని కథ కూడా వినాలని ఎంతో కుతూహలంగా ఉంది. మామీది వాత్సల్యంతో ఆ కథ కూడా చెప్పండి” - అంటూ శౌనకాదులు ఆసక్తిమా పించారు. సూతుడు కూడా అందుకు సంతోషించి "మునివరులారా! అవును ఆ ఉదంకుడు కూడా అమేయ తపశ్శక్తిశాలి. గురుభక్తి పరాయణుడు. అంతేనా? ఒక సందర్భంలో సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్ముని శపించబోయాడు కూడా”శ్రీ మన్నారాయణుని శపించడమా!? ఎందుకు? అంత ఆగ్రహం ఎందుకు కలిగింది. శ్రీ కృష్ణుడేం చేశాడు? ఏం జరిగింది” – అంటూ ఆత్రంగా ప్రశ్నించారు శౌనకాదులు. “ఈ ఉదంకుని కథను వ్యాస మహర్షి ఆనతి మేరకు ఆతని శిష్యుడు వైశంపాయనుడు - జనమేజయునికి చెప్పాడు. అదే మీకు చెబుతున్నాను. సావధానంగా వినండి” అని సూతుడు చెప్పసాగాడు. ఒకసాశ్రీ కృష్ణుడు హస్తినగరం నుండి ద్వారకా నగరానికి వెళుతూ మార్గమధ్యంలో ఉన్న ఉదంకుడనే ముని ఆశ్రమానికి చేరి, ఆతని చేత అతిథి మర్యాదలు స్వీకరించి ఆతనితో సంభాషించాడు. ఆ మాటల మధ్యలో ఉన్నట్టుండి ఉదంకునికి కోపం వచ్చింది. శ్రీ కృష్ణడు కావాలనే సంధిని కూర్చకుండా సంగ్రామాన్ని జరిపించి కురువంశాన్ని నాశనం చేశాడని నిందించాడు.


మోసం చేసి కౌరవవంశాన్ని తుదముట్టించావు. అన్నీ తెలిసిన సమర్దుడవై కూడా సంధి చేయలేదు సరికదా ఇంతటి పాపాన్ని చేశావు. చేయించావు. అందుకు ప్రతిగా నిన్ను శపిస్తాను” - అన్నాడు ఉదంకుడు. శాంతమూర్తి అయిన పరమాత్మ - "నా మాటలు పూర్తిగా విను. కోపం చాలించు. నీవంటి వారి వలన నాకు కలిగే కీడేమీ లేదు. శపిస్తే - నీకే తపోనష్టం జరుగుతుంది. ముందు నేను చెప్పేది విను. ఆ తరువాత నీకు తోచినదే చెయ్యి” అంటూ ఆ మునీశ్వరునికి తత్త్వబోధ చేశాడు.


“ఉదంకా! సత్త్వ రజస్తమస్సులనే మూడు గుణాలూ నాలోనే ఉన్నాయి. సకల దేవతలు నానుండే పుట్టారు. నేను విష్ణువును. అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నది నేనే. సృష్టంతా నాలోనే నిశ్చలంగా ఉన్నది. చిత్తు, అచిత్తు అనే తత్త్వాలు రెండూ నేనే”. జాతములును, సమంచిత స్వర్గ మోక్ష ములును మన్మయముల కాగ తెలిసికొనుము” - అశ్వ - ప.39 – తృ.ఆ ఓంకారంతో మొదలయ్యే నాలుగు వేదాలు, నాలుగు వర్ణాశ్రమాలు, నాలుగు వర్ణాలు, వాటి విధులు, స్వర్గం, మోక్షం అన్నీ నా రూపాలే. సర్వ లోకాలలోను అత్యంత మహా మహిమలు కలిగి ఉన్న నేనే బ్రహ్మగా సృష్టినీ, విష్ణువుగా స్థితినీ, శివునిగా లయాన్నీ అనాయాసంగా చేస్తున్నాను. ధర్మహానిజరిగినపుడులోకక్షేమం కోసం నేనే అధర్మాత్ములను నశింపచేసి, ధర్మాత్ములను మహా వాత్సల్యంతో రక్షిస్తాను. కౌరవులు దుష్టులని తెలిసినా సంధి కోసమే నేను ప్రయత్నించాను. నాయీ పూనికను బ్రహ్మజ్ఞాన సంపన్నులైన వ్యాసాది మహరులెంతో మెచ్చుకున్నారు. కానీ కౌరవులు దుర్బుద్ధితో ధర్మాత్ములైన పాండవులతో తలపడి యుద్ధంలో మరణించారు. దైవంగా దుష్ట సంహారం నా కర్తవ్యం. అయినా నేను ఆయుధం చేపట్టక పాండవుల చేతనే దుర్మార్తులను సమయింప చేసి, భూతలాన్ని రక్షించాను. ఇప్పుడు చెప్పు - నా తప్పిదమేంటో? నీ కోపానికి కారణమేంటో - అని ఉదంకుని సమాధానపరిచాడు పరమాత్మ. .


అంతే. ఉదంకుడుతన కోపాన్ని పారద్రోలి “మహాత్మా! నీవు చెప్పినవన్నీ నాకు తెలిసినవే. అయినా నీచమైన కోపంతో కూడిన గర్వం నా మనస్సును కప్పివేసింది. అమృత తుల్యమైన నీ మాటలతో నన్ను నిర్మలుడిని చేశావశ్రీ కృష్ణా! నీమహా అనుగ్రహానికి నేను అర్హుడనైతే - నా మనో నేత్రాలకు నీ విశ్వరూపాన్ని పెంచి, ధన్యునిగా చెయ్యి” – అని వేడుకున్నాడు. భక్తుడు కోరినంతశ్రీ కృష్ణుడు — అర్జునుడికి పిన తన విశ్వరూపాన్ని ఉదంకునూ పించాడు. అది సి ఉదంకుడు విస్మయ భయ ఆనందాలను పొంది - పద్మనేత్రా! పరమాత్మా! నీ పాదాలు భూమినంతటినీ నింపి ఉన్నాయి. నీ శిరస్సులు ఆకాశాన్ని కప్పివేశాయి.


నీ ఉదరాలు భూమ్యాకాశ మధ్యభాగాన్ని ఆక్రమించాయి. నీ మహాభుజాలు సర్వదిక్కులలోను వ్యాపించాయి. నీవు మొత్తం విశ్వమైకనబడుతున్నావు. నీ ఈ విశ్వరూప దర్శనం నన్ను మహా తృప్తి పరిచింది. పరమ పురుషా! ఈ రూపాన్ని మరలించి నన్ను కరుణించి నీ సహజ రూపాన్ని ధరించు” అని ప్రార్థించాడు. - శ్రీ కృష్ణుడు కరుణించి తన మామూలు రూపాన్ని ధరించి వరం కోరుకొమ్మని ఉదంకుని అనుగ్రహించాడు. “నీ విశ్వరూప దర్శనం కంటే వేరే వరాలెందుకు స్వా” అన్న ఉదంకుని వాత్సల్యంతో వరం కోరి తీరాలని పట్టు పట్టాడు పరంథాముడు. ఉదంకుడు “స్వామీ! ఇది నిర్జల ప్రదేశం. కాబట్టి నీరు నాకు సదా చేరువలో ఉండేటట్లు అనుగ్రహించు” అని కోరుకున్నాడు. “తనను తలచుకుంటే చాలు - తక్షణం నీరు లభిస్తుంద"ని వెంటనే అనుగ్రహించాడశ్రీ కృష్ణుడు. ఉదంకుని ఆశీర్వదించి తాను ద్వారకకు బయలుదేరాడు.


“ఇప్పుడొక అద్భుతమైన విషయం జరిగింది” అంటూ వైశంపాయనుడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు. భృగు వంశశ్రీ ష్ఠుడైన ఉదంకుడు తిరుగుతూ తిరుగుతూ దాహం వేసి శ్రీ కృష్ణుని స్మరించాడు. అంతలో ఒక మాతంగుడు దిగంబరంగా కన్పించాడు. ఒళ్ళంతా మురికిపట్టి ఉంది అతనికి. అతనితో కుక్కలు కూడా ఉన్నాయి. అతని శరీరం నుండి మాత్రం నిర్మలమైన నీరు కారుతోంది. ఆతడు ఉదంకునితో తన శరీరం నుండి వస్తున్న నీటిని త్రాగి దాహం తీర్చుకోమని మతో అన్నాడు. అందుకు ఉదంకుడు ఇష్టపడలేదు సరికదా ఏవగించుకుని, కోపంతో అతనిని పొమ్మనమని గద్దించాడు. ఆ చండాలుడు కుక్కలతో సహా మాయమయ్యాడు. ఉదంకుడు ఆశ్చర్యపడి ఇదంతాశ్రీ కృష్ణుని లీలా విలాసమై ఉంటుందని భావించాడు. అంతే శ్రీ కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. పరమాత్ముని చూ సి ఉదంకుడు వ్యధ చెందిన మనస్సుతో “నేను చండాలుని దేహం నుండి కారుతున్న నీరు తాగుతానా? ఇలా చేశావేం దేవా” అంటూ వాపోయాడు.


అందుకు శ్రీ కృష్ణుడు “నీకెప్పుడూ ఆవేశమేనా!? నేను చెప్పేది స్పష్టంగా విను. నీ కోసం నేను చేసిన ప్రయత్నమంతా వృథా అయిపోయింది కదా. నీకు అమృతం ఇవ్వమని దేవేంద్రుని వేడుకున్నాను. నీకు తెలీక తొందరపాటుతనంతోను, ఏవగింపుతోను ఇంత మంచి భాగ్యాన్ని పొందలేకపోయావు. ఇప్పుడు వచ్చిన చండాలుడే దేవేంద్రుడు. ఆతడు నీకిస్తానన్న నీరే అమృతం. తపశ్శక్తి శాలివై ఉండి కూడా నీవు నిజాన్ని గుర్తించలేకపోయావు. నీవు గద్దించేసరికి ఇంద్రుడు అదృశ్యమయ్యాడు. నీకు అమృతాన్ని పొందే ప్రాప్తం లేకపోయింది.ఏంచేస్తాం!? నీకు నేనిచ్చిన వరం వ్యర్థం కాకుండా నీకు ఏడాది పొడుగునా నీళ్ళు లభించే ఏర్పాటు చేస్తాను. -


, ఈ నిర్జల ప్రదేశంలో నీవు కోరినంతనే మేఘాలు నీళ్ళు కురిపిస్తాయి. ఆ మేఘాలు ఉదంక మేఘాలు అనే పేరుతో వర్తిల్లి నీకు కీర్తిని కలిగిస్తాయి. ఈ చోటులో ఆ మేఘాలు చక్కగా వ్యాపించి నీ దాహాన్ని తీరుస్తూనే ఉంటాయి” అని అనుగ్రహించి మాయమైపోయాడు కృష్ణుడు.


ఆ నిర్జల ప్రదేశంలో ఉదంక మేఘాలు నియమం తప్పకుండా ఆశ్చర్యకరంగా పుణ్యతిథులలో నీళ్ళు కురిపించి ఉదంకుని సంతోషపెడతాయి. సంతృప్తినిస్తాయి. కేవలం గురుభక్తి వల్లనే ఉదంకునికి అంతటి శక్తి కలిగింది. గురువర్యుడైన గౌతమునికి అనితర సాధ్యమైన సేవ చేసి తరించాడు. వృద్ధాప్యం వచ్చేదాకా గురుసేవలోనే మునిగిపోయాడు ఉదంకుడు. ఒకసారి తాను మోసుకువచ్చిన కట్టెలమోపులో తన తలవెంట్రుక చిక్కుకొని ఉండటురూ సి, దానిని తీసి పారవేయబోయి – ఆ వెంట్రుక తెల్లబడి ఉండడం గమనించి, వ్యధ చెందాడు. తాను ముసలివాడినయినానని అప్పటికి గుర్తించాడు. కాలం కూడా తెలియకుండా గురుసేవామగ్నుడైన తనను గురువు పట్టించుకోలేదని పరితపించాడు. ఉదంకునికి ఉన్నట్టుండి కన్నీరు ఉబికింది.


ఆ కన్నీటిని దోసిటిలో పట్టమని గౌతముడు తన కుమార్తెను నియోగించాడు. ఆమె పరుగున వచ్చి, ఉదంకుని కన్నీటిని దోసిటిలో పట్టి, ఆ వేడికి చేతులు కాలేసరికి వెంటనే ఆ కన్నీటిని వదిలివేసింది. నేలమీద పడిన ఆ కన్నీటి వేడికి భూమి కూడా క్షోభించింది. అంత తీవ్రతరమైన శక్తిని కలిగి ఉంది ఉదంకుని కన్నీరు కూడా. గౌతమ మహర్షి ఉదంకుని చేరబిలిచి, అనునయించి అతని దుఃఖానికి గల కారణమేమిటని అడిగాడు. “గురుదేవా! శిష్యులందరికీ వరాలిచ్చి పంపేశావు. నాకు వార్థక్యం వచ్చినా, నన్ను కరుణించలేదు. నా మీద నీకు దయ లేదా? ఇందుకు నేను శోకించకుండా ఎలా ఉండగలను?” అని వాపోయాడు ఉదంకుడు. ఉదంకుడు చెప్పిన విషయం విన్న గౌతమునిలో కరుణ పెల్లుబికింది. “నాయనా! నీవు ఋషి సత్తముడవు. నీకు యౌవనాన్ని ప్రసాదిస్తున్నాను. నా పుత్రికను కూడా నీకు మతో ఇస్తున్నాను. ఇతరులెవ్వరూ నీ తేజస్సును భరించలేరు. నా కుమార్తెకు కూడా నూతన శరీరాన్ని, యౌవనాన్ని ప్రసాదిస్తాను. ఆమెను వివాహమాడి సుఖసంతోషాలతో వర్ధిల్లు. ఇందులో ఏ దోషమూ లేకుండా వరమిస్తున్నాను” అని ఉదంకుని సంతోషపరుస్తూ, ఇంకా అనేక వరాలు ఇస్తాడు గౌతమ మహరి. గురూత్తముని ఆనతిని శిరసావహించి, గురుపుత్రిని వివాహమాడి ఉదంకుడు విశేష లబ్దిని పొందాడు. - “మహరీ! ఇందులో దోషం లేకుండా చేస్తానన్న గౌతమ మునీంద్రుని వరంలోని అర్థం ఏమిటి?” అని ప్రశ్నించిన జనమేజయునికి వైశంపాయనుడు ఇలా సమాధానమిచ్చాడు. “కురువంశోత్తమా! గురువులకు శిష్యులు పుత్ర సములు కదా! కనుక గురుపుత్రిక శిష్యులకు సోదరి వంటిది. వారి మధ్య వివాహం సమంజసం కాదు. అయినా ఉదంకునికి తగిన ఇల్లాలు తన పుత్రి అని, తన పుత్రికకు తగిన మగడు ఉదంకుడే అని నిశ్చయించిన గౌతమ ఋషి వారి వివాహానికి ఎటువంటి దోషమూ అంటదని తన తపశ్శక్తితో వరమిచ్చాడు.


వివాహానంతరం ఉదంకుడు గురువు పాదాల చెంతకు చేరి 'గురుదక్షిణ' కోరమని వేడుకున్నాడు. దానికి గౌతముడు “ఉదంకా! నీ సత్సవర్తనమే నాకు గురుదక్షిణ” అని సంతోషంగా బదులిచ్చాడు. అది విని ఉదంకుడు సంతృప్తి చెందక గురుపత్ని అయిన అహల్యాదేవిని చేరి “ఏదైనా కోరమని, తెచ్చి ఇస్తాన”ని ప్రాధేయపడ్డాడు. ముందు అహల్య కూడా ఏదీ అవసరం లేదనీ, నీ భక్తి ప్రపత్తులే చాలున”ని పలికింది. కానీ ఏదో ఒకటి గురు దక్షిణగా తాను సమర్పించాలని పట్టుపట్టిన ఉదంకుని మనస్సు నొప్పించలేక అహల్యాదేవి “నాయనా! మిత్రసహుడి దేవేరి చెవి పోగులు లోకోత్తర మహిమాన్వితమైనవి. అవి తెచ్చి పెట్టమ”ని కోరింది. గురుపత్ని వాక్కునే గుర్వాజ్ఞగా భావించి ఆ పనికై పరుగులు పెట్టాడు ఉదంకుడు. మిత్రసహుడు శాపగ్రస్తుడని, నరమాంస భక్షకుడనీ తెలిసిన గౌతముడు తానున్నచోటునుండే శిష్యుని రక్షణకు సంకల్పించాడు - తన తపశ్శక్తితో. ఉదంకుడు ఒక నిర్జనారణ్యం చేరి, అక్కడే ఉన్న మిత్రసహుమా శాడు. మిత్రసహునికే మరోపేరు సౌదాసుడు. సౌదాసుడు శాపం పొందకముందు మహారాజు. ధర్మప్రవర్తకుడు. కాని ఒక బ్రాహ్మణుని శాపం వల్ల నరులను భక్షించే రాక్షసుడిగా, మిత్రసహుడిగా కాలం గడుపుతున్నాడు. సౌదాసుని శరీరమంతా మనుష్యుల రక్తంతో తడిసిభయంకరంగా ఉండటం శాడు ఉదంకుడు. ఉదంకుని చూ సిన సౌదాసుడు ఆనందంతో 'ఆహా! నాకీనాడు ఆహారం దొరికింది. నిన్ను తినేస్తాను” అంటూ ముందుకు వచ్చాడు. ఉదంకుడు ఏమాత్రం తొట్రుపడకుండా "మిత్రసహా! నేను గురువు గారి పనిమీద నిన్ను అర్థించటానికి వచ్చినవాడను. నన్ను చంపటం నీకు తగదు. అయినా నీకు 'ఆహారం' అని అన్నావు కనుక - గురువు గారి పని పూర్తిగా నిర్వర్తించి, తిరిగి వచ్చి, నీకు ఆహారమవుతాను. మాట తప్పను. నన్ను నమ్ము' - అని మెత్తగా పలికాడు. ఉదంకుడి మాటలకు సౌదాసుడికి సంతోషం కలిగింది. 'ఏది కావాలో కోరుకో' అని అడిగాడు. ఉదంకుడు దానికి సమాధానంగా 'నీ భార్య పరమప్రీ తితో ధరించిన కుండలాలను మా గురుపత్ని కోరింది. వాటిని నాకిప్పించు' అని అనగానే సౌదాసుడు ధర్మబుద్ధితో ఉదంకుని తన దేవేరి ఉండే అంతఃపురానికి పంపాడు. మహారాణిని కలిసి ఉదంకుడు తన కోరికను వెల్లడించాడు. "నా భర్తయే నిన్ను పంపినట్లు ఏదైనా ఒక గుర్తు తీసుకొని రా మహరీ!” అని మహారాణి ఉదంకుని తిరిగి సౌదాసుని వద్దకు పంపిస్తుంది. ఉదంకుడు సౌదాసుని చేరి, మహారాణి అడిగిన గుర్తును ఇమ్మని అర్థిస్తాడు. అప్పుడు రాజైన సౌదాసుడు – “ఈ విధంగానే క్షేమం కలుగుతుందని నిశ్చయించలేము. అలాగని వీనిని వదిలిపెడితే వేరే గతిలేదు” అన్న నా యీ మాటలనే గుర్తుగా పలుకు” అని చెప్పి ఉదంకుని మళ్ళీ మహారాణి వద్దకు పంపుతాడు. ఉదంకుడు మహారాణి అయిన మదయంతిని కలిసి సౌదాసుని మాటలనే గుర్తుగా తెలియజెబుతాడు. అందుకు సంతసించిన మదయంతి - "గురుహితాభిలాషీ!నానాథుడి ఆనతిమేరకునా కుండలాలను నీకిస్తున్నాను. వీటి మహత్తును గురించి తెలియజెబుతాను.


“మహర్షీ! దేవతలు, గంధర్వులు, నాగులూ ఈ కుండలాల కోసం ఎన్నో ఉపాయాలు పన్నుతూ ఎంతోకాలంగా ఎదురు చూ స్తున్నారు. ఎంగిలి అంటుకున్నా, నేలమీద పెట్టినా, నీవు మైమరచి నిద్రించినా, వారు వెంటనే వీటిని అపహరిస్తారు. భక్తితో పూజించి, వీటిని ధరిస్తే - ఆకలి, దప్పిక, అగ్నిభయం, విషవ్యాధి, భూత బేతాళాల పీడలు కలుగవు. పిల్లలు పెట్టుకున్నా, పెద్దలు పెట్టుకున్నా వారి వారి కొలతల ప్రకారం సరిగా అతికినట్లు సరిపోతాయి. అంతేకాదు. ఈ కుండలాలు బంగారాన్ని కురిపిస్తాయి. ఎంతో పవిత్రమైనవి. పరాకు లేకుండా వీటిని గురుపత్నికిచ్చిగురుదేవుని మెప్పుపొందు” అని చెప్పి, భక్తి సంతోష వినయపూర్వకంగా తనకుండలాలను ఉదంకునికిచ్చింది. కుండలాలను స్వీకరించి, పరమానందంతో ఉదంకుడు ఆమెను దీవించి, సౌదాసుడి దగ్గరకు వెళ్ళి, ఆ మహారాజుకు కృతజ్ఞతలను తెలుపుకున్నాడు. తన మనసులోనే సందేహాన్ని వెలువరిస్తూ ఉదంకుడు సౌదాసునితో “ప్రభూ! నీ వలన నా కోరిక నెరవేరింది. కాకపోతే నువ్వు నాకు గుర్తుగా చెప్పిన మాటలే నా కర్థం కాలేదు. ఆ భావం నేను తెలుసుకోదగినదే అయితే చెప్పు” అని అడిగాడు. దానికి సౌదాసుడు "మునివర్యా! రాజులు బ్రాహ్మణులను పూజిస్తారు. నేను అలాగే చేశాను. కాని ఒక చిన్న తప్పు చేత బ్రాహ్మణ శాపాన్ని పొందాను. ఇలా నరమాంస భక్షకుడినయ్యాను.నా పాపం పోగొట్టుకోవడానికి వేరే ఉపాయం లేదు. కాబట్టి బ్రాహ్మణ పూజ చాలా కష్టం. దీనివలన మేలే కలుగుతుందని చెప్పడానికి వీలులేదు. అలాగని మేలు కలిగించే వేరే మారమూ లేదు. ఇదే గుర్తుగా మదయంతికి చెప్పాను. మహిమ కలిగిన కుండలాలను నీకిచ్చి, నీ వలన నా కీడును తొలగించుకోవచ్చని అభిప్రాయపడ్డాను” అని వినయంగా సమాధానమిచ్చాడు. ఉదంకుని పవిత్ర సన్నిధానం చేత సౌదాసుడికి – శాంతి, తెలివి, శ్రద్ధ, మాట మెత్తన సిద్దించాయి. గురుపత్నికి కుండలాలనిచ్చి, తిరిగి నీ వద్దకు వస్తాను. మాట తప్పను. అప్పుడు నీకాహారమవుతాను. వెళ్ళి వస్తాను” అని పలికిన ఉదంకుని మాటలకు సౌదాసుడు ఆశ్చర్యచకితుడైనాడు. మహరి సత్తముడికి నమస్కరించి - వస్తారటయ్యా? నీ గొప్పతనం, సత్యసంధతలకు చాలా సంతోషంగా ఉంది. నీ తపశ్శక్తితో నా దుఃఖాన్ని తొలగించు” అంటూ ప్రార్థించాడు. సౌదాసుడు. ఉదంకుని మనస్సు ఆర్థమయింది. “ఏమిటనైన నొప్పమి నరేంద్ర! సుచిత్తుల పొందె నేనియున్ వేమరలున్, భవదుణమవీత కళంకుని చేసె నిన్ను, సాం ద్రామల కీర్తి గౌతమ మహాముని చల్లని చిత్తవృత్తి నీ పై మలగించె కావలయు పార్థివసత్తమ! పొందుమున్నతిన్” - అశ్వ - ప.102 - తృ.ఆ “మహారాజా! మంచి మనసున్న వారికి ఏ కారణం చేతనైనా ఆపద వాటిల్లినా అది వెంటనే తొలగిపోతుంది. నీ మంచి గుణమే నిన్ను పుణ్యాత్ముడిని చేసింది. మహా కీర్తిసంపన్నుడైన గౌతమ మహర్షి ఇప్పుడు నిన్ను చల్లని మనస్సుతో శాడు కాబోలు! నీవు పాప విముక్తుడవై పూర్వపు ఔన్నత్యాన్ని పొందుతున్నావు” అని పలికి, ఉదంకుడు తన కరస్పర్శతో సౌదాసుని పునీతుని చేసి, అనేక దీవెనలిచ్చి, ఆతనిని ఆనందింపచేశాడు. ఉదంకుని ఉత్తమత్వాన్ని తెలిపి వైశంపాయనుడు జనమేజయుని వైపు చూ స్తూ ఒక్క క్షణం ఆగాడు. (సశేషం)