వేంకటాచలం - మందరపు వి.జి.శంకరాచారి


బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందాది మునులను వైకుంఠ ద్వారం దగ్గర కావలిగా యున్న జయవిజయులు లోపలికి వెళ్ళనీయకుండా అడ్డగించారన్న కోపంతో వారి శాపానికి గురియై భూలోకంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు గాను, రావణ, కుంభకర్ణులుగాను, శిశుపాల దంతవక్రులు గాను జన్మించి - పిదప ఆ పరంధాముడి చేతిలో మరణించి తిరిగి వైకుంఠ ధామునిలో ఐక్యం కావాలని కోరుకున్నవారిలో ముందుగా భూలోకంలో జన్మించిన హిరణ్యాక్షుడు - భూదేవిని పలు బాధలకు గురి చేసి ఒకానొక సందర్భంలో భూమాతను చాపగా చుటి రసాతలమునకు అణచివేసి హింసించసాగినాడు.


హిరణ్యాక్షుని బాధలు భరించలేక మునులు విష్ణుమూర్తికి మొర పెట్టుకోగా.. వారి బాధలను తీరుస్తానని మాట ఇచ్చి ... ఈ ఇలలో శ్వేత వరాహమూర్తిగా అవతరించి... హిరణ్యాక్షుని వధించి భూమిని యథాస్థానంలో నిలిపి తన భక్తులను కాపాడినాడు. ఇలలో వెలసిన శ్వేత వరాహమూర్తి శేషాద్రి నందు కొలువై తన భక్తులను రక్షిస్తూ.... భూదేవీ సహిత వరాహస్వామిగా , భాసిల్లుతూ పూజలందుకుంటున్నాడు. ఆ విధంగా కొంతకాలం (యుగాలు) గడిచిన పిమ్మట... కలియుగంలో... నారదుని సలహా మేరకు త్రిమూర్తులలో సత్త్వగుణము కలిగిన పరమాత్మ ఎవరో తెలుసుకుని వారి] తి కొరకు యజ్ఞం చేయవలెనని చెప్పిన మాటలకు లోబడి త్రిమూర్తులను పరీక్షింపదలచి మునులందరి తరపున భృగుమహర్షి సిద్ధపడి మొదటగా సత్యలోకం వెళ్ళి అక్కడ వారి నిరాదరణకు లోనై బ్రహ్మకు భూలోకంలో ప్రజలెవరూ పూజించరని శపించి... పిదప కైలాసమునకు వెళ్ళి అక్కడ కూడా శివ పార్వతుల నిరాదరణమూ సి సహింపలేక కోపోద్రిక్తుడైన భృగుమహర్షిని ఈశ్వరుడు త్రినేత్రాగ్నితో భస్మము చేయదలచినాడు. కానీ భృగుమహర్షి తన్ను దహింపవలెనని సమీపించుచున్న త్రినేత్రాగ్నిని తన పాదమందున్న జలనేత్ర ప్రభావముతో చల్లబరిచి "దేవా! నీ త్రినేత్రాగ్ని సన్మార్తులమగు బ్రాహ్మణులను భస్మము చేయలేదు. త్రినేత్రుడనిన త్రిమూర్తులలో ఒకడినని గర్వించి నా వంశీయులను శపించితివి గనుక నేటినుండి నీ శిరస్సు మాత్రమే పూజార్హమగు గాక... భూలోకవాసులు నీ సంపూర్ణ స్వరూపును గాక లింగరూపమున ఉండు నీ శిరస్సును మాత్రమే పూజింతురు గాక” అని శపించి తక్షణం కైలాసమును విడిచి వైకుంఠానికి బయలుదేరినాడు.


శ్రీ మన్నారాయణుడు, భృగుమహర్షి తన చెంతకు వచ్చిన సమయంలో లక్ష్మీదేవితో కలిసి క్రీడా వినోదములు సలుపుచుండ అదూ సిన భృగువు కోపముతో విష్ణుమూర్తి వక్షస్థలమును తన్నితన రాకను తెలియజేసినాడు. పిదశ్రీ హరి భృగువును మన్నించమని కోరుతూ ఆదరించి లక్ష్మీదేవితో సహా సపర్యలు చేసి అతడి పాదనేత్రమును అణచివేసి భృగువునకు జ్ఞానోదయం కలిగించినాడు. పాదనేత్రము అంతరించి పోవడంతో భృగువు తన అహంకారమును వదలి పశ్చాత్తాప హృదయంతో మన్నారాయణుని స్తుతించి సత్వగుణం కలిగిన పరమాత శ్రీ మహా విష్ణువు మాత్రమేనని తలచి భూలోకమునకు బయలుదేరాడు. భృగు మహర్షి భూలోకమునకు చేరుకుని మునులకు తన సమాచారమంతయు తెలియజేసి సత్వగుణం కలవాడు శ్రీ మహావిష్ణువు మాత్రమేనని, ఆ పరమాత్మనే యాగకర్తగా భావిస్తూ దేశ సౌభాగ్యం కోసం యజ్ఞం చేయనారంభించినారు. తదనంతరం త్రిలోకసంచారియైన నారదుడు వైకుంఠమునకేగి శ్రీ మన్నారాయణుడితో “పరంధామా! భృగువు మీ వక్షస్థలమును తన్నినా అతనికి ఏ శిక్షను విధించకపోవడం విచిత్రంగాను, మీరు పిరికివారుగాను భూలోకవాసులు అనుకుంటున్నారు. ఇంతియేగాక మీ వక్షస్థలమును తన్నినందుకు గాను ఆ వక్షస్థల వాసియైన శ్రీ లక్ష్మీదేవి ఏమియును నొచ్చుకొనకుండా ఆతనికి సపర్యలు చేయడం, మీరు చేయమనడం విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. శ్రీ లక్ష్మీదేవికి ఎటువంటి ఆగ్రహం కలగనందుకు ఆశ్చర్యపోతున్నారు” అని భూలోకంలోని విషయాలు చెబుతున్న నారదుని మాటలు విని లక్ష్మీదేవి నారదుడు వైకుంఠాన్ని వీడిన తక్షణం తనుకూడార్రీ మన్నారాయణునిపై కినుక వహించి భూలోకంలోని కొలాపురి ప్రాంతమునకు చేరుకుని తపస్సు చేయనారంభించింది. తనపై అలుకబూని భూలోకమును చేరుకున్న లక్ష్మీదేవిని వెదుక్కుంటూ శ్రీ మన్నారాయణుడు శేషాద్రి పర్వత సమీపమున గల ప్రాంతమునకు వచ్చి తను కూడా తపస్సు చేయనారంభించాడు. కాలక్రమంలో చెట్లు, పుట్టలతో నిండిపోయి ఆ ప్రాంతమంతా భీకరంగా మారెనుశ్రీ మన్నారాయణుడు మాత్రం పుట్టలో నుండే తపస్సు చేయనారంభించాడు. అయితే అతడి ఆకలిని తీర్చుటకు ఈశ్వర రితముగా అదే ప్రదేశమునకు మేత మేయుటకు తీసుకువచ్చిన గోవుల మందలో కపిలగోవు అనే ఆవుమాత్రం ఆమందనుండి తప్పించుకుశ్రీ మన్నారాయణుడు తపస్సు చేయుచున్న పుట్ట పైభాగమునకు వచ్చి మేత మేయసాగెను. ఆ సమయమున చిత్రంగా ఆ పుట్టలోనుండి దూడ ఒకటి బయటకు వచ్చి ఆ కపిలగోవు పాలను పూర్తిగా త్రాగి మరలా పుట్టలోకి వెళ్ళి మాయమైపోయినది. ఇది గమనించిన గొల్లవారు ఈ విషయమును ఆ ప్రాంత పాలకుడైన చోళరాజుకు తెలియపరచినారు. ఆ విషయమును విడూరముగా తోచి తమ యొక్క కపిలగోవు చేయుచున్న కార్యమును గమనించుటకు తానే స్వయముగా బయలుదేరినాడు.


ఆ ప్రాంతమునకు వెళ్ళిన చోళరాజు చాటునుండి ఆవుల మందను గమనించసాగినాడు. - గొల్లవారు మేతకు విడిచిన ఆవుల మందలోనుండి కపిలగోవు నెమ్మదిగా బయటపడి శ్రీ మన్నారాయణుడు తపస్సు చేయుచున్న ప్రాంతమునకు చేరుకుని పుట్టపై నెక్కి మేత మేయుచుండగా... పుట్టలోనుండి ఒక దూడ బయటకు వచ్చి కపిలగోవు క్షీరమును త్రాగి మరలా పుట్టలోనికి వెళ్ళిపోవడం గమనించిన చోళరాజు ఆ పుట్ట దగ్గరకు వచ్చు. చినాడు. - అక్కడ లేగదూడకు బదులు రాజపుత్రుని రూపంలో పుట్టలో కూర్చుని తపస్సు చేయుచున్న విష్ణుమూర్తిని చూ చి తెల్లబోయి అతడెవరో తెలుసుకోవలెనని చోళరాజు "స్వామీ! తమరెక్కడివారు? ఎచ్చటినుండి వచ్చి ఇక్కడ తపస్సు చేయుచున్నారు. నేను ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చోళరాజుని. . అక్కడ లేగదూడకు బదులు రాజపుత్రుని రూపంలో పుట్టలో కూర్చుని తపస్సు చేయుచున్న విష్ణుమూర్తిని చి తెల్లబోయి అతడెవరో తెలుసుకోవలెనని చోళరాజు "స్వామీ! తమరెక్కడివారు? ఎచ్చటినుండి వచ్చి ఇక్కడ తపస్సు చేయుచున్నారు. నేను ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చోళరాజుని. . రామవర్మ అను నామధేయము కలవాడిని. మా గోవులను గొల్లలు మేత కొరకు ఈ ప్రాంతమునకు తీసుకువచ్చి ప్రతితో వాటిని మేతకు వదులుతారు. వాటిలో కపిలగోవు తప్పించుకొని ఇక్కడకు వచ్చి మేత మేయుచున్నది. చిత్రముగా పుట్టలో నుండి ఒక లేగదూడ వచ్చి కపిలగోవు క్షీరమును పూర్తిగా త్రాగి మరలా పుట్టలోనికి వెళ్ళిపోయినది. సత్యం తెలుసుకొనవలెనని వచ్చిన నాకు మీరు కనిపించినారు. ఆ దూడ ఏమయినదో మాకు అర్థం కావడం లేదు. కావున సవివరముగా మీ వృత్తాంతము తెలియజేయుము” అనశ్రీ మన్నారాయణుడు చిరునవ్వు నవ్వి చోళరాజుతో ఇట్లు చెప్పినాడు. “చోళభూపతీ! నేను వేరు, మీరూ సిన దూడ వేరు కాదు. నేనే దూడ రూపమున నీ కపిలగోవు పాలన్నిటిని త్రాగుచుంటిని. కారణాంతరముల వలన వైకుంఠమును వీడి ఈ ప్రాంతమునకు వచ్చి తపస్సు చేయుచున్నాను. కొంతకాలమైన పిదప ఈ శేషాద్రి పర్వతము పైన వేంకటేశ్వరస్వామి అను నామధేయంతో వెలసి నా భక్తులను కంటికి రెప్పలా కాపాడుకొనుటకై ఈ భూలోకమునకు వచ్చినాను. సత్యం తెలుసుకుని నా దర్శనము పొందిన నీవు పుణ్యాత్ముడవు. నేను తపస్సు చేయుచున్నంత కాలం కపిలగోవు పాలు, పళ్ళు తెచ్చిపెట్టుము. నన్ను నమ్మి సేవించిన నీ కీర్తి ఆచంద్ర తారార్కం ఈ భువిపై నిలిచి ఉండగలదు. నా భక్తుడవైన నీకు దివ్యజ్ఞానము నొసగి ముక్తిని ప్రసాదించుచున్నాను” అని చెప్పినాడు.


చోళరాజు ఆ మాటలు విని బ్రహ్మానంద భరితుడైనాడు. అది మొదలు ప్రతితో పళ్ళు.. పాలను స్వయముగా తీసుకొని వెళ్ళి స్వామికి నైవేద్యముగా సమర్పించి ధన్యత నొందుతూ జీవనం సాగించుచున్నాడు. ఆ విధంగా శ్రీ మన్నారాయణుడు తపస్సు నాచరించుచున్న ప్రాంతమునకు దగ్గరలో గల శేషాద్రి పర్వతముపై శ్వేత వరాహమూర్తి కూడా నివసిస్తూ తన భక్తులను రక్షిస్తూ ఉన్నాడు. ఇట్లు జరుగుచుండగా కొందరు రాక్షసులు ఆ పర్వత ప్రాంతమునకు వచ్చి అక్కడ తపస్సు చేసుకొనుచున్న మహామునులను బాధింపసాగారు. ఆ మునుల విన్నపములతో వరాహస్వామి ఆ ప్రాంతమంతా కలియతిరుగుతూ చెట్లు పుట్టలలో దాగుకొనియున్న రాక్షసులను వధిస్తూ విష్ణుమూర్తి తపస్సు చేయుచున్న ప్రాంతమునకు వచ్చి అక్కడ పుట్టలో తపస్సు చేసుకొనుచున్న నారాయణుడిచూ సి దివ్యదృష్టితో విషయమును తెలుసుకొని పట్టరాని ఆనందమును పొందినాడు. వరాహస్వామి విష్ణుమూర్తి వద్దకు పోయి "సోదరా! తోడు నీడ లేనివాని వలె నీవీ నిర్జన ప్రాంతమున పుట్టల మధ్య వసించుచున్నావేమి? నేనుగానీశ్రీ నృసింహస్వామి గానీ, నీవు గానీ మహా విష్ణువు అంశ వలన పుట్టిన అవతార పురుషులమే గానీ అన్యులము కాదు గదా. మేమందరం నీకు అండగా ఉండగా నీవీ నిర్జన ప్రాంతమున తపమాచరించవలదు. నేను నివసించుచున్న శేషాద్రి పర్వత ప్రాంతమున వంద గజాల స్థలములో నీకొక ఆశ్రమమును తక్షణమే నిర్మించెదను. ఇకనుండి , నీ తపస్సు నా ఆశ్రమము సమీపమున నిర్మించబోవు నీ కుటీరమునందు చేసుకొనుము. నామాట కాదనక నా వెంట బయలుదేరి శేషాద్రికి రమ్ము” అని చెప్పగా విశ్రీ హరి ఆనందించి వరాహస్వామితో కలిసి శేషాచల ప్రాంతమునకు వెళ్ళినాడు. పిదప వరాహస్వామి నిర్మించి ఇచ్చిన వంద గజాల ఆశ్రమంలో తన తపస్సును కొనసాగించబోతూ వరాహస్వామితో ఇట్లనెను.


"సోదరా! నీవు నాకు నిర్మించి ఇచ్చిన ఈ ఆశ్రమంలో నేటినుండి లక్ష్మి కొరకై తపమాచరించెదను. త్వరలో లక్ష్మీదేవి నన్ను చేరుకొనగలదు. తదుపర్రీ నివాసుడను పేరుతో నేనిక్కడ శిలారూపమునశ్రీ దేవి భూదేవులతో వెలసి నా భక్తులను నిరంతరము కాపాడుకొనుచుందును. నా దర్శనము కోరి వచ్చిన భక్తులు ముందుగా నీ దర్శనము చేసుకొనిన పిమ్మటనే నా దర్శనము చేసుకొనవలెను. నిన్ను పూజింపకుండా నన్ను మాత్రమే దర్శించినవారికి నేనెటువంటి శుభములను కలుగజేయలేను. నాకు తగిన ఆశ్రయమొసగి ఆదరించిన అగ్రజుడవగు నీకు నేను సదా కృతజ్ఞుడనై ఉండగలను” అని పలికిన పరంధాముని మాటలకు వరాహస్వామి ఆనందభరితుడైనాడు. ఆనంద భరిత హృదయముతో వరాహస్వామి "సోదరా! నీవు చేయుచున్న తపము ఫలించి, త్వరలోనే నీ లక్ష్మి నిన్ను చేరుకొనగలదు. అందులో సందేహమేమీ లేదు. అయితే ఒక ముఖ్య విషయం. ద్వాపరంలో నిన్ను పెంచిన యశోద నేడు వకుళమాలికగా జన్మించి నా ఆశ్రమమునందే నివసించుచున్నది. ఆమె కుమారుడు గోవిందరాజులు కూడా నా దగ్గరే నివసించుచున్నాడు. ఆమెను నీ తల్లిగాను, గోవిందరాజులును నీ సోదరునిగా భావించి వారిని నీ దగ్గర ఉంచుకొని వారి జీవితాలను ధన్యత పరచుము... ద్వాపరంలో నీ పెళ్ళి వేడుకూ డలేదని బాధపడిన యశోద ఈ కలియుగంలో నీ పెళ్ళి పెద్దగా, నీ అత్తగారికి వియ్యపురాలిగా మారి జీవితం ధన్యత పరచుకోబోతున్నది. సోదరుడు గోవిందరాజులు నీ పెళ్ళికి కుబేరుడి దగ్గర అప్పుగా తీసుకొనబోవుచున్న కోట్ల వరహాలను తిరిగి తీర్చడానికి భక్తుల ద్వారా లభించిన ధనపురాశిని ప్రతితో కొలుస్తూ (లెక్కబెడుతూ) ఈ పర్వత పాదాల క్రింద గోవిందరాజులుగా పూజింపబడుతాడు. 


నీ నివాస స్థలమైన ఈ శేషాద్రి ప్రాంతము ఇకముందు శ్రీ వేంకటాచలమని పేరుపొంది ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమగును” అని చెప్పగా విష్ణుమూర్తి "అలాగే కానిండు సోదరా” అని నవ్వుతూ తన యొక్క అనుజ్జను తెలియజేసినాడు.