వరాలు -జె. వీరరాఘవ శర్మ


సుశాస్త్రి నిత్యం అమ్మవారి ఆరాధన చేస్తేగాని అన్నపానాలు స్వీకరించేవాడు కాదు. కొంతకాలానికి అమ్మవారికి అనుగ్రహం కలిగి సుశాస్త్రిని చిన్నగా పరీక్షించి కటాక్షించాలని నిశ్చయించుకుంది. ఒకనాటి ఉదయాన అమ్మవారి అర్చన చేయుచున్న సమయంలో అమ్మవారి మనోహర రూపం దృశ్యాదృశ్యంగా సుశాస్త్రికి గోచరించింది. సుశాస్త్రి ఆ రూపాన్ని స్పష్టంగా దర్శించాలన్న తాపత్రయంలో అనుష్టానం మధ్యలో ఆపాడు. తను చేస్తున్న పూజపై ధ్యాస సడలింది. అలా శూన్యంలోకూ స్తున్న భర్తచూ సి సుచరిత కంగారుపడి “ఏమండీ! అలా ఉండిపోయారేమిటి? అని అడిగింది. మళ్ళీ తనే ఏమైనా నీరస పెట్టిందేమోనని వైద్యుని పిలుచుకు రావడానికి కంగారుగా వెళ్ళింది. ఆ రూపం ఓ విప్రుడా! నీ అభీష్టమేమిటి? అని అడిగినట్లు అనిపించి తేరుకుని అమ్మా! నీ నామాలు పఠించినప్పుడు ఏదో తెలియని ఆనందానుభూతి


పొందుతున్నాను. పార్వతీ, హైమవతీ, అంబా అని నిన్ను స్తుతించుచున్నప్పుడు నిన్ను దర్శించుకున్న వారి మనస్సులో ఉన్న కోరికలు సిద్ధింపచేయి తల్లీ అని లోలోపల అనుకున్నట్లు భ్రమ కలిగింది. ఆ రూపం తథాస్తు అని అభయహస్తంతో దీవించినట్లుగా గోచరమైనది సుశాస్త్రికి. ఇంతలో భార్య వైద్యునితో వచ్చి కంగారునూ డమనగా, సుశాస్త్రి కొద్దిగా కదిలి ఈ లోకంలోకి వచ్చి మెల్లగా కళ్ళు తెరచి, నాకేం కాలేదు అని భార్యకు సైగ చేసి వైద్యుని పంపించివేశాడు. తదుపరి మిగతా అనుషానం పూర్తిచేసి మంచినీరు త్రాగి భార్యతో జరిగినది చెప్పగా, ఏం మనిషివయ్యా నువ్వు? అమ్మవారిని ధన, కనక, వస్తు, వాహనాలు కోరుకోవాలే గాని, మా మేనమామ చెవిలో రోమాలు మొలిపించు, అప్పుడు నాకు అదృష్టం కలిసివస్తుందన్నట్లు ఏం కోరిక కోరావయ్యా అని భార్య చిరాకుపడింది. అంతా దైవేచ్ఛ అని భార్యతో అని


సరిపెట్టుకున్నాడు. మరునాడు యథావిధిగా ఉదయానే అమ్మవారి పూజ చేస్తుండగా, సహస్రనామాలలో ఒకటైన పార్వతి నామం ఉ చ్చరిస్తుండగా, పక్కింటి పార్వతి వాళ్ళింటికొచ్చి తలుపు తట్టగా సుశాస్త్రి ఏకాగ్రతకు భంగం కలిగింది. పక్కింటి పార్వతి సుచరితను రేపు మా ఇంటిలో గౌరీపూజకు రమ్మని పిలవడానికి వచ్చింది. పూజామందిరానికి నమస్కరించి దర్శనం చేసుకుంది. పక్కింటి పార్వతి. ఇంకా పిలవకుండా ఆమెకు సౌభాగ్య చిహ్నాలైన పసుపు, కుంకుమతో నిండిన బంగారు భరిణలు ఆమె చేతిలో పడ్డాయి అమ్మవారి కృపతో. ఆమె ఎంతో సంతోషించి అడగకుండానే వరాలిచ్చే అమ్మవారు నన్ను ఇంకా గౌరీ పూజ కాకుండానే కటాక్షించిందని, వారికి నమస్కరించి మరునాటి గౌరీపూజకి పిలిచి వెళ్ళిపోయింది. అమ్మవారు మీకు వరమిస్తే పక్క ఇంటి పార్వతికి ఫలించడమేమిటని భర్తని అడుగగా అంతా దైవేచ్ఛ అన్నాడు సుశాస్త్రి. తరువాత రోజు కూడా యథావిధిగా సుశాస్త్రి అమ్మవారి అర్చన చేస్తుండగా హైమవతీ నామం జపిస్తుండగా, హైమవతి నామధేయం గల సుశాస్త్రి పెద్దమ్మ దారిద్ర్యంతో బాధపడుతూ ఏదైనా ధన సహాయం ఆపేక్షతో పక్క ఊరు నుండి అప్పుడే వచ్చి తలుపు తట్టగా... విప్రుని ఏకాగ్రతకు భంగం కల్గింది. ఆమె దైవ పీఠానికి నమస్కరించి అమ్మవారి దర్శనం చేసుకోగానే, ఆమె మెడ రకరకాల కనక భూషణాలతో నిండిపోయింది. అబ్బాయీ సుశాస్త్రీ! నేనిక్కడకొచ్చిన కారణం మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నందున ధనసహాయం కోరి వచ్చాను. నేను అడగకుండానే నీ అనుషాన ఫలితం వలన నువ్వు సంకల్పించగానే నాకు అనంత నిక్షేపం లభించింది. సుఖీభవ అని దీవించి వెళ్ళిపోయింది హైమవతి. -


జరుగుతున్న అనూహ్య పరిణామాలకు అవాక్కయ్యారు. సుశాస్త్రి దంపతులు. అంతా దైవేచ్ఛ అన్నాడు సుశాస్త్రి. తర్వాత రోజు మామూలుగా దైవపూజలో భాగంగా అమ్మవారి నామం "అంబ” నామం చేస్తుండగా చాలా క్షుద్బాధతో ఒక ఆవు సుశాస్త్రి వాకిలిలో నిల్చుని బిగ్గరగా అంబా అని అరవగా భూసురుడి ఏకాగ్రత భంగమైనదూ. "స్తుండగానే గోవుకుప్రీ తికరమైన చిట్టు, తవుడు, ఉడికించిన ఉలవలు, లేత పచ్చగడ్డిపరకలతో కూడిన మిశ్రమం గోవు ముందు ప్రత్యక్షమైంది. ఆవు తృప్తిగా ఆరగించి కృతజ్ఞతా పూర్వకంగా సుశాస్త్రి వయా చి తోక వూపుతూ వెళ్ళిపోయింది. అంతా నీ దయతల్లీ అంటూ అమ్మవారికి నమస్కరించాడు సుశాస్త్రి. - జరుగుతున్న అద్భుతాలచూ సిన సుచరిత తనకుమాలిన ధర్మం జరుగుతోందని అసహనం ప్రదర్శించగా, సుశాస్త్రి మాత్రం అంతా అమ్మ దయ. మనం నిమిత్తమాత్రులం. అమ్మ ఏం చేసినా మన మంచికే చేస్తుంది. విత్తు నాటిన నాడే ఫలించదు అని వేదాంతోపదేశం చేశాడు భార్యకి. మనమేమీ ధనికులం కాదు. పౌరోహిత్యం ద్వారా మీ అంతంత మాత్రం ఆదాయంతోనే మన జీవితాలు వెళ్ళదీస్తున్నాం అని వాపోయింది భార్య. అనునిత్యం దైవోపాసన చేస్తూ అమ్మ నామధేయం గలవారందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా అమ్మ కృపకు పాత్రులగుచున్నారు. సుశాస్త్రి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. సుశాస్త్రికి 50 సంవత్సరాల వయస్సు వచ్చింది. స్వల్ప అనారోగ్యంతో నిత్యపూజ మానసికంగా చేస్తుండగా, దివ్యమంగళరూపంతో అమ్మవారు ప్రత్యక్షమై నేటితో నీ కర్మ పరిపక్వమైనది. నువ్వు నిజంగా సుశాస్త్రివి (మంచి శాస్త్ర జాలానివి). అనునిత్యం నన్నుస్మరించి, సమస్త ప్రజలు సుఖంగా ఉండాలని, పూజానంతరం నీవు నీటిధార విడిచేవాడివి. నీ గురించినన్ను ఏదీ కోరలేదు. అందువల్లనే నీకు దృశ్యాదృశ్యంగా గోచరించి, ఏ నామంతో నువ్వు స్మరించావో ఆ పేరు గలవారికి వారి అవసరం మేరకు వరం ప్రసాదించబడినది. కారణం ఆ నామం కలవారు వచ్చినప్పుడు నీ ఏకాగ్రత భంగ పడడం వల్ల, ఫలితం వారి పూర్వజన్మ సుకృతం వల్ల, నా దర్శనం వల్ల, నీ అనుష్ఠానబలం వల్ల వారికి వారి అభీష్టసిద్ధి కలిగినది. కానీ ఆ వరాలన్నీ పరోక్షంగా నీకు సంక్రమించినవే. గౌరి అనే పేరుతో ఉన్న ఆమెకు అఖండ సౌభాగ్య ప్రదానం జరిగింది. ఆ ఫలితం వల్లే నీకు ఆయుర్వృద్ధి జరిగినది. అసలు నీ ఆయుర్దాయం 50 సంవత్సరాలు మాత్రమే. పరోక్షంగా నీ భార్యకు సౌభాగ్య వృద్ధి అయింది.


హైమవతి పేరుగల మీ పెద్దమ్మకు కనకాభరణాలు ప్రసాదించడం వల్ల నీకు ఐశ్వర్యం ప్రసాదిస్తున్నాను. అంబ ఉచ్చారణ సమయంలో గోమాతకు ఇష్టమైన గ్రాసాన్ని ప్రసాదించాను. తత్ఫలితంగా మీకు అన్నోదకాలు ఆజన్మాంతం లోటు లేకుండా అనుగ్రహిస్తున్నాను. నేను (అహం) అన్నది విడిచి అందరి క్షేమం ఆకాంక్షించావు కనుక నీకు వంశాభివృద్ధిని అనుగ్రహిస్తున్నానని లలితాదేవి పరోక్ష వరాలు ప్రసాదించి అంతర్థానమైనది. సుశాస్త్రి అమితానందంతో భార్యని పిలిట శావా అమ్మ ఎలా అనుగ్రహించిందో అని భార్యకు చెప్పగా, సుచరిత పశ్చాత్తాపంతో అమ్మవారికి నమస్కరించగా, సుశాస్త్రి అస్వస్థత పోయి అనతికాలంలోనే వంశాభివృద్ధి జరిగి చిరకాలం భోగభాగ్యాలతో జీవించి, భార్యతో సహా మణిద్వీపానికి చేరాడు. నేను, నాది అన్న విషయాలు పక్కన పెట్టి అందజై యస్సుకై పాటుపడేవారికి భగవంతుని అనుగ్రహం సదా వుంటుందని నీతి.