తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కైంకర్యాలు -అర్చకులు రామకృష్ణ దీక్షితులు


శ్రీ వారి ఆలయంలో ప్రతినిత్యం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారములు తెరువబడుతాయి. దీనికే 'సుప్రభాత సేవ' అని ప్రసిద్ధమైన పేరు. ప్రతిరోజు ఉదయం 3 గంటలకు ఆలయ వేద పారాయణ దారులచే సుప్రభాత శ్లోకాల పఠనం జరుగుతుంది. బంగారు వాకిలికి ఇరువైపుల సుప్రభాత సేవార్డులు, అధికారులు, మహంతు మఠం ప్రతినిధి, మైసూరు శ్రీ వారి సేవకై సిద్ధంగా ఉంటారు. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్ల, జియ్యంగార్ స్వాములు సన్నిధిలోకి ప్రవేశించి స్వామివారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం మొదలైనవి వరుసగా పఠించబడుతుండగా, సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూషకాల ఆరాధనలో భాగంగాశ్రీ వారికి మొదటి నివేదనగా గోక్షీరాన్ని (పచ్చి ఆవుపాలు) నివేదిస్తారు. అంతకు పూర్వం ముందురోజు రాత్రి పవళింపు సేవలో బంగారు నవారు మంచంపై శయనించి ఉన్నశ్రీ వారి కౌతుక బేరం శ్రీ భోగశ్రీ నివాసమూర్తి వారిని మూల విరాట్ పాదముల వద్ద ఉన్న సింహాసనంపై జీవస్థానంలో వేంచేపు చేస్తారు. జరుగుతుంది. దీనికే కైంకర్యపరుల హారతి అని పేరుశ్రీ వారి మూల విరాట్ ముఖమండలంలో గడ్డం మీద అర్చకులు, గడ్డం బొట్టుగా పచ్చకర్పూరాన్ని అద్దుతారుశ్రీ వారికి గొల్లహారతి సమర్పించిన తర్వాత వైఖానస అర్చకులు, ముందుగా బ్రహ్మతీర్థాన్ని తాము స్వీకరించిన పిదప జియంగార్ స్వామికి, 


సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థం, శఠారి సాయిస్తారు. బంగారు వాకిలి వద్ద మంగళా శాసన శ్లోకాల పఠనం జరుగుతుండగా సన్నిధిలో శ్రీ వారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. అనంతరం జియర్ స్వాములు, ఆచార్య పురుషులు, అన్నమయ్య వంశీయుల వార్లకు వరుసగా బ్రహ్మతీర్థం, శఠారి ఇవ్వబడుతాయి. తదుపరి మహంతు మఠం మరియు మైసూరు రాజావారి ప్రతినిధి సమర్పించిన నవనీతం (వెన్న), తమలపాకులు, వక్కలశ్రీ వారికి నివేదించి, నవనీత హారతిని సమర్పిస్తారు. తదుపరి సుప్రభాతం సేవార్డులనశ్రీ వారి దర్శనానికి వరుస క్రమంలో పంపుతారు. ఈ సమయంలో జరిగే దర్శనానికే “విశ్వరూప దర్శనం” అని పేరు. భక్తులకు బ్రహ్మతీర్థం, శఠారి వితరణ జరుగుతుంది. శ్రీ వారి ఆలయ సంప్రదాయ ఆచారముల మేరకు, ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ సమయంలో ఒక బంగారు బిందెలో, విమాన ప్రాకారంలోని బంగారు బావినుండి తీసుకొని రాబడిన తీర్థంతో నింపుతారు. ప్రతినిత్యం రాత్రి ఆలయ ద్వారములు మూసివేసిన తర్వాత, బ్రహ్మాది దేవతలు శ్రీ వారికి ఏకాంతంగా ఆరాధన చేస్తారని ప్రతీతి. అందువల్లనే ఏకాంతసేవ అయిన తర్వాత విమాన ప్రాకారంలో దేవతా సంచారం ఉంటుందనిశ్రీ వారి సేవార్డమై వచ్చినవారి ఏకాంతమునకు భంగం వాటిల్లకుండా, ఆ సమయంలో ప్రదక్షిణ చేయకూడని కట్టడి ఉన్నది.


సన్నిధిలో ఆరాధన పాత్ర శుద్ధి జరిగిశ్రీ వారికి ప్రాతఃకాల ఆరాధనలో ఉపయోగించే పుష్పమాలికలు, తులసి మున్న సంభారములు, విమాన ప్రాకారంలో ఈశాన్య దిక్కున ఉనశ్రీ యోగ నరసింహస్వామివారి సన్నిధికి కుడివైపున 'యమునోత్తరై' అనే గది నుండి సన్నిధి ఏకాంగిచే ఒక పెద్ద వెదురుబుట్టలో పుష్పములను అమర్చి, శిరస్సుపై ధరించి, ఆలయ మర్యాదలతో, ధ్వజస్తంభ ప్రదక్షిణగా సన్నిధిలో తేబడి, దక్షిణం వైపున ఉంచబడతాయి. తదుపరి ప్రాతఃకాల ఆరాధన అనే తోమాల సేవకు, సేవార్డులను వరుస క్రమంలో కూర్చుండబెడతారు. ఉదయాస్తమాన సర్వసేవా పథకం గృహస్తులకు మాత్రం. అర్చకస్వామిచే గోత్రనామాదులతో సంకల్పం గావించబడుతుంది. తదుపరి సన్నిధిలో పరదాను వేసిశ్రీ భోగశ్రీ నివాసమూర్తి వారిని స్నానపీఠంపై వేంచేపు చేస్తారు. పరదా తీసి అర్చకులు సంకల్పం చేసుకుని శ్రీ భోగమూర్తి వారికి తోమాల సేవలో భాగంగా, ఆకాశగంగా తీర్థం, పాలు, పరిమళం (చందనం, పచ్చకర్పూరం, కుంకుమపువ్వుల మిశ్రమం) మొదలైన ద్రవ్యాలతో పురుషసూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత వారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు యథాక్రమంగా తిరుమంజనం జరుగుతుంది.


తదుపరి పరదా వేసి, అర్చకస్వామి ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి, ఆకాశగంగా తీర్థంతో పంచపాత్రలను నింపి, భూతశుద్ధి, ఆవాహనాదులను పూర్తిచేసి పరదా తీస్తారుశ్రీ వారి మూలవిరాట్ కు ఆసనం, పాద్యం, అర్యం, ఆచమనం మొదలైన 30 ఉపచారములతో ఆ వేదమంత్రోచ్చారణ పురస్సరంగా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారు. తరువాత వరుసగా వక్షఃస్థల లక్ష్మి, పద్మావతి, తాయార్లకు శ్రీ భోగ శ్రీ నివాసమూర్తి వారికి శ్రీ దేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికిశ్రీ దేవి, భూదేవి సమేతు ఉశ్రీ నివాసమూర్తి వారి శ్రీ కొలువు నివాసమూర్తి వారికి శ్రీ సీత, లక్ష్మణ, రాముల వారికి శ్రీ రుక్మిణీ సమేత కృష్ణస్వామివారికి, సాలగ్రామ, శఠారిలకు,శ్రీ సుదర్శనులవారికి, విమానం, విమాన వేంకటేశ్వరస్వామి వారికి ఆరాధనను నిర్వహిస్తారు. అనంతరం శ్రీ వారి మూర్తులన్నింటినీ పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. శ్రీ వారి మూలవిరాట్టుకు మరియు ఇతర మూర్తులకు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పించిన వెంటనే, భక్తాదులను దర్శనానికి అనుమతిస్తారు. , తోమాల సేవానంతరం ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా, స్నపన మంటపంలో శ్రీ కొలువు శ్రీ నివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారుశ్రీ వారికి పంచాంగ శ్రవణం, హుండీ జమా ఖర్చులను విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. నవనీత హారతి సమర్పణ జరిపిత్రి వారి మూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేస్తారు.


తదుపరి సన్నిధిలో శ్రీ వారికి సహస్ర నామార్చన సేవను నిర్వహిస్తారు.శ్రీ వేంకటేశ సహస్ర నామావళిలోని 1008 నామాలు పఠిస్తుండగా తులసీదళములతో శ్రీ వారికి అర్చనను నిర్వహిస్తారు. అర్చన తర్వాతశ్రీ వారికి నక్షత్ర హారతి, కర్పూరహారతి జరిపి, మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారుశ్రీ వారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి గంట నివేదన జరుగుతుంది. అన్న ప్రసాదములు, లడ్డు, వడ వంటి నివేదనలుశ్రీ వారికి శ్రద్ధా భక్తులతో సమర్పించబడుతాయి. నివేదన అనంతరం ఆలయంలోని ద్వార దేవతలు, దిగ్గేవతలు, ద్వారపాలకులు, ఉప ఆలయాలలోని మూర్తులకు బలిహరణంలో భాగంగా నివేదనలు సమర్పించబడుతాయి. సన్నిధిలో శ్రీ వారికి,శ్రీ వైష్ణవ సంప్రదాయక 'శాత్తు మొఱ'ను జియ్యంగార్ స్వాములు మరియు ఇతశ్రీ వైష్ణవులు నిర్వహిస్తారు. అనంతరం సర్కార్ హారతి జరిపి, భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాతశ్రీ వారికి మాధ్యాహ్నిక ఆరాధన ప్రారంభమవుతుంది. అర్ఘ్య, పాద్యాచమన్యాదులు సమర్పించిన తర్వాత శ్రీ వేంకటేశ అష్టోత్తర శతనామావళి పఠనంతో తులసీదళ అర్చన నిర్వహిస్తారు. అనంతరం మాధ్యాహ్నిక రెండో గంటా నివేదన, బలి జరిపి, భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారుశ్రీ వారి ఉత్సవమూర్తిశ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారిని విమాన ప్రదక్షణిగా, సంపంగి ప్రాకారంలోని కళ్యాణమంటపానికి వేంచేపు చేస్తారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు అభిజిల్లగ్నంలోశ్రీ వారికి నిత్యకళ్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపర్వంగా నిర్వహిస్తారు. తదుపరి ఆర్జిత డోలోత్సవం సేవను, అద్దాల మంటపంలో నిర్వహిస్తారు. అనంతరశ్రీ వారి ఉత్సవ మూర్తులను ఆలయం వెలుపల ఉన్న వైభవోత్సవ మంటపానికి ఊరేగింపుగా తీసుకువెళతారు. అక్కడ వారికి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంత్రం కొలువు మంటపంలో సహస్రదీపాల కాంతులతో వారికి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం శ్రీ వారు, నాలుగు తిరుమాడ వీధులలో నిత్యోత్సవానికి వేంచేస్తారు.


ఉత్సవానంతరం శ్రీ వారిని సన్నిధిలోకి వేంచేపు చేస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీ వారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు. శ్రీ వారి మూలవిరాట్ కు ఉదయం తోమాలసేవలో అలంకరించిన పుష్పమాలలను సడలింపు చేసి, సన్నిధిలో పాత్రశుద్ధి జరుపుతారు. అనంతరశ్రీ వారికి రాత్రి తోమాలసేవ, రాత్రి అర్చన, రాత్రి గంట, తీరువీసం ఘంట, బలి మొదలైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. తదుపరి భక్తులను, సర్వదర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం సమాప్తి అయిన తర్వాతశ్రీ వారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు. సళ్ళింపు, శుద్ధి అనంతరం స్వామివారి పాదములు, వక్షఃస్థల తాయార్లకు, భోశ్రీ నివాసమూర్తి వారికి చందనం సమర్పించి, పాలు, పండ్లు, పంచకజ్జాయం, తాంబూలాదులను నివేదిస్తారు. శ్రీ వారి కౌతుక బేరం భోశ్రీ నివాసమూర్తి వారిని బంగారు నవారు మంచం పై పవళింప చేసి హారతి సమర్పించడంతో ఆ రోజు నిత్యకైంకర్యములు సమాప్తి అవుతాయి. అర్చకులు సాబూతు (స్వామివారికి అలంకరించిన నగల పరిశీలన) సుకుని ఆలయ ద్వారములు మంత్రోచ్చారణ పురస్సరంగా కుంచెకోలతో మూసివేస్తారు. ఇది ప్రతినిత్యం తిరుమశ్రీ వారి ఆలయంలో వైఖానసాగమోక్తంగా నిర్వహించే నిత్య కైంకర్యాల సంక్షిప్త వివరణ. (సశేషం)