“అస్థిరంబు భూలోక నివాసంబు"- డా|| కూర్మాచలం శంకరస్వామి


అస్థిరంబులు సమస్త ప్రాణికోటియున్ అస్థిరంబులు యెల్ల శరీర ధారులున్ అస్థిరంబులు ఆలు పిల్లలు బంధువులున్ అస్థిరంబులు ఆస్తియున్ అంతస్తులున్ అస్థిరంబులు బాహ్య వస్తువులన్నియున్ అస్థిరంబులు ధన కనక వస్తు వాహనముల్ అస్థిరంబులు రత్నఖచిత రాజసౌధంబుల్ అస్థిరంబులు అహంకార, మమకారంబుల్ అస్థిరంబు సుమ్మీ ప్రాణికోటికిన్ ఈ భూలోక నివాసంబు ఏది సత్యం ఏది నిత్యం అంటే ఏమని చెప్పను? ఓ భూలోక వాసులారా ఓ బుద్ధ జీవులారా | పంచభూతాలు సత్యం ప్రకృతిమతల్లి సత్యం సూర్యచంద్రులు సత్యం ఉభయ సంధ్యలు సత్యం ధర్మువు చక్షువులు సత్యం అంతరాత్మయున్ సత్యం వీటన్నింటికి మూలమైనవాడు సర్వాంతర్యామి ఒక్కడే యన్నది పరమసత్యం


ఏడేడు లోకాలైన భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జప, తప లోక, బ్రహ్మలోక, సత్యలోక అనే పైలోకాలు, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ అనే క్రింది లోకాలు కలిసిన పదునాలుగు లోకాలలో భూలోకానికి ఎంతో ప్రాశస్త్యముంది. దీనిని మర్యలోకమని కూడా అంటారు. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి అనే పంచభూతాలలో భూమి కూడా ఉన్నందున మనం భూదేవిగా కీర్తిస్తాం. నవగ్రహాలలో భూమి కూడా ఉంది. సూర్యమండలం, చంద్రమండలం, నక్షత్రమండలం, తోయజ మండలాల్లో భూమండలం కూడా ఉండడం చేత ఈ లోకానికి అంత ప్రాధాన్యం ఉంది. భూలోకం లేకుంటే సృష్టి ప్రశ్నార్థకమే. సప్తఖండాలు, సప్తసాగరాలు, సప్త కులపర్వతాలు, సప్తర్షులు, సమస్త జీవనదులు, పుణ్యక్షేత్రాలు, దివ్యతీర్థ స్థలాలు, కొండలు, గుట్టలు, రాళ్ళు రప్పలు, చెట్లు - పుట్టలు, కీకారణ్యాలు, తపోవనాలతో అందమైన హరివిల్లు ఈ భూలోకం. భూగోళం గురించి పంచమ స్కంధము ద్వితీయాశ్వాసంలో పోతన ఇలా వర్ణించాడు. - ఈ భూమంతా పద్మాకారంగా ఉండేది. ఇదొక బంగారు కొండ. దీని ఎత్తు లక్ష యోజనాలు. సరిగా ఈ భూమికి మధ్యభాగాన జంబూద్వీపం పద్మపత్రంలా ఉండేది. లక్ష యోజనాల పొడవు, అంతే వెడల్పుగా ఉంటుంది. దీనికి తొమ్మిది వరాలున్నాయి. అందులో పత్ర వర్షం. దాని మధ్యలో బంగారంతో ఉంది. ఈ భూమినే పద్మానికి పైకి వచ్చిన బొడ్డు వంటిది బంగారు కొండ. దీని ఎత్తు లక్ష యోజనాలు. దీనికి ఉత్తర దిశగా నల శ్వేత శృంగ మహాపర్వతాలు మూడున్నాయి. రెండు వేల యోజనాలతో ఇవి బాగా వ్యాపించి ఉన్నాయి. వీని మధ్యలో రమ్య హిరణ్యయా కుడు వర్షాలున్నాయి. వాటి విస్తారం తొమ్మిది వేల యోజనాలు లవణ సముద్రాంతం వరకు వ్యాపించి ఉన్నాయి. ఇలా వృత వర్షానికి దక్షిణాన నిషధ - హేమకూట పర్వతాలున్నాయి. వీని మధ్యలో హరివర కింపురుష వర్షాలున్నాయి. ఇలా వృతానికి పడమర దిశగా మాల్య వీద్రి, తూర్పున గంధమాదనం, ఇక్కడ కేతుమాల వర్షం కూడా ఉంది.


గంధమాదన పర్వతానికి తూర్పుగా భద్రాశ్వవరం, మేరువుకు తూర్పుగా మందరపర్వతం, మేరువుకు నలుదిశలా ఉండే స్తంభాల మధ్య క్షీరమదం, ఇక్షు రసాల రుచులు కలిగి పెద్ద సరోవరాలున్నాయి. ఈ సరస్సులలో స్నానం గావించేవారికి సకల ఐశ్వర్యాలు సుఖ భోగాలు కలుగుతాయి. ఈ మేరు పర్వత శిఖరాల పై చైత్రరథ, విభ్రాజిత, సర్వతోభద్రలనే నామాలతో అందమైన వనాలనేకం ఉన్నాయి. విభ్రా ఇచ్చటకు దేవకాంతలు వచ్చి నృత్య, గీతాలతో విహారం గావిస్తారు. ఈ మందర పర్వతంపై మామిడిచెట్లు బహుళంగా ఉన్నాయి. వాటికి గల ఫలములు ఎంతో మధురంగా, పెద్ద పెద్ద పరిమాణం కలిగి ఉంటాయి. ఆ మామిడిపళ్ళు బాగా ముగ్గి వచ్చిన రసంతో సరస్సులు తయారౌతాయి. మేరు మందర గిరుల మీద నేరేడు పళు మరీ విపరీతంగా ఉంటాయి. ఆ పళ్ళరసంతో జంబూ నదం ఏర్పడింది.


జంబూనదిలో బాగా నానిన మట్టి సూర్యకిరణాలకు ఎండి, గాలికి ఆరిపోయి బంగారంలా ఉంటుంది. సుపార్వగిరి మీద అయిదు బారల వెడల్పుతో మధుర ధారలతో దిక్కులకు ప్రవహించి మూలావృత వర్ష పడమర భాగమంతటా తడిసిపోయి ఈ ప్రవాహంలో తేనె త్రాగినవారు విడిచిన వాయువు సుగంధభరితంగా ఉంటుంది. కుముదగిరిపై నాలుగు దిక్కులు విస్తరిల్లే ఒక వృక్షం ఉంది. అది చెప్పుకో దగింది. ఆ చెట్టు నుండి పాలు, పెరుగు, నేయి, బెల్లం కలిపిన అన్నం ఉద్భవిస్తుంది. ఈ వృక్షం మనం మనసులో కోరే వస్త్రాలు, ఆభరణాలు, మాచలం, ఆసనాలు ఎన్నిటినో సమర్పిస్తుంది. అంతేకాదు ఈ వృక్షాన్ని ఆశ్రయించేవారికి ముసలితనం చావు రాదు. చలి, వేడిమి ఉండదు. వారి శరీరాలు సువాసనా భరితంగా ఉంటాయి. ఇక్కడ దివ్యులు, దానవులు, మునులు, ఋషులు, గంధర్వులు స్వేచ్చగా ఇష్టానుసారంగా క్రీడిస్తారు. మేరుగిరి కర్ణికకు చుట్టూ కేసరల్లాగా కురంగా, కురగ, కుసుంభ, వైకంకత, త్రికుట, శిశిర, పతంగ, రుచక, నిషధ, శిశువాస, కపిల, శంకలనే మహాపర్వతాలున్నాయి. మేరు పర్వతానికి తూర్పుదిక్కున జఠర పర్వతాలు, దీనికి పడమర దిక్కున పవన, పారియాలున్నాయి. దక్షిణం వైపు కైలాస, కరవీరాలు, ఉత్తరాన త్రిశృంగ, మకరాలను గొప్ప పర్వతాలుశ్రీ ణులతో విస్తరిల్లి ఉన్నాయి.


మేరు పర్వత శిఖరం పై పదివేల యోజనాల ఎత్తూ, అంతే వైశాల్యంతో స్వర్ణమయమైన పురం ఉంది. దీనికి ఎనిమిది వైపుల అష్టదిక్పాలకుల పట్టణాలున్నాయి. శ్రీ హరి వామన రూపంతో పెరుగుతున్న సమయాన అతని కాలిగోరు తగిలి పైనున్న బ్రహ్మాండమంతా జలయింది. అప్పుడక్కడ బయలుదేరిన జలధార శ్రీ నారాయణుని పాదస్పర్శతో ప్రవహించి, సర్వలోకాల పాపాలు కడిగి భగవత్పాది అను పేరుతో స్వర్గలోకంలో విహరించింది. పరమ భాగవతోత్తముడైన ధ్రువుడు శ్రీ హరి పాదోదకాన్ని నిత్యం శిరముపై జల్లుకుంటాడు. ధ్రువ మండలానికి క్రింది భాగాన ఉన్న సప్తర్షులు కూడాశ్రీ హరి పాదోదక సేవయే తపఃఫలమని తెలిసికొని తమ జటూ టాలను ఆ పవిత్ర జలధారతో నింపుకున్నారు. అది దేవమార్గం గుండా దిగివచ్చి చంద్రమండలంలో దిగి మేరుశిఖరం మీద బ్రహ్మపట్నం చేరి అక్కడ నుండి నాలుగు పాయలుగా ప్రవహిస్తుంది. బ్రహ్మ పట్టణం తూర్పు ద్వారాన ప్రవహించింది సీత. ఇది గంధమాదనం మీదుగా భద్రాశ్వవర్షం దాటి తూర్పు సాగరంలో సంగమిస్తుంది. పడమర ద్వారాన వచ్చింది చక్షువు మాల్యవత్పర్వతం దాటి కేతుమాలా వర్షం మీదుగా పడమర సాగరానకలుస్తుంది. ఉత్తరంగా వచ్చిన భద్రావతి కుముద, నీల శ్వేత పర్వతాల మీదుగా ఉత్తర కురు భూముల్ని పరమపావనం చేసి ఉత్తర సాగరాన కలిసింది. దక్షిణ దిక్కుగా ప్రవహించే అలకనందా నది హేమకూట, హిమకూటములు దాటి భారత భూమిని మహాపవిత్రం చేసి దక్షిణ సాగరంతో సంగమిస్తుంది. మేరువు మొదలైన మహా పర్వతాల నుండి జన్మించే నదులు వేలకు వేలున్నాయి. జంబూ ద్వీపంలో భారత వర్షమొక్కటే కర్మభూమి. మిగిలిన అన్నిటా ఉండేవారు దివినుండి దిగివచ్చినవారు తమ పుణ్యఫల శేషం అనుభవించి పోతుంటారు. అక్కడ నివసించేవారు వేనకువేల సంవత్సరాలు జీవిస్తారు. వేల ఏనుగుల మహాబలం కలవారు. వజ్రం వంటి శరీరాలు కలవారు. నిరంతరం సంతోషంతో ఉండేవారు. ప్రమత్తత ఉండదు. దీనిలో నిరంతరం కామోపభోగాలతో నిరంతరం విహరిస్తారు. ఇలావృత వరానికి అధిపతి పరమశివుడు. అచ్చట నందనవనం లాంటి వనాల్లో పార్వతితో పరమశివుడు నిరంతరం లీలావినోదంలో తేలియాడుతారు.అక్కడికి ఎవరు వెళ్ళినా స్త్రీలుగా మారిపోతారు. భద్రాశ్వవర్షాధిపతి భద్రశ్రవుడు. అతడు హయగ్రీవానుచరుడు. అందువన అచ్చట ఉన్నవారందరూ అతనిని కొలుస్తారు. ఎంతో సంతోషంతో ఉంటారు. హరివర్గానికి నరహరి ప్రభువు. దానవ దైత్యులందరూ ప్రహ్లాదుడు మొదలగు వృద్దులతో కూడి నరహరిని అర్చిస్తారు. కేతుమాల వర్షంలోశ్రీ నారాయణుడు శ్రీ మహాలక్ష్మిపీ తికలిగే రమ్యక వర్గానికి ప్రభువు మనువు. ఈయన మత్స్యరూపుడైన శ్రీ హరినే సేవిస్తాడు. హిరణ్య వర్షానికి ఆదిదేవుడైన కూర్మరూపుడైన హరి ఉత్తర భూములకు వరాహరూపుడు అధిదేవత. కింపురుష వర్షాధి దేవతశ్రీ సీతా లక్ష్మణ సమేతుడై శ్రీ రాముడు. అక్కడున్న కింపురుష గణాలతో శ్రీ హనుమ రాముని సేవిస్తాడు. భారత వర్గానికి అధిదేవత బదరికాశ్రమవాసి నారాయణుడు. అతనిని నారదాదులు ఉ పాసిస్తారు. భారత వర్షంలో ప్రసిద్ధాలైన నదీనద పర్వత క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఈ క్రింది పద్యంలో పేర్కొనడం జరిగింది.


మలయ, మంగళ, మైనాక, త్రికూట, ఋషభ, ఋక్షగిరి, ఋష్యమూక, సహ్య, కృష్ణవేణి, గోదావరి, భీమరథి, వేదగిరి, వింధ్య, మహేంద్రశ్రీ శైల, వేంకటాద్రి, పారియాత్ర, ద్రోణ, చిత్రకూట, గోవర్ధన, రైవతక, నీలగిరి, కాకుముఖ రామగిరి, ఇంద్రకీల మొదలైన మహాపర్వతాలు పేరెన్నిక గన్నవి ఉన్నాయి. చంద్రవట, కృతమాల, వైజయసి, ప్రమోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, గోదావరి, భీమరథి, నిర్వింద్య, రేవా, శివా, సుర, చర్మణ్మతి, వేదస్మృతి, ఋషికుల్య, కౌశిక, మందాకిని, యమున, సరస్వతి, వృషద్వతి, గోమతి, సరయు, భోగవతి, శతద్రు, చంద్రభాగ, మమద్వ్యధ, వితప్త, విశ్వసింధు, రోణలు, నదీనదాలు. ఈ భారత భూమిలో పుట్టేవారు త్రిగుణాలతో జరిపే కర్మల మూలంగా దేవ, మానవ, నరకాలందుతారు. రాగద్వేషాలు లేకుండా అవాజ్మానస గోచరుడైన శ్రీ నారాయణుని నామాన్నే సర్వకాలాల్లో జపించే భాగవతోత్తములుశ్రీ విష్ణు పదాన్ని పొందుతారు. అందువలన ఈ దేశంలో పుట్టడం ఎంతో పుణ్యం చేసేవారికే లభ్యం అవుతుంది. శ్రీ మన్నారాయణ నామ జపం సర్వపాపాలను నాశనం గావిస్తుంది. ఇతర స్థలాల్లో వేల సంవత్సరాలు తపస్సు చేసినా లభింపని జన్మరాహిత్యం ఇచ్చట ఒక్క క్షణకాలం గావిస్తే లభిస్తుంది. వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇచ్చట ఒక పరమ రహస్యం దాగి ఉందిశ్రీ నారాయణ నామజపం లేని దగ్గర అతని స్మరణ లేని భాగవతులు లేని దగ్గర, ఆ శ్రీ పతిని ఆరాధించలేని దగ్గర అది ఎంత గొప్ప స్థలమైనా ఒక క్షణం కూడా నిలువరాదు. మనుష్య జన్మ దుర్లభం. అందులో జ్ఞాన, తప, అనుష్టానాలతో ముక్తిని పొందలేకపోతే ఇక గందామ్మగంగారణ్యంలో పుట్టడం మంచిది. నరుడై పుట్టినందుకు నారాయణ నామస్మరణ జపంతో ఈ జన్మను పునీతం చేసుకోవాలి. అది భారతదేశంలోనే సాధ్యమవుతుంది. జంబూద్వీపం చుట్టూ లక్షయోజనాల వైశాల్యంతో ఉప్పు సముద్రముంది. రెండు లక్షల విశాలతతో పక్షిద్వీపం ఉంది. దీనికి అగ్నిహోత్రుడాధిదేవత. దానికవతల ఇక్షు సముద్రముంది. మధ్యలో శాల్మలీ ద్వీపముంది. దీనికి చంద్రుడాధిదేవత. దానికావల సురా సాగర మధ్యలో కంశ ద్వీపముంది. ఈ ద్వీపాన్ని ఆనుకొని ఘృత సముద్రముంది. అక్కడ క్రౌంచ ద్వీపముంది. దీనికావల పదహారు యోజనాల విశాలంతో పాల సముద్రముంది. అందులో శాకర్వీ ద్వీపముంది. . దానికావతల దధీ సముద్రంది. ఇది అరువది నాలుగు లక్షల యోజనాల వైశాల్యంతో ఉంది. అచ్చట పదివేల సువర్ణ దళాల విశాల పద్మం. దానిపై ప్రజాపతి అధిష్ఠించి ఉంటాడు. దీనికి నాలుగు దిక్కులా దిక్పాలురు నలుగురూ తమ నగరాలలో కాపురం చేస్తుంటారు. మానసోత్తర పర్వతం ఇక్కడే ఉంది. ఈ పర్వతం చివరల నుండి సూర్యభగవానుని రథం మేరుపర్వతం చుట్టూ ప్రదక్షిణ గావిస్తూ కాలానిచూ పుతుంది. పుష్కర ద్వీపంలో జీవుల మధ్య అణుమాత్రం భేదభావముండరాదు. అందరూ కలసి మెలసి జీవనం సాగిస్తారు. ఈ ద్వీపం చుట్టూ ఉండే సాగరంలో నీరు స్వాధురుచితో ఉంటుంది. ఈ సాగరానికావల లోకాలోక పర్వతం ఉంది. వీటి మధ్యభాగంలో రెండు కోట్ల యోజనాల విశాలమైన ప్రశాంత ప్రశస్త ప్రదేశంలో దేవతలు విహరిస్తూ ఉంటారు. ఈ భూమండలంలో లోకాలోక పర్వతం నాలుగో వంతుంటుంది. ఈ పర్వతం పైన ఋషభ, పుష్కరూ డ, వామన, అపరాజిత అనే పేర్లతో దిగ్గజాలుంటాయి. ఇక్కడే నారాయణుడు తన విష్వక్సేనాదిది అనుచరులతో దేవమునులతో హాయిగా నివసిస్తాడు. ఈ భువన భవనానికి మధ్యభాగాన సూర్యభగవానుడుంటాడు. సూర్యునికి ఇరువైపులా ఇరువది అయిదు కోట్ల యోజనాలలో బ్రహ్మాండ భాండముంది. సర్వజీవుల ఆత్మ సూర్యుడు.


ఇంతటి విశిష్ట స్థానం కలిగిన ఈ భూలోకం ఏ ప్రాణికీ స్థిరమైనది. ఇది కర్మభూమి అని పిలువబడుతుంది. తమ కర్మలకు అనుగుణంగా ఇక్కడ నివసించి వెళ్ళక తప్పదు. మర్య లోకమనగా, భూమి, భూలోకంలో మానవులు జ్ఞానము కల్గిన జీవులు. వారి వారి పూర్వ పుణ్య పాప కర్మలను ఇక్కడ అనుభవించి మంచి కర్మలు చేసినవారికి మోక్షము, పాప కర్మలు చేసినవారికి నరకము సంభవించును. భూలోకం మానవులకు ఒక ముసాఫిర్‌ఖానా అని గుఱ్ఱం జాషువా చెప్పినట్లు ఈ లోకం ఒక విశ్రాంతి స్థలం. మానవులు బాటసారులు మాత్రమేనని పేర్కొన్నారు. అనగా మానవులకు ఈ లోకం విశ్రాంతి క్షేత్రం కనుక ఇక్కడ ఎవరికీ స్థిరమైన స్థానం లేదు. స్వయంగా పరమాత్ముడే మానవునిగా జన్మించినా కొంతవరకే ఉండి తిరిగి అవతారము చాలించినట్లు కృతే త, ద్వాపర యుగాల చరిత్రను చదివితే మనకు అవగతమవుతుంది. ఈ విషయాన్ని స్వయంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరుడు అనంతాచార్యులకు చెప్పినట్లు తిరుమల కథల ద్వారా తెలుస్తుంది. భగవద్రామానుజుల నిర్యాణానంతరం అతని శిష్యుడైన అనంతాచార్యులు తీవ్ర మనోవేదన చెందగా భూలోకం మానవులకు అస్థిరమని, ఇక్కడ జన్మించినవారు ఎవరూ శాశ్వతంగా ఉండరని, అది భూమి యొక్క ధర్మమని ఓదార్చాడు. కాబట్టి "అస్థిరంబు భూలోక నివాసంబు” అని పేర్కొన్నారు.