శ్రీవారి కథలు - Dr. D.శ్రీ నివాస దీక్షితులు


“చక్రవర్తీ! రాజ్యంలో అందరూ కుశలమే కదా! " ఆప్యాయంగా అడిగాడు అంగీరసుడు. - "ముఖ్యప్రాణాన్ని ఆత్మదృష్టితో ఉపాసన చేసిన మహర్పులు మీరు. తమ తపశ్శక్తి అండగా ఉండగా మాకు కొరత ఏముంటుంది?” వినయంగా అన్నాడు చక్రవర్తి. “మీరాకకి కారణం? ” చిరునవ్వుతో అడిగాడు అంగీరసుడు. “గురువర్యా! ” ఆగాడు చక్రవర్తి. “ఆగారేం... చెప్పండి!” అన్నాడు అంగీరసుడు. “ఈ మధ్య... నా మనసుని ఒక వేదన కలచి వేస్తోంది. అందుకే మీ దగ్గరికి ఇలా వచ్చాను గురువర్యా!” అన్నాడు తొండమానుడు. అంతలో శిష్యుడు మట్టి ముంతతో ఆవుపాలు తెచ్చి చక్రవర్తికి ఇచ్చాడు. తాగమని సైగ చేశాడు మహర్షి. ఆవుపాలని తాగాడు చక్రవర్తి. "చక్రవర్తీ! నీకు వేదనా....?" ఆశ్చర్యంగా అడిగాడు అంగీరసుడు. “అలా అడిగారేంటి?” అన్నాడు చక్రవర్తి. శ్రీ నివాసుని అనుగ్రహానికి పాత్రుడవైన నీకు వేదన కలగటం ఆశ్చర్యంగా ఉంది!” అన్నాడు అంగీరసుడు.


"గురువర్యా! నేను మహాపచారం చేశాను. అందువల్ల స్వామికి బాధ కలిగింది. ఆ బాధేనా వేదనకి కారణం!” అంటూ జరిగిన సంగతంతా వివరించాడు చక్రవర్తి. “అలాగా...” అన్నాడు అంగీరసుడు. “గురువర్యా! శ్రీ నివాసుడు ప్రసన్నుడు కావాలంటే... ఆయన కరుణ పూర్తిగా నాకు లభించాలంటే నేనేమి చెయ్యాలో చెప్పండి!” అని అర్థించాడు తొండమానుడు. శ్రీ నివాసుని అర్చించటమే మార్గం” చెప్పాడు మహర్షి. “వివరంగా చెప్పండి” అన్నాడు చక్రవర్తి. "నిత్యమూ తులసీదళాలతో శ్రీ నివాసునికి సహస్ర నామార్చన చెయ్యిశ్రీ నివాసుడు తప్పక కరుణిస్తాడు. ఇంకా ముక్తిని కూడా అనుగ్రహిస్తాడు! ” అని ఉపదేశించాడు అంగీరసుడు. వెంటనే బంగారంతో తులసీదళాలను చేయించి కులగురువు ఆదేశానుసారం ఆ సువర్ణ తులసీదళాలతో నిత్యమూ ఆనందనిలయానికి వచ్చిశ్రీ నివాసునికి సహస్ర నామార్చన చేస్తున్నాడు తొండమానుడు. నెలలు గడుస్తున్నాయి. అయినా శ్రీ నివాసుడు...


శ్రీ వేంకటేశ్వరుడు ప్రసన్నుడు కాలేదు. ఆత్మస్టెర్యాన్ని కోల్పోకుండా అర్చన చేస్తూనే ఉన్నాడు చక్రవర్తి. “స్వామీ! నన్నింకా పరీక్షిస్తున్నావెందుకు? బంగారు తులసీదళాలతో నిత్యమూ నిన్ను పూజిస్తున్నాను కదా! అయినా నువ్వు నన్ను కరుణించటం లేదు. కూర్మనాథుని భార్యకి దివ్యదర్శనాన్ని ప్రసాదించావు. నాకు ఆ అదృష్టం లేదా?” అని శ్రీ నివాసునికి పదే పదే మొరపెట్టుకుంటున్నాడు తొండమాన్ చక్రవర్తి. అతను చేసిన మహాపాపాన్ని తొలగించినా అతనికి కనువిప్పు కలగలేదు. తాను చక్రవర్తిని అనే అహంకారమూ నశించలేదు. అహంకారమే కదా అన్ని అనర్థాలకి మూలం. అన్యథా శరణం నాస్తి... త్వమేవ శరణం మమ.. నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అని శరణు వేడితే తపశ్రీ నివాసుడు కరుణించడు. ఆ పరిపక్వత ఇంకా తొండమానునికి లభించలేదు. అందుకే ఈ విచారధార. ఒక రోజు ...


20000000 యథాప్రకారం ఆనందనిలయంలో శ్రీ నివాసుని అర్చామూర్తికి సువర్ణ తులసీదళాలతో సహస్ర నామార్చన చేస్తున్నాడు. ఒక్కో నామానికి ఒక్కొక్క తులసీదళాన్ని... సువర్ణ తులసీదళాన్ని స్వామి పాదాల చెంత ఉంచుతున్నాడు చక్రవర్తి. అంతలో ఆయనకి ఒక చిత్రం కనిపించింది. తాను సమర్పించిన సువర్ణ తులసీదళాలు పక్కకి తొలగి ఎక్కడినుంచో వచ్చి మట్టితో చేసిన తులసీదళాలు చేరుతున్నాయి. వరుసగా నామాలు చదువుతూ సువర్ణ తులసీదళాల్ని సమర్పిస్తున్నాడు చక్రవర్తి. వెంటనే అవి పక్కకి తొలగిపోతున్నాయి. వాటి స్థానంలో మట్టితో చేసిన తులసీదళాలు వచ్చి చేరుతున్నాయి. " వాటిని పరిశీలనగా శాడు చక్రవర్తి. నల్లని మట్టితో చేసిన తులసీదళాలు. అందంగా నిగనిగలాడుతున్నాయి. ముచ్చటగా ఉన్నాయి. కృష్ణతులసిలాగా ఉన్నాయి. అవి ఎక్కడినుంచి వచ్చి పడుతున్నాయో ఆయనకి అర్థం కాలేదు. మనసుని చిక్కపట్టుకుని ఎలాగో అర్చనని పూర్తి చేశాడు చక్రవర్తి. "స్వామీ! పిలిచాడు తొండమానుడు. శ్రీ నివాసుడు పలకలేదు. "ఇచ్చిన మాట తప్పుతావా? తండ్రీ! ” స్వామినుంచి సమాధానం లేదు. మళ్ళీ పిలిచాడు... మళ్ళీ మళ్ళీ పిలిచాడు చక్రవర్తి శ్రీ నివాసుడు ప్రత్యక్షమయ్యాడు. . "స్వామీ! నీకు నాకంటే పరమ భక్తుడున్నాడా? ఈ మట్టిదళాలు ఏ భక్తుడు సమర్పించినవి? నేను అర్పించే సువర్ణ తులసీదళాల కంటే ఈ మట్టివి ఎక్కుతిపాత్రమయ్యాయా? చెప్పు!” అడిగాడు తొండమానుడు. శ్రీ నివాసుడు మందహాసం చేశాడు. “చెప్పు స్వామీ చెప్పు” అడిగాడు చక్రవర్తి. “తొండమానూ! నువ్వూ నా పరమ భక్తుడివే సుమా! నీ భక్తిలో అహంకారం ఆవరించి ఉంది. బీదవాడైన ఒక భక్తుడు ఎంతో వినయంతో స్వయంగా చేసి మట్టి తులసీదళాల్ని నాకు నిత్యమూ సమర్పిస్తున్నాడు...” వివరించాడశ్రీ నివాసుడు. “ఆ భక్తుడు ఎవరు? అతని పేరేమిటి? ఎక్కడ ఉంటాడు?” అడిగాడు చక్రవర్తి. “తొండమానూ ఆ భక్తుడు కడు పేదవాడు. కుండలు చేసే కుమ్మరి. అతనిమా స్తావా?” అడిగాడు


శ్రీ నివాసుడు. “తప్పకుండ స్తాను!” అన్నాడు చక్రవర్తి. "మనకి సమీపంలోనే ఉన్నాడు! ” అన్నాడు స్వామి. “మనకి సమీపంలోనా?” “అవును” చక్రవర్తి ఆశ్చర్యంగా స్వామి వంక చూ శాడు.