మానవ పుట్టుక మహోన్నతం. పూర్వజన్మ సుకృతం. పునరపి జననం, పునరపి మరణం కాకూడదు. ఇంకో జన్మ లేకుండా చేసుకోవడమే మానవజన్మ. 84 లక్షల జీవరాశులలో ఉత్కృష్టమైన జన్మ మానవజన్మ. మనిషి దివ్యగుణాల పుట్ట. ప్రతి మానవుని మది జ్ఞాననిధి. ప్రతి మానవుని హృదయం చైతన్య నిలయం. భగవంతుని ఆశ్రయం. అది గమనించి తెలుసుకోవడమే నీలోకి నీ ప్రయాణం. అంతర్ ప్రయాణం విచక్షణా జ్ఞానానికి నిదర్శనం. అదే బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి సులువైన మార్గం. అమృతమార్గం. ఆనంద జీవనానికి సూచకం.
గురువులెందరున్నా సద్గురువు ఒక్కరే. సద్గురువు యొక్క సాన్నిహిత్యము అమృతతుల్యము. సరైన దారి ఎంపిక సద్గురువు యొక్క సాన్నిహిత్యమే. సరైన దారిలో ప్రయాణం గమ్యానికి సన్నిహితం. గురువు గమనిస్తాడు. అవసరమైతే మందలిస్తాడు. తప్పుదారి నుండి తప్పిస్తాడు. తమోగుణాన్ని వివరించి సాత్వికంగా తయారు చేస్తాడు. సామర్థ్యాన్ని పెంచుతాడు. పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి వన్నె తెప్పిస్తాడు. శిల్పిగా అనవసరాన్ని తొలగించి అందమైన శిల్పంగా మలుస్తాడు. మన్ననలను ప్రశంసలకు పాత్రుడవుతాడు. పసిబిడ్డలా లాలిస్తాడు. పశుత్వాన్ని పారద్రోలి మానవత్వాన్ని పెంచడానికి శిక్షణ ఇస్తాడు. గురువు గారి స్పర్శనం, శిష్యునికి సర్వమంగళ ప్రదాయకం. సకల భోగప్రదాయకం. సద్గురువు నిరంతరం శిష్యుని బాగోగులను గురించి ఆలోచిస్తాడు. శిష్యుణ్ణి గురువుకు తగ్గ శిష్యునిగా మలుస్తాడు. ఉలిదెబ్బలు తిన్న శిల్పంగా మార్చుతాడు.
గురువును తలిస్తేనే, మనసున పూజిస్తేనే ప్రసన్నమై శిష్యునికి కావలసింది ఇస్తాడు. ఏకలవ్యుని శిష్యరికం ప్రతి ఒక్కరికి ఆదర్శం. నిష్కల్మషమైన నిజాయితీతో కూడి విశ్వాసముతో వినమ్రతతో గురువు యొక్క విగ్రహాన్ని, చిత్ర పఠనాన్ని లేదా రూపాన్ని ఊహించుకొని పూజించిన గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాం. గురువు దగ్గర నుంచి సర్వశక్తులు పొందగలం. ఇది సత్యం. దైవాన్ని విగ్రహంలో స్తున్నాం. పూజిస్తున్నాం. దీవెనలు పొందుచున్నాం. అలాంటిది గురువు స్వయంగా అనుగ్రహించి స్పర్శిస్తే ఆయన శక్తి మనకు రాదా! ఆయన అనుగ్రహానికి పాత్రులం కామా! తప్పక సద్గురువు ఎల్లప్పుడూ తన శిష్యులు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు కాబట్టి. గురువుగారి భాషణం అమృతతుల్యం. వారి మహానుభావంతో వారి నోటనుంచి వచ్చే మాట సూక్తుల మాట. లోక కళ్యాణం కోసం వారు మనకు అందించే తియ్యటి పాట. శిష్యుని స్థాయి సద్గురువులెందరో, ఎందరెందరో, సద్గురువు యొక్క యుక్త భాషణముతో శిష్య పరంపర చైతన్యస్థితికి వెళ్ళి విశ్వకళ్యాణము, విశ్వశాంతి కోసం పాటు పడుతుందనడంలో అతిశయోక్తి లేదు.
గురువుగారి బోధనలు శిష్యులకు సాధనలు కావాలి. పఠనంతోటి పాటించడం అత్యంత ఆవశ్యకం. చెప్పడం కాదు ముఖ్యం ఆచరించడం. ఆచరణలోనే ఆనందం. బోధించేవాడు ఆచరించాలి. సద్గురువులు ఆచరించిన తర్వాతనే శిష్యులకు బోధిస్తారు. ఆచరణ తర్వాత వచ్చే భాషణం విశ్వానికి అత్యంత ముఖ్యం. గురువుల, మహానుభావుల భాషణం అవసరమైనప్పుడు మూడు విధాలుగా యుక్త భాషణం,మిత భాషణం, నిర్భాషణంగా ఉంటుంది. గురువులందరూ కదిలే విశ్వవిద్యాలయాలు. వారి భాషణం సుభాషణం. అమృతమయం. జ్ఞానమయం. గురువుల మాట ముత్యపు మూట. గురువుగారి సత్సంగమం విశ్వజ్ఞాన సమ్మేళనం. శిష్యులకు అత్యంత ఆచరణీయం. గురువు స గురువు యొక్క నిర్భాషణం శిష్యులకు శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన. సృష్టి రహస్య ఛేతన. గురువుగారి భాషణ శిష్యునికి దారూ పే పరిశోధన. సోక్రటీసు, ప్లేటో, రమణమహర్షి, షిర్డీసాయి, సత్యసాయి ఇలాంటి ఎందరో సద్గురువులు కదిలే విశ్వవిద్యాలయాలు. వారి నడక మనకు పాఠం. వాడూ పు మనకు శక్తి. వారి హావభావాలు మనకు (శిష్యులకు) జీవన ప్రయాణానికి సూచనలు. వారి కరటి పు శిష్యులగమ్యామ్నా పువారినవ్వు శిష్యులకు ఆధ్యాత్మిక పువ్వు. వారి కదలికలు శిష్యులకు జ్ఞానబోధనలు. వారి శరీరము సృష్టి రహస్యాన్ని తెలిపే బ్రహ్మతత్వము. వారి శ్వాసలో ఓంకారము, వారి బోధనలు బ్రహ్మతత్వపు నిధులు. వారిలోని అంతర్ శక్తి శిష్యులకు ప్రకంపనల ద్వారా ప్రసరిస్తుంది. . సహనము సముద్రము కన్నా గొప్పది. సద్గురువులు శిష్యులను ఎన్నోరకాలుగా పరీక్షిస్తారు. పరీక్షలన్నీ ఆత్మజ్ఞానము పొందడానికి అర్హత సూచికలు. గురువుగారి దర్శనం మహాభాగ్యం. గురుకులాల్లో జతో గురువుని దర్శించుకుని ప్రార్థించిన ప్రతిరోజు సద్గురువులో ఏదో ఒక అమృతగుణాన్ని నేర్చుకోవచ్చు. గమనించాలి. గమనిస్తే గమ్యం. గురువుగారి మట్టి విగ్రహాన్ని ఎదురుగా ఉంచుకుని సకల విద్యాపారాయణుడుగా తయారయిన ఏకలవ్యుడు ఎంతటివాడో! గురువుని దర్శించకపోయినా ఆయన విగ్రహాన్ని ఏర్పరచుకొని నిగ్రహముతో కౌరవ, పాండవులకు నేర్పిన విద్యలన్నింటిని నేర్చుకోగలిగాడంటే ఏకలవ్యుని పట్టుదల, నిబద్ధత, గురుతుల్యభావం, ఏకాగ్రత శిష్యులకు ఆదర్శం. గురుదర్శనం పాపహరణం. శిష్యుని అంతర్ముఖ ప్రక్షాళనం. గురుదర్శనం అంతర్ముఖ ప్రయాణానికి సోపానం. శిష్యుని చంచల చిత్తాన్ని గురుదర్శనం నిలకడతో తన లోపలి ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. నిర్ణయిస్తుంది. ఆదేశిస్తుంది. గురుదర్శనం పూర్వజన్మ సుకృతం. ముక్తి మార్గాన్ని నిర్దేశించే, నిర్ణయించే దైవ స్వరూపం.