శ్రీరాముని ఆలయాలు చరిత్ర వైశిష్ట్యం


తండ్రి మాటను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, దూరమైనా నిరంతరం ఆమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా, ఎక్కడ కూడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చెప్పిన వ్యక్తి శ్రీరాముడు. త్రేతాయుగంలో శ్రీమహా విష్ణువే లోక కల్యాణం కోసం రాముడిగా అవతరించి, దుష్ట శిక్షణ చేశాడని రామాయణం తెలియజేసింది. తండ్రికి ఇచ్చిన మాట కోసం కట్టుబడి అరణ్యాలకు వెళ్ళిన రాముడు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆదర్శమూర్తె. రామాయణంలో రాముని లక్షణాలు గురించి వర్ణిస్తూ షోడశ మహాగుణాలు ఆయనలో ఉన్నట్లు తెలిపారు. ఇటువంటి రాముడి గురించి వెలసిన దేవాలయాలను పరిచయం చేయడమే నా పత్రం ముఖ్యోద్దేశం. శ్రీరాముడిని పూజించే దేవాలయం రామాలయం. ప్రతి గ్రామంలోనూ రాముని ఆలయం ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ ఆలయాలు ఏవో చూద్దాం.


భద్రాచలం :


శ్రీ సీతారాముల వారి దేవస్థానం తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో భద్రాచలంలో ఉంది. ఇది తెలంగాణాలోని రామాలయాలలోకెల్లా పెద్దది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. 17వ శతాబ్దంలో శ్రీరామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంలో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయాన్ని దర్శించడానికి నలుమూలల నుండి ప్రజలు అనేక మంది వస్తుంటారు. పవిత్రమైన గోదావరినది ఈ కొండను చుట్టుకొని దక్షణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలంకి మరింత తోడ్పాటునిచ్చింది. మేరుపర్వతం, మేనకలకు పుట్టిన బాలుడే భద్రపర్వతం. ఈ భద్రుడు (చిన్నకొండ) వల్లే ఈ చిన్నకొండకు భద్రగిరి అని, ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో ఉండే ప్రత్యేకతలు చూస్తే శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కాని భద్రాచలంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా కుడిచేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లుని ధరించి, విష్ణువులాగా కుడిచేతిలో శంఖాన్ని, ఎడమ చేతిలో చక్రాన్ని ధరించి ఉంటుంది. అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడి వైపున ఉంటాడు కాని భద్రాచలంలో ఎడమ వైపున ఉంటాడు. ఇక్కడ జరిగే ఆకు వచ్చింది.


ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమి రోజున జరిగే కల్యాణం. ఇది దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ది చెందిన ఉత్సవం. ఈ కల్యాణానికి అనేకమంది భక్తులు వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ప్రతి సంవత్సరం పంపడం జరుగుతోంది. నిత్య పూజలు నిర్వహిస్తుంటారు. పర్ణశాల భద్రాచలం నుండి 35కి.మీ దూరంలో ఉంది. సీతారామలక్ష్మణులు వనవాస సమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు. ఇక్కడ సీతారాములకు చెందిన అనేక దృశ్యాలు కనిపిస్తాయి. జటాయుపాక భద్రాచలానికి 2కి.మీ దూరంలో ఉంది. సీతాపహరణం సమయంలో జటాయువు రావణుని ఎదుర్కొని, సీతను రక్షించే ప్రయత్నంలో తన ప్రాణాలను పోగొట్టుకున్న స్థలంగా దీనిని చెబుతారు. ఇంకా అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది భద్రాచలం.


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలానికి చెందిన గ్రామం. ఇక్కడ శ్రీ కామాక్షీదేవి సమేతంగా రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ గ్రామం సముద్రతీరాన ఉంది. సముద్రతీరాన సూర్యోదయ సమయంలో శ్రీరామచంద్రుడు సైకతం (ఇసుక) తో శివలింగాన్ని చేసి, శివార్చన చేసిన స్థలం ఇది. రాముడు శివార్చన చేసిన ఈ ప్రదేశంలో సముద్రస్నానం చేసి స్వామికి మొక్కుకొంటే కోరిన కోర్కెలు తీరుతాయని అక్కడ భక్తుల విశ్వాసం. యుగాలు మారిన తరగని భక్తితో భక్తులు ఇక్కడకు రావడం విశేషం. రాముడు సేవించిన తీర్థం కాబట్టి 'రామతీర్థం'గా పేరు వచ్చింది. ఇక్కడ దర్శనం చేసుకుంటే శివకేశవులను ఒకేసారి దర్శనం చేసేకున్నంత పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ప్రాచీనకాలం నుండి దివ్యక్షేత్రంగా వెలుగొందుతూ ప్రసిద్ధి చెందింది. 14వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవరాజులు శ్రీరాముడికి దేవాలయం నిర్మించారని ఇక్కడ చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. 18వ శతాబ్దంలో స్వామి వారిచే స్వప్నంలో ప్రేరణ పొందిన శ్రీ కోటంరెడ్డి శేషాద్రిరెడ్డి ఆలయాన్ని పునరుద్ధరణ చేశారు. వర్షాకాల సమయంలో సముద్రం పొంగి ఊరంతా జలమయం అయినప్పుడు స్వామి వారు కట్టను తెంచి గ్రామాన్ని రక్షించారని స్థానిక భక్తుల విశ్వానం. ఇక్కడ ప్రతి సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వర్తిస్తారు.


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తడ మండలానికి సమీపంలో వేనాడు అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ప్రతి వీధికి ఒకటో, రెండో దేవాలయాలు దర్శనమిస్తాయి. వేనాడు ఎక్కువ దేవాలయాలు ఉన్న గ్రామంగా చెప్పవచ్చు. అక్కడ రాముడు సంచరించాడని ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉన్నట్లు అక్కడి ప్రజలు చెప్తారు. వేనాడు గ్రామంలోని శివాలయం గుడిలో శివలింగం మీద మొదటి సూర్యుని కాంతి కిరణాలు పడటం ఆ దేవాలయం ప్రత్యేకత. ప్రతి నెల జాతరలు ఎక్కువగా జరుపుకుంటారు.


తిరుపతి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని కోదండ రామాలయం ప్రాచీనమైన, ప్రఖ్యాతమైన హిందూ దేవాలయం. ఇక్కడ మూలమూర్తులు కోదండ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు కొలువైయున్నారు. ఈ ఆలయం ఎదురుగా భక్తాంజనేస్వామి ఆలయం కుడా ఉంది. - భవిష్యోత్తర పురాణంలో శ్రీరాముడు సీతాన్వేషణ ఫలితం కోసం శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసినట్లు చెప్పబడింది. ఆ కాలంలో ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో ఒక గుహ వెలసి ఉండేదని ప్రతీతి. అందులో నుండి ఒక దివ్యమైన తేజస్సు వెలువడుతుండేది. రామాగమన గుర్తుగా ఈ ఆలయాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడని తర్వాత కాలంలో జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించాడని స్థానికుల అభిప్రాయం. ఈ ఆలయంలోని విగ్రహాలు రామచంద్ర పుష్కరిణిలో చక్రవర్తికి లభించినట్లు భావిస్తారు. ఈ ఆలయం తిరుమల వారి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఆలయం శిల్పకళ విజయనగరం కాలం నాటిదిగా గుర్తించవచ్చు. ప్రతి స్తంభంపై అనేక భాగవత, రామాయణ ఘట్టాలు, దేవతామూర్తులు దర్శనమిస్తాయి. 1830 లో కాశీయాత్రకు బయలుదేరి దారిలో తిరుపతి ప్రాంతాన్ని దర్శించుక్ను ఎనుగుల వీరాస్వామయ్య అప్పటి ఆలయ స్థితిగతుల గురించి రాశాడు.


ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని కోదండ రామాలయం ప్రాచీనమైన, విశిష్టమైన హిందూదేవాలయం. ఇక్కడి మూలమూర్తులు కోదండ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైయస్ఆర్ కడప జిల్లాకు చెందిన మండలం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27కి.మీ దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రం ఏకశిలా నగరంగా ప్రసిద్ది చెందింది. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ఈ ఆలయం ఒంటిమిట్ట ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిర్వహిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ఈ అలయానికి సమర్పిస్తారు. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామతీర్థం ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళగంగను పైకి తెచ్చాడని స్థలపురాణంలో వివరించారు. గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నెయర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి” అని కీర్తించాడు. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు కథనం. ఈ కోదండ రామాలయానికి మూడు గోపురాలున్నాయి. విశాలమైన ఆవరణం ఉంది. ఆలయ ముఖద్వారం ఎత్తు 160 అడుగులు. - 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించారు. గోపురాలను చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయి. ఈ చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణ గాథ కూడా ఉంది. క్షీరసాగర మథనం తర్వాత లక్ష్మీదేవిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు విన్నవించుకోగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్ళు ఇక్కడ స్వామివారి బ్రహోత్సవాలను నిర్వహిస్తారు. ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాం బేగ్ బావి ఒకటిగా చెప్పవచ్చు.


కె.సావరం : కె.సావరం గ్రామం ఉండ్రాజవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లాలో రామాలయం గుడి విశిష్టత ఎంతో ప్రాచుర్యం పొందింది. కర్రావారి సావరంలో ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ముత్యాలమ్మ తల్లి ఆలయంలో రామాలయంలోని సీతారాములు కల్యాణం రెండింటిని అంగరంగ వైభవంగా చేస్తుంటారు. ఇది జాతరలో ఒక భాగంగా జ్యోతి ఊరేగింపు, గరగల సందడి (పాముల ఆకారంలో ఉందే బొమ్మలను తల మీద పెట్టుకొని ఊరంతా తిరుగుతారు. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ వేషం వేసుకున్న వారిని చిన్నపిల్లలతో దాటించడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని అక్కడి ప్రజలు నమ్మతారు). బుట్టబొమ్మలు మొదలైన వాటితో సంక్రాంతిని పురస్కరించుకొని చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే సీతారాముల కల్యాణం చేసి ఊరంతా సుభిక్షంగా ఉండాలని అక్షింతలను పంచడం,


ముత్యాలను పంచి పెట్టడం చేస్తుంటారు. ఈ కల్యాణ మఘోత్సవంలో పాల్గొన్న వారందరికి శుభం కలుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. వీటన్నిటిని చేసిన తర్వాత అన్నసమారాధనతో (అన్నదానం) ఈ ఉత్సవం ముగుస్తుంది.


తణుకు : పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వీరభద్రపురం గ్రామంలో శ్రీరాముని ఆలయం ఉంది. పురాణాలలో చెప్పినట్లుగా సురలకు, అసురులకు క్షీరసాగరమథనం జరిగినప్పుడు వీరభద్రుడుకి తారకాసురుడికి మధ్య ఒకానొక ఘట్టంలో యుద్ధం జరుగుతుంది. వీరి యుద్ధం పేరుతో తణుకు పూర్వనామం తారకాసురపురం అని ఉండి కాలక్రమేణా తణుకుగా ప్రసిద్ధికెక్కింది. అలాగే వీరభద్రుడు అమృతం కోసం చేసిన ప్రయత్నంలో ఏర్పడిన స్థలాన్ని వీరభద్రపురం అంటారు. ఈ సంఘటన అక్కడ జరిగిందని ఐతిహ్యం కలదు. ఇక్కడ రామాలయం గుడికి చాలా విశిష్టత కలదు. ఈ రామాలయానికి ఆనుకొని ఉన్న పుట్టలో నాగుపాము ఎప్పుడూ అక్కడే నివసిస్తూ ఉంటుంది. పిల్లలు లేని వారు అక్కడి పుట్టకు మెక్కితే పిల్లలు కలుగుతారని అక్కడి ప్రజల విశ్వాసం. మదనపల్లె, జంగాల అగ్రహారం (పలమనేరు), చెన్నరెడ్డి పాళెం, వడ్డిపల్లి (నెల్లూరు), బెల్లంవారి పల్లె (గుంటూరు), దుండి పాళెం, పత్తిపాడు, రామలింగేశ్వరం పేట (తెనాలి), సంజామల (కర్నూలు) మొదలైనవి. ఇవేకాక ఇంకా ఎన్నో రామాలయాలు మన దేశంలో ఉన్నాయి. రామాయణం జీవిత విలువల్ని బోధించడమే కాదు వాటిని కాపాడేందుకు మార్గాలు చూపిస్తుంది. మనిషి గుణగణాలు ఎలా ఉండాలన్న దానికి రఘుకులోత్తముడైన శ్రీరాముడు ప్రతీక. అలాగే సాధ్వీమణి సీత కూడా ఆడవారికి మార్గదర్శి. తండ్రి మాట జవదాటకుండా అడవులకు వెళ్తున్నప్పుడు రాముడు సీతాదేవిని రాజ్యంలోనే ఉండిపొమ్మని ఎంతగానో నచ్చచెప్పాడు. తాను అనుభవించబోయే కష్టాల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం తన సతికి లేదనేది ఆయన భావన. అయినా సీతాదేవి పతియే ప్రత్యక్ష దైవమనుకుంటూ భర్త వెంట నడిచింది. రాముడి నుంచి ఏం నేర్చుకోవాలన్నది రామాయణం చెప్తుంది. ధైర్యసాహసాలు, సహనశీలత, దయార్లగుణం, పితృవాక్యపాలన, ధర్మనిరపేక్షత ఇలా చెప్పుకుంటూపోతే చాలా గుణాలు ఉన్నాయి. అలాగే మనిషి జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు రావచ్చు. వాటికి భయపడకుండా, వెనుతిరిగి చూడకుండా వాటిని ఎదుర్కొన్నవాడే ధైర్యశాలి. జీవితంలో అపజయపు మెట్టును తొలగించుకొని విజయపు మెట్టును ఎక్కగలడు. నలుగురికి ఆదర్శప్రాయంగా నిలువగలడు. -