భూలోకంలో కల్పవృక్షం తులసిమాత


తులసి జన్మవృత్తాంతం


తులసి ధర్మధ్వజుడు - మాధవి అనే రాజదంపతుల ఏకైక సంతానం. పుట్టుకతోనే నారాయణ స్మరణ చేసింది. ఊహ రాగానే రాజ ప్రాసాదం వదిలి బదరికాశ్రమం చేరి తపస్సు చేయడం ఆరంభించింది. శ్రీమన్నారాయణుడిని ప్రసన్నం చేసుకుని, ఆయనను పరిణయమాడాలన్నదే ఆమె తపస్సు లక్ష్యం. లక్ష సంవత్సరాలు సాగిన ఆమె కఠోర తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై ఆమె కోరిక తెలియజేయుమనగా, ఆమె తనకు తెలిసిన తన గత జన్మను వివరించింది. ఈ ద్వాపర యుగంలో తాను కృష్ణభగవానుని గోకులంలో ఒక గోపికననీ, ఒకనాటి పున్నమి వెన్నెల్లో కృష్ణునితో నృత్యం చేస్తూ, పట్టనలవికాని కృష్ణ మోహంతో ఆమె మూర్చపోయింది. కృష్ణునిపై ఆమె మనసుపడటాన్ని సహించని రాధ తనను భూలోకంలో జన్మించమని శపిస్తుంది. అక్కడే ఉన్న కృష్ణుని మిత్రుడు - సుదాముడు, తులసికి శాపం ఇవ్వడం తప్పని రాధతో వాదించాడు. ఫలితంగా సుదాముని కూడా భూలోకంలో జన్మించమని రాధ శపించింది. ఈ శాపవృత్తాంతం ప్రత్యక్షమైన బ్రహ్మకు వివరించి కనీసం ఈ జన్మలోనైనా శ్రీమన్నారాయణుని పరిణయమాడే అవకాశం కల్గించమని బ్రహ్మను వేడుకుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే - కృష్ణుని మిత్రుడు సుదాముడు తులసిని కోరుకున్నందుకే ఆమెవైపు మాట్లాడానని బ్రహ్మ చెప్పాడు. శాపగ్రస్తుడైన సుదాముడు ప్రస్తుత రాక్షస వంశంలో శంఖచూడుడను రాజుగా జన్మించాడనీ, కావున శంఖచూడుడిని పరిణయమాడమని చెప్పాడు. సంవత్సరం పైగా తులసితో విహరించిన శంఖచూడుడు తిరిగి రాజ్యపాలనకు వచ్చి, ఇరుగు పొరుగు రాజ్యాల్ని జయించి, దేవతలపై రణభేరిని మ్రోగించి వారిని ఓడించాడు. ఓడిన దేవతలు తొలుత బ్రహ్మను, అటుపై శివుని శరణు కోరగా వారినుండి తగిన రక్షణ లభించక, వైకుంఠమందలి శ్రీమన్నారాయణుని శరణు వేడారు. శంఖచూడుని గతజన్మ వృత్తాంతం తెలిసిన శ్రీమన్నారాయణుడు అతని శక్తి అంతా అతని చేతిలోని ఆయుధం సర్వమంగళ అనీ, ఏదో ఉపాయంతో అతని చేతినుండి ఆ ఆయుధాన్ని తొలగించడం, అదే సమయంలో శంఖచూడుని భార్య తులసి పాతివ్రత్య పథం నుండి ఎప్పుడు తప్పుతుందో అప్పుడే ఆమె భర్త శంఖచూడుడు బలహీనమవుతాడనీ చెబుతాడు. అందులకు శ్రీమన్నారాయణుడు తులసి చెంతకు మాయరూపంతో చేరుతాడని పరమశివునికి చెబుతాడు. ఆ సమయంలోనే శంఖచూడుని వధింపుమని, శివునికి తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. శివుడు తన రాయబారిగా పుష్పదంతుని పంపి శంఖచూడుని సంహారం కోసం సుదర్శనంతో పుష్పభద్ర నదీతీరాన మర్రిచెట్టు క్రింద తను వేచి ఉన్నట్లు చెప్పమన్నాడు. శంఖచూడుని ద్వారా ఈ వార్తను విన్న తులసికి నిద్రలేదు. శంఖచూడుడు ఇదంతా విధి అనీ, బదరికాశ్రమంలో నీవు ఆచరించిన ఘోర తపస్సు ఫలంగా త్వరలోనే నారాయణునితో ఐక్యమవుతానని, తామిద్దరూ త్వరలో గోలోకం చేరబోతున్నట్లు తులసికి చెప్పి యుద్ధానికి బయలుదేరాడు. ముందే తన సంపదను ప్రజలకు పంచి, కుమారునికి పట్టాభిషేకం చేశాడు. ముందుగా శివునికి నమస్కరించి ఆయన దీవెనలు పొందాడుజ బ్రాహ్మణుని వేషంలో శంఖచూడుని సమీపించి శ్రీమన్నారాయణుడు సర్వమంగళ ఆయుధాన్ని దానంగా పొందాడు. ఆయుధం కోల్పోయిన శంఖచూడుడు పరమేశ్వరుని శక్తికి కిందపడిపోగా అతని దుస్తుల్ని, రూపాన్ని తీసుకుని శ్రీమన్నారాయణుడు తులసి వద్దకు వెళ్ళాడు. యుద్ధంలో శంఖచూడుడు బతికి విజయం సాధించి రావడం తులసి నమ్మలేకపోయింది. అయితే శంఖచూడుని రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు మభ్యపెట్టాడు. తులసి నమ్మింది గానీ, ఎక్కడో ఏదో సందేహం. గతంలో కలిగిన ఆనందం, తృప్తి, అనుభవం ఇప్పుడు లేదు. ఏదో తెలియని అసంతృప్తి తులసిని బాధపెడుతోంది.


ఇక ఉండబట్టలేక నిగ్గుతీయగా శ్రీమన్నారాయణుడు తన ముగ్ధమనోహర రూపంతో సాక్షాత్కరించాడు. ఆ రూపాన్ని చూడగానే తులసి స్పృహ తప్పింది. కోలుకోగానే కోపం కట్టలు తెంచుకుని శ్రీమన్నారాయణుని 'పాషాణంగా మారిపో' అని శపించింది. తులసి శాపానికి కంపించిన శ్రీమన్నారాయణుడు ఆమె తొలిదశ జీవితం శంఖచూడునితో ముగిసి, రెండవ దశలో గండకీనదీ రూపంలో కొంతకాలం తనతో ఉండి, తరువాత తులసి మొక్కగా, ఆమె శిరోజాలు తులసి ఆకులుగా పుట్టి, తులసిమాతగా, విష్ణుప్రియగా మానవులు కొలుస్తారనీ, నీ దళాలు అత్యంత పవిత్రమైనవనీ, అమె శాప ప్రకారమే తాను గండశిలగా గండకీ నదీతీరంలో ఉంటానని మాట ఇచ్చాడు. ఆ తర్వాతనే శ్రీమన్నారాయణునితో వైకుంఠానికి వెళ్ళింది. అక్కడ లక్ష్మీదేవికి తులసి రాక నచ్చక, చీటికి మాటికి సూటిపోటి మాటలతో వేధింపులు భరించలేక అచ్చట ఒక వనంలో చేరి విలపిస్తుండగా నారాయణుడు ఆమెను ఓదార్చి "వైకుంఠంలో కన్నా ఇక్కడి వనంలో తులసి మొక్కగా ఉండటమే మంచిది” అని సూచించగా అందులకు తులసి అయిష్టంగానే అంగీకరించింది. ఆ వృక్షరూపంలో అమె దేవతలు, మానవులు అందరిచేత పూజలందుకుంటోందనీ, తులసీ దళాలతో నారాయణుని పూజిస్తారు. కాబట్టి ఎప్పుడూ తన చెంతనే ఉండగలదని తులసిని సముదాయించాడు. నాటినుండి నారాయణుడు తులసిమాలలను ధరించసాగాడు. తులసి ఆయన ఛాతీమీద నిరంతరం తలవాల్చి ఉంటుంది.


తులసి - వినాయకుడు వినాయకచవితి నాడు పూజ అంతా పత్రాలతోనే. ప్రకృతిలో లభించే ఎన్నెన్నో పత్రాలను వెదికి, సేకరించి తెచ్చి పూజ చేస్తాం. కాని ఆ పత్రాలలో ఎక్కడా తులసిమాల ప్రస్తావన ఉండదు. తులసి పవిత్రమైన మొక్క. దేవతలందరికీ ప్రీతిపాత్రమైంది. తులసి మాలతో పూజ చేయటం అత్యుత్తమ పూజావిధానమంటారు. కాని వినాయకునికి మాత్రం తులసి ఆకుల పూజ లేదు. దానికి కారణం బ్రహ్మవైవర్త పురాణంలోని గణేశఖండం చివరిలో ఈ విధంగా ఉంది. “గంగానదీ తీరంలో వినాయకుడు ధ్యానంలో ఉండగా, అక్కడ సంచరిస్తున్న యువరాణి తులసి వినాయకుని వింత ఆకారానికి ఆకర్షితురాలై 'నేను ధర్మధ్వజరాజు పుత్రికను. నన్ను పరిణయమాడమ'ని అడిగింది. వినాయకుడు అంగీకరింపలేదు. ఎంత బతిమలాడినా లొంగని వినాయకుని తిరస్కారాన్ని భరించలేక 'నీవు దీర్ఘకాలం బ్రహ్మచారిగా మిగిలిపోవుదువు గాక' అని శపించింది. అందుకు ప్రతిగా 'నీవు రాక్షసుని చేతిలో బందీ అయి, ఆ తరువాత సువాసన వెదజల్లే మొక్కగా పుట్టుదువు గాక' అని గణేశుడు ఆమెను శపించాడు. తన పొరపాటును గ్రహించి తులసి క్షమించమని కోరగా 'ఆ శాపం వెనక్కి తీసుకోలేను. కానీ నువ్వు దేవతలందరి పూజకు పవిత్రమైన మొక్కగా ఉంటావు' అని వివరించాడు. ఐనా తాను అప్పుడు కూడా ఆమెను స్వీకరించలేనని చెప్పాడు. వినాయకచవితి రోజు తప్ప నేటికీ వినాయకునికి తులసిపూజలు లేవు. తుంచితే సంతోషిస్తాయి. అందుకని ఈ శ్లోకం చదివి, తులసికి నమస్కరించి తర్వాత దళములు కోయాలి. శ్లో || తులసీస్య మృత జన్మసి సదాత్వం కేశవప్రయే వేశనార్థంతు నామత్వాం వరదా భవన్ భనే | త్వం మంగ సంభవై వ ం పూజయామి యథా హరి తథా కురు పవిత్రాంగం కలౌరుల వినాశనీ ||


తులసి దళములు కోయకూడని రోజులు శుక్రవారం, ఆదివారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో తులసి దళములు కోయరాదు. అయితే శ్రాద్ధం ఏ రోజు వచ్చినా తులసి దళాలను కోయవచ్చును. కార్తీక ద్వాదశి నాడు తులసిదళాన్ని ఉసిరిపత్రాన్ని అసలెవ్వరూ కోయరాదనేది మరో నిషేధం. మహిళలు ఎంతో మక్కువతో భక్తితో పూజించే తులసి మొక్కను వారు నాటటం కానీ, తొలగించటం కానీ చేయరాదట. చివరికి తులసి దళాలకు కూడా తుంచరాదనీ, మగవారు తుంచి ఇచ్చినవాటితోనే పూజ చేయాలని పెద్దలు చెబుతారు. శ్లో || నమస్తులసి కళ్యాణి నమోవిష్ణు ప్రియే శుభే | నమో మోక్ష ప్రదాదేవీ, నమః సంపత్పదాయకే || ఓ కళ్యాణీ! తులసీ, శ్రీవిష్ణువు ప్రియురాలా! శుభప్రదా! నిన్ను కొలిచినవారికి సర్వ సంపదలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించే నీకు నమస్కారం.


మంత్రం - ఐం హ్రీం క్లీం బృందావనైక స్వాహా ప్రతి ఇల్లాలు ఉదయం స్నానమాచరించి, తులసిచెట్టు మొదట్లో నీళ్ళు పోసి, పసుపు కుంకుమలతో పూజించి, పాలు, పళ్ళు నైవేద్యం పెట్టి కర్పూరహారతి ఇచ్చి, ముమ్మారు ప్రదక్షిణ చేసి, తులసి మన్నును నుదుట ధరించి పై మూల మంత్రమును పదకొండు సార్లు పఠించినచో ఆ కుటుంబం లోనివారు ఆయురారోగ్య ఐశ్వర్య సంతోషాలతో ఉంటారు.


ప్రార్థన శ్లో || యన్మూలే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవతా | యదగ్రే సర్వ వేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం || అని ప్రార్థిస్తూ తులసికోటలో జలాన్ని పోయాలి. శ్లో || మూలత్ బ్రహ్మరూపాయ, మధ్యత్ విష్ణురూపిణే | అగ్రత్ శ్శివరూపాయ వృక్షరాజాయ నమోన్నమః || అని నమస్కరించి తులసికోటలో జలం పోయాలి. తులసి దళమును తుంచే ముందు తులసి విష్ణువుకు ఎంతో ప్రియమైనది. మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. కనుక తులసి దళములు తుంచేటప్పుడు అవి కూడా బాధపడతాయి. అందుకని వాటికి నమస్కరించి, స్తుతించి తుంచితే సంతోషిస్తాయి. అందుకని ఈ శ్లోకం చదివి, తులసికి నమస్కరించి తర్వాత దళములు కోయాలి. శ్లో || తులసీస్య మృత జన్మసి సదాత్వం కేశవప్రయే వేశనార్థంతు నామత్వాం వరదా భవన్ భనే | త్వం మంగ సంభవై వ ం పూజయామి యథా హరి తథా కురు పవిత్రాంగం కలౌరుల వినాశనీ || తులసి దళములు కోయకూడని రోజులు శుక్రవారం, ఆదివారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో తులసి దళములు కోయరాదు. అయితే శ్రాద్ధం ఏ రోజు వచ్చినా తులసి దళాలను కోయవచ్చును. కార్తీక ద్వాదశి నాడు తులసిదళాన్ని ఉసిరిపత్రాన్ని అసలెవ్వరూ కోయరాదనేది మరో నిషేధం. మహిళలు ఎంతో మక్కువతో భక్తితో పూజించే తులసి మొక్కను వారు నాటటం కానీ, తొలగించటం కానీ చేయరాదట. చివరికి తులసి దళాలకు కూడా తుంచరాదనీ, మగవారు తుంచి ఇచ్చినవాటితోనే పూజ చేయాలని పెద్దలు చెబుతారు. శ్లో || నమస్తులసి కళ్యాణి నమోవిష్ణు ప్రియే శుభే | నమో మోక్ష ప్రదాదేవీ, నమః సంపత్పదాయకే || ఓ కళ్యాణీ! తులసీ, శ్రీవిష్ణువు ప్రియురాలా! శుభప్రదా! నిన్ను కొలిచినవారికి సర్వ సంపదలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించే నీకు నమస్కారం.


ఉపసంహారం


తులసి కట్టె గంధం తీసి రామునికి అర్పించి పూజిస్తే కర్పూరం, అగరు, కస్తూరి, చందనాదులతో చేసే పూజలు సాటి రావట. తులసి దళాలతో హరిహరులను పూజించిన వారికి పునర్జన్మ ఉండదని పురాణోక్తి. తులసి సన్నిధిలో ప్రాణాలు విడిచినా పుణ్యమే. అంత్యకాలంలో ఏదీ వెంట రాదు అని అంటారు. కాని ఇందుకు తులసి మినహాయింపు. అవసానదశలో గొంతులో పోసిన తులసితీర్థం జీవుని వెనువెంటే ఉండి పుణ్యలోకాలకు తీసుకుపోతుందని మన అనాది విశ్వాసం. తులసిమాలను కంఠంలో ధరిస్తే మనసుకీ, శరీరానికి ఎంతో మంచిది. తులసిని స్త్రీలు, పురుషులు, బ్రహ్మచారులు, గృహస్థులు, సన్యాసులే కాక అన్ని కులాలవారు పూజించవచ్చును. శ్రీమహావిష్ణువుకు తులసివనం, పరిసరాలు ఎంతో ఇష్టం. తులసివనం, పద్మవనం, సాలగ్రామశిలలు ఉన్నచోట శ్రీమహావిష్ణువు తప్పకుండా ఉంటాడట. అందుకే తులసికి విష్ణుప్రియ అనే పేరు. శ్రీమహావిష్ణువుకు తులసిపత్రం ఎంత ఇష్టమంటే జగత్తులోని సంపదనంతటినీ ఒకప్రక్క భక్తితో సమర్పించిన తులసిదళంను మరోప్రక్క ఉంచితే ఆయన తులసి దళాన్నే కోరుతాడట. అందుకే ఇది భూలోకంలో కల్పవృక్షం.