జ్యోతిర్లింగాలలో ఒకటి జాగేశ్వర క్షేత్రం

జ్యోతిర్లింగాలలో ఒకటి జాగేశ్వర క్షేత్రం - కౌతా నిర్మల


హిమాలయాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన జాగేశ్వర పుణ్యక్షేత్రం ఉంది. ఇది ఉత్తరాంచల్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో ఉంది. ఈ క్షేత్రం సముద్ర మట్టానికి 6,500 అడుగుల ఎత్తులో కుమావూ పర్వత శ్రేణిలో ఉంది. హల్ద్వా నీ నుంచి అల్మోరాకు సుమారుగా 58 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఆ మారంలో ప్రయాణించడమన్నది. ఎంతో ప్రమాదకరం. ప్రయాణ సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆ దారంతా లోయలు, వంతెనలతో కూడి ఉంటుంది. హల్ ద్వానీలో వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ, అక్కడి నుండి జాగేశ్వర్ క్షేత్రం చేరుకునేవరకూ, చలిగాలులు వీస్తూ, వాతావరణం చాలా చలిగా అనిపిస్తుంది. ఋషీకేశ్ నుండి సోన్ ప్రయాగ చేరుకుని అక్కడి నుండి డోలీల్లో వెళ్ళవచ్చు. ఈ జాగేశ్వర్ క్షేత్రాన్ని కేదారేశ్వర క్షేత్రంగా చెప్తారు. ఈ ప్రాంతంలో దేవదారు వృక్షాలు విస్తారంగా ఉంటాయి. జాగేశ్వర ఆలయ ప్రాంగణంలో 40 అడుగుల ఎత్తు ఉన్న ఒక దేవదారు వృక్షాన్ని రాధాకృష్ణుల వృక్షంగా భావిస్తారు. పైవరకూ ఆ వృక్షం ఒకటిగా ఉండి, పైన మాత్రం రెండు భాగాలుగా కనిపిస్తుంది. జాగేశ్వర క్షేత్రం ఆలయాలకు ప్రసిద్ది. ఈ క్షేత్రంలో సుమారుగా 125 ఆలయాలున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో రక రకాలైన ఆకృతుల్లో శివలింగాలు కనిపిస్తుంటాయి. జాగేశ్వర క్షేత్రం క్షేత్ర జాగేశ్వరం, దండేశ్వర జాగేశ్వరం, వృద్ధ జాగేశ్వరం అనే మూడు ప్రాంతాల్లో ఉంది. ఈ ఆలయాల్లో కేదారేశ్వరుడు, కాలభైరవుడు, నాగేశ్వరుడు భక్తుల చేత పూజలందుకుంటున్నారు. సూర్యుడు, హనుమంతుడు తమ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. జాగేశ్వర క్షేత్ర ఆలయంలో నృత్య వినాయకుడు ప్రతిష్ఠించబడి, తన దర్శనాన్ని ప్రదర్శిస్తున్నాడు. దండేశ్వర జాగేశ్వరం, జాగేశ్వర క్షేత్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.


ఉంటుంది. దక్షయజ్ఞంలో ఆత్మాహు ఇక్కడ ఈశ్వరుడు సప్తఋషులకు శివతత్వాన్ని ఉపదేశించాడని చెప్తారు. ఇక్కడ శివలింగం పుట్టను పోలి ఉంటుంది. అయినప్పటికీ ఆ లింగం శిలారూపాన్నే కలిగి ఉంటుంది. భక్తులు పూజాభిషేకాలు చేస్తారు. వృద్ధ జాగేశ్వరం ఈ రెండు జాగేశ్వరాలకన్నా ఎత్తుగా శిఖరాగ్రం పైన ఉంటుంది. దకయజంలో ఆతారణ కావించిన సతీదేవి, ఆ తర్వాత పార్వతిగా జన్మించింది. ఆమె శివుడిని తన భర్తగా పొందటానికి ఈ ప్రాంతంలోనే తపస్సు చేసిందట. కుమారస్వామి జననం తర్వాత శివుడు తన తత్త్యాన్ని పంచాక్షరి ద్వారా, కార్తికేయునికి ఈ ప్రాంతంలోనే ఉపదేశించాడని పురాణాలు వెల్లడించాయి. అందుకే ఈ పర్వత శ్రేణికి కుమార శ్రేణి అని పేరు ఏర్పడిందని చెప్తారు. వృద్ధ జాగేశ్వరం 15 వేల మీటర్ల ఎత్తున ఉంది. ఇక్కడ పరమ పవిత్రమైన గురుశిఖరం కూడా ఉంది. ఈ పర్వతం మీదినుంచి చూస్తే నందాదేవి, పంచశూల్, కైలాసగిరి, త్రిశూల్ అనే పర్వతాలు కనిపిస్తాయి. జాగేశ్వరం క్షేత్రం చుట్టూతా గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాలకు మునులు, యోగులు, సన్యాసులు వస్తుంటారు. శీతాకాలంలో ఇక్కడ విపరీతంగా మంచు కురుస్తూ మంచు పేరుకుపోతుంది. దేశంలోనే అత్యధిక శివలింగాలు జాగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉండటమన్నది ఈ క్షేత్ర విశేషం. ఈ క్షేత్రం గురించి శివపురాణం, వామన పురాణం, వాయు పురాణాల్లో విశదంగా వివరించబడింది. మొట్టమొదటి శివలింగం అరుణాచల క్షేత్రంలో ఉద్భవించినట్లుగానూ, లింగరూపంలో ఉన్న శివుడికి మొట్టమొదటిగా పూజాభిషేకాలు జాగేశ్వర క్షేత్రంలో జరిగాయని పురాణాలు తెలిపాయి. ప్రకృతి సౌందర్యానికి, అనేక వృక్షాలకు, భక్తిభావానికి, ఆధ్యాత్మికతకూ ప్రసిద్ధి చెందింది ఈ జాగేశ్వర క్షేత్రం. ***