కపిల తీర్థం, కపిలేశ్వరస్వామి ఆలయందిగువ తిరుపతిలో ఆలయాలెన్నో ఉన్నాయి. గోవిందరాజస్వామి ఆలయం, కపిలతీర్థ ఆలయం, కోదండరామస్వామి ఆలయం వగైరా. తిరుపతి నగరానికి ఉత్తరదిశలో ఈశాన్యమూల శ్రీవేంకటాచలం కొండలలో ప్రకృతిసిద్ధంగా ఒక కోనేరు ఉంది. ఈ కోనేరు లోనికి కొండలమీదుగా వయ్యారంగా దూకే జలపాతం ద్వారా నీరు చేరుతుంది. ఆ కోనేరుకు తూర్పుదిక్కులో ఒక గుహాలయం ఉంది. ఆ గుహాలయంలో కపిలముని అనే మహర్షి ఒక శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఆ శివలింగాన్ని కపిలేశ్వర లింగంగా వ్యవహరించబడుతుంటే ఆ తీర్థక్షేత్రాన్ని కపిల తీర్థంగా పిలుస్తారు. కపిలేశ్వర ఆలయ ప్రాంగణంలోనే శ్రీవేణుగోపాలస్వామి ఆలయం కూడా నెలకొని శివకేశవులకు భేదం లేదని తెలియ చెప్తుంది. ఈ కపిలేశ్వర క్షేత్ర ప్రస్తావన మనకు అనేక పురాణాలలోనూ శ్రీవేంకటేశ్వర ఇతిహాసాలలో కన్పిస్తుంది. ఆలయాన్ని దర్శించే తమిళ భక్తులు కపిల తీర్థాన్ని ఆళ్వారు తీర్థంగా పిలుస్తారు. ఆలయానికి ఒకప్రక్క వేంకటాచలం కొండయే ప్రకృతి ఏర్పరిచిన సరిహద్దు గోడగా ఉంటుంది. ఆ కొండమీద నుండి నీరు కోనేరులో పడుతుండటం కమనీయంగా అనిపించే దృశ్యం. వర్షాకాలంలో ఇక్కడి రద్దీ విపరీతంగా ఉంటుంది. ఆలయానికి సమీపంలోని కూడలిలో నంది విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. కపిలేశ్వర శివాలయం తితిదే యాజమాన్యంలోనే ఉండటం విశేషం. - గుహాలయంలో శివలింగం పశ్చిమ ముఖంగా ప్రతిష్ఠించబడింది. ఆలయానికి ఎదురుగా బంగారు పూత పూసిన


                  దిగువ తిరుపతిలో ఆలయాలెన్నో ఉన్నాయి. గోవిందరాజస్వామి ఆలయం, కపిలతీర్థ ఆలయం, కోదండరామస్వామి ఆలయం వగైరా. తిరుపతి నగరానికి ఉత్తరదిశలో ఈశాన్యమూల శ్రీవేంకటాచలం కొండలలో ప్రకృతిసిద్ధంగా ఒక కోనేరు ఉంది. ఈ కోనేరు లోనికి కొండలమీదుగా వయ్యారంగా దూకే జలపాతం ద్వారా నీరు చేరుతుంది. ఆ కోనేరుకు తూర్పుదిక్కులో ఒక గుహాలయం ఉంది. ఆ గుహాలయంలో కపిలముని అనే మహర్షి ఒక శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఆ శివలింగాన్ని కపిలేశ్వర లింగంగా వ్యవహరించబడుతుంటే ఆ తీర్థక్షేత్రాన్ని కపిల తీర్థంగా పిలుస్తారు. కపిలేశ్వర ఆలయ ప్రాంగణంలోనే శ్రీవేణుగోపాలస్వామి ఆలయం కూడా నెలకొని శివకేశవులకు భేదం లేదని తెలియ చెప్తుంది. ఈ కపిలేశ్వర క్షేత్ర ప్రస్తావన మనకు అనేక పురాణాలలోనూ శ్రీవేంకటేశ్వర ఇతిహాసాలలో కన్పిస్తుంది. ఆలయాన్ని దర్శించే తమిళ భక్తులు కపిల తీర్థాన్ని ఆళ్వారు తీర్థంగా పిలుస్తారు. ఆలయానికి ఒకప్రక్క వేంకటాచలం కొండయే ప్రకృతి ఏర్పరిచిన సరిహద్దు గోడగా ఉంటుంది. ఆ కొండమీద నుండి నీరు కోనేరులో పడుతుండటం కమనీయంగా అనిపించే దృశ్యం. వర్షాకాలంలో ఇక్కడి రద్దీ విపరీతంగా ఉంటుంది. ఆలయానికి సమీపంలోని కూడలిలో నంది విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. కపిలేశ్వర శివాలయం తితిదే యాజమాన్యంలోనే ఉండటం విశేషం. - గుహాలయంలో శివలింగం పశ్చిమ ముఖంగా ప్రతిష్ఠించబడింది. ఆలయానికి ఎదురుగా బంగారు పూత పూసిన ధ్వజస్తంభం, బలిపీఠం ఉన్నాయి. కపిలేశ్వరుని ఎడమప్రక్క మీనాక్షి దేవికి ప్రత్యేక మందిరం ఉంది.


అమ్మవారికి రెండు పూటలా సహస్ర నామార్చనలు, కపిలేశ్వరునికి నిత్యాభిషేకాలు, నైవేద్య సమర్పణలు పుష్పాలంకారాలు, వేద పఠనాలు జరుగుతుంటాయి. నిత్య, వార, నక్షత్ర పూజలు శివాగమ యుక్తంగా నిర్వహించబడుతున్నాయి. ఆలయ ముఖద్వారానికి ఎదురుగా ఒకప్రక్క శ్రీవేణుగోపాలస్వామి రుక్మిణీ సత్యభామలతో కూడి దర్శనమిచ్చే ఆలయం, దాని మరోప్రక్క ఎదురుగా ఎత్తయిన వేదిక మీద లక్ష్మీనారాయణస్వామి ఆలయం ఉంది. కపిల తీర్థంలో మూడు గుండాలు (పాతాళ లోకం నుండి ఊరే ఊట జలాలు) కూడా ఉన్నాయి. వీటిని బ్రహ్మగుండం, విష్ణుగుండం, మహేశ్వరగుండంగా వ్యవహరిస్తారు. కరువు సమయంలో, నిండు వేసవి కోనేరులోని నీరు తగ్గినా ఈ త్రికూట గుండాలలో సజీవంగా ఉండటం విశేషం. విష్ణుగుండం నుండి నీటిని వైష్ణవ ఆలయాలకు (శ్రీవేణుగోపాలస్వామి, లక్ష్మీనారాయణస్వామి) మహేశ్వరగుండం నుండి కపిలేశ్వర ఆలయానికి నీటిని తెస్తారు. ఈ గుండాలున్న ప్రదేశానికి దగ్గర్లో మరో గుహాలయం (నరసింహ గుహ) ఉంది. కపిలేశ్వరస్వామి ఆలయంలో వినాయకునికి ప్రత్యేక మందిరం ఉంది. భక్తులు మొదట వినాయకుని దర్శించి ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసి స్వామివారిని అమ్మవారిని దర్శిస్తారు. ఈ తిరుపతి యాత్రకు వచ్చినవారందరూ ఈ కపిలేశ్వరస్వామి ఆలయం, మిగతా ఆలయాలు దర్శించి కపిల తీర్థంలో స్నానమాచరిస్తుంటారు. తితిదే వారి ఆలయ సందర్శన బస్సులు, ఆటోలు లభ్యమవుతాయి.