గత సంచిక తరువాయి
వీరస్థాపక మూర్తి: "తృతీయం వీరస్థానకం దేవం శ్యామాభం చతుర్భుజం శంఖచక్రధరం దక్షిణవామయోః బ్రహ్మేశాభ్యాం భృగు పుణ్యాభ్యాం | కిష్కింధ సుందిరాభ్యాం సనక సనత్కుమారాభ్యాం హీనం మధ్యమం వీరస్థానకం. ఆదిత్య చంద్రాభ్యాం పూజక మునిభ్యాం, హీన మధ్యమం వీరస్థానకమ్" అన్నట్లు వీరస్థానక మూర్తి శంఖచక్రాలను ధరించి ఉంటుంది. ఇంతేకాక బ్రహ్మ, మహేశ్వర, భృగు, మార్కండేయ, కిష్కింధ, సుందర, సనక సనత్కుమార సూర్యచంద్ర మూర్తులుంటాయి. ఈ మూర్తులన్నీ ఉన్నప్పుడు ఉత్తమ తరగతికి చెందిన వీరస్థానక మూర్తి అవుతుంది. కిష్కింధ, సుందర సనక సనత్కుమార మూర్తుల లోపించినట్లయితే మధ్యమ తరగతికి చెందిన ప్రతిమ అవుతుంది. ఇదేగాక సూర్యచంద్ర పూజకమునుల మూర్తులు లోపిస్తే ప్రతిమ అథమ తరగతికి చెందినదవుతుంది.
ఆభిచారిక స్థానకమూర్తి:
"చతుర్థ మాభిచారిక స్థానకం దేవం, ద్విభుజం, చతుర్భుజంవాధూమశ్యామవస్త్రధరం శుష్కవక్తం, శుష్కాండం, తమోగుణాన్వితం, ఊర్ధ్వనేత్రం బ్రహ్మాది దేవైర్వివర్జితం, పైశాచపద అర్థాద్యను నక్షత్రం, శర్వర్యా చరరాశా స్థాపితం విమానంచ లక్షణ హీనం వా కారయేత్" అన్నట్లు ఆభిచారిక స్థానక మూర్తులకు రెండుగాని, నాలుగుగాని భుజాలుంటాయి. ధూమవర్ణం కలిగి నల్లటి బట్టలు ధరించి, శుష్కవకం కలిగి ఉండాలి. పైశాచ పదంలో స్థాపించబడి ఉండాలి. మరీచ సంహితశ్రీ విమానార్చన కల్పః | అనే సంస్కృత గ్రంథం ఆధారంగా యోగ, భోగ, వీర ఆభిచారిక మూర్తులకుండు ఉత్తమ, మధ్యమ, అథమ రూపాలు స్థానక మూర్తులందు ఎలా ఉంటాయో వివరింపబడ్డాయి. స్వామివారి విగ్రహము స్థానక భంగిమలో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందేశ్రీ స్వామివారి విగ్రహమును వర్ణించుటకు ముందు భారతదేశంలో కొన్ని ముఖ్యమైన విష్ణుప్రతిమల వివరాలు తెలుసుకొందాం. మహాబలిపురంలో మధ్యమ, యోగస్థానకమూర్తి యైన శ్రీ విష్ణుమూర్తి ప్రతిమ ఒకటి మనకి కనిపిస్తుంది. ఇది 7,8 శతాబ్దాలకు చెందిన శిల్పమని చెప్పవచ్చును. ఈ విగ్రహాలలో కొంతవరకు తిరుపతి వేంకటేశ్వరస్వామి వారి పోలికలు కనిపిస్తాయి. భృగు మార్కండేయులతో సహా ఉన్న ఈ శిల్పమునందు విష్ణుమూర్తి కిరీట మకుటధారిగా ఉన్నాడు. శంఖ చక్రధారి కూడాను. ముందున్న కుడిభుజం అభయహస్తమైతే ముందున్న వామహస్తం కట్యవలంబిత ముద్రయందు ఉంది. యజ్ఞోపవీతము, హారము, ఉదరబంధము, భుజముల మీద కేయూరములు, మణికట్టు మీద కటకములు ఉన్నవి. విష్ణుమూర్తి పద్మపీఠము నందు నిలిచివున్నాడు. పాదములు సమభంగిమలో నిలిచి ఉన్నట్లు పబడింది. మదరాసుకు సమీపంలో ఉన్న తిరువుత్తియూరులో ఉన్న శివాలయములో సుమారు 1067 ఈ మూర్తి యజ్ఞోపవీతములు, హారములు ఉదర బంధములు కలిగి చోళుల కాలమునాటిదై ఉన్నది. ఇదేవిధంగా తాడిపత్రి శివాలయంలో శంఖ చక్రధారియై వరద కట్యవలంబిత హస్తాలతో ఉన్న భోగస్థానక మూర్తి ఒకటున్నది. ఇది హొయసల కాలం నాటిదని చెప్పవచ్చును. మధురై మ్యూజియంలో ఉన్న మరొక ప్రాచీన విష్ణుమూర్తి గదా చక్రధారియై వరద కట్యవలంబిత ముద్రలందు ఉన్నది. ఈ విగ్రహములలోని ప్రత్యేకత వెనుకనున్న కుడి భుజము గదాధారిగా ఉండటం అని చెప్పవచ్చును. లక్ష్మి, భూదేవి ప్రతిమలు ఈ విగ్రహమునందే పరివార దైవములుగా మలచబడినవి. ఇది త్రివిక్రమ అవతారపు ప్రతిమ కావచ్చును. శ్రీ మహావిష్ణువుకు సహస్ర నామములు ఉన్నవన్న విషయము 1068 సం||కు చెందిన అథమ భోగస్థానక మూర్తి ఉన్నది. శంఖచక్రములు కలిగి అభయ కట్యవలంబిత హస్తాలతో ఉన్నమీకు తెలిసినదే. ఈ సహస్ర నామములు మహాభారతమందలి అనుశాసనిక పర్వమునందు ఇవ్వబడినవి. వీటిలో 24 నామములు అత్యంత పవిత్రములుగా భావింపబడుతున్నవి. ఈ 24 నామములకు సరియైన 24 మూర్తులు మనకు శిల్పాలలో కనిపిస్తాయి. వీటన్నిటిలో శ్రీ మహావిష్ణువు స్థానకమూర్తిగా ఉంటాడు. చతుర్భుజములు కలిగి, ఆభరణములు ధరించి ఉంటాడు. మూర్తి సాధారణంగా పద్మాసనమునందు నిలచి ఉన్నట్లూ పబడుతుంది. ఒక మూర్తికి, మరొక మూర్తికి వ్యత్యాసం కనిపెట్టాలంటే శంఖ, చక్ర, గద, పద్మములు స్వామివారి చతుర్భుజములందు ఏ విధముగా ఉన్నయో .గుర్తుపట్టవలసి ఉంటుంది. "రూపమందన" గ్రంథాన్ని ఆధారంగా తీసుకుని ఈ 24 మూర్తులు చతుర్భుజాలలో ఆయుధాలు ఎలా ఉంటాయో ఈ ప్రక్క పట్టికయందు ఇవ్వబడినవి. గమనించండి. పద్మపురాణంలోని పాతాళ ఖండంలో ఇచ్చిన విష్ణుమూర్తి వివరాలు పై వివరణతో కొన్ని విషయాలతో ఏకీభవించవు. కానీ పైన చెప్పిన రూప మందనలని వివరాలే సరి అయినవి అనిపిస్తుంది.
పంచరాత్రాగమంలో పైన చెప్పిన 24 మూర్తులకు అతి ప్రాముఖ్యము ఉన్నది. చైతన్యమూర్తి అయిన పరవాసుదేవుడు జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు, నిరోషము కలిగి ఉంటాడని మనకు తెలుస్తుంది. ఈ 24 విష్ణుమూర్తులలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న అనిరుద్ధులు మరింత ఎక్కువ ప్రాముఖ్యాన్ని పొంది ఉన్నారు. ఈ నాలుగు మూర్తులు శక్తి, మాయ, వ్యూహ రూపులట. వైఖానస ఆగమం ప్రకారం కూడ ఈ నాలుగు మూర్తులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. నారద పంచరాత్ర ఆగమంలో విష్ణుమూర్తుల 14 శక్తి స్వరూపములు గుర్తింపబడ్డాయి. అవి ఇలా ఉంటాయి.
విష్ణుమూర్తి యొక్క స్వరూపములు :
1. కేశవ - కీర్తి 2. నారాయణ - కాంతి 3. మాధవ - తుష్టి 4. త్రివిక్రమ - శాంతి 5. వామన - క్రియ 6. అచ్యుత - దయ, శ్రీ ధర - మేధ 8. హృషీకేశ - హర్ష 9. పద్మనాభ - శ్రద్ద 10. దామోదర - లజ్జ 11. వాసుదేవ - లక్ష్మి 12. సంకర్షణ - సరస్వతి 13. ప్రద్యుమ్న ప్రీ తి 14. అనిరుద్ద - రవి.
విష్ణు ధర్మోత్తరమునందు పరవాసుదేవుని యొక్క వర్ణన ఉన్నది. ఈ మూర్తికి చతుర్భుజములుంటాయి. అత్యంత సౌందర్యము కలిగి అందంగా ఉంటుందీ మూర్తి. పసుపు పచ్చని వస్త్రములు ధరించి నీలమేఘ శ్యామ శరీరచ్ఛాయ కలిగి ఉండాలి ఈ మూర్తి. శంఖము లాంటి మెడ ఉంటుంది. వనమాల అనే హారము మోకాళ్ళ వరకు ఉంటుంది. చెవులకు కుండలములు, భుజముల మీద కేయూరము ఉంటాయి. వక్షస్థలమందు కౌస్తుభము, శిరస్సు మీద శిరశ్చక్రము కలిగిన కిరీటము ఉంటుంది. ఒక భుజమునందు వికసించిన కమలము, మరొక వామహస్తమందు శంఖము ఉంటాయి. ఈ మూర్తికి కుడివైపున ఆయుధమైన గద, మూర్తీభవించిన భగవతివలె మలచబడి ఉంటుంది. ఈమె చామర హస్తయై ఉంటుంది. పరవాసుదేవుని కుడిహస్తము ఆమె తలమీద ఉన్నట్లూ పబడాలి. ఇంతేగాక భూదేవి, చక్రము యొక్క ఆకారాలు మలచబడి ఉంటాయి. సరే! ఇక మనశ్రీ వేంకటేశ్వరస్వామి ఎలా సాక్షాత్కరించారో గమనిద్దాం రండి.
శ్రీవేంకటేశ్వరస్వామివారి వర్ణన :
భారతదేశంలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాలలోశ్రీ వేంకటేశ్వర స్వామి మూర్తి యొక్క సౌందర్యము వర్ణనాతీతం. నిజానికి ఈ మూర్తి భారతదేశంలోని అతి సుందరమైన విష్ణుమూర్తి అని నొక్కి చెప్పవచ్చును. స్వామి తిరుమల త్రము నందు స్వయం వ్యక్తమైన ధ్రువమూర్తి. కృతయుగమున నరసింహస్వామి, శ్రీ తా యుగముశ్రీ రాములవారు, ద్వాపరయుగముశ్రీ కృష్ణమూర్తి, కలియుగమున శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యక్ష దైవములని పురాణములు ఘోషించుచున్నవి. ఈ స్వామి, స్వామిపుష్కరిణీ తీరమున ఏవిధముగా అవతరించాడో వరాహ పురాణము, భవిష్యోత్తర పురాణము మొదలైన పురాణములలో వర్ణింపబడి ఉంది. ఈ పురాణగాథలు మరొక అధ్యాయము నందు సంక్షిప్తంగా వివరించినాము. ఈ పురాణ గాథలను తెలిపే శ్రీ వేంకటాచల మాహాత్మ్యము అనే గ్రంథములో శ్రీ వేంకటేశ్వరస్వామివారి లీలలు కూడా వర్ణింపబడి ఉన్నవి. ఈ గ్రంథాన్ని అనుసరించో చినట్లయితే మన్నారాయణ మూర్తి ఒక దివ్యవిమానంలో, శేషాచలం మీద సాక్షాత్కరించాడని మనకు తెలుస్తుంది. స్వామి వారికి క్రీడాద్రిగా వేంకటాచలం ప్రత్యేకంగా వైకుంఠం నుండి వచ్చినదట. ఈ సాక్షాత్కారము శ్వేతవరాహ కల్పంలో జరిగినదట. ఈ కాలమునందశ్రీ స్వామి వారిని బ్రహ్మదేవుడు ముందుగా ఆరాధించెనట. ఆ తరువాత కలియుగంలో స్వామివారి అర్చావతారియై ధ్రువమూర్తి అయ్యాడని మనకు తెలుస్తోంది. చరిత్రకందని ఈకాలంలో రంగదాసు సహాయముతో తొండమాను చక్రవర్తి శ్రీ స్వామి వారి విగ్రహాన్ని చీమలపుట్ట యందు కనుగొన్నాడని, స్వామిని వైఖానసముని పూజించాడని ఇంకా మనకు తెలుస్తోంది. స్వామి స్వయం వ్యక్తమైన ధ్రువమూర్తి అన్న వాదాన్ని ఒప్పుకొన్నట్లయితే శ్రీ స్వామివారి మూర్తిని శిల్ప శాస్త్రాల ఆధారంగా పరిశీలించడం అనవసరమే అవుతుంది. అయినా స్వామివారి మూర్తి విశేషాలు తెలుసుకున్న తరువాత ఈ మూర్తి ఏవిధంగా శిల్పశాస్త్ర ఆగమాలకు అతీతమైందో తెలుసుకుందాం. (సశేషం)