ధర్మోపదేశం


ధర్మోపదేశం మరి మానవ ధర్మమంటే ఏమిటి? ఎవరు ధర్మపరులు? ఎవరు అధర్మపరులు? అనే విషయాలపై మన పురాణాలలో అనేక ఉదంతాలు పొందుపరచబడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మానవులు మనసా, వాచా, కర్మణా ఇతరులకు హాని కల్గించకుండా ఉండడమే మానవ ధర్మము. ఈ ధర్మాలను క్రమం తప్పకుండా ఆచరించేవారే ధర్మపరులు. ఈ మూడు గుణాలను ఆచరించకుండా స్వార్థ చింతనతో పరులను హింసించువారు 'అధర్మపరులు'. పుట్టినవారు సక్రమ పద్ధతిలో తల్లితండ్రుల సంరక్షణలో ఎదగడం ధర్మం. తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం తల్లితండ్రుల ధర్మం. ప్రతి వ్యక్తి ఉదర పోషణార్థం సంపాదించుకోవడం ధర్మం. దానిని సద్వినియోగం చేయడం ధర్మం. జ్ఞానాన్ని సంపాదించుకోవడం ధర్మం. ఆ జ్ఞానాన్ని పదిమందికి పంచడం ధర్మం. కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలకు చిక్కకుండా ఉండడం, వృద్ధులను, పిల్లలను, అతిథులను ఆదరించడం మొదలగు దశగుణ ధర్మాలను ఆచరించడమే మానవ ధర్మము. వీటిని ధర్మోపదేశం ఆచరించనివాడు మూరుడుగాను, క్రూరుడుగాను ఈ లోకం పరిగణిస్తుంది. మూర్ఖత్వం, క్రూరత్వం ఎప్పుడెప్పుడు పెరిగిపోతుందో అప్పుడప్పుడు తాను అవతరిస్తానని భగవాన్ శ్రీ కృష్ణుడే అర్జునునితో చెప్పినట్లు పేర్కొన్న భగవద్గీత శ్లోకాలను గమనించండి.


"యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత | అభ్యుతాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం || - భగవద్గీత - అధ్యాయం 4-7 ,


ఓ భరత వంశీయుడా! ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో, మరియు అధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేను అవతరింతును అశ్రీ కృష్ణుడు స్వయంగా అర్జునునితో పలికెను. ఇచట 'సృజన' అను పదము ముఖ్యమైనది. దానినెప్పుడును సృష్టింపబడుననెడి భావములో ఉపయోగించరాదు. ఎందుకంటే భగవానుడు దేహమునకు లేదా రూపమునకు సృష్టి యనునది లేదు. రూపములన్నియు నిత్యముగా నిలిచి యుండుటయే అందులకు కారణము. సృజామి యనగా భగవానుడు తన స్వీయ రూపముతో అవతరించునని భావము. నియమానుసారముగా శ్రీ కృష్ణ భగవానుడు బ్రహ్మదేవుని ఒక దినము నందలి ఏడవ మనువు యొక్క ఇరువది ఎనిమిదవ యుగపు ద్వాపర యుగాంతము ఆవిర్భవించును. కాని అతనికి అదేవిధముగా విధి నియమానుసారముగా అవతరించాలని నియమము లేదు. అతడు తనకు తోచిన రీతిగా వర్తించగలడు. కనుక అధర్మము ప్రబలి, నిజమైన ధర్మము అడుగంటినప్పుడు అతడు తన ఇచ్చానుసారము అవతరించుచుండును. ధర్మనియమములు వేదములందు వివరింపబడినవి. అట్టి వేద నియమాచరణము నందు భంగము వాటిల్లినచో మనుజుడు అధర్మవర్తనుడగును. ఆ నియమములు భగవానుని శాసనములశ్రీ మద్భాగవతము తెలుపుచున్నది. కేవలము శ్రీ కృష్ణ భగవానుడు మాత్రమే ధర్మవిధానమును సృజింపగలడు. వేదములు సైతము తొలుత బ్రహ్మదేవుని హృదయమున భగవానునిచే పలుకబడినవని తెలియవచ్చుచున్నది. కనుకనే ధర్మనియమములు సాక్షాత్తుగా భగవానుని నిర్దేశములైయున్నవి. ఈ నియమములన్నియు భగవద్గీత యందు స్పష్టముగా వివరించబడినవి. భగవానుని అధ్యక్షతలో ఆ నియమాలను స్థాపించుటయే వేదముల ప్రయోజనమై యున్నది. ధర్మము యొక్క అత్యున్నత నియమము తననే శరణు వేడవలెను. అంతకు మించి వేరొకటి లేదనియు శ్రీ కృష్ణ భగవానుడు స్వయముగా గీత యొక్క అంత్యమున ప్రత్యక్షముగా ఆదేశించినాడు. ఆ దేవదేవుని సంపూర్ణ శరణాగతి


లోనికే వేద నియమములు మనుజుని చేర్చగలవు. అట్టి నియమములు దానవులు మరియు దానవ ప్రవృత్తి గలవారిచే నశింపచేయబడినప్పుడు భగవానుడు అవతరించును. భౌతిక భావనము విచ్చలవిడిగా నుండి లౌకికులు వేద ప్రమాణము ఒక నెపముగా భావించినప్పుడు అవతరించిన బుద్దుడు శ్రీ కృష్ణుని అవతారమని భాగవతము ద్వారా తెలుస్తున్నది. కొన్ని ప్రత్యేక ప్రయోజనములకై గల జంతువధ విషయమున నియమ నిబంధనలు వేదములందున్నప్పటికిని దానవ ప్రవృత్తి గలవారు ఆ నియమములను పాటింపకనే జంతుబలులను స్వీకరించిరి. అట్టి విపరీతమునాపి వేద ధర్మమైన అహింసను నెలకొల్పుట కొరకే బుద్ధుడు అవతరించెను. అనగాళీ కృష్ణభగవానుని ప్రతి అవతారమునకు ముఖ్య కార్యముండును. అవి యన్నియును శాస్త్రములందు సంపూర్ణముగా వివరించబడినవి. కనుక శాస్త్రములందు తెలుపనిదే ఎవ్వరినీ కూడా అవతారముగా అంగీకరించరాదు. భగవానుడు భారతదేశమునందే అవతరించుననుట సత్యము కాదు. అతడెక్కడైనను, ఎన్నడైననూ తాను కోరినట్లు అవతరించగలడు. భగవంతుని తత్త్వము వైపు మానవులను మళ్ళించుటకు మరియు ధర్మ నియమములు వారిచే పాటింపజేయుటకు ఉద్దేశ్యముగా నుండు అన్ని అవతారములయందును, అతడు వివిధ పరిస్థితులకు చెందిన ఆయా జనుల అవగాహన చేసుకొను రీతిలో ధర్మమును గూర్చియే ఉపదేశమొసగును. కొన్నిమార్లు అతడు స్వయముగా అరుదెంచును. మరికొన్నిమార్లు తన ప్రామాణిక ప్రతినిథిని పుత్రుని రూపమున గాని, సేవకుని రూపమున గాని పంపును. లేదా తానే స్వయముగా గూఢరూపములో అరుదెంచును. ప్రపంచమునందు ఇతర మనుష్యులకన్నను ఉన్నతుడై యున్నందున భగవద్గీత నియములు అర్జునునికి తెలుపబడినవి. అర్జునుడే కాదు, ఉన్నతులైన వారందరూ ఈ ఉపదేశము గ్రహించుటకు అర్హులై యున్నారు. రెండును రెండుచే కలిపినచో నాలుగగుననుట ప్రాథమిక భావము. మరియు ఉన్నత గణితములు రెండింటి యందు సత్యమే యైనను ప్రాథమిక, ఉన్నత గణితములందు వ్యత్యాసమున్నది. అదేవిధముగా భగవానుడు అవతరించిన ప్రతిసారీ అవే ధర్మములు ఉపదేశించబడినను పరిస్థితుల ప్రకారము అవి ప్రాథమికములు మరియు ఉన్నతములని రెండు విధాలుగా నుండును. వర్ణాశ్రమ సాంఘిక విధానమును అంగీకరించుట ద్వారా ఉన్నత ధర్మాచరణము ఆరంభము కాగలదు. అనగా సర్వత్రా కృష్ణభక్తి భావమును జాగృతము చేయుటయే సర్వావతారముల ముఖ్య ప్రయోజనములై ఉన్నది. అట్టి భావనము పరిస్థితుల ననుసరించి కొన్నిమార్లు వ్యక్తమై మరికొన్నిమార్లు అవ్యక్తమై నిలిచి యుండును.


"పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్ | ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || - భగవద్గీత - అధ్యాయము - 4-8


సాధువులను రక్షించుటకు, దుర్మార్తులను నశింపచేయుటకు మరియు ధర్మమునుపునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించుచుందును అని పలికిన భగవానుని మాటలను బట్టి భగవద్గీత ప్రకారము సాధువనగా కృష్ణభక్తి భావనా పూర్ణుడని భావము. ఒక వ్యక్తి అధర్మవర్తనుడుగా గోచరించినను, కృష్ణభక్తి భావన లక్షణములను సంపూర్ణముగా కలిగియున్నచో అతనిని సాధువుగా పరిగణిస్తారు. అలాగే కృష్ణభక్తి భావన లేనివారు దుష్కృతులుగా పిలువబడుతారు. అట్టి దుష్కృతులు లౌకిక పారంగతులైనను మూఢులుగాను మరియు నరాధములుగాను వర్ణింపబడుదురు. కాని కృష్ణభక్తి యందు నూటికి నూరుపాళ్ళు నిమగ్నమైనవాడు విద్యావంతుడు లేదా నాగరికుడు కాకపోయినను సాధువుగా అంగీకరింపబడును. రావణ, కంసులను వధించిన రీతి, నాస్తికులను నశింపజేయుటకు భగవానుడు స్వయముగా అవతరించవలసిన అవసరము లేదు. ఎందుకంటే దానవులను సంహరించుటకు యోగ్యులైన ప్రతినిధులు అతనికి ఎందరో కలరు. అయినను దానవులచే పీడింపబడు తన శుద్దభక్తులను ఆనందింప జేయుటకొరకే అతడు ప్రత్యేకముగా అవతరించును. దానవ ప్రవృత్తి గలవాడు భక్తుని సదా పీడించుచుండును. పీడింపబడెడి భక్తుడు సృజనుడే అయినప్పటికీ అతడు ఆ కార్యమునకు వెనుదీయడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని తనయుడు అయినను ఆ దానవుడు ప్రహ్లాదుని మిగుల పీడించెను. కృష్ణుని తల్లియైన దేవకి కంసుని సోదరియైనను కృష్ణునికి జన్మనివ్వ నున్నందున ఆమె మరియు ఆమె భర్త వసుదేవుడు ఇరువురును కష్టములకు గురి కాబడ్డారు. కనుక కంసుని వధించుట కన్నను ముఖ్యముగా దేవకిని రక్షించుట కొరకే కృష్ణుడు ఆవిర్భవించాడు. అయినను ఈ రెండు కార్యములు ఏక కాలముననే జరిగినవి. కనుకనే సాధువులైనవారిని రక్షించి దుష్టులను నశింపచేయుటకే శ్రీ కృష్ణభగవానుడు వివిధ అవతారములను స్వీకరించునని ఇచ్చట తెలియుచున్నది.


అవతారమనునది భౌతిక ప్రపంచము కొరకై భగవద్దామము నుండి అవతరించును. అట్లు అవతరించిన భగవానుని రూపమే అవతారమని పిలువబడును. అట్టి రూపములు ఆధ్యాత్మిక జగత్తు నందునెలకొనియుండి భౌతిక జగత్తునందు అవతరించినప్పుడు అవతార నామములు కూడా గోచరించును అని కృష్ణదాస కవి రాజగోస్వామి వారు పేర్కొన్నారు. అవి పురుషావతారములు, గుణావతారములు, లీలావతారములు, శక్త్యావేశావతారములు, మన్వంతరావతారములు, యుగావతారములని అవతారము లు పలు రకములు. అవన్నియును క్రమ పద్ధతిలో విశ్వమందంత టను అవతరించుచుండును. కానిశ్రీ కృష్ణ భగవానుడు ఈ అవతారములన్నింటికిని మూలమై యున్నాడు. ఆదియైన బృందావన లీలలయందే తననయా డగోరు శుద్ధభక్తుల కలతల నన్నింటిని నశింపచేయుటకే అతడు ప్రత్యేకముగా అవతరించును. అనగా తన విశుద్ధ భక్తులను సంతృప్తి పరుచుటయేశ్రీ కృష్ణావతార ముఖ్య ప్రయోజనమై 10 యున్నది.


ప్రతి యుగము నందు అవతరింతునని శ్రీ కృష్ణ భగవానుడు పలికి యున్నాడు. కలియుగమునందును అతడు అవతరించగలడని ఈ విషయము సూచించుచున్నది. శ్రీ మద్భాగవతము ననుసరింశ్రీ చైతన్య మహాప్రభువే కలియుగమునందలి అవతారమై యున్నారు. ఆయనే సంకీర్తనోద్యమము ద్వారా కృష్ణభక్తిని ప్రచారము కావించి, భారతదేశమంతటను కృష్ణ భక్తిరస భావమును విస్తరించిరి. అట్టి హరినామ సంకీర్తనము ప్రపంచము నందలి ప్రతి నగరము మరియు ప్రతి గ్రామము నందు ప్రచారము కాగలదని ఆయన భవిష్యద్వాణి పలికి యున్నదిశ్రీ చైతన్య మహాప్రభువు దేవదేవుడైన శ్రీ కృష్ణుని అవతారమని ప్రత్యక్షముగా కాక అతి రహస్యముగా ఉపనిషత్తులు,మహాభారతమశ్రీ మద్భాగవతము వంటి శాస్త్రముల రహస్య భాగములలో తెలుపబడినది.శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క ఈ సంకీర్తనోద్యమము నందు నేడు కృష్ణ భక్తులందరును అత్యంత అనురక్తిని కలిగియుందురు. కృష్ణభగవానుని ఈ అవతారము దుష్టంబును వధించుట కొరకు గాక నిర్ణేతుక కరుణతో వారిని తరింప జేయునదియైయున్నది. ఇట్టి అవతార సత్యము నెరిగినవాడు భవబంధముల నుండి ముక్తిని పొందినవాడే. కనుక దేహ త్యాగానంతరము అతడు శీఘ్రమే భగవద్దామమును తప్పక చేరగలడు. జీవునికి అటువంటి భవబంధ విముక్తి ఏ మాత్రము సులభమైన కార్యము కాదు. నిరాకారవాదులు మరియు యోగులు బహు కష్టములు మరియు జన్మల పిమ్మటయే ముక్తిని పొందగలరు. అయినను వారు పొందెడి ముక్తి కేవలము పాక్షికము మాత్రమే. దానిని సాధించిన పిమ్మటయు భౌతిక జగమునకు తిరిగి వచ్చు ప్రమాదము కలదు. కాశ్రీ కృష్ణ భగవానుని రూపము మరియు కర్మల దివ్య స్వభావమును అవగతము చేసుకొనుట ద్వారా భక్తులు దేహత్యాగము పిమ్మటశ్రీ కృష్ణ ధామమును పొంది ఈ భౌతిక జగమునకు తిరగి రావలసిన ప్రమాదము నుండి బయటపడుదురు.


కాబట్టి మానవులు తమ తమ ధర్మాలైన తల్లితండ్రులను గౌరవించటం, బంధువులను, అతిథులను ఆదరించటం, అన్నార్తులను, శరణార్థులను సాధ్యమైనంత మేర ఆదుకోవడం, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాదులకు దూరంగా ఉండడం, మనకు సహాయం చేసినవారి పట్ల కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించటం చేయాలి. ఇవి అన్నియు సకాలంలో సక్రమంగా సాగాలంటే ముందుగా ప్రతి - వ్యక్తి విద్యావంతుడు కావాలి. ఆర్థిక స్వావలంబనను పెంపొందించుకోవాలి. దానధర్మాది పుణ్యకార్యాలు చేయాలి. నిస్వార్థ సేవలను అందించినప్పుడే ఈ మానవజన్మకు సార్థక్యం చేకూరుతుంది. ఇదే భగవద్గీత ధర్మోపదేశం. ఈ ఉపదేశాన్ని తు.చ తప్పకుండా పాటించిన మానవుడే మహనీయుడుగా, మహోన్నత కీర్తి ప్రతిష్ఠలను పొందగలడు.