బ్రహర్షి, సప్త మహరులలో ఒకడు, మరీచి మహర్షి పుత్రుడు, బ్రహ్మదేవుని మనుమడు అయిన కశ్యప మహర్షి మహానుభావిత్వం చేత వినతకు జన్మించిన అమేయబలపరాక్రమ సంపన్నుడు గరుత్మంతుడు. వినతాదేవి దక్షప్రజాపతి పుత్రిక. గరుడుని పుట్టుకలోనే సంభ్రమాశ్చర్యాలు గోచరిస్తాయి. ఖగనాథుడైన గరుడుని చరిత్ర చెప్పసాగాడు సూతమహర్షి. శ్రద్ధగా ఆలకిస్తున్నారు శౌనకాది మహరులంతా. కద్రువ, వినత - ఇద్దరూ కశ్యపుని పత్నులే. వారిద్దరి కోరిక మేరకు పుత్రకామేష్టి చేసిన కశ్యప మహర్షి అగ్నితేజో సమన్వితులు, మహాబల సంపన్నులు, దీర్ఘదేహులు అయిన వేయి మంది పుత్రులను కద్రువకు వరంగా ప్రసాదించాడు. వినత కోరిన సన్మార్గ ప్రవర్తకులు, మహాపరాక్రమశాలురు, కద్రువ పుత్రులకన్న అధిక బలధీరులు అయిన ఇద్దరు పుత్రులను ఆమెకు కలుగజేశాడు వరంగా కశ్యపుడు. తారక్ష్యుడు - గరుత్మంతుడికి మరోపేరు. కశ్యపాత్మజుడైన గరుడుని బలపరాక్రమాలు అనన్య సామాన్యాలు. సువిశాలమైన రెక్కల చేత విసరబడిన గాలులు పర్వత సమూహాలను చలింపచేస్తుండగా, వేగం మహాసముద్రాలనే అల్లకల్లోలం చేస్తుండగా, తన శరీర కాంతి సూర్యప్రకాశాన్నే అధిగమించగా జన్మించిన గరుడుడు-తల్లికి మత్రీ తినికలిగిస్తూ మహావేగంతో ఒక్కసారిగా ఆకాశవీధిలోకి ఎగిరాడు. కద్రువ పుత్రులు నాగరాజులైతే వినత సుతులు పక్షినాథులు. కశ్యపుడు అనేకానేక జీవులను సృష్టి చేసిన ప్రజాపతి. కశ్యపుని పుత్రులందరిలోను సాధుజన హృదయానందకరుడు, మాతృభక్తి పరాయణుడు గరుడుడు.
"వజ్రాయుధం దెబ్బ చవి డని పెద్దవైన రెక్కలు కలిగి కులపర్వతం లాగా ఆకాశానికెగిరిన గరుడుడు ఆకాశ గమనంతో దిగివచ్చి తల్లి పాదాలకు నమస్కరించాడు". మాతృమూర్తితో సమానురాలు, వినతకు అక్క అయిన కద్రువ దగ్గరకు వెళ్ళి ఆమెకు కూడా వినయంతో నమస్కరించాడు. కాని కద్రువ గరుడుని వినయానికి సంతృప్తి చెందలేదు. పైగా అతని తల్లి తనకు దాసిగా ఊడిగాలు చేస్తున్నది గదా అనుకొని "గరుడా! నేనెప్పుడే పని చెబితే ఆ పని చేయాలి నీవు. ఇంకో మాట. నా కొడుకుల్ని నీ మూపు మీద ఎక్కించుకొని లోక లోకాలు తిప్పుతూ అక్కడి సుందర దృశ్యాయ పించు" అని ఆజ్ఞాపించింది. కద్రువ చెప్పిన పనులన్నీ చేయటానికి గరుత్మంతుడు వినత అనుమతి తీసుకుని చేస్తున్నాడు.
తల్లి మాట జవ దాటకుండా గరుడుడు పన్నగ పతులనందరినీ తన వీపున పెట్టుకొని తిరగసాగాడు. అడవులు, ద్వీపములు, కొండలు, దిక్పాలకుల నగరాలను - ఒకటేమిటి? ఎన్నెన్నో అంతకు ముందు వారెన్నడచూ డని వింతలను, విశేషాలననూ పించేవాడు. ప్రతిదినమూ. ఆ పర్యటనలో ఒకనాడు వాయువేగంతో పాములన్నింటినీ వీపుపై మోస్తూ సూర్యమండలం దాకా ఒక్క ఎగురు ఎగిరాడు గరుడుడు. ఆతని భుజశక్తి అంత గొప్పది. సూర్యదేవుని ప్రచండ కిరణాల వేడికి పాములు తట్టుకోలేక మాడిపోయి భూమిపైన పడిపోయాయి. మూర్చపోయిన తన పుత్రులచూ సిన కద్రువకు విపరీతమైన కోపం వచ్చింది. దానికి కారకుడైన గరుడుని అనేక విధాల నిందించింది. వెంటనే తెలివి తెచ్చుకుని - ముందు తన బిడ్డలు మూర్చ నుంచి తేరుకోవడానికి త్రిలోకాధిపతి అయిన దేవేంద్రుని ఆరాధించింది. మిక్కిలి భక్తితో స్తుతించిన కద్రువ పలుకులకు సంతోషించిన ఇంద్రుడు స ష్టులపైన వర్షం కురిపించి వారిని మూర్ఛనుంచి తేర్చాడు. ఇంద్రుడు కూడా నిజానికి కద్రువకు సవతి, అక్క అయిన అదితి పుత్రుడే. కాని ఇక్కడ అవసరం ఆమె చేత ఇంద్రుని ప్రార్థింపచేసింది. ఇదంతూ స్తున్న గరుడుడికి ఆశ్చర్యం కలిగింది. కద్రువ రోజు మాదిరిగానే వినతచేత, గరుడుడి చేత పనులు చేయిస్తూనే ఉంది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు అది సహించలేక గరుడుడు తల్లిని సమీపించి "మనమెందుకు నాగమాతకు దాస్యం చేయవలసి వచ్చిందని" అడుగుతాడు.
తల్లీ! నాకొక విషయం అర్థం కావటం లేదు. ఇంత గొప్ప బలము, ప్రఖ్యాతి ఉన్న నేను, నా విశాలమైన రెక్కలతోను, సునిశితమైన ముక్కుతోను కులపర్వతాలనే నుగ్గు నుగ్గు చేయగలనే! ఇంత నీచపు పనిని ఎందుకు చేయవలసి వచ్చింది? ఎందుకూ పనికిరాని ఈ చవట పాములను నా వీపుమీద పెట్టుకొని ఎందుకు మోస్తూ తిరగాలి? వాళ్ళు చెప్పే పనులన్నీ మనమెందుకు చేయాలి? ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏ కారణం చేత నీవు ఆమెకు దాస్యం చేయవలసి వచ్చింది? చెప్పు. నీవు మాత్రం కశ్యప ప్రజాపతికి ఇల్లాలివి కావా?" అని అడిగిన కొడుకు మదిలో కలిగిన ఆర్తిని గ్రహించింది వినత. "దానికంతా చాలా పెద్ద కారణమే ఉంది. చెబుతాను విను నాయనా!" అని వినత తన గత జీవితం గురించి చెప్పసాగింది. "గరుడా! నేను, మా అక్క అయిన కద్రువ - పతిని కోరి పుత్రులనుపడశాము.ఆపుత్రులుఎలాకలిగారంటే-మాగర్భాలు కొంతకాలానికి అండాలుగా ఏర్పడ్డాయి. వాటిని నేతి కుండలలో పెట్టి రక్షిస్తుండేవాళ్ళం. అయిదు వందల సంవత్సరాలు గడిచిన తరువాత కద్రువ గర్భంలోని అండాలు పగిలి విచ్చుకున్నాయి. వాటినుంచి శేషుడు, వాసుకి, తక్షక, కర్కోటకాది నాగులు ఉద్భవించారు. నాకు పుత్రులు కలుగలేదే అన్న విచారంతో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి ఒక అండాన్ని పగులగొట్టాను. అప్పుడా గ్రుడ్డులోంచి శరీరంలో పై భాగాన్ని మాత్రమే కలిగి ఉండి క్రింది అవయవాలు ఏర్పడకుండా - వికలాంగుడై ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడి పేరు అరుణుడు (అనూరుడు). "నాకు సంపూర్ణ శరీరం ఏర్పడకముందే అండాన్ని విరగగొట్టావు కనుక నీవు అవినీతిపరురాలివ'ని నన్ను నిందించి నాకు ఘోరశాపాన్ని ఇచ్చాడు అరుణుడు. "అయిదు వందల సంవత్సరాల పాటు నీవు నీ సవతికి దాసిగా ఉండు. రెండవ గ్రుడ్డు పగిలే దాకా నీవు వేచివుంటే దానిలోనుంచి పుట్టే నీ పుత్రుడు మహాబలశాలియై నీ దాసీత్వాన్ని పోగొడుతాడు" అని చెప్పి సూర్యభగవానునికి రథసారథిగా వెళ్ళిపోయాడు అరుణుడు. నా పెద్దకొడుకు నాకిచ్చింది శాపమో, వరమో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయాను నేను. ఎట్టకేలకు మామూలు స్థితిలోకి వచ్చి రెండో అండాన్ని బహు జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ వచ్చాను. అండం సహజంగా పగిలినప్పుడు నీవు అందులోనుంచి జన్మించావు. అరుణుడు నాకు పెట్టిన శాపానికి తోడుగా మరొక విషయం కూడా ఉంది నాయనా! అది కూడా చెబుతాను విను. .
ఒకనాడు నేను, కద్రువ వినోదంగా సముద్రం చెంతకు వెళ్ళాము. ఆ సముద్రం ఒడ్డున ఏలకీలతలు, లవంగలతలు, లవలీలతలు మున్నగు తీగెలతో అతి సుందరంగా ఉన్న వనాన్ని చూ శాం. ఆ ప్రక్కనే తెల్లని కాంతులతో డముచ్చటగా ఉన్న ఉచ్చెశ్శవమనే అశ్వరాజాచ్నూ సిఆనందించాం. అది ఇంద్రుడి అశ్వం. క్షీరసాగర మథన సందర్భంలో ఉద్భవించిన చక్కని అశ్వం. ఆ తురగాన్ని తదేకందూ స్తూ - ఎంతో తెల్లగా ఉన్న ఈ గుఱ్ఱం తోక నల్లగా ఉంటూ శావా వినతా? అన్న కద్రువ మాటలకు నాకు నవ్వు వచ్చింది. "అదేమిటి అక్కా! ఆ గుఱ్ఱం అంత తెల్లగా ఉంటే! దాని ఒంటి మీద ఎక్కడా నలుపనేదే లేదు. నువ్వే కళ్ళతూ శావో! చూ పుమా శావో? దాని తోక కూడా తెల్లగానే ఉందే! నీకెక్కడ నలుపు కనిపించిందో నాకర్థం కావటం లేదు" అని నేననగానే నా మాటలకు అక్క కూడా నవ్వింది. నవ్వి -
"అమ్మహాశ్వంబు ధవళ దేహంబునందు నల్లగలిగిన నీ విష్ణు నాకు దాసి వగుము; మఱియందునల్లలేదయ్యెనేని నీకు నే దాసినగుదు పన్నిదము సబుము" - 31 ప - ద్వి.ఆ - ఆ.ప -
వినతా! ఆ అశ్వరాజంలో నల్లని మచ్చ కనుక ఉంటే నీవు నాకు దాసివికా. ఒకవేళ నీవన్నట్లు నల్లని మచ్చ లేకపోతే నేనే నీకు దాసినవుతాను. ఇదే మనిద్దరి మధ్య పందెం. సరేనా?" అని ప్రశ్నించటంతో "పద! దాని దగ్గరకు వెళ్ళి అద్దాం. నల్లని మచ్చ దాని శరీరంలో ఉందో లేదో తెలిసిపోతుంది" అని అన్నాను - నేనే పందెంలో గెలుస్తాననే నమ్మకంతో. "ఇప్పుడు సూర్యాస్తమయం అవుతోంది. సమయం లేదు. రేపు ప్రొద్దున వచ్చు. ద్దాం. అదీగాక పతిసేవకు కూడా కాలం అతిక్రమిస్తోంది మనం వెంటనే ఇళ్ళకు వెళ్ళకపోతే ఎలా?" అని కద్రువ అనటంతో ఇద్దరం ఇళ్ళకు వెళ్ళిపోయాం . నాయనా! గరుడా! ఆ మరునాడు ఉదయమే మేమిద్దరం ఆ అశ్వామా డటానికి దానికి కొంచెం దూరంలో నిలబడ్డాము. ఆ తెల్లని గుఱ్ఱం తోక నల్లగా కనబడటంతో నేనామెకు దాసిని కావలసి వచ్చింది. బాధపడుతూ, భయపడుతూ ఇన్నేళ్ళూకద్రువకు దాస్యం చేశాను. అలా చేస్తుండగా అయిదువందల ఏళ్ళు గడిచిపోయాయి. నా రెండవ అండం అప్పుడు పగిలి పుత్రోదయానికి తావిచ్చింది. నా ప్రథమ పుత్రుని శాపం కారణంగా ఇన్ని సంవత్సరాలు ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డాను. సవతికి దాస్యం చేశాను. నా దుఃఖానికి అంతు లేదు. మహా బలవంతుడవైన నీ కారణంగా నా కష్టాలన్నీ తొలగి, శాపవిముక్తురాలినవుతానని అరుణుడు చెప్పాడు. అది ఫలించబోయే తరుణంలో నీవు నన్నా ప్రశ్న వేశావు. నీ బలమే నాకు రక్ష. పుత్రులు సర్వసమర్థులైతే తల్లితండ్రులు బాధలనుంచి విముక్తులౌతారన్నది ఆర్యవాక్కు. నీవంటి సత్పుత్రుని పొంది కూడా ఇంకా సవతికి దాసినై ఉంటానా!" అన్న తల్లి మాటలు విన్న గరుడుడు దుఃఖపరవశుడైనాడు. -
ఒకనాడుకద్రువ పుత్రులతో తమదాస్యము పోయే ఉపాయం చెప్పమని అడగడంతో శేషుడు, వాసుకి మొదలైన సర్పరాజులు తమలో తాము ఆలోచించి కరుణాత్ములై వారి కోరికను వెల్లడించారు. ఈ "అమిత పరాక్రమంబును, రయంబును, లావును గలు ఖేచరో త్తముడవు నీవు; నీదయిన దాస్యముఁ బాచికొనంగ నీకు చి త్తము గలదేని, భూరి భుజదర్పము శక్తియు నేర్పడంగమా కమృతము తెచ్చియి"మ్మనిన నవ్విహగేంద్రుడు సంతసంబునన్" . - ప.54 - ద్వి.ఆ - ఆ.ప
"గరుడా! మా తల్లివల్ల నీవు మాకు దాసుడవైనావు. నీవు, నీ యొక్క, నీ తల్లియొక్క దాస్యాన్ని పోగొట్టుకోవాలని మమ్మడుగుతున్నావు గనుక ఒక ఉపాయం చెబుతాం విను. నీవు మహాపరాక్రమవంతుడవు. వాయువేగాన్ని మించిన వేగం గలవాడివి. ఇక నీ బలమంటావా! ఎంత గొప్పదో నీకూ తెలుసు. మాకూ తెలుసు. అందుచేత పక్షిరాజోత్తమా! భుజబలము, మహాశక్తి ప్రదర్శిత మయ్యేటట్లుగా మాకు అమృతం తెచ్చి ఇవ్వు. నీవందుకు సమర్థుడవే. నీవు మాకమృతాన్ని తెచ్చి ఇస్తే, మీ దాస్యం పోయినట్లే" అన్న నాశ్రీ షుల వచనాలకు ఉబ్బితబ్బిబ్బెనాడు ఖగేంద్రుడు. అమృతం తేవటం తనకెంత పని! తమ దాస్యం పోయినట్లే అని సంతృప్తి చెందాడు. "నాగరాజులారా! మీరు చెప్పిన ప్రకారం అమృతం తెచ్చి ఇస్తాను. అప్పుడు, నేను, మా అమ్మ మీ దాస్యం నుంచి విముక్తులమవుతాము" అని వారి అనుమతితో బయలుదేరాడు. తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా ఆమెకు చెప్పి "అమ్మా! అమృతం తేవటానికి వెళ్ళి వస్తాను. నన్ను దీవించి పంపమ్మా" అని మ్రొక్కిన ఆత్మనందనుచూ సి వినత ఆనందోత్సాహాలు పెల్లుబుకగా గరుడుని కౌగిలించుకొని మురిసిపోయింది.
"గరుడా! వాయుదేవుడు నీ రెండు రెక్కలను, చంద్రుడు వీపును, అగ్ని శిరస్సును, సూర్యభగవానుడు నీ సమస్త దేహాన్నీ కాపాడుతూ, ఎల్లప్పుడు నిన్ను రక్షిస్తూ, నీ కోరికలన్నిటినీ ప్రియమార తీరుస్తుంటారు. దిక్పాలకుల రక్ష, సూర్యచంద్రుల అనుగ్రహం నీ వెన్నుదన్ని ఉంటాయి. నీవు సర్వలోకవాసుల చేత వినుతింపబడతావు. విజయాన్ని, ఔన్నత్యాన్ని పొంది క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా నాయనా!" అని ఆశీర్వదించిన తల్లికి మరొకసారి నమస్కరించి అమృతం తేవడానికి సరిపడే ఆహారాన్ని ఏది తీసుకోవాలో తెలుపమ్మా అని అడిగాడు గరుడుడు.
ఆహారం పెట్టేది అమ్మ గనుక, ఏ ఆహారం తీసుకోమంటావో నీవే చెప్పమ్మా అని గరుడుడు అడగడంతో లోక సహజమైన విషయం స్ఫురిస్తుంది. "సముద్ర గర్భంలో బోయవాళ్ళు ఎందరో ఉన్నారు. వారంతా భూలోకవాసుల్ని ఎప్పుడూ కష్టపెడుతూ ఉంటారు. వారినందరినీ అమిత బలపరాక్రమవంతుడవైన నీవు నిమిషకాలంలో భక్షించి వెళ్ళు. నీకెదురనేది ఉండదు" అన్నవినత మాటలు విని, తల్లికి చెప్పి, మరయంతో గరుడుడు ఆకాశయానం చేసి సముద్రతీరం చేరుకుంటాడు. ఆ సముద్రగర్భంలో ఉన్న లక్షలాది సంఖ్యలో ఉన్న నిషాదులందరినీ పాతాళ రంధ్రంలా ఉన్నతన నోరు తెరిచి ఒక్కపెట్టున మ్రింగివేశాడు.మహాబలులకు సాధ్యం కాని విషయముండదు. అదీ గరుడుని విషయంలో! బోయవాళ్ళందరినీ మ్రింగిన వెంటనే ఆకాశమార్గానికి ఎగిరి ప్రయాణం చేయసాగాడు. ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడవుతూ గరుడుడు పయనిస్తున్న సమయంలో ఆతనికి నారద మహర్షి ఎదురౌతాడు. వెంటనే గరుడుడాగి బ్రహ్మరికి నమస్కరించి వినయ వినమితోత్తమాంగుడౌతాడు. - "వినతాత్మజా! ఎక్కడికయ్యాపరుగు పరుగున వెళుతున్నావు. నీ వేగాన్ని నేనందుకోగలనా! ఆగి నిలబడ్డావు గనుక అడుగుతున్నాను. ఎక్కడికి నీ ప్రయాణం? చెప్పవచ్చునదైతే చెప్పు. లేకపోతే వద్దులే. నా దారిని నేను పోతాను" అన్న బ్రహ్మరి పలుకులకు మరింత వినయంతో నమస్కరించాడు గరుడుడు. "మహాత్మా! నీకు చెప్పకూడనిది, నీకు తెలియనిది అయిన విషయమేమైనా ఉంటుందా? అయినా, అడిగావు కనుక చెబుతాను. నేను, నా తల్లి దాస్య విముక్తులం కావటానికి అమృతం తెద్దామని, దేవలోకం వెళుతున్నాను. అంతే" అన్న గరుడుని మాటలు విని నారదుడు మరో ప్రశ్న వేశాడు.
"అరుణుడిచ్చిన శాపమే ప్రధాన కారణమనుకో. మీ తల్లి ఆ శాపాన్ని అనుభవించటానికి మరొక కారణం కూడా ఉది తెలుసా?" అన్నాడు. "తెలియదు మహర్షీ! అదేమిటో వివరంగా చెప్పండి" అని అడిగాడు గరుడుడు. "కద్రువ, వినతలు మొదటూ సింది ధవళాశ్వాన్నే. అది దేవేంద్రుని తురగమైన ఉచ్చెశ్రవము. దానిలో నల్లని మచ్చ ఉండదు. సవతి మీద తాను గెలవాలని, ఆమె చేత ఊడిగాలు చేయించుకోవాలని అనుకొని ఆ రాత్రి పూట కద్రువ తన కొడుకుల్ని ఆ తెల్లటి గుబ్దానికి నల్లని మచ్చ ఉండేటట్లు చేయమని బాధతో అడిగింది. కద్రువ కోరిక అధర్మమని, అలా చేయలేమని నాగులు తల్లి మాటను తిరస్కరించారు. ట్లనదగునమ్మ? యెట్లయిన నయ్యెను;
కన్నీరు కారుస్తున్న తల్లినిచూ సి వాసుకి మొదలైన నాగరాజులు ఆమెను ఓదార్చబోయారు. "అమ్మా! నీవా తెల్లని గుఱ్ఱం తోక నల్లగా ఉండేటట్లు చేయమని ఆజ్ఞాపించావు. కాని, అది ధర్మం కాదుగదమ్మా! నువ్వు చెప్పిన పద్దతి వల్లకలిగే గెలుపు నీకు గాని, మాకు గాని శుభాలనిస్తుందా చెప్పు! అంతేకాదమ్మా. వినతకూడా మాకు తల్లివంటిదేకదా! న్యాయంగా ఆలోచిస్తే - ఈ పనిని నీవు మాకు చెప్పవచ్చా? ఎలా జరిగితే అలా జరగనీ. మనం పాపపు పని చేయవచ్చా? నీమాటలు మరి మాకు నచ్చటం లేదు" అని వారు వినయంగా కద్రువను మార్చబోయారు. ఆమె వారి మాటలు అర్థం చేసుకోలేదు సరికదా, వారికి ఘోరమైన శాపాన్నిచ్చింది. "తల్లి మాట వినని మీరు భవిష్యత్కాలంలో జనమేజయుడు చేసే సర్పయాగంలో భస్మమైపోదురు గాక!" అని. ఆమె పుత్రులందరూ భయపడిపోయారు. కొంతమంది అక్కడ ఉండకుండా దూరంగా వెళ్ళిపోయారు. కర్కోటకుడు చావుకు భయపడి, తల్లి ఆజ్ఞను శిరసా వహించి ఆ ధవళాశ్వం తోకకు చుట్టుకుని, తోక నల్లగా ఉండేటట్లు కనిపింపచేశాడు. వినత కద్రుమా పించిన నల్లని తోడూ సి, సత్య నిష్ణా గరిష్టురాలు, వినయ సద్గుణ సంపన్న కావడంతో సవతికి దాస్యం చేసింది. అంత ధర్మ మూర్తి అయిన మీ తల్లిని దాస్య విముక్తురాలిని చేయటం నీ ప్రథమ కర్తవ్యం. అమృతం తెచ్చి మీ తల్లిని రక్షించు. నీవంతటి సమర్థుడవే" అని నారదుడు గరుత్మంతుని దీవించి పంపివేశాడు.
కద్రువ చేసిన మోసాన్ని తెలుసుకొన్న గరుడుడు మరింత కుపితుడైనాడు.నిషాదభక్షణంతో ఆకలి పూర్తిగా తీరకపోవడంతో, తాను ఏవిధంగా బలిష్టుడు కావాలో, ఏమి తినాలో తండ్రినడిగి తెలుసుకొందామని, ఆయన ఆశీస్సులు పొందుదామని అనుకొని గరుడుడు క్షణకాలంలో కశ్యప ప్రజాపతిని చేరి, మ్రొక్కి తాను విన్నదంతా ఆయనకు తెలియజెప్పాడు. అమృతం తీసుకు రావాలన్న తన దృఢ నిశ్చయాన్ని విన్నవించాడు. కొడుకు చేయబోయే పనిని విన్న కశ్యపుడు ఆనందించి అమృతం ఎక్కడ ఉంటుందో వివరించి తెలియజెబుతాడు.
"అమృతభాండాన్ని జలం రక్షిస్తూ ఉంటుంది. దాని మధ్యలో అగ్నిమండుతూ ఉంటుంది. కత్తులు మొదలైన కఠినాయుధాలను ధరించి ఉగ్రులు, బలిష్ఠులు, దీర్ఘకాయులు అయిన రాక్షస శ్రీ ష్ఠులెందరో దానిని కాపలా కాస్తుంటారు. అంత గొప్ప రక్షణతో అమృతభాండం ఇనుప వలలో సురక్షితంగా ఉంది" అని చెప్పిన తండ్రి' సి గరుత్మంతుడు చిన్నగా నవ్వుకొన్నాడు. "తండ్రీ! నా మీద ఉండే మ కొద్దీ అమృతభాండం యొక్క రక్షణ గూర్చి అంత గొప్పగా చెప్పావు. నీకు నా బలం తెలియదా? ప్రతాపం గుర్తులేదా? శక్తి ఎరుగవా? అమృతభాండాన్ని ఎలా చేరాలో ఉపాయం తెలిసినవాడినే! నీకు సందేహం అవసరం లేదు. నేను తప్పక నీ ఆశీర్వాదం వల్ల అమృతాన్ని తెచ్చి తీరతాను. నా ఆకలి పూర్తిగా తీరే విధానం చెప్పు" అని అడిగాడు. కొడుకు పట్టుదలకు, పరాక్రమాతిశయానికి కశ్యపుడు ఎంతగానో సంతోషించి "నీకు సరిపోయే ఆహారాన్ని చెబుతాను విను" అని చెప్పసాగాడు. -
"పక్షినాథా! సముద్రం ప్రక్కన ఉరగమనే పేరుగల గొప్ప పర్వతం ఉంది. పర్వతం ప్రక్కనే ఒక చక్కని కొలను ఉంది. పర్వతం మీద ఒక పెద్ద ఏనుగు నివాసమేర్పరచుకొని విహరిస్తుండేది. ఆ ఏనుగు కొండ ప్రక్కనే ఉన్న కొలను వద్దకు వెళ్ళి దాహం తీర్చుకుంటుండేది. ఆ కొలనులోని నీరు మధురాతి మధురంగా ఉన్న కారణంతో ఎప్పుడూ గజం అక్కడికే వెడుతుండేది. కాని ఆ కొలనులో ఒక పెద్ద తాబేలు నివసిస్తుండేది. ఏనుగు నీరు త్రాగడానికి తాబేలు అడ్డుపడి దానితో వీరయుద్ధం చేస్తుండేది. రెండు జంతువులకు 2తో పోరు ఘోరమవుతూ పెరగసాగింది. ఈ గజకచ్ఛపాలు ఎవరనుకొన్నావు?
"మధుకైటభులనే రాక్షసశ్రేష్ఠులే మరో జన్మలో గజ కచ్చపాలుగా జన్మించారు. ఆ విషయం తెలియని వాళ్ళు, అన్యోన్య వైరంతో మహాభయంకరంగా యుద్ధం చేస్తున్నారు. ఆ రెండింటినీ ఎవరూ జయించలేరు. ఆ రెండింటినీ తింటే నీ ఆకలి పూర్తిగా పోతుంది. కాని వాటిని పట్టుకోవడానికి నీకో ఉపాయం చెబుతాను. శ్రద్ధగా విను. ఏనుగు నీళ్ళు తాగడానికి రాగానే ఆ శబ్దాన్ని గ్రహించి తాబేలు దానితో పోరాడడానికి గబగబా ఒడ్డు మీదికి వస్తుంది. ఆ సమయంలో మాత్రమే రెంటినీ ఒక్కసారిగా పట్టుకోగలుగుతావు. కాబట్టి నీవు చేయవలసిన పని ఏమిటంటే - తాబేలు ఒడ్డుకు వచ్చి పోరాడడానికి సిద్ధమయ్యేవరకు పొంచి, వేచి ఉండాలి. ఆ గజ కచ్చపాలను పట్టి భక్షిస్తే నీవమృతం తేవడానికి బలవంతుడవౌతావు" అని చెప్పి కశ్యప బ్రహ్మ కుమారుని 'విజయోస్త'ని దీవించి తత్కార్య నిర్వహణకు పంపివేశాడు. తల్లితండ్రుల దీవెనలు గ్రహించిన గరుడుడు 'ఉరగ' పర్వతం వద్దకు వెళ్ళడానికి ఆకాశంలోకి ఒక్క ఎగురు ఎగిరాడు. గజకచ్ఛపాలు నివసించే చోటకు చేరుకున్నాడు. ఆరామడల పొడవు, ష ండామడల వెడల్పుగల గజరాజాన్ని చూ శాడు. ఆ ఏనుగుచూ సి కొలను ఒడ్డు మీదకు వస్తున్న - మూడామడల పొడవు, పది ఆమడల పరిధిని కలిగి ఉన్న తాబేలును కూడూ శాడు గరుడుడు. తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకొన్నాడు. ఇదే సరైన అదును అని అనుకొన్నాడు. -
ఒక చేతితో (రెక్కతో) తాబేటిని, రెండో చేతితో ఏనుగును గట్టిగా పట్టుకున్నాడు. రెండు జంతువులు ఒకదానితో మరొకటి చుట్టుకొనేటట్లు చేశాడు. ఒకదానితో ఇంకో దాన్ని కదలటానికి వీలులేని విధంగా నొక్కి పట్టుకొని ఆకాశమార్గానికి ఎగిరాడు. గరుడుని ధాటికి దేవతల విమానాలు ఊగిపోయాయి. గరుడుడు ఆకాశ గమనంతో 'అలంబం' అనే తీర్థరాజాన్ని చేరాడు. ఆ ప్రక్కనే ఉన్న "రోహిణి" అనే మహావృక్షం గరుడుని చూ సి గౌరవించింది. నూరామడల పొడవున్న తన కొమ్మపైన కూర్చుని గజకచ్చపాలను భక్షించి వెళ్ళమని కోరింది. వల్లె అని, గరుడుడు ఆ కొమ్మపైన తన పాదం పెట్టాడు. అంతే. ఆ మహాబలవంతుడైన గరుడుడు కాలు కొమ్మపైన మోపగానే అంత పొడవైన రోహిణి శాఖ పెళ పెళమని విరిగి క్రింద పడబోయింది. ఆ మహాశాఖను అవలంబం చేసుకొని తలక్రిందులుగా నిలబడి సూర్యకిరణాలే ఆహారంగా ఘోర తనస్సు చేస్తున్న వాలఖిల్య మహాముని సమూహాని సి, వారికి బాధ కలుగరాదన్న భావనతో గరుడుడు ఆ కొమ్మను ముక్కుకు కఱచుకొన్నాడు. గజకచ్ఛపాలను రెక్కలతో అదిమి గట్టిగా పట్టుకొని వేగవంతుడై కశ్యపుని చేరాడు. కొడుకు అవఛూ సిన కశ్యపుడు - ఆ మహామునులనచూ సి "పూజ్యులైన మహరులారా! ఈ గరుడుడు లోకోపకారి. ఎవరికీ హాని చేయనివాడు. మీకెక్కడ బాధ కలుగుతుందో అని రోహిణి శాఖను విడువకుండా ఉన్న మహా బలశాలి. పైన పెద్దల పట్ల భక్తి గలవాడు. కరుణించి మీరు మరొకచోటికి వెళ్ళి తపస్సు చేసుకోమని వేడుకొంటున్నాను" అని చెప్పగానే వాలఖిల్యాదులు గరుడుని పరికియా శారు. గరుడుని శక్తికి ఆశ్చర్యపోయారు. ఈ పక్షినాథుడు వినతా కశ్యపుల పుత్రుడు గదా, తల్లితండ్రుల సద్గుణాలన్నీ పుణికి పుచ్చుకొన్నాడు అని, అతని జవసత్వాలను మెచ్చుకొన్నారు.
"గరుడుడికి కాక వేరెవరికీ ఇంత బలమూ, శక్తి, ఆలోచనా ఉండవు. కనుకనే మనకే ప్రమాదం జరగకుండా, జాగ్రత్తగా కొమ్మను తండ్రి వద్దకు తెచ్చాడు. ఇతడిలోని సద్గుణం, సహనం, కరుణ ఎన్నదగినవి. తండ్రీ కొడుకుల కోరిక మేరకు మనమింకొక చోటుకు వెళ్ళిపోదామ"ని వాలఖిల్యాది మహరులు హిమవత్పర్వత ప్రదేశానికి వెళ్ళిపోయారు. గరుడునకి కార్యసిద్ధి లభిస్తుందని దీవించి మరీ వెళ్ళారు. అంగుష్ట ప్రమాణ గాత్రులైన (బొటన వ్రే లంత శరీరంగల), మహాతపస్సంపన్నులైన వాలఖిల్యాది మహరులు రోహిణీ శాఖను విడిచి తమంత తాము హిమవంతానికి తరలిపోవటం - వారి మహిమకు నిదర్శనం. మహరులు కొమ్మ విడిచి వెళ్ళిపోగానే గరుడుడికి ఆ మహాశాఖను ఎక్కడ విడిచిపెట్టాలో అర్థం కాలేదు. ఎక్కడ వదిలినా, చెట్టుమీది జీవజాతుల స్థితి గురించి, క్రిందపడితే దానిక్రింద పడి నలిగిపోయే జీవజాలం గురించి ఆలోచించసాగాడు. "నిర్జీవ స్థలం ఎక్కడుందో చెప్పమని, ఆ శాఖనెక్కడ వదిలివేయాల"ని తండ్రినడుగుతాడు. "నాయనా! గరుడా! నీ బుద్ది చాలా నిశితమైనది. కరుణామయుడవైన నీవు నన్నడిగిన ప్రశ్న చాలా సమంజసంగా ఉంది. చెబుతాను విను. ఇక్కడకు లక్ష యోజనాల దూరంలో హిమవత్పర్వత గుహ ప్రాంతంలో నిష్పురుషమనే కొండ ఉంది. అక్కడ మానవులెవరూ నివసించరు. ఈశ్వరాదులు కూడా ప్రవేశించరు.జీవహింసకాస్కారం లేనిచోటది. కనుక ఈ రోహిణీ శాఖను ఆ కొండపైన విడిచిపెట్టు" అని కశ్యపుడు చెప్పగానే గరుడుడు మనోవేగంతో ప్రయాణించి తన ముక్కున కఱచికొని ఉన్న కొమ్మను నిష్పురుష నగంలో వదలివేశాడు. వెంటనే హిమవత్పర్వత సానువు మీద నిల్చి, తన రెక్కల సందులలో ఇరుక్కుపోయిన ఆ గజకచ్ఛపాలను రెండింటిని భక్షించి, కడుపు నిండినందుకు సంతోషించి కర్తవ్యోన్ముఖుడైనాడు. (సశేషం).....