భీష్మ ఏకాదశి


భారతంలో భీష్ముని కథలాంటి కథలో జీవిస్తున్నవాళ్ళు లోకంలో ఎందరో, ఎందరెందరో కనిపిస్తారు. అన్నీ ఉండి, ఏమీ లేనితనంతో జీవించేవాళ్ళు కొందరైతే, ఏమీ లేనితనంతో అన్నీ ఉన్నవాళ్ళుగా నటిస్తూ బ్రతికేవాళ్ళు మరికొందరు. ఈ రెంటిలో మొదటి జాతికి చెందినవాడు భీష్మ పితామహుడు.


పుట్టిన ఐదేళ్ళ వరకు తండ్రికి దూరంగా గంగమ్మ దగ్గరే పెరిగాడు. సర్వవిద్యల్లో, విశేషించి ధనుర్విద్యలో నైపుణ్యాన్ని గడించి తల్లి కారణంగా తండ్రి వద్దకు చేరాడు. తల్లి దూరమైంది. తనకి వయస్సు వచ్చి ఉన్న స్థితిలో తండ్రికి వివాహ కాంక్ష మెదిలింది. కాదనలేదు. తన పెళ్ళి మాటేమిటని నోరు తెరిచి అడగలేదు. తండ్రి కోరికను తీర్చడమే సరియైనదని భావించి, తండ్రి శంతనునికి పెళ్ళి చేశాడు. ఆ చేయడం కోసమే తన రాజ్యపు హక్కును విడిచాడు. అంతతో సరిపోలేదని రాజ్యాన్ని ఆశించే సంతానం వల్ల ఎక్కడ తన ప్రతిజ్ఞకు భంగం కలుగుతుందో అని వివాహాన్ని కూడా త్యజించాడు. దానికి కారణం తన తండ్రి ఇద్దరు పిల్లల్ని కని వంశాభివృద్ధి చేసి గతించినా ఆ ఇద్దరిలో ఒకడు దురదృష్టవశాత్తు యుద్ధంలో మరణించడమే. మళ్ళీ వంశం ఎక్కడ ఆగిపోతుందో అని ఆ రెండవవాని కోసం అనాలోచితంగా ఆవేశంతో, కాశీరాజు పుత్రికలు ముగ్గురిని తన తమ్ముడితో వివాహం జరిపించడానికి బలవంతాన తెచ్చేశాడు. ఆ ముగ్గురిలో పెద్దామె వివాహానికి


వ్యతిరేకించింది. అంతటితో ఊరుకోక తపస్సు చేసి భీష్ముణ్ణి అస్త్ర సన్యాసం చేసేలా చేసింది. చివరికి స్మశానంలో అంపశయ్య మీద పరుండి, తన చివరి కాలంలో ఉత్తరాయణం వచ్చేవరకూ ఎదురు సి మహరులూ, దేవతలూ, పాండవులూ ఇంకా ఎందరో సత్పురుషులూ ఇలా తనని అందరు చుట్టుముట్టిన వేశ్రీ కృష్ణుణ్ణి నారాయణ రూపండూ సుశ్రీ విష్ణు సహస్ర నామాలని గానం చేసి మనకందించి కైవల్యానికి చేరాడు భీష్మ పితామహుడు. ఈ రోజు అనగా మాఘమాస శుక్లపక్ష అష్టమి నాడు భీష్ముడికి తర్పణం వదిలి శ్రాద్ధం చేసినవారికి సంతానం కలుగుతుందని పద్మపురాణంలో చెప్పబడింది. కనుక సంతానం లేనివారు భీష్మాష్టమి రోజున భీష్ముడిని స్మరించడం, తర్పణ శ్రదాదులను నిర్వహించడం మంచి ఫలితాలనిస్తుంది. భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి రోజు భీష్ముని స్మరించడం, జలాంజలిని అర్పించడం చేయవలెను. భీష్మ ఏకాదశి నాడు ఈ లోకానికి భీష్ముడు ప్రసాదించి శ్రీ విష్ణుసహస్ర నామాల్ని పారాయణం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ