భాగవతుని లక్షణములు

భాగవతుని లక్షణములు


భాగవతుడు ఎల్లప్పుడు భగవంతుని పట్ల అత్యంత భక్తశ్రద్ధలు కలిగి ఉండటమే కాక తోటి భాగవతుల పట్ల అపచారము చేయకుండుట అత్యంత అవశ్యకము. ఈ భాగవత అపచారములు చాలా రకములుగా ఉండును. వ్యక్తి వంశములో ఏ కులములో జన్మించాడని సంశయించరాదు. అతడు చేసే పనులను కూడా విమర్శించరాదు. అతడు బాలుడా, యువకుడా, వృద్దుడా అనే వయోభేదముచే కించపరచరాదు. విష్ణుభక్తి కలిగిన వ్యక్తి స్త్రీయా, పురుషుడా ఆమా డరాదు. అతడు ఏ ఆశ్రమమునకు చెందినవాడూ డరాదు. అతని శరరీ అవయములలో ఏదేని లోపము ఉంటే పరిహసించరాదు. అతని మలిన శరీరమున చి అసహ్యించుకోరాదు. వారిలోని భక్తి భావమునే గమనించవలెను. భాగవతుడు నివసించుస్థలమును బట్టి విలువనియ్యరాదు, అవహేళన చేయరాదు. ఈ భక్తునికి వాడి బంధువులను బట్టి గొప్పవాడని, తక్కువవాడని విలువనీయరాదు. అతని కీర్తి ప్రతిష్టలను బట్టి కూడా గౌరవించుటయు, అగౌరవపరచుటయు చేయరాదు. వారు భగవంతునికి చేయు కైంకర్యములచూ చి గొప్పవారని, తక్కువవారని తలచరాదు. జీవ యాత్రకై ఒక్కొక్కరు ఒక్కొక్క పనులను చేయుచుందురు.


వారు చేయు పనులను బట్టి వారిని గౌరవించక వారిలోని భాగవత లక్షణములనే ప్రమాణముగా తీసుకొని గౌరవించవలెను. ఇతరులలోని దోషములను ఎన్నడును | ఎతం పరాదు. ఇది మహా దోషమగును. ఇట్టి అనేక అపచారములు చేయకుండా జీవనయాత్ర సాగించవలెను. పూర్వము కొందరు భాగవత అపచారములు చేసి పాడైనవారు పెక్కుమంది కలరు. అందులో త్రిశంకుడు, వైనతేయుడు, సీతామాత కూడా కలదు. త్రిశంకుడు ఒకప్పుడు భాగవతుడే, కాని శరీరముతోనే స్వర్గమునకు వెళ్లవలయుననే తన కోరికను అతని గురువైన వశిష్టుడు నిరాకరించుట వలన వసి షుని అవమాన పరచి, త్యజించి విశ్వామిత్రున్ని ఆశ్రయించాడు. శాపవశాత్తు చండాలుడైనాడు. వైనతేయుడు కూడా ఒకమహా భాగవతోత్తమురాలూ చిఆమె నివసించు ప్రదేశముచూ చి, ఈమె ఇక్కడ నివసించదగినది కాదని అవమాన పరచాడు. ఫలితంగా పైకి ఎగిరే సామర్థ్యాన్ని కోల్పోయాడు. పచ్చాత్తాపచింతుడై శ్రీ హరిని వేడుకోగా ఎగిరే సామర్థ్యాన్ని తిరిగి పొందాడు. సీతామాత కూడా భాగవతపచారము చేసి రావణుని లంకలో బంధించబడిందని పెద్దలంటారు. ఈమె మహాభక్తుడైన లక్ష్మణుడిని నానా మాటలచే గాయపరిచింది, బాధపెట్టింది. ఫలితంగా రావణునికి బంధీ అయింది. ఇలా ఒక భాగవతుడు ఆచరించదగిన లక్షణములను ప్రతివారు శ్రద్ధగా గుర్తుంచుకొని దేనివలన ఇతరులకు అపకారం జరుగునో అది ఆచరింపక, ఏది ఆచరిస్తే భగవంతుడు సంతోషించునో దానినే ఆచరించుచు, స్వలాభము కంటే ఇతరుల క్షేమమే ముఖ్యమని భావించుచశ్రీ వేంకటేశ్వరున్ని సదా స్మరించువారు ధన్యులు. వీరిశ్రీ వేంకటేశ్వరుడు అక్కున చేర్చుకొనును.