శ్రీవారి కథలు - శ్రీ నివాస దీక్షితులు


శ్రీనివాసుని రాకతో ఆనంద నిలయమంతా కళకళ లాడింది. బంగారు కాంతులు మరింతగా కనువిందు చేశాయి. ఆయన కాళ్ళు కడిగింది పద్మావతి. ఆ నీళ్ళు తలమీద చల్లుకుంది ఆమె. తర్వాత తెల్లటి మృదువయిన వస్త్రంతో ఆయన కాళ్ళ తడి తుడిచింది. ముందుగా తల్లి వకుళమాలిక పాదాలకి నమస్కరించాడు శ్రీనివాసుడు. కొడుకుని ఆశీర్వదించి ఆలింగనం చేసుకుంది వకుళమాలిక.


"ఎన్నేళ్ళయిందిరాశ్రీ నివాసా! కళ్ళు కాయలు కాశాయి. బాగా చిక్కిపోయావు కన్నయ్యా!" అంది వకుళమాలిక. ఆమె కళ్ళనిండా నీళ్ళు నిలిచాయి. శ్రీ నివాసుడు మందహాసం చేస్తూ మెల్లగా పద్మావతి చిలిపి కళ్ళల్లోకి అల్లరిచూ శాడు. ఇద్దరూ పులూ కలిశాయి. పరిచారికలు... వకుళమాలిక... తొండమానుడు... నందకం అందరూ ఆనంద నిలయంలోంచి బయటకొచ్చి నిలబడ్డారు. ఏకాంతం... అంతా నిశ్శబ్దం... ఆది దంపతుల ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలు తప్ప మరేమీ వినిపించటం లేదు. ఈ "పద్మా! బాగున్నావా!" అంటూ చేతులు చాపాడు నివాసుడు. "స్వామీ!" అంటూ ఆయన గుండెమీద వాలిపోయింది పద్మా వతి. ఇద్దరూ చాలాసేపు అలాగే ఉండిపోయారు. ఆయన బిగి కౌగిలిలో ఆమె ఇరవైరెండేళ్ళ విరహం కరిగిపోయింది. అనంతమైన ఆనందాన్ని అనుభవించింది పద్మావతి. అంతలో తటాలున ఆయన కౌగిలిలోంచి విడివడి ఆతృతగా


అడిగింది పద్మావతి. "స్వామీ! అక్కయ్య ఏదీ?" "వెదుకు... ఎక్కడ ఉందో..." అన్నాడు నివాసుడు. "వెదకాల్సిన పనిలేదు... ఇదుగో ఇక్కడుంది... అక్కయ్యా !" అంటశ్రీ నివాసుని హృదయాన్ని మృదువుగా తాకింది పద్మావతి. "చెల్లీ! నువ్వు తెలివైనదానివే... నాకు చాలా ఆనందంగా ఉంది.నీస్పర్శహాయిగా ఉంది!"అంది ఆయన హృదయంలోంచి మహాలక్ష్మి. "చెల్లీ! నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు విరహవేదన కలిగించాను... మన్నించమని అడగలేను... నేను అక్కయ్యని కదా! అవునా;" అంది మహాలక్ష్మి. "అలా అనకు అక్కా! నువ్వు దగ్గర ఉంటే స్వామికి ఆనందం... స్వామి ఆనందమే నాకు ఆనందం!..." అంది పద్మావతి. . పద్మావతీ! నా తపస్సుకి మెచ్చి మహాలక్ష్మి నా హృదయ భాగంలో రెండు చేతుల్లో పద్మాలను ధరించి "వ్యూహలక్ష్మిగా... ద్విభుజా వ్యూహలక్ష్మి"గా ఆవిర్భవించింది. ఈమె భూతకారుణ్యలక్ష్మిగా కూడా పిలువబడుతుంది!" చెప్పాడు శ్రీ నివాసుడు. ఆసక్తిగా వింటోంది పద్మావతి. "పద్మా! మరో విశేషం కూడా జరిగింది. సుమా!" అన్నాడు శ్రీ నివాసుడు. "విశేషమా?" అంది ఆశ్చర్యంగా పద్మావతి. "ఈ మహాలక్ష్మి... మీ అక్కయ్య నా శరీరమంతా ఆక్రమించింది... తెలుసా?" అన్నాడు నివాసుడు. "ఎలా....?" అంది పద్మా వతి. - "ఇలా... నా నోటిలో భాగ్యలక్ష్మిగా... నా కరతలాల్లోనూ దానలక్ష్మిగా... రెండు భుజాల్లో వీరలక్ష్మిగా.... హృదయంలో భూతకారుణ్యలక్ష్మిగా... నా ఆయుధమైన నందకం అనే ఖడ్గంలో శౌర్యలక్ష్మిగా... నా గుణగణాల్లో కీర్తిలక్ష్మిగా.... నా సర్వాంగాల్లో శాంతస్వరూపంతో శౌర్యలక్ష్మిగా... రాజ్యలక్ష్మిగా అష్టలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి కొలువయింది...." చెప్పాడు వివరంగా శ్రీ నివాసుడు. "పాదాల నుంచి హృదయం వరకు మహాలక్ష్మీ సంపన్నులు మీరు స్వామీ!" అంది పద్మావతి. "అంతా లోకకళ్యాణం కోసమే" అన్నాడు నివాసుడు. "స్వామీ! " ఆర్తితో పిలిచింది పద్మావతి. "చెప్పు పద్మా!" అన్నాడు నివాసుడు. "ఇక నేను మీ విరహవేదనను భరించలేను...భరించలేను. ఇరవై రెండేళ్ళు విరహం ఎలా భరించానో సహించానో తెలియదు. ఇకమీదట..." అంది పద్మావతి. "ఊఁ చెప్పు!" అన్నాడు నివాసుడు. "నేను మిమ్మల్ని విడిచి ఉండలేను స్వామీ! నన్ను అనుగ్రహించండి!" అని ప్రాధేయపడింది పద్మావతి. "పద్మావతీ బాధపడకు. నువ్వు మాయలో ఉన్నావు. నువ్వు కారణజన్మురాలివి. మహాలక్ష్మి అంశతో జన్మించావు. త్రే తాయుగంలో సీతాదేవికి బదులుగా లంకలో బాధలు అనుభవించిన వేదవతివి నువ్వు. మత్స్యనారాయణుడు అవతరించిన నారాయణ వనంలో జన్మించావు. నేను నీకిచ్చిన వరం ప్రకారం నిన్ను వివాహం చేసుకున్నాను. నీ కోరిక ప్రకారం ఇప్పటినుండి నిన్ను విడిచి ఉండను... అందుకోసం నా హృదయంలో వ్యూహలక్ష్మిగా కొలువై ఉన్న మహాలక్ష్మితో కలిసిపో!" అన్నాడు నివాసుడు. - ''ధన్యురాలిని స్వామీ!" అంది పద్మావతి. - "అయితే పద్మావతీ! నా దగ్గరికి రా... నిన్ను ఆలింగనం చేసుకుంటాను. వ్యూహలక్ష్మితో నువ్వు కలిసిపో... నా హృదయంలో నిలిచిపో..." అన్నాడు నివాసుడు.


''ధన్యురాలిని స్వామీ!" అంది పద్మావతి. - "అయితే పద్మావతీ! నా దగ్గరికి రా... నిన్ను ఆలింగనం చేసుకుంటాను. వ్యూహలక్ష్మితో నువ్వు కలిసిపో... నా హృదయంలో నిలిచిపో..." అన్నాడు నివాసుడు. వెంటనే పద్మావతి ఆనందంతోశ్రీ నివాసుని దరి చేరింది. ఆయన ఆమెను కౌగిలించుకున్నాడు. అంతే... మరుక్షణంలో ఆకాశరాజు కూతురైన పద్మావతి అద్భుతంగాశ్రీ నివాసుని హృదయభాగంలో కొలువైన వ్యూహలక్ష్మితో కలిసిపోయింది. ఆ దృశ్యాన్ని అప్పుడే బయటినుంచి ఆనంద నిలయంలోకి వచ్చిన వకుళమాలిక... తొండమానుడూ సి తరించారు. "స్వామీ! సందేహం..." అన్నాడు తొండమానుడు. "ఊఁ..." అన్నాడు నివాసుడు. "తీరుస్తారా ప్రభూ!" అన్నాడు తొండమానుడు. "అడుగూ..." అన్నాడు నివాసుడు. "గతంలో అవతారాల్లో మాదిరిగా ఈ అవతారంలో మీకు విడిగా దేవేరులుండరా?" అడిగాడు తొండమానుడు. "కలియుగంలో ఇదే నా అవతారం.శ్రీ నివాసుడిగా... వేంకట నాయకుడిగా.. శ్రీ వేంకటేశ్వరునిగా భక్తులు నన్ను కీర్తిస్తారు. ఈ వేంకటాచలంలో నాకు విడిగా దేవేరులుండరు. నాలోనే దేవేరులు కలిసి ఉంటారు. ఈ ఏడుకొండల మీద నేనే పరదైవాన్ని. నన్ను కీర్తించినా... దర్శించినా... అర్చించినా ముక్తి లభిస్తుంది..." అని వివరించాడశ్రీ నివాసుడు. వకుళమాలిక అలజం స్తూ ఉండిపోయింది. తొండమానుడు పరమభక్తితో శ్రీ నివాసునికి సాష్టాంగ దండప్రణామం చేశాడు.