మకర సంక్రాంతి


మకర సంక్రాంతి సుఖం, శాంతి, వైభవం, ప్రగతి సూచకం. మకర సంక్రాంతి పర్వం సమస్త భారత దేశంలో ఏదో ఒక విధంగా జరుపుకుంటారు. ఈ పండుగ సామరస్యానికి ప్రతీక.


సూర్యుడు సంవత్సరంలో 12 రాశుల్లో పరిభ్రమిస్తాడు. ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడమే సంక్రమణం. మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి. దేవలోకంలో సంవత్సరంలోని ఆరు నెలలు ఒక పగలు. తక్కిన ఆరు నెలలు రాత్రి. మకరసంక్రాంతి నాడు సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. దేవలోకంలో దేవతలు ఈ పగలు ఆరు నెలలు మేల్కొని ఉండడం వల్ల భూమిపై జరిగే శుభకార్యాలపై వారి దృష్టి పడుతుంది. అందుచేత శుభకార్యాలు చక్కగా సాగుతాయి. సంక్రాంతి తరువాత ఎక్కువ శుభకార్యాలు నిర్వహిస్తారు.


ఉత్తరాయణం


భూమి సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల కాంతి వృత్తం ఏర్పడుతుంది. భూమి తన ఇరుసుపై కూడా తిరగడంతో ఇరుసుపై 23.5 అంశాలు వాలి ఉంటుంది. సూర్యుడు మకర రేఖ నుండి ఉత్తర కర్కాటక రేఖ వైపు ప్రయాణించడాన్ని 'ఉత్తరాయణం' అని, దక్షిణంలో మకరరేఖ వైపు ప్రయాణించడాన్ని 'దక్షిణాయనం' అని వ్యవహరిస్తారు. ఉత్తరాయణం ఆరు నెలల్లో సూర్యుడు మకరరేఖ నుండి మిథునం వరకు ఆరు రాశుల్లో సంచరిస్తాడు. దక్షిణాయనంలో ఆరు నెలల్లో సూర్యుడు కర్కాటక రాశి నుండి ధనుస్సు రాశి వరకు ఆరు రాశుల్లో సంచరిస్తాడు. "ఉత్తరాయణం ఆరు మాసాల్లో దేహం త్యజించిన బ్రహ్మవేత్తలైన యోగులు బ్రహ్మను చేరుకుంటారు" అని భగవద్గీత చెబుతోంది. అందుచేతనే భీష్మ పితామహుడు దేహత్యాగం కోసం ఉత్తరాయణ కాలం వచ్చేదాకా వేచి ఉన్నాడు. మకర సంక్రాంతి విశేషంగా సూర్యోపాసనకు సంబంధించినది. సూర్యోపాసన వల్ల ఋణ విముక్తి, దారిద్య నాశనం జరుగుతుంది. హృదయ రోగాలు, నేత్ర రోగాలు, కుష్టు మొదలైన చర్మ వ్యాధులు సూర్యుని ప్రసన్నత చేత స్వతహాగా నివారణ అవుతాయి. కలియుగంలో శీఘ్రఫలప్రదాత సూర్యభగవానుడు. సూర్యోపాసనకు వేదాల్లో సర్వోన్నత స్థానం కల్పించబడింది.


సంక్రాంతి స్నానం అర్ఘ్యం


సూర్యోదయమయ్యాక సంక్రాంతి కాలానికి ముందు, తర్వాత కూడా స్నానం చేయాలి. సంక్రమణ సమయం తర్వాత 20 ఘడియల కాలం పుణ్యకాలంగా భావింపబడుతుంది. సంక్రాంతి తరువాత రెండు గంటల సమయం సర్వోత్తమ పుణ్యకాలం, స్నాన, దాన, పుణ్యకర్మలకు ఉత్తమమైన సమయం. మకర సంక్రాంతి నాడు పవిత్ర నదుల్లో పర్వస్నానం చేసి, సూర్యదేవునికి కింది మంత్రంతో జలం సమర్పించాలి. "ఓం ఘృణి సూర్యాయ నమః | ఓం సూర్యనారాయణ ఇతి అర్ఘ్యం సమర్పయామి పై మంత్రంతో సూర్యునికి అర్ఘ్యం ఇచ్చాక బ్రాహ్మణులకు దానం చేయాలి. తీర్థ స్నానాలు చేయలేనివారు తమ ఇంట్లోనే నీటిలో నువ్వులు వేసి గంగాజలాన్ని స్మరించి స్నానం చేయాలి. స్నానం చేశాక రాగిపాత్రలో శుద్ధగంగాజలం నింపి కొంచెం బెల్లం నువ్వులు చందనం అక్షతలు పుష్పాలు వేసి పైన చెప్పిన మంత్రంతో లేదా గాంత్రీ మంత్రంతో సూర్యనారాయణునికి అర్ఘ్యం సమర్పించాలి. తర్వాత నువ్వులు, బెల్లం, పెసరపప్పు వంటివి నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత పదార్థాలన్నీ బ్రాహ్మణునికి దానం చేయాలి. కొంచెం తీసిపెట్టి ప్రసాదంగా స్వీకరించాలి. సంక్రాంతి నాడు నువ్వులు ఉపయోగించడం చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ నాడు నువ్వుల నూనె శరీరానికి రాసుకుని మర్దన చేసుకోవాలి. ఈ మర్దన వల్ల శరీరంలో మంచి స్పూర్తి కలుగుతుంది. నువ్వుల పిండి లేపనం వల్ల శరీర సౌందర్యం పెరిగి చిత్రమైన నిగారింపు వస్తుంది. స్నానం చేసే నీటిలో నువ్వులు కలిపితే మంచిది. ఈ రోజు నువ్వులతో హోమం చేయాలి. దీనివల్ల ఇంట్లో సుఖం, సంపదశ్రీ ప్రాప్తిస్తాయి. జీవితకాలమంతా ఐశ్వర్యం నిలకడగా ఉంటుంది. - భోజనంలో నువ్వులకు సంబంధించిన పదార్థాలు వాడాలి. నువ్వుల లడ్డు, చిమ్మిలి, నువ్వుల పచ్చడి వంటివి భుజించడం వల్ల సూర్యుడు ప్రసన్నుడవుతాడు. నువ్వులు, బెల్లం కలిపిన పదార్థాలు తినడం వల్ల శరీరంలోని జీర్ణశక్తి వర్ధిల్లుతుంది. శరీరంలో పుష్టి కలుగుతుంది. సంక్రాంతి రోజంతా నువ్వులు కలిపిన జలం సేవించాలి. సంక్రాంతి తరువాత స్నానం, లేపనం, హోమం, తర్పణం, దానం, భక్షణ కార్యాల్లో నువ్వులు ఉపయోగించేవారి పాపాలన్నీ నశిస్తాయి. నువ్వులను పాపనాశకంగా చెబుతారు.


విశేష పూజ


చందనంతో అష్టదళ పద్మం చిత్రించి అందులో సూర్యదేవుని స్థాపించి విధ్యుక్తంగా పూజించాలి. గోశాలలో గడ్డి పంపిణీ చేయడం, పేదలకు భోజనం పెట్టడం పుణ్యప్రదం. స్త్రీలు పసుపు, కుంకుమ పంచుతారు. తమ సౌభాగ్యం కోసం 13 పాత్రలలో పసుపు, కుంకుమ బొట్టు పెట్టి వాటిలో బియ్యం, పెసరపప్పు కలిపేసి నువ్వుల లడ్డుతో కలిపి దానం చేస్తారు. ఈరోజు పవిత్ర నదుల్లో స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం పాపనాశకమని పేర్కొన్నారు. సూర్యుని ఈ సంక్రమణ కాలం పితృదేవతల ఆత్మశాంతికి, ముక్తిత్రే ష్ఠ సమయంగా శాస్త్రాల్లో చెప్పబడింది. ఈరోజు గంగా స్నానానికి విశేష ప్రాముఖ్యత ఉంది. హరిద్వార్ మొదలైన పవిత్ర తీరాల్లో అత్యధిక సంఖ్యలో భక్తులు చేరతారు. తమ కుటుంబ సౌఖ్యం, పితృదేవతల ఆత్మశాంతి కోసం గంగాస్నానం చేసి ఉపాసనలు చేస్తారు.


సంక్రాంతి దానం


ఈరోజు దానం ప్రధాన కర్తవ్యం. సూర్యోదం లోపునే స్నానం, దానం చేయడం ఉత్తమం. స్త్రీలు శుభ సంఖ్యలో అనేక వస్తువులు దానం చేస్తారు. ఈ రోజు చేసే దానం పరమసౌభాగ్య దాయకమని విశ్వసిస్తారు. ముఖ్యంగా వస్త్రాలు, అన్నం, నెయ్యి, ఉప్పు, కంబళి, నువ్వులు, నువ్వులతో చేసిన పిండివంటలు, గుమ్మడికాయ (కూష్మాండం) దానం, యథాశక్తి దానకర్మ చేయడం ముఖ్య కర్తవ్యం. ఈరోజు సూర్య మంత్రాలను జపించి ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయడం వల్ల పదివేల గోవులను దానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది. ఈ రోజే గంగాదేవి భూమిపై అవతరించిందని విశ్వాసం. గంగాస్నానం చేశాక యజ్ఞం, దానం నిర్వర్తించి విశేషంగా దానాలు చేస్తారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగ జరుపుకునే విధానాల్లో వివిధ పద్ధతులుంటాయి. ఈ\


కర్ణాటక రాష్ట్రం


కర్ణాటక ప్రజలు రంగు రంగుల నూతన వస్త్రాలు ధరించి బంధువుల ఇళ్ళకు వెళ్తారు. చెరకు, నువ్వులు, మిఠాయిలు, ఎండుకొబ్బరి, వేరుశెనగపప్పు, వేయించిన శనగలు పంచుతారు. పశువుల (ఎద్దులు, ఆవులు) కొమ్ములు కడిగి, రంగులు వేసి పూలమాలలతో అలంకరిస్తారు. రాత్రివేళ పాటలు, నృత్యాలతో కాలక్షేపం చేస్తారు. మంట పెట్టి జంతువులను దానిపై దూకిస్తారు.


కేరళ - తమిళనాడు


ఇక్కడ హార్వెస్ట్ ఫెస్టివల్ లేదా పొంగల్ అనే పేరుతో భగవంతునికి కృతజ్ఞతలు, మంచి పంటలు పండినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రార్థనలు చేస్తారు. నాలుగు రోజులు పండుగ జరుపుకుంటారు. పండుగకు ముందు పది రోజుల నుండి ఏర్పాట్లు ప్రారంభిస్తారు. రంగు రంగుల వస్తువులతో


ఇళ్ళను అలంకరించి నేలపై ముగ్గులు తీరుస్తారు. ఇక్కడ ఆబోతుల పోట్లాట జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో ఈరోజు పాలు, బియ్యం కలిపి పరమాన్నం చేస్తారు.


పంజాబ్


పంజాబ్ లో ఈ పండుగనులోహడే పేరుతో జరుపుకుంటారు. శీతాకాలం కనుక అగ్ని ప్రజ్వలింపచేసి సంగీత నృత్యాలతో కాలక్షేపం చేస్తారు. నువ్వులు, బెల్లం, వేరుశెనగపప్పు కలిపి తినడం సంప్రదాయం.


మహారాష్ట్ర


ఈరోజు మహారాష్ట్రలో పరస్పరం ఆలింగనం చేసుకుని రంగు రంగుల తియ్యని నువ్వులు పలుకులు వేయించినవి పంచుకుంటారు. 'తిల గుడ్ ఘయం, గుడ్ - గుడ్ బోలా" అని స్నేహాన్ని ప్రీ తార్థమానం చేయమని చెప్పుకుంటారు. నవదంపతులు ఈరోజు నూనె, ఉప్పు, పత్తి దానం చేస్తారు.


రాజస్థాన్


రాజస్థాన్ లోని పుష్కర్ క్షేత్రంలో ఈరోజు గొప్ప జాతర జరుగుతుంది. చుట్టుప్రక్కల గ్రామాలు, వన్యప్రాంతంలోని ఆదివాసీలు, గ్రామీణులు తమ పశుసంపదతో కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు.పశుసమ్మేళనంలో ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు మొదలైన చతుష్పాద జంతువులను అమ్మటానికి తీసుకువస్తారు. పర్యాటకులు ఈ ఉత్సమా డటానికి వస్తారు. పర్యాటకులు జంతువులపై సవారీ చేయటమే కాక అక్కడి జనుల ఆచారాలను, సంప్రదాయాలను తెలుసుకుంటారు. రాజస్థానీ మహిళల నృత్యాడు డముచ్చటగా ఉంటాయి.


ఉత్తర భారతదేశం


హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మకరసంక్రాంతినాడు స్నానం, దానం చేయడానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. వివాహిత స్త్రీలను సంక్రాంతి నాడు పుట్టింటివారు ఆహ్వానించి వారికి నువ్వులు, బెల్లంతో పాటు లడ్డు, ఖిచిడి వంటివి తయారు చేసి తినడం, పంచటం జరుగుతుంది. నువ్వులు, బెల్లం, నెయ్యి, మినుములు కలిపి కిచిడీ చేసి తినటం వల్ల శీత ప్రకోపం శాంతిస్తుంది. సూర్యుణ్ణి ప్రార్థించటం అనేక ప్రయోజనాల కోసమే అయినా ముఖ్యంగా శీత ప్రకోపాన్ని తగ్గించటానికి, తాపం పెంచమని ముఖ్యంగా ప్రార్థిస్తారు. "ఓం సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాలు జపించి ఉపాసన చేస్తారు.


గుజరాత్


ఇక్కడ మకర సంక్రాంతి నాడు కొత్త పాత్రలు కొనే ఆచారం ఉంది. ఇక్కడ గాలిపటాల కోలాహలం కూడా చాలా ఎక్కువ. అహ్మదాబాదు భారతదేశపు గాలిపటాల రాజధానిగా పేర్కొంటారు. ఇంటింటా వయో, లింగభేదం లేకుండా అందరూ గాలిపటాలు ఎగురవేస్తారు. స్త్రీలు గర్బా నృత్యం చేస్తారు. వివిధ వ్యంజనాలతో విందులు చేస్తారు. తెలుగు రాష్ట్రాలలో భోగినాడు పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. భోగిమంటలు వేసి చలి కాచుకుంటారు. సంక్రాంతినాడు కొత్త బియ్యం, కొత్తబెల్లంతో పాలుపోసి పొంగలి వండుకుని సూర్యునికి నైవేద్యం పెట్టి ఆరగిస్తారు. ఈ మూడు రోజులు ఎంతో సందడిగా ఉంటుంది.


సంక్రాంతి శోభ డాలంటే పల్లెలకు వెళ్ళాల్సిందే. గొబ్బెమ్మలు, ముగ్గులతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది. పంట ఇంటికి చేరుకునే వేళ కనుమనాడు పశువులను అలంకరించి పూజ చేస్తారు. కోడి పందాలు, గాలిపటాలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలూ, డముచ్చటగా ఉంటాయి. కొత్త దంపతులు అత్తగారింటికి రావడం ఆనవాయితీ. పితృతర్పణాలు, దానాలు సంప్రదాయం. కనుము, ముక్కనుము నాడు మినుములు తప్పక ఉపయోగిస్తారు. మినపగారెలు కనుమనాడు తప్పక వండుతారు. పండుగల్లో సంక్రాంతి పండుగ ప్రత్యేకత వేరు. - అమెరికాలో 'థాంక్స్ గివింగ్ డే' అని, 'హార్వెస్ట్ ఫెస్టివల్' అని, చైనాలో 'ఫుల్ మూన్' పేరుతో 15 రోజుల హార్వెస్ట్ ఫెస్టివల్ జరుపుతారు. జపానులో 'తోరీ నోపలచీ' అనీ కొరియాలో చూ శోక్' అనే పేరుతో పంటలకు సంబంధించిన పండుగలు జరుపుకుంటారు.