పుష్యమీ నక్షత్రంతో కూడి పున్నమి గల మాసాన్ని పుష్యమాసం అంటారు. ఈ మాసమునకే 'సహస్యం' అను నామాంతరమున్నది. పుష్యమీ నక్షత్రం శనిదేవుని నక్షత్రం. కనుక శప్రీ త్యర్థం ఈ మాసమంతా పూజలు చేయాలి. ఈ మాసం చాలా పునీతమైన మాసం. విష్ణువు, శని, సూర్యుడు, శివుడు, పితృదేవతలు ఈ మాసంలో భక్తులచేత కొలువబడుతారు. పుష్యమాసంలోనే రైతులకు పంటలు పుష్కలంగా పండి చేతికి అంది రావడం చేత పౌష్యమాసమని అంటారు. ఈ మాసం హేమంత ఋతువునందు రావడంతో చలి మిక్కుటముగా ఉంటుంది. పగటికాలం తక్కువగా ఉండి, రాత్రి కాలం అధికంగా ఉంటుంది. ఈ మాసంలో వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి మొదలైన పండుగలు వస్తాయి.- మొక్కపోయినది అని అర్థము
కుంఠం కానిది వైకుంఠము. కుంఠము అనగా మొక్కపోయినది అని అర్థము. పుష్యమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు చాతుర్మాస్య కాలంలో దక్షిణ దిక్కున తలబెట్టి నిద్రించి, పుష్య శుక్లపక్ష ఏకాదశినాడు మేల్కొని భక్తులకు ఉత్తరద్వార దర్శనాన్ని ఇస్తాడు.ఏకాదశి అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించే రోజు. వైకుంఠ ఏకాదశినాడు ఉత్తరద్వారం నుంచి స్వామివారి దర్శనం చేసుకున్నవారు అనంతమైన పుణ్యరాశిని దక్కించుకుంటారు. ధనుస్సు నెలపట్టిన తరువాత శుద్ధంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. విష్ణుభక్తులకు ఈ దినం మహా పర్వదినం.
"వికుంఠ" అనే తల్లికి కుమారునిగా అవతరించినందువల్ల స్వామి వైకుంఠుడు అని అమరకోశం వర్ణిస్తుంది. ఆ స్వామి నివాసస్థానం వైకుంఠం. మనిషికి జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలుంటాయి. "కుటతీతికోటి: కుట కౌటిల్యే". వంకరగా ఉండునది అంచు. చివరకు కోట అని పేరు. ఈ మూడు అవస్థల అంచులను తాకి, మనలను పునీతులను చేసేది ముక్కోటి ఏకాదశి.
కృతయుగంలో చంద్రావతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని "ముర" అనే రాక్షసుడు రాజ్యం చేసేవాడు. ఇతడు తాళజంఘుడు అనేవాని కుమారుడు. బ్రహ్మను గురించి ఘోరమైన తపమాచరించి మెప్పించాడు. ఆతని తపమునకు మెచ్చి బ్రహ్మ వరము కోరుకొనుము అనగా అయోనిజ అయిన స్త్రీ వల్ల తప్ప ఇంకెవరి చేతిలోనూ మరణము రాకూడదని వరము పొంది బలవంతుడయ్యాడు. వరగర్వముచే విర్రవీగి దేవతలను, ఋషులను, మానవులను పీడించసాగాడు. అతని దుశ్చేష్టలను భరించలేని దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. వారి ప్రార్థన ఆలకించిన విష్ణువు మురాసురునిపై దండెత్తి యుద్ధమాచరించాడు. యుద్ధము చాలాకాలము జరిగి విష్ణువు అలిసిపోయి సింహవతి అనే గుహలో ప్రవేశించాడు.
అతని సంకల్పంచే ఏకాదశి అనే స్త్రీమూర్తి ఉద్భవించి, ఆ రాక్షసుని సంహరించింది. అందుకు విష్ణువు సంతోషించి వరము కోరుకోమనగా "తిథులన్నింటిలో అత్యంతు తిపాత్రం కావాలని, తిథులన్నిటిలోనుశ్రీ ష్ఠత్వం ఇవ్వాలని, ఏకాదశి తిథినాడు ఉపవాసం ఉన్నవారికి మోక్షం ప్రసాదించాలని వరము కోరుకొనినది. ఆనాటి నుండి ఏకాదశి పవిత్రమైన తిథిగా ఉద్భవించినది. ప్రధానమైన తిథి అయింది. .
వైకుంఠ ఏకాదశిని "పుత్రదా ఏకాదశి" అని కూడా అంటారు. దీని విశిష్టత తెలిపే కథ ఒకటి ఉంది. పూర్వం సుకేతుడు అను మహారాజు ఎన్ని సంపదలున్నప్పటికీ, కీర్తి ప్రతిష్ఠలున్నప్పటికీ పుత్రసంతానం లేకపోవటంతో వారి జీవితంలో తీరని లోటుగా మారింది. పుత్ర సంతానం కోసం మహావిష్ణువుని స్తుతిస్తూ తపమాచరించగా అతని తపమునకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ఆ మహారాజుకు పుత్రసంతానం కలిగేటట్లు వరమిచ్చాడు. కొంతకాలంలోనే పరంధాముని వరంచే సంతానం కలిగినది. ఏకాదశి తిథినాడు పుత్రుడు కలుగుటచే ఆ తిథిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఇది పుత్రదా ఏకాదశి మాహాత్మ్యం . వైకుంఠ ఏకాదశినాడు సూర్యోదయానికి పూర్వమే లేచి, కాలకృత్యములు తీర్చుకుని, దగ్గరలో ఉన్న జలాశయానికి వెళ్ళి స్నానమాచరించాలి. నదిలో నడుములోతు వరకు వెళ్ళి స్నానము చేయాలి. స్నానానంతరం విష్ణుమూర్తిని తులసిని పూజించాలి. త్రికరణశుద్ధిగా నమస్కరిస్తూ -
అని స్తుతిస్తూ పూజించాలి. విష్ణువుకు తులసీదళాలతో మాలగ్రుచి సమర్పించి నమస్కరించాలి. పిదప విష్యాలయానికి వెళ్ళి ఉత్తరద్వారం గుండా స్వామిని దర్శించుకొని యథాశక్తి పూజించాలి. ఉత్తరద్వార దర్శనమనగా ఆకాశంలో శ్రవణా నక్షత్ర మండలంలో పాలవెల్లిలో మూడుకోట్ల నక్షత్రాలు (దేవతలు) వెంట ఉండగా విశ్వవ్యాపితమైన శ్రీ మన్నారాయణుని దర్శించడం అని అర్థం. ద్వారకా తిరుమల క్షేత్రంలో వేంకటేశ్వరుడు దక్షిణాభిముఖుడై వెలశాడు. ఉత్తర ద్వార దర్శనం, సద్యోముక్తి దాయకం. తిరుమలలో కూడా వైకుంఠ ద్వాదశినాడు అరుణోదయ వేళలో ముక్కోటి తీర్థాలు శ్రీ స్వామిపుష్కరిణిలో మునకలిడుతాయి. శుభప్రదమైన ఆ వేళలో స్నానం చేసే మహాభాగ్యం అందరికీ కలుగనే కలుగదు. ఎవరైతే వేల జన్మల్లో పుణ్యాన్ని ఆర్జించుకొని ఉంటారో, వారికి మాత్రమే కోనేటిలో స్నానం చేసే భాగ్యం కలుగుతుంది. అలాంటివారికి సద్యోముక్తి కలుగుతుంది. అంటే వారు శరీరంతో ఉన్నా జీవన్ముక్తిని పొందుతారని అర్థము.
ఇందులో ఎలాంటి సందేహం లేదు. స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం, ఆ పరంధాముని దర్శనభాగ్యం కలగడం కొందరికే కలుగుతుంది. అది సిద్ధించిన భక్తుని అదృష్టం వర్ణనాతీతం. ఇరువది నాలుగు ఏకాదశులలో పూజిస్తే ఎంత ఫలితం కలుగుతుందో, ముక్కోటి ఏకాదశినాడు స్వామిని దర్శించి పూజించినా అంతే పుణ్యఫలం లభిస్తుంది. ఉపవాసం, స్వామిని దర్శించుకోవడం సర్వపాపహరం. భక్తిముక్తి దాయకం. అనంతుడు, అచ్యుతుడు, అప్రమేయుడు, జ్యేష్ఠుడు, సనాతనుడు, ఆశ్రిత భక్తజన వత్సలుడు, స్థితికారకుడు అయిన శ్రీ మహావిష్ణువు భక్తుల కష్టాలను గట్టెక్కించి వారి కోరికలు తీర్చే ఆ దేవదేవుని వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారము గుండా దర్శించుకొని జీవన్ముక్తులమవుదాము.
"నారాయణ - నారాయణ జయ గోవింద హరే నారాయణ - నారాయణ జయ గోపాల హరే కరుణా పారావార వరుణాలయ గంభీర నారాయణ ఘన నీరద సంకాశ కృత కలి కల్మష నారాయణ" శ్రీ దశ్శీన శ్మీనివాసశ్రీ నిధిశ్శీ విభావనః శ్రీ ధర శ్శకర శ్శేయశ్రీ మాన్ లోకత్రయాశ్రయః" సర్వేజనాః సుఖినోభవంతు