భగవంతుని కోరికను తీర్చిన భక్తుడు


 ఈ ప్రపంచంలో భగవంతునిపై అనన్య భక్తిని, అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం గొప్ప విషయం సాధారణంగా భక్తుడు భక్తితో భగవంతుని ప్రార్థించటం, తనకు కావలసినవి ఆ భగవంతుని వరప్రసాదముగా పొందటం జరుగుతుంటుంది. కాని ఎల్లలు లేని భక్తి - భగవంతుని పట్ల అవధులు లేని అనురక్తి, అపారమైన మ కలిగి ఉన్న భక్తుడు తన గురించి ఏమీ ఆయనను కోరుకోడు. అందుకు మారుగా ఆయన కోరికనే తను తీర్చాలనుకుంటాడు. భగవంతుడికి కోరిక ఏమిటి? దానిని భక్తుడు నెరవేర్చడమేమిటి? విడ్డూరమనుకోరాదు. ఆధ్యాత్మిక విషయాల్ని ఆధ్యాత్మిక దృష్టితోచూ డాలి తప్ప - సాధారణ, లౌకిక దృష్టితమే డరాదు. మయూరశర్మ గొప్ప కృష్ణభక్తుడు. ఎంతటి భక్తుడంటే ఆయన తలచుకుంటే చాలు కృష్ణపరమాత్మ దర్శనమిస్తాడు. అంతేకాదు ఒక్కోసారి మయూరశర్మ తలచుకోకపోయినా శ్రీ కృష్ణుడే కోరి అతని దగ్గరికొస్తుంటాడు. భక్తుడు భగవంతుణ్ణి ఎంతగా కోరుకుంటాడో - మిస్తాడో - భగవంతుడు కూడా భక్తుడు అంతగా కోరుకుంటాడనటానికి ఇదో ఉదాహరణ. ఒకసారిశ్రీ కృష్ణుడికి తన ప్రియ భక్తుశ్లోకసాచూ సి రావాలనిపించి తక్షణం అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. మయూరశర్మ తనపై భగవంతునికి గల అపార కరుణకు ఎంతో ఆనందపడిపోయాడు. భక్తి ప్రపత్తులతో సేవించుకున్నాడు శ్రీ కృష్ణుడు సప్రీ తుడై 'మయూరా, నేను నిన్నొకటి కోరాలనుకుంటున్నాను. ఇవ్వగలవా? అన్నాడు. ఏ భక్తుడైనా భగవంతుడొచ్చి ఇలా అడిగితే కాదనగలడా? అందునా మయూరశర్మ స్వామివారికి ప్రియభక్తుడు. వెంటనే క్షణం ఆలోచించకుండా చెప్పు స్వామీ! నువ్వేది అడిగినా సమర్పించుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. అన్నాడు మయూరశర్మ ఆనందంగా. 'నీ కొడుకు నాకు కావాలి. ఇస్తావా' అన్నాడు పరమాత్మ. మయూరశర్మకు లేక లేక పరమాత్మ ప్రసాదంగా కలిగిన పుత్రుడు. 5 సంవత్సరాల పసివాడు. తల్లితండ్రులు ప్రాణాలు పెట్టి పెంచుకుంటున్నవాడు. అయినా మయూరశర్మ ఏమీ జంకలేదు. 'వాడు నా కొడుకే. అయితే నీవాడే. నాదంటూ ఏముంది స్వామీ? అంతా నీ ప్రసాదమే కదా. నీది నీకు ఇవ్వటానికి ఆలోచనెందుకు?' అనుకుని 'సరే స్వామీ! తీసుకోండి' అన్నాడు. 'అయితే నీ కుమారుడి మొత్తం శరీరం నాకు అవసరం లేదు. శరీరంలోని కుడి వైపు భాగమిస్తే చాలు అన్నాడుశ్రీ కృష్ణుడు. సరేనన్నాడు భక్తుడు. 'బాలుణ్ణి నిలబెట్టి శరీరాన్ని నిలువునా రెండు భాగాలు చేసి కుడివైపు భాగం నాకివ్వు' అన్నాడు. .


కొడుకుని రెండు భాగాలుగా నిట్టనిలువుగా కొయ్యటానికి మయూరశర్మ ఒప్పుకున్నాడు. 'మరి అలా చేస్తున్నప్పుడు నువ్వు కాని, నీ భార్య కాని ఏడవకూడదు. బాధపడకూడదు. ఈ షరతులన్నింటికి ఒప్పుకుంటేనే నీ కొడుకుని నేను స్వీకరిస్తాను' అన్నాడు కృష్ణుడు. అన్నింటికీ అంగీకరించాడు మయూరశర్మ. కొడుకుకి స్నానం చేయించి నూతన వస్త్రాలు కట్టాడు. రంపాన్ని ఒకవైపు తను, రెండవవైపు భార్య పట్టుకుని కొడుకుని రెండు భాగాలుగా చీల్చటం ప్రారంభించారు. వారి కంటినుండి ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలలేదు. ముఖాలలో దుఃఖం కనబడలేదు. పరమాత్మని స్మరిస్తూ నిర్లిప్తంగా కొయ్యసాగారు. అయితే ఆ పిల్లవాడి ఎడమ కంటినుంచి నీరు కారింది. వెంటనే కృష్ణుడు 'నేను విధించిన నిబంధనలను మీరు పాటించటం లేదు కనుక మీ కుమారుడి శరీర కుడిభాగం నాకవసరం లేదు' అన్నాడు. దానికి మయూరశర్మ 'స్వామీ! మీరు మేము దుఃఖించరాదని షరతు విధించారు. నేను, నా భార్య దుఃఖించకుండా సర్వాత్మనా మీకు మా కుమారుడి కుడి భాగాన్ని సమర్పించుకుంటున్నాం కదా' అన్నాడు. దానికి కృష్ణుడు 'మీ భార్యాభర్తలు రోదించటంలేదు. కానీ నీ పుత్రుడి ఎడమ కంటినుంచి నీరు కారుతోంది. ఎవరు బాధపడినా మీరు చేసే దానం సంపూర్ణం కాదు' అన్నాడు. ఇది విని బాలుడు 'స్వామీ! నా శరీరంలోని కుడిభాగాన్ని మాత్రమే మీరు కోరుకున్నారు. కుడివైపు భాగం చేసుకున్న పుణ్యం - నేను చేసుకోలేకపోయానే... అందుకేగా స్వామి నన్ను స్వీకరించటం లేదని బాధతో నా ఎడమవైపు కన్ను రోదిస్తోంది' అన్నాడు. 


ఆ మాటలు వినగానే కృష్ణ పరమాత్మ చలించిపోయాడు. ఆయన కళ్ళనుండి అశ్రువులు ప్రవహించాయి. వెంటనే ఆ బాలుణ్ణి దగ్గరకు తీసుకుని మతో ఆలింగనం చేసుకున్నాడు. మయూరశర్మ అతని భార్య, అతని కొడుకు తనపై పెంచుకున్న అపారమైన భక్తి, మలకు ఆయన ప్రసన్నుడయ్యాడు. 'మయూరా! నీ నిర్మల భక్తి నన్నెంతో ఆనందపరచింది. ఏదైనా వరం కోరుకో. నువ్వేం కోరుకున్నా ఇస్తాను' అన్నాడు కృష్ణభగవానుడు.


మయూరశర్మ కొడుకుని బ్రతికించమని కోరలేదు. తనకు సంపదనిమ్మని కోరలేదు. 'స్వామీ! జన్మ జన్మలకు నీ పాదాల చెంత భక్తుడినై ఉండి నిన్ను సేవించుకునే వరాన్నివ్వు' అని ప్రార్థించాడు. భగవంతుణ్ణి ఏదో కావాలని కోరుకుంటే కోరుకున్నది మాత్రమే ఇస్తాడని, నిష్కామంగా సేవిస్తే కావలసినవన్నీ ఆయనే అడగకుండా ఇస్తాడని భక్తుడు తెలుసుకోవలసిన రహస్యం. మయూరశర్మకు కావలసినవన్నీ కొడుకుతో సహితంగా అనుగ్రహింపబడ్డాయని వేరుగా చెప్పనవసరం లేదు.