భగవద్గీతను ఎందుకు చదవాలి?


"కరార విందేన పదారవిందం ముఖారవిందే వినివేశ యంతం వటస్య పత్రస్య పుటేశ యానం బాలం ముకుందం మనసా స్మరామి"


శ్రీ కృష్ణ కర్ణామృతం తామరపువ్వులాంటి చేతితో, తామరపువ్వు లాంటి పాదాన్ని పట్టుకొని తామరపువ్వులాంటి నోట్లో ఉంచుకొని, మట్టి ఆకు మీద శయనించి ఉన్న బాలకృష్ణుని స్మరిస్తున్నానని భావం.


దుష్టశిక్షణ - శిష్టరక్షణలకు కృష్ణావతారం ప్రధానమయింది. అంతేకాక శృంగార, వైరాగ్య, భక్తి, స్నేహ, రౌద్ర, అద్భుతాది అనేక రసాల సమన్వయమే భగవాశ్రీ కృష్ణుడు. శ్రీ మన్నారాయణుని పరిపూర్ణ అవతారం శ్రీ కృష్ణావతారం. అది కానప్పుడు మహాభారతంలో శ్రీ కృష్ణుడు అర్జునునకుపదేశించిన గీత కృష్ణగీత కావాలి. కానీ అది "భగవద్గీత"గా పేర్కొనబడింది శ్రీ కృష్ణుడు చెప్పే గ్రంథాన్ని భాగవతమనీ, కృష్ణుడు చెప్పిన గీతను భగవద్గీత అనీ అంటున్నాం. దీనిని బట్టూ స్త్రీశ్రీ కృష్ణుడు స్వయంగా భగవంతుడన్నమాట. ఇంత విశిష్టమైన, పరిపూర్ణమైన భగవదవతారాన్ని దశావతారాలలో పేర్కొనబడలేదు.


మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ బుద్ధ కల్కి అవతారాలే చెప్పబడ్డాయి. వీటిలో శ్రీ కృష్ణావతారం లేదు. పై అవతారాలన్నీ ఆయా అవతారాల ప్రయోజనం చేకూరిన తర్వాత ఉపసంహరింపబడ్డాయి. కానీ కృష్ణావతారం విలక్షణమైంది. ఈ స్వామి అడుగడుగునా తన పరమేశ్వరత్వాన్ని, సర్వసాక్షిత్వాన్ని, సర్వజ్ఞతను, సర్వకారణత్వాన్ని వెల్లడించాడు.


భగవంతుడు అని చెప్పేందుకు ఆరు లక్షణాలు కావాలి. అవి ఏమిటంటే : ఐశ్వర్యస్య | సమగ్రస్య | ధర్మస్య | యశసశ్శియః | జ్ఞాన | వైరాగ్య /యోశైవ షణాం భగవతారికా || భగవంతుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు. అవి 1. సమగ్రమైన ఐశ్వర్యం. 2. సంపూర్ణమైన ధర్మం. 3. స్వచ్ఛమైన యశస్సు. 4. పరిపుష్టమైన భాగ్యం. 5. పరిపూర్ణమైన జ్ఞానం. 6. నిశ్చలమైన వైరాగ్యం. ఈ ఆరింటిని కలిసి ఉన్నవారిని భగవంతుడు అంటారు. దశావతారాల్లో ప్రతి అవతారానికి ఒకటో రెండో లేక మూడు లక్షణాలున్నట్లు మాత్రమే కన్పిస్తుంది. అందుకని అవి పరిపూర్ణ అవతారాలు కావు. కానీశ్రీ కృష్ణుడు ఈ ఆరు లక్షణాలున్న సద్గుణ సంపన్నుడు. అందువలననే "కృష్ణస్య భగవాన్ స్వయం" అన్నారు. ఆ 1. సమగ్ర ఐశ్వర్యం - ఐశ్వర్యం అంటే భోగభాగ్యాలు, సిరిసంపదలు కావు. ఈశ్వర భావమే ఐశ్వర్యం. ఒక వ్యక్తికి శాసించే అధికారముంటే దాన్ని ఐశ్వర్యం అంటారు. ఈ చరాచర సృష్టియే భగవంతుని శరీరం. దాన్ని శాసించే శక్తి ఆయనకుంది. ఈ శక్తి అనంతమైంది. అంచనాలకందనిది. అర్జునుడు మీయొక్క జ్ఞాన, ఐశ్వర్య శక్తి బల వీర తేజో యుక్తమైన ఐశ్వర్య రూపాన్ని ప్రత్యక్షంగా దర్శింపగోరుతున్నానని అడగ్గా శ్రీ కృష్ణ భగవానుడు -


నీకు (అర్జునునకు) దివ్య దృష్టి అలౌకిక చక్షువులను ఇస్తున్నాను. ఆ యోగ దృష్టితో ఈశ్వరీయమగు నా యోగశక్తిని దర్శింపమని చెప్పాడు. భగవంతుని సమగ్రమైన ఐశ్వర్యం ఈ విధంగా ప్రదర్శింపబడింది. 2. సంపూర్ణ ధర్మము - లోకంలో ధర్మాన్ని స్థాపించటానికి యుగము యుగమునందు అవతరించెదనని వివరించాడు శ్రీ కృష్ణుడు.


పురాణాలు ధర్మాన్ని వృషభంతో పోల్చినాయి. పరీక్షిన్మహారాజు ధర్మమనే వృషభాన్ని నాలుగు పాదాల నడిపించాడు. జ్ఞానమూర్తి అయిన పరమేశ్వరునకు ధర్మమనే వృషభం వాహనమయింది. ఎన్నో భోగభాగ్యాలను, సుఖ దుఃఖాలను, రాగద్వేషాలను, శీతోష్ణములను సమభావంతో స్వీకరించిన రాగద్వేష రహితుడు, సమగ్ర ధర్మస్వరూపుడు అయినందునే భాగవతం "కృష్ణస్య భగవాన్ స్వయం" అని స్పష్టీకరించింది. 


3. స్వచ్ఛమైన యశస్సు - యశస్సు అంటే కీర్తిశ్రీ కృష్ణుడు అనే పేరుకు, ఆయన ఆకృతికి స్వచ్ఛమైన, అసాధారణమైన కీర్తి ఉంది. ఈయన జన్మించటానికి ముందూ, జన్మించిన తరువాత, ఈ అవతారములోని ప్రతిఘట్టము మహిమాన్వితము. జననమప్పుడు పరబ్రహ్మ స్వరూపుడుగా తల్లితండ్రులకు దర్శనమిచ్చి కర్తవ్యం నిర్దేశించాడు. పసిపాపడుగా పూతన సంహారం, యశోదమ్మకు నోటిలో అండపిండ బ్రహ్మాండమును దర్శింప చేయడం, శకటాసుర వధ, తృణావర్త, ధేనుకాసుర భండనము, గోవర్ధనోద్ధరణము, గోపికా మనోహరణం, కాళియమర్దనం, కంస సంహారము ఇత్యాదులన్నీ శ్రీ కృష్ణుని మహోన్నత కీర్తికి మకుటాయ మానములైన నిదర్శనములు. యథారమైన, స్వచ్ఛమైన, స్వాభావికమైన, నిరుపానమైన శ్రీ కృష్ణుని కీర్తి వేనోళ్ళ కొనియాడదగినది. కాబట్టి "కృష్ణస్తు భగవాన్ స్వయం" అని భాగవతం ప్రస్తుతించింది. ఆ 4. పరిపుష్టమైన భాగ్యం - అర్జునుడు రథి, కృష్ణుడు సారథి. రథి సారథికి శిష్యుడు. అర్జునుడు విజయ పరంపరలను పొందాడు కానీ విజయ గర్వితుడు కాలేదు. అందువల్లనే అతడు శ్రీ కృష్ణునకు ఆప్తుడు, శిష్యుడు, అత్యంత ప్రియుడు కాగలిగాడు. ఆధ్యాత్మికుల మనస్సు నిరంతరం భగవ ధ్యానంలో ఉంటుంది. కాబట్టి వారికి దారిద్యం లేదు. ధనదాహానికి తావులేదు. పరాక్రముడైన రాజు పాలించే దేశంలో బీదప్రజలుండవచ్చు గానీ పరమాత్మ ఉండే చోట దరిద్రానికి నిలువ నీడ లేదు.


యోగీశ్వరుడైన శ్రీ కృష్ణుడు, గాండీవధారియైన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్క శ్రీ (సంపద – మహాలక్ష్మి ) విజయం , ఐశ్వర్యం, దృఢమైన నీతి ఉంటుంది. అందువల్లనే 'కృష్ణస్య భగవాన్ స్వయం' అని భాగవతం నిర్ద్వందంగా ప్రకటించింది. 5. పరిపూర్ణమైన జ్ఞానం - అభేద దర్శనమే జ్ఞానం. అందరిలోను భగవంతుడు ఏకాత్మగా వ్యాపించి ఉన్నాడని తెలిసికొనుటయే జ్ఞానమని ఉపనిషత్తులు తెలిపాయి.


ఈ భక్తులందరూ ఉదారులే. వీరిలోని జ్ఞానియగువాడు మాత్రం సాక్షాత్తు నా స్వరూపమే. ఇది నా మతం. ఎందుకనగా నాయందే బుద్ధి, మనస్సు మొదలగు వానిని నిల్పి యుండు జ్ఞాని అయిన భక్తుడు అత్యుత్తమ స్వరూపుడు. భగవద్గీత అంటే జ్ఞాన శాస్త్రమే. దానిని బోధించినది పరిపూర్ణ జ్ఞానదేవుడు శ్రీ కృష్ణ భగవానుడు. ఆకాశమును సూర్యుని ఏవిధముగా విభజింప వీలులేదో, జ్ఞానసూర్యుడైన భగవంతుని జ్ఞానమూ విభజన, మార్పు లేనిది. జ్ఞాని ఎవడైనా భగవత్స్వరూపుడే. భగవత్స్వరూపమే జ్ఞానం. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మం. జ్ఞానం కంటే పవిత్రమైనది లేదు. అందువల్లనే జ్ఞానరత్నమైన శ్రీ కృష్ణ భగవానుని భాగవతము "కృష్ణస్తు భగవాన్ స్వయం" అని నొక్కి వక్కాణించింది.


6. నిశ్చలమైన వైరాగ్యం - భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను కలిగించాలి. లేకుంటే అది భక్తి కాదు. జ్ఞానానికి మించిన సుఖం, వైరాగ్యానికి మించిన భాగ్యం లేదు అని ఉపనిషత్తు స్పష్టంగా చెప్పింది. భగవంతుని వైరాగ్యం నిశ్చలమైంది. ఎలాగంటే సృష్టి భగవంతునిదే. దానిపై ఆయనకు వ్యామోహం లేదు. ప్రళయం ఆయన ద్వారానే జరుగుతుంది. అందుకు ఆయనకు శోకం లేదు. రాగం లేని మ, ద్వేషం లేని త్యాగం భగవంతుని లక్షణాలు. ఇవే జ్ఞాన వైరాగ్యాలు. కుచేలుడు దుర్భర దారిద్యాన్ని అనుభవిస్తూ చిన్ననాటి చెలికాడైశ్రీ కృష్ణుని సహాయం కోరవచ్చి ఆ పరాత్పరుని దర్శించగానే అతని కోర్కెలు మటుమాయమయ్యాయి. అతడుశ్రీ కృష్ణుని పరమభక్తుడు. ఆ మహాత్ముడు కుచేలుడి కాళ్ళు కడిగి ఆ నీటిని శిరస్సుపై చల్లుకొని, ఆయనకు అసాధారణ సంపదలు అజ్ఞాతంగా ఇచ్చి సాగనంపాడు. అందువలననే భాగవతము "కృష్ణస్తు భగవాన్ స్వయం" అని నిర్ధారించి చెప్పింది. . ఇటువంటి సలక్షణ షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీ కృష్ణ పరమాత్మ మాహాత్మ్యం శుభ, శాంతి, ఇహ, పర, సుఖదాయకం. కాబట్టి ఆయనను భజించి, సేవించి, పూజించి, స్మరిస్తూ పునీతులమగుటకు మనవంతు కృషి ఆచరణ మనం చేయాలి.


భగవద్గీతను ఎందుకు చదవాలి?


భగవత్ససాదమైన మానవజన్మను సార్థకత చేసుకొనేందుకు ప్రతి ఒక్కరు భగవద్గీతను చదవాలి. చదవలేనివారు వినాలి. అదీ కుదరని వారు ఆ పవిత్ర గ్రంథాన్ని పూజగదిలో ఉంచి పూజించాలి. భగవద్గీత స్వయంగా భగవంతునిచే గానం చేయబడిన భగవానుని దివ్యవాణి. గీత మాహాత్మ్యాన్ని శివుడు పార్వతీదేవికి, విష్ణువు లక్ష్మీదేవికి చెప్పారు. మరి మానవ మాత్రులమైన మనమెంత? గీత చెప్పినవాడు అవతార పురుషుడై శ్రీ కృష్ణ పరమాత్మ. వినినవాడు భక్తుడైన అర్జునుడు. శ్రీ కృష్ణ స్వరూపం గీతను రాసినవాడు వేదవ్యాసుడుశ్రీ కృష్ణ స్వరూపము (మునీ నామవ్యహం వాసః) ఇలా గీతను చెప్పినవాడు, వినినవాడు, రాసినవాడు సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాతశ్రీ వ్యాసమునీంద్రుని అనుగ్రహం వల్ల గీతా బోధనను ప్రత్యక్షంగా విన్నవాడు సంజయుడు. వీరితో పాటు అర్జునుని రథంపైనున్న ఆంజనేయుడు.


గీత అనే పదంలో గీ అంటే త్యాగం, త అంటే తత్త్వజ్ఞానం. త్యాగాన్ని, తత్త్వజ్ఞానాన్ని బోధించేది గీత. సమస్త వేదాల సారాన్ని శ్రీ వేదవ్యాసులవారు మహాభారతంలో ఇమిడ్చారు. ఉపనిషత్తుల సారాన్నంతటినీ తీసి భగవద్గీతగా రూపొందించారు. భగవద్గీతలో ప్రతి అధ్యాయం చివర శ్రీ మద్భాగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయా యోగశాస్త్రి శ్రీ కృష్ణార్జున సంవాదే" అన్న పంక్తులుంటాయి. ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రాల సమిష్టి రూపమే గీత. శ్రీ కృష్ణావతారంలో భగవంతుడు మురళీగానం, గీతాగానం అనే రెండు గానాలు చేశాడుశ్రీ కృష్ణ పరమాత్మ గీతను మార్గశిర శుద్ధ ఏకాదశినాడు అర్జునునికి బోధించాడు. అందువల్లనే ఆ రోజును మనం గీతాజయంతి గా జరుపుకుంటున్నాం. ఇలా ఒక గ్రంథానికి జయంతిని జరుపుకోవడం ప్రపంచంలో వేరెక్కడా లేదని చెప్పాలి. ..


మ - అన్యాయాలకు, మంచి - చెడులకు, సత్య - అసత్యాలకు పోరు జరుగుతున్న సమయంలో ధర్మమార్గాన్ని బోధించింది భగవద్గీత. 'గ' కారంతో మొదలయ్యే నాలుగింటిని, ఏ మానవుడు కలిగి ఉంటాడో వారికి పునర్జన్మ లేదని, మోక్షం తథ్యమనీ మహాభారతం చెబుతోంది. ఆ నాలుగు 1. గీతాధ్యయనం 2. గంగా స్నానం 3. గాంత్రీ మంత్ర జపం 4. గోవిందుని ధ్యానం. భగవద్గీత గంగ కంటే ఉత్తమమైంది. గంగలో స్నానం చేసిన వారికి మాత్రమే ముక్తి లభిస్తుంది. కాని 'గీత' అనెడి గంగలో మునిగినవాడు తను ముక్తుడగుటయే కాక ఇతరులను కూడా తరింపచేస్తాడు. భగవద్గీత గాంబ్రీ మంత్రం కంటె గొప్పది. జ్ఞాన, భక్తి, నిష్కామ, కర్మ, తత్వ రహస్యాలను గీతలో చెప్పినట్లు మరే గ్రంథంలోనూ చెప్పబడలేదు. సర్వ కర్మ ధర్మ మర్మముల సారం భగవద్గీత.