శ్రీ నివాసునకు బ్రహ్మ చేసిన మహోత్సవం


బ్రహ్మదేవునిచే జరుపబడిన ఉత్సవము గల వేంకటేశునకు నమస్కారము. శ్రీ నివాసునకు బ్రహ్మ చేసిన మహోత్సవం వరాహ (అధ్యా. 50, 51) భవిష్యోత్తర పురాణములలో (అధ్యా. 14) వివరముగా వర్ణించబడింది.


శ్లో || మాయావీ పరమానందః త్యక్త్వా వైకుంఠ ముత్తమమ్ | స్వామిపుష్కరిణీ తీరే రమయాసహమోదతే ||


మాయావి, పరమానంద స్వరూపుడు అగు శ్రీ మన్నారాయణుడు వైకుంఠమును వీడి, లక్ష్మీదేవితో స్వామిపుష్కరిణీ తీరమున విహరించుచున్నాడు. వైకుంఠమును విడిచిపెట్టి లోకహితము కోరి వేంకటాద్రిపై వెలసిన విష్ణుదేవుని వెదకుచు బ్రహ్మాది దేవతలు అక్కడికి చేరినారు. భగవంతుని దర్శించి ఆనందించినారు.


లోక కళ్యాణార్థం కలియుగమందలి మానవ భక్తులను తరింపచేయడానికి శ్రీ మన్నారాయణుడు నారాయణగిరిపై వెలసిన శుభ సంఘటనను పురస్కరించుకొని బ్రహ్మదేవుడు విష్ణుభగవానునికి నమస్కరించి -


ధ్వజ సమారోహణము దొలదగు మహోత్స వంబు సేయంగ నభిలాష వరలె నాకు నేత దుత్సవమునకు నీ వియ్య కొనుము కమల వాసినితో గూడి కమలనాభ!


ఓ శ్రియఃపతీ! ధ్వజారోహణ పూర్వకముగా నీకు మహోత్సవము చేయవలెనని అభిలషించుచున్నాను. ఆ యుత్సవమును లక్ష్మీదేవితో కూడ అంగీకరించ ప్రార్థించుచున్నాను అని విన్నపం చేశాడు. అందుకు లక్ష్మీనారాయణుడు అంగీకరించినాడు. ఇట్లు శ్రీ నివాస భగవానుని అనుమతితో తిరుమలలో బ్రహ్మూత్సవాలు ప్రారంభమైనాయి. అంత సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సౌరమానరీత్యా సూర్యుడు కన్యారాశిలో సంచరించునపుడు (చాంద్రమాన రీత్యా ఆశ్వయుజ మాసమున) విష్ణుదేవుని అవతార నక్షత్రమగు శ్రవణం నాడు అవభృథమును నిర్ణయించి శుక్లపక్ష విదియ నాడు హస్తా నక్షత్రమున దేవఋషులైన విఖనస, భృగు, మరీచ్యాది మహరులను ఋత్విక్కులుగా ఆమంత్రణము చేసి, వారి సహాయముతో ధ్వజారోహణ పూర్వకముగ నవాహ్నికముగ (తొమ్మిది రోజులు) మహోత్సవమును చేసినాడు. ఇదియే వేంకటేశునకు జరిగిన మొదటి బ్రహ్మూత్సవము. ఈ సంఘటన యథార్థమని తెలుపుతూ, నేటికీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి కన్యామాసములో శ్రవణం నక్షత్రం నాడు అవభృథము (చక్రస్నానం) నిర్ణయించి బ్రహ్మూత్సవము - బ్రహ్మ ప్రారంభించిన మహోత్సవం - పేరుతో వేంకటేశ్వరస్వామి అవతార పర్వదినమును, అవతార నక్షత్రమును గుర్తు చేస్తూ నిర్వహింపబడుచున్నది. తరిగొండ వెంగమాంబ వేంకటాచల మాహాత్మ్యమును పద్యకావ్యంలో బ్రహ్మూత్సవ క్రమమును ఇట్లు వర్ణించింది


".............కన్యారాశియందు సూర్యు డమర ప్రవేశించి నట్టి మాసమున జి. త్రాఖ్య నక్షత్రంబునందు శాస్త్ర మభిమతంబుగ సద్వజారోహణము చేసి యుత్తరాషాఢ రథోత్సవంబు గావించి శ్రవణ నక్షత్ర మందే తీర్థ వారి జేయింపుగా వలయు" -2-120


సూర్యుడు కన్యారాశిలో సంచరించుచున్నప్పుడు చిత్తా నక్షత్రం నాడు ధ్వజారోహణము, ఉత్తరాషాఢ నక్షత్రమున రథోత్సవము, శ్రవణం నక్షత్రం నాడు తీర్థవారి (చక్రస్నానం) చేయవలయును.


"ఋతగ్ం సత్యం పరంబ్రహ్మ, ఏకమేవాః ద్వితీయం బ్రహ్మ, నారాయణం పరబ్రహ్మ" అను వేదవాక్యముల చేత నారాయణ శబ్ద వాచ్యుడే పరబ్రహ్మ. ఆ బ్రహ్మకు జరుగుచున్న మహోత్సవం బ్రహ్మోత్సవం అని పిలువబడినది. ఈ మహోత్సవం బ్రహ్మదేవునిచే ప్రారంభింపబడి తొమ్మిది రోజులు జరుపబడునది గనుక బ్రహ్మోత్సవం అని పిలువబడింది. నేటికీ తిరుమలశ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు బ్రహ్మ మార్గదర్శకత్వంలోనే జరుగుచున్నవని తెలియజేయుచు శ్రీ వారి బ్రహ్మూత్సవాలలో పగలు, రాత్రి జరిగే వాహనముల ఊరేగింపులకు ముందు శోభాయమానముగా అలంకరింపబడిన ఒక చిన్న రథం - బ్రహ్మరథం - ముందుగా సాగుతుంటుంది. ఈ రథంలో నిరాకార, నిర్గుణ స్వరూపంలో బ్రహ్మదేవుడు అధివసించి, ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాడు. అయితే ఒక్క రథోత్సవం నాడు మాత్రం వాహన ఊరేగింపు ముందు బ్రహ్మరథం ఉండదు. ఎందుకనగా వేంకటేశ్వరస్వామి పరబ్రహ్మ యొక్క అర్చామూర్తి కనుక వారి రథోత్సవం నాడు బ్రహ్మదేవుడే రథసారథియైతేరు యొక్క పగ్గాలను బట్టుకొని రథం నడుపుతుంటాడు. రథోత్సవంలో అదృశ్యంగా పాల్గొంటాడు.ఉత్సవే దర్శనం పుణ్యశ్రీ నివాసస్య శాఱిణః ||


నవమం, నవ, రత్నం, బ్రహ్మ, కమలాసనః, నిధిః, గ్రహాః, ఖండః, రంధ్రః, భావః, లబకుడు ఈ పది పేర్లు తొమ్మిది సంఖ్యను తెలియజేస్తాయి. సంజ్ఞా నిఘంటువు (సంస్కృతం) ప్రకారం 'బ్రహ్మ' అనే పదం నవ బ్రహ్మలను బట్టి తొమ్మిది సంఖ్యను తెలియజేస్తుంది. వేంకటేశ్వరునికి బ్రహ్మ జరిపిన మహోత్సవము ధ్వజారోహణము నుండి ధ్వజావరోహణము వరకు తొమ్మిది రోజులు జరుగుతుంది. కనుక తొమ్మిది రోజుల పాటు జరిగే మహోత్సవం బ్రహ్మూత్సవం అని సార్థక నామధేయంతో పిలువబడింది.


తిరుమలలో ఈ వార్షిక బ్రహ్మూత్సవం గాక ఒక్కరోజు జరిగే బ్రహ్మూత్సవాలు మూడు ఉన్నాయి. రథసప్తమి నాడు ఆర్షము, కైశికి ద్వాదశినాడు రాక్షసం, ముక్కోటి ఏకాదశి నాడు దైవికం అనే బ్రహ్మూత్సవాలు తిరుమలలో జరుగుచున్నాయి. బ్రహ్మ జరుపుచున్న వేంకటేశ్వరుని మహోత్సవమునకు దేవతలందరు ఆహ్వానింపబడినారు. ఇంద్రాది దిక్పాలకులు తమ తమ వాహనముల నధిరోహించి, వేంకటాద్రికి చేరినారు. పుణ్య నిరతులగు భారతదేశమందలి రాజులందరు వచ్చారు. దేశములోని అన్ని ప్రాంతముల నుండి భక్తులు వరుస జనము గోవిందా! గోవిందా! అని దైవ నామస్మరణము చేయుచు వేంకటాద్రికి వచ్చారు. యోగివరులకైనా కనులకు కనిపించని పరబ్రహ్మ యగుశ్రీ నివాసుడు సర్వ ప్రాణులయందు దయ గలిగి ప్రత్యక్షముగా అందరికి కనిపించినాడు. బ్రహ్మ శిల్పులలో శ్రేష్ఠుడగు విశ్వకర్మను పిలిపించి, అతనిచే మహోత్సవమునకు వేంకటాద్రి వచ్చు వారందరి కొరకు కొండపై వసతి గృహములు, చలివేంద్రాలు ఏర్పాటు చేయించినాడు. బ్రహ్మ ఆహ్వానితులకు, అతిథులకు, భక్తులకు, యాత్రికులకు సకల సౌకర్యములు కలుగజేసినాడు. మహోత్సవ దర్శనమునకు వచ్చిన వారందరు శ్లో || అంగీచకార విధినా నిర్మితం చమహోత్సవమ్ |ఉత్సవే దర్శనం పుణ్యశ్రీ నివాసస్య శాఱిణః ||


శ్రీ నివాసుడు మహోత్సవమునకు అంగీకరించినాడు. బ్రహ్మ మహోత్సవమును చక్కగా నిర్వహించినాడు. ఉత్సవ దినములలో ధనురారి యగు శ్రీ నివాసుని దర్శనము పుణ్యప్రదమని కీర్తించారు. మహోత్సవము కొరకు తిరుమలమాడవీధులన్నియు జెండాలతో, రత్నతోరణములతో, పూలమాలలతో, అరటిచెట్లతో సుందరముగ కనుల పండువగ అలంకరింపబడినాయి. మహరులు యాగశాలలో వేదమంత్రములతో హోమాదులు చేయుచున్నారు శ్రీ నివాసుని బ్రహ్మ కుబేరుడు సమర్పించిన దివ్యాభరణములతో అలంకరించినారు. మహోత్సవ దినములలో బ్రహ్మ విశేషమైన అర్చనలు చేయించాడు. ఘృత, సూపములతో సంస్కరించిన గుడాన్నము, ముద్దాన్నము, మధురాన్నము, తిలాన్నము, మాషాన్నము, దధ్యన్నములను, రుచికరములైన ఆరు అన్నప్రసాదములను, తిలాపూప,మాషాపూప, మనోహర,మోదకాది భక్ష్యాలతో, నానా రకములైన ఫలములను, స్వాదువులు, అమృత కల్పములగు వ్యంజనములతో కూడిన నానావిధములగు నైవేద్యములను శ్రీ నివాసునికి విశేషముగా, ఘనంగా సమర్పించినాడు.


ఒక దినమున ఉచ్చెశ్రవసమమగు అశ్వముపై, ఒక దినమున ఐరావతము వంటి ఏనుగుపై, ఒక దినమున ఆదిశేషునిపై, ఒక దినమున వేదస్వరూపుడగు గరుడునిపై ఇట్లు ఒక్కొక్కనాడు ఒక్కొక్క వాహనము శ్రీ దేవి, భూదేవులతో కూశ్రీ నివాసుడు అధిరోహించి తిరువీధులలో భక్తజనులకు కనువిందు చేయుచు విహరించినాడు. వాహన సేవలకు ముందు తత్రీ వాద్యములతో, తాళ వాద్యములతో గంధర్వులు పాటలు పాడినారు. అప్సర స్త్రీలు నాట్యము చేసినారు. వందిమాగధులు నివాసుని వైభవమును స్తోత్రము చేసినారు. ధనవంతులగు భక్తులు యాత్రికులకు అన్నదానం, వస్త్రదానము చేసినారు. ఆర్యులకు సువర్ణదానం, గృహదానం చేశారు అని వరాహపురాణం వర్ణించింది.


శ్రీ నివాసుని ఉత్సవ దినము పుణ్యప్రదము, పాప వినాశకరమని మహోత్సవము దర్శించిన జనులందరు ఉత్సవమును నిర్వహించిన బ్రహ్మదేవుని నోరార కీర్తించారు. ఈవిధముగా రోజుకు రెండు పూటలు వాహనసేవలు, మూడు పూటల నైవేద్యములతో కడు వైభవంగా నిర్వహించిన మహోత్సవమునకశ్రీ నివాస భగవానుడు సంతోషించాను. ఇక మీదట ఈ మహోత్సవము బ్రహ్మూత్సవము అను పేరుతో ప్రసిద్ధమౌతుంది. నీవు చేసిన రథోత్సవమును భక్తితో చినవారు దుస్తరమైన సంసార సముద్రమును దాటి, జన్మరహితులై సుఖింతురు. వారి నందరిని నేను కరుణతో రక్షించుచుందును. ఎంత నమ్మినవారికి అంత ఫలము లభించును.


ఈ ఉత్సవము (ఉత్ - సవమ్ - ఉత్సవము - గొప్ప యజ్ఞము) భక్తితో ఎవ్వరు పూజనీయులకు, భక్తులకు అన్నము, వస్త్రము, ధనము, గృహము, పాత్రలు మొదలగునవి దానము చేయుదురో వారు (దాతలు) ధనవంతులై సుఖ సంపదలతో కూడిన జీవితమును అనుభవింతురు అని పలికి బ్రహ్మచూ చి వరము కోరుకొనుమనగా బ్రహశ్రీ నివాసునకు నమస్కరించి -


దేవా! అందరికిని కనిపించుచు ఈ వేంకటాచలము నందె నివసించుము. ఇట్లే ప్రతి సంవత్సరము ఈ మహోత్సవమును అంగీకరించి, చేయించుకొనుచు ప్రసన్నుడవై వరదుడవై ప్రజలందరిని కరుణతో రక్షించుచుండుము. ఇదే నా కోరిక. అనుగ్రహింపుము అని ప్రార్థించినాడు. బ్రహ్మదేవుని కోరికను అనుగ్రహింశ్రీ నివాసుడు


బ్రహ్మా! నీవు ప్రార్థించినట్లే నేను వేంకటాద్రి యందే నివసించెదను. ప్రజలందరికీ కనిపించుచు, వారిని దయతో రక్షించుచుందును. వారికి సకల సంపదలు ఇచ్చి సుఖింప చేయుదును అని వరము అనుగ్రహించినాడు. ఆ మాట ప్రకారంశ్రీ నివాసుడు వేంకటాద్రి యందు కలియుగాంతము వరకు నివసించి యుండును. భక్తులకు కోరిన వరములను గుప్పించుచుండును. బ్రహ్మ చేసిన శ్రీ నివాసుని మహోత్సవమును వేడుకతో చూ చుటకు వచ్చిన దేవతలు, మహరులు ప్రజలు అందరూ అని తలంబ్లీ నివాసునికి వీడ్కోలు చెప్పి, స్వామి అనుమతిని పొంది స్వస్థానములకు వెళ్ళినారు. అంతు నివాసునకు బ్రహ్మ చేసిన మహోత్సవము ముగిసింది..