అళగర్ పెరుమాళ్ కోవెల -  - ఇలపావులూరి వేంకటేశ్వర్లు


మధురై చుట్టుప్రక్కల ఉన్న ఆరశ్రీ వైష్ణవ దివ్యదేశాలలో ప్రముఖమైనదిగా పేరు పొందినది అళగర్ పెరుమాళ్ కోవెలశ్రీ వైష్ణవ దివ్యతిరుపతి గానే కాకుండా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆరు పాడైవీడు ఆలయాలలో ఒకటైన "పలమదురైచోళై" కూడా ఇక్కడే ఉన్నది. అళగర్ (అందమైన) పర్వత పాదాల వద్ద ఉన్న ఈ దివ్యదేశం పాండ్యనాడుగా చరిత్రలో పేర్కొనబడిన నేటి మధురై నగరానికి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పచ్చని చెట్లతో, జలప్రవాహాలతో అత్యంత సుందర ప్రకృతికి నిలయాలు ఈ వృషభాద్రే ణి.


అళగర్ పెరుమాళ్ కోవెల                                                                                                                                                             - ఇలపావులూరి వేంకటేశ్వర్లు


బ్రహ్మాండ పురాణం, వరాహ పురాణం, ఆగ్నేయ పురాణం, స్కాంద పురాణం మరియు అనేకానేక పురాతన గ్రంథాలూ ఈ క్షేత్ర మహత్యాన్ని ఎంతో గొప్పగా పేర్కొన్నాయి. గ్రంథాలు, పురాణాలు, ఆళ్వారుల పాశురాలు వృషభాద్రిని ముక్తి క్షేత్రంగా కీర్తించాయి. శ్రీదేవి మరియు సుందరవల్లి తాయారు సమేత శ్రీ అళగర్ పెరుమాళ్ ఈ దివ్య తిరుపతిలో కొలువైన పురాణ గాథ కూడా పెక్కు గ్రంథాలలో లిఖించబడినది.


మలయధ్వజ పాండ్యరాజు తనకు ఇంద్రుడు ప్రసాదించిన పుష్పక విమానంలో ప్రతినిత్యం కాశీ వెళ్ళి గంగాస్నానం చేసి, విశ్వనాథుని సేవించుకొని, గయా క్షేత్రంలోని గంగాధరుని కూడా పూజించుకొని తిరిగి మధురై చేరుకొనేవాడట. ఒకరోజు మార్గం మార్చి వృషభాద్రి మీదుగా వస్తుండగా విమానం గగనంలో నిలిచిపోయిందట. విషయం అర్థంకాని పాండ్యరాజుకు అశరీరవాణి వినిపించిందట. ఈ పర్వతాలు లోకరక్షకుడైన శ్రీ హరి కొలువైనవిగా ఆ వాణి తెలిపిందట. క్రిందికి దిగిన రాజు "నూపుర గంగా" తీర్థంలో స్నానమాచరించి, పాదాల వద్ద కొలువైశ్రీ అళగర్ పెరుమాళ్ ను సేవించుకొన్నాడట. ఆయనే తొలి ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబతున్నాయి గ్రంథాలు. ప్రస్తుత ఆలయం ఎనిమిదో శతాబ్దంలో నిర్మించినట్లుగా శాసనాధారాలు తెల్పుతున్నాయి. సువిశాల ప్రాంగణానికి చుట్టూ కోటగోడ లాంటి ఎత్తైన ప్రహరీ నిర్మించారు. ప్రస్తుతం కొంతమేర శిథిలమైనది. ప్రాంగణం లోని ప్రథమ సన్నిధీశ్రీ భైరవునిది. ఈయన త్ర పాలకుడు. గతంలో రాత్రి పూజాదికాలు పూర్తయిన తరువాత పూజారి ఆలయ తాళాలను క్షేత్రపాలకునికి ఇచ్చి తిరిగి ఉషోదయాన తీసుకుని ఆలయాన్ని తెరిచేవారట. ఒకనాటి రాత్రి ఇంటికి చేరుకున్నాక పూజారికి తన కుమారుని ఆలయంలో ఉంచి తాళాలు వేసినట్లుగా గ్రహింపు కలిగిందట. పరుగు పరుగున ఆలయానికి చేరుకుని భైరవుని తలుపులు తెరిచి భైరవుని తన పుత్రుని బయటకు పంపవలసిందిగా అర్థించాడట. దానికి అంగీకరించని భైరవుడు అతని కుమారునికి వచ్చిన ఆపద ఏమీ లేదన్నాడట. కానీ ఆందోళన చెందుతున్న పూజారి ఆగ్రహించాడట. కోపించిన క్షేత్రపాలకుడు అతని కుమారుడిని బయటకు విసిరివేశాడట. గాయపడిన పుత్రుని పరిస్థితిన చూ సి మరింత ఆగ్రహించిన పూజారి భైరవుని శక్తులను తన మంత్ర ప్రభావంతో సంగ్రహించి ఒక రాతిలో నిక్షిప్తం చేశాడట. నేటికీ భైరవుని సన్నిధికి ఎదురుగా ఉన్న "క్షేత్రపాలక శిల"మూ డవచ్చు. మరో విషయం ఏమిటంటే సహజంగా శివాలయాలలో కొలువై ఉండే సప్త మాతృకలు ఇక్కడ ఉండడం. వీరికి నియమంగా నిత్యపూజలు జరుగుతాయి.


ఆలయ ఉత్తర భాగాన కొలువైన శ్రీ జ్వాలా నారసింహ సన్నిధి పైభాగాన ఒక పెద్ద రంధ్రం ఉంటుంది. స్వామివారి నుండి వెలువడే ఆగ్రహ జ్వాలలు దానినుండి ఆకాశం వైపుకు వెళతాయని, భక్తులు స్వామివారి అనుగ్రహజ్వాలలు పొందుతారని చెబుతారు. మరో ప్రత్యేక సన్నిధి రాజగోపుర ద్వారం వద్ద ఉన్న కరుప్పస్వామిది. ఈయననే పదునెట్టాంపడి కరుప్పస్వామి అని కూడా పిలుస్తారు. రాజగోపుర ప్రధాన ద్వారం వద్ద గంధపు చెక్కలతో చేసిన తలుపులను అమర్చారు. కరుప్పస్వామి పూజలన్నీ ఈ తలుపుల వద్దనే జరుగుతాయి. ప్రత్యేక ఉత్సవాలప్పుడు మాత్రమే ఈ తలుపులను తెరుస్తారు. కురువ కులస్థులు ఈ సన్నిధికి పూజారులుగా వ్యవహరిస్తారు. చుట్టుప్రక్కల గ్రామాలవారు దొంగతనాలు, మోసం లాంటివి జరిగినప్పుడు నేరస్తులను ఇక్కడికి తీసుకువచ్చి ప్రమాణం చేయమంటారు. కరుప్పస్వామి ముందు ఎవరూ అసత్యం చెప్పరన్నది వారి విశ్వాసం. ఆషాఢమాస అమావాస్య మరియు పౌర్ణమిశ్రీ కరుప్పస్వామికి విశేషపూజలు చేస్తారు. మరో విశేషం ఏమిటంటే పర్వదినాలలో• పెరుమాళ్ కి అలంకరించే నగల వివరాలను ఈయన సమక్షంలో చదివి, ఊరేగింపు తరువాత మరోసారి సురాసుకున్నాకే పెరుమాళ్ ఆలయంలోకి వస్తారు. పర్వత శిఖరాన ఉన్న అనేక తీర్థాలలో నూపురగంగ ఒక పవిత్ర జలధార. ఈ నీటికి సర్వపాపాలు హరించే శక్తి ఉన్నదని భక్తులు విశ్వసిస్తారు. అరుదైన వనమూలికల సారాన్ని నింపుకున్న నీరు ఆరోగ్య ప్రదాయినిగా భావిస్తారు. సీసాలలో గృహాలకు తీసుకొని వెళుతుంటారు. -


శ్రీ సుందర రాజ పెరుమాళ్ కోవెల క్రింద ఉండగా, అగ్రభాగాన నూపురగంగ, మధ్యలో శ్రీ సుబ్రహ్మణ్య సన్నిధి ఉంటాయి. నిత్యం ఎన్నో పూజలుశ్రీ అళగర్ పెరుమాళ్ కి జరుపుతారు. ఉత్సవమూర్తి శ్రీ సుందరరాజ పెరుమాళ్" అరుదైన అపరంజి అని పిలిచే బంగారంతో తయారు చేశారు. నిత్య అభిషేకాలలో నూపుర గంగాజలాన్ని వాడాలి. లేనియెడల విగ్రహం నల్లగా మారిపోతుంది. పూజారులుతో పైకి వెళ్ళి నీటిని తెస్తారు. వారు నిజంగా గంగనీటినే తెచ్చారా? అన్నదానికి వారశ్రీ కరుప్పస్వామి వద్ద ప్రమాణం చేసిన తరువాతనే నీటిని అభిషేకాలకు వినియోగిస్తారు. నూపురగంగ దాకా రహదారి మార్గం ఉన్నది. నడిచి వెళ్ళడానికి మెట్ల దారి ఉన్నది. పరిసరాలు, ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటాయి.


అళగర్ పెరుమాళ్ కోవెలలో ప్రతినిత్యం ఉత్సవమే


అన్నింటిలోకి మీనాక్షి సోమసుందరేశ్వరస్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి స్వామివారు తరలివెళ్ళే "చిత్తిరైతిరువిళ్ళ" ఒక అద్భుతమైనది. మొత్తం తొమ్మిది రోజులలో మొదటి మూడు రోజులు ఇక్కడ, మిగిలిన నాలుగు రోజులు మధురై వైగైనదీ తీరంలో. రెండు రోజులు వెళ్ళి రావడానికి. ఈ తొమ్మిది రోజులు పెరుమాళ్ కి ఎన్నో అలంకరణలు చేస్తారు. సోదరి వివాహానికి తరలివెళ్ళే సోదరునికి ఎంతో సుందరమైన, సరైన అలంకారం ఉండాలి కదా! వైగై నది ఒడ్డున జరిగే ఉత్సవరూ డటానికి లక్షలాది మంది తరలి వస్తారు. ఈ ప్రస్తుత ఆలయాన్ని ఎనిమిదో శతాబ్దంలో పాండ్యరాజులు నిర్మించారు. తరువాత చోళులు, విజయనగర రాజులు, నాయక రాజులు పెక్కు నిర్మాణాలను నిర్మించారు. ఆలయాన్ని అభివృద్ధి చేశారు. చక్కని శిల్పాలకు నెలవు ఈ ఆలయం 2తో వేలాదిమంది భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తుంటారు. మధురై పెరియార్ బస్టాండ్ నుండి బస్సులు లభిస్తాయి. పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్, భూతత్తి ఆళ్వార్, పేయాళ్వార్ మరియు నమ్మాళ్వార్లు కలిసి 128 పాశురాలు అళగర్ పెరుమాళ్ మీద గానం చేశారు. "నమో నారాయణ"